24, అక్టోబర్ 2018, బుధవారం

స్వచ్ఛ భారత్

పోయిన వారం ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ, మా బంధువు ఒకతను మా అమ్మాయితో మాట్లాడుతూ నీకు ఆస్ట్రేలియా నచ్చిందా లేక ఇండియానా అని అడిగితే

ఆస్ట్రేలియా అంది ఠక్కున ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా

ఎందుకు? అని అడిగాడు అతను

డర్టీ ఇండియా అంది

అలా అనకూడదమ్మా అని నేను అంటే

లేదు నాన్నా, ఎక్కడ చూసినా రబ్బిష్ ఉంది రోడ్డు మీద, రోడ్ సైడ్స్ లో అంది.

అలా కాదమ్మా ఇక్కడ పాపులేషన్ ఎక్కువ, ఫెసిలిటీస్ తక్కువ అని సర్ది చెప్పాను.

ఇక్కడ ఆస్ట్రేలియా లో  T.V చానెల్స్ లో యాడ్ వస్తూ ఉంటుంది 'డోంట్ బి ఎ టాస్సర్' అని. సిగరెట్ తాగి పక్కనే వాటి కోసం స్పెషల్ బిన్ ఉన్నా అందులో వేయకుండా రోడ్ మీద పారేసి వెళ్లే వాళ్ళు ఇక్కడా ఉన్నారు.

స్వచ్ఛ భారత్ అనేది రెండు మూడేళ్ళ క్రితం చీపుర్లు అవీ పట్టుకొని సెలబ్రిటీస్ పోజులు ఇవ్వడంతోనే ముగిసి పోయిందేమో అనిపిస్తోంది. లేదంటే పూర్తిగా సక్సెస్ అవ్వడానికి టైం పట్టచ్చేమో అనిపిస్తోంది. 

కోరమంగళ ఏరియా బెంగళూరు లో నేను తాగేసిన జ్యూస్ బాటిల్ పారేయడానికి చుట్టుపక్కల వెదికితే ఒక్కటంటే ఒక్క dustbin కనపడలేదు . బాటిల్ కాబట్టి సరిపోయింది, ఏ అరటి తొక్క అయితే అలా అరగంట సేపు పట్టుకొని తిరగడానికి వీలవుతుందా ?

ఇంకోసారి పోస్ట్ ఆఫీస్ పని మీద పోస్ట్ ఆఫీస్ లో గంటన్నర వెయిట్ చేయాల్సి వచ్చింది. తిరిగి వచ్చేప్పుడు పాస్ పోయడానికి  పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడా లేవని తెలిసింది.

కాస్తో కూస్తో awareness ఉండబట్టి ఏదో ఒక గోడ దగ్గరికి చేరకుండా, పనిలేకపోయినా  కాస్త దూరం లో ఉండే షాపింగ్ మాల్ లోకి వెళ్ళవలసి వచ్చింది.

madiwaala ఏరియా లో మాత్రం కొబ్బరి బొండాం బండి దగ్గర ఒక పాడుబడ్డ గోడ మీద, ఇంకొంచెం దూరం పోయాక కట్టె మీద నిలపెట్టిన అట్టపెట్టె మీద 'పబ్లిక్ టాయిలెట్ 500 మీటర్స్' అని ఒక arrow మార్క్ వేసి స్పెల్లింగ్ మిస్టేక్స్ తో రాసి ఉండటం చూసాను.

వెరీ గుడ్, గవర్నమెంట్ మంచి పని చేసింది, పబ్లిక్ టాయిలెట్ కట్టించడమే కాక ఇలాంటి ఇండికేషన్స్ కూడా పెట్టడం బాగుంది అన్నా ఆ కొబ్బరి బోండాం బండి వాడితో. 

అది గవర్నమెంట్ పని కాదు సర్, ప్రతీ ఒక్కడూ అదిగో అక్కడ పని కానిస్తున్నారు అన్నాడు అక్కడ దూరంగా కనిపిస్తున్న ముళ్ల కంప వైపు చూపిస్తూ . కనీసం ఈ బోర్డు చూసి అయినా ఆ పని అక్కడ చేయరని నేనే రాయించా అన్నాడు. 

స్వచ్ఛ భారత్ ఇండియా లో సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఇవి అని రాసిన ఆర్టికల్ ఎక్కడో చదివినట్లు గుర్తు. అందులో నమ్మకాలు/మూఢ నమ్మకాలు ఒక కారణం అని ఒక (జరిగిన) కథ ఇచ్చారు.

ఒకానొక మారుమూల గ్రామం లోకి సేవ చేయడానికి ఒక కుర్ర డాక్టర్ వెళ్ళాడట. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం గమనించి అలా చేస్తే రోగాలు స్ప్రెడ్ అవుతాయి, వంద రూపాయిలు పెట్టి dustbins లాంటివి కొనండి అని చెప్పాడట.

ఆ పల్లె జనాలకు వంద రూపాయలు అనేది చాలా పెద్ద మొత్తం కాబట్టి వాళ్ళు కొనలేదట. ఈ డాక్టర్ గారే ఆ dustbins కొని ఒక్కో కుటుంబానికి ఒకటి ఇద్దామని అనుకున్నారట కానీ అతని ఆదాయమే అంతంత మాత్రం ఉండటంతో ఆ ఆలోచన డ్రాప్ అయి ఒక వండర్ఫుల్ ఐడియా ఇ చ్చారట.

పాతకుండని dustbin గా వాడమని, అలా కుండలో పోగయిన చెత్తని ఏం చెయ్యాలి లాంటి సలహాలు ఇచ్చి ఆ గ్రామాన్ని క్లీన్ గా ఉంచారట.

అలా ఒక రెండు నెలలు గడిచాక ఒక అత్యవసర పని పడి పది రోజులు వేరే ఊరికి  వెళ్లి వచ్చేసరికి మళ్ళీ గ్రామం మొత్తం ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయిందట.

ఎందుకిలా జరిగింది అని ఒకరిద్దరిని విచారిస్తే......

ఏదో ఒక బాబాజీ ఆ గ్రామానికి వచ్చాడని అలా మట్టి కుండలో చెత్త వేయడం అపవిత్రం అని అలా చేస్తే ఊరు మొత్తం నాశనం అవుతుందని హెచ్చరించాడట.

దాంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ తర్వాత ఇంకేదో అలోచించి మళ్ళీ ఊరిని క్లీన్ గా ఉంచేట్లు చర్యలు తీసుకున్నాడట. 

ప్రతీ చోటా ఇలా ఒక డాక్టరో, కొబ్బరి బొండాం బండి వ్యక్తో ఉండకపోవచ్చు, కానీ మొదటి అడుగు మన నుంచే పడితే,  అది చూసి ఇంకొకరు మరొక అడుగు వేస్తారేమో. 

గాంధీ గారన్నట్లు “We must be the change we want to witness in the world”.

25, ఫిబ్రవరి 2018, ఆదివారం

బ్లాగ్ కి పట్టిన బూజు


ఓయ్ పవనూ ఎటెళ్లి  పోయావూ ఇన్ని రోజులు, నీ కోసమే ఈ ఎదురు చూపులు 


సంక్రాంతి వస్తోందిగా బూజు దులపడానికి వచ్చా

ఇప్పుడు  సంక్రాంతి ఏమిటి తమరి బొంద శివ రాత్రి కూడా వెళ్ళిపోయింది .. అజ్ఞాతవాసి సినిమా చూసాక నీ మతి గతి తప్పినట్లుంది. 

అయినా  ఇంట్లో చెప్పే సినిమాకి వచ్చావా అని ఎంట్రీ దగ్గర ఉండే గేట్ కీపర్, జండూ బామ్ కావాలా నాయనా అని పైనుంచి  కీర వాణి హెచ్చరించినప్పుడే జాగ్రత్త పడుండాల్సింది. 

కీర వాణి ,దివ్య వాణి కాదు ఆకాశ వాణి..అయినా ఆ సినిమా ..

సరేలే ఆ సినిమా గుర్తుకు తెప్పించి మానిపోతున్న గాయాన్ని గెలక్కు

ఆరిపోతున్న దీపాన్ని నువ్వు వెలిగించాలనుకోవట్లా ఇదీ అంతే

దీపమా?

అదేలే  నీ బ్లాగ్

ఏదో కాస్త బూజు దులిపి మళ్ళీ మొదలెడతామని

బూజా .. ఇంటికా నీ బుర్రకా?

కాదు బ్లాగ్ కి

ఇన్ని రోజులేం చేస్తున్నావ్ బ్లాగ్ రాయకుండా

రాస్తునే ఉన్నాను కానీ,  అది జావా కోడ్. 

ఇంట్లో రాయొచ్చుగా

ఇంట్లో కూడా జావా కోడ్ రాయమని మా మానేజర్ ఫోర్స్ చేస్తుంటేనూ కుదరడం లేదు. 

మిగతా టైమ్స్ లో రాయొచ్చుగా

బరువు భాధ్యతలు కూడా ఉన్నాయిగా అందుకే


అలాగని రాయకుండా వదిలేస్తే ఎలా? ఆఫీస్ పని ఉందని దాని మీదే కాన్సట్రేట్ చేస్తే ఎలా?

నేనంతే, దేని మీదైనా కాన్సంట్రేట్ చేస్తే ఆ పని పూర్తయ్యేదాకా డిస్టర్బ్  అవ్వను


చూస్తూనే అర్థమవుతోంది...నీ కాన్సంట్రేషన్ దేని మీదో, అయినా పనులన్నాక వస్తుంటాయ్ పోతుంటాయ్...కడలి తరంగాల లాంటివి అవి, అలాగని బ్లాగ్ రాయకపోతే ఎలా

కడలి తరంగాలు...ఇదేదో బాగుంది, నెక్స్ట్ పోస్ట్ కి నా టైటిల్ ఇదే

రామ్ గోపాల్ వర్మ లా ఏది అనిపిస్తే ఆది చేసేస్తావా, అదేం టైటిల్, అయినా బ్లాగ్ కి కాదు నీ బుర్రకు పట్టిన బూజు దులుపుకో ముందు

'లలిత్ మోడీ నీరవ్ మోడీ లాంటి  కేడీలు ఎందరో మా నరేంద్ర మోడీ రాజ్యం లో' అనే టైటిల్ పెట్టి పోస్ట్ రాస్తా

ఏమిటా అర్థం పర్థం లేని డైలాగు

సమకాలీన పరిస్థితులను నా బ్లాగ్ ద్వారా ఎలుగెత్తి చాటాలని తపన

తపన ఒక్కటే సరిపోదు దానికి తగ్గ విషయం ఉండాలి

పవన్ కళ్యాణ్ దగ్గర ఏ మాత్రం ఉందని ....

అయినా ఆయన్ని కామెంట్ చేయడానికి నువ్వేమీ కత్తివో వర్మవో కాదు.

వర్మ అంటే గుర్తుకు వచ్చింది యెంత ఇష్టమో శ్రీదేవి అంటే తనకి.  నాకు కూడా శ్రీదేవి అంటే బాగా ఇష్టం. 

ఎప్పటికైనా

పెళ్లంటూ చేసుకుంటే శ్రీదేవినే చేసుకుంటా 20  ఏళ్ళు పెద్దదైనా,
వాళ్ళింట్లో, మా ఇంట్లో ఒప్పుకోకపోతే దివ్య భారతి నైనా చేసుకుంటా 15 ఏళ్ళ తర్వాతైనా
ఇల్లంటూ కట్టుకుంటే నాగార్జున సిమెంట్ తోనే కట్టుకుంటా 10 ఏళ్ళ తర్వాతైనా [అప్పట్లో టి.వి లో ఇదే యాడ్ వచ్చేది మరి]
కిళ్ళీ అంటూ తినవలసి వస్తే పూర్తిగా చదువైపోయాకే తింటా ఎన్నేళ్ల తర్వాతైనా [కిళ్ళీ తింటే చదువు సరిగ్గా రాదు అని ఎవరో చెప్పిన మాటకు భయపడి ]

అని అప్పుడెప్పుడో స్కూల్ రోజుల్లోనే గట్టిగా డిసైడ్ అయ్యాను.  అలాంటిది శ్రీదేవి చనిపోయిందట అని మా ఆవిడంటే, వయసైపోయిందిగా పైగా బోల్డన్ని సర్జరీలు అన్నాను కొద్దిగ కూడా బాధ పడకుండా.

కానీ మా ఆవిడే చాలా బాధ పడింది. "కట్టిన చీర మళ్ళీ కట్టేది కాదట, ఇప్పుడు ఆ చీరలన్నీ ఎవరు సొంతం చేసుకుంటారో అని". 

ఏది ఏమైనా పాత సినిమాల్లో చిరంజీవి పక్కన ఏ హీరోయిన్ ఉన్నా చిరంజీవినే చూడాలనిపిస్తుంది ఆ  విషయంలో శ్రీదేవి మాత్రం మినహాయింపు.

కే.వి రెడ్డి - మాయా బజార్, రాం గోపాల్ వర్మ - శివ, బాపు - ముత్యాల ముగ్గు, బ్రహ్మదేవుడు - శ్రీదేవి. అరుదుగా మాస్టర్ పీస్ లు సృష్టించబడతాయి. 

ఆగ్రా కు వెళ్లి తాజ్ మహల్ చూడాలి, ముంబై కి వెళ్లి శ్రీదేవిని చూడాలి అనుకునేవాడిని. మొదటిది ఎప్పుడో తీరింది రెండోది ఇక ఎప్పటికీ తీరదు. 

ఈ పోస్ట్ చదివే ముందు వద్దు వద్దు అని మీకు కీర వాణి ,దివ్య వాణి, ఆకాశ వాణి లాంటివి హెచ్చరించినా  మీరు పట్టించుకోక పోయి ఉండచ్చు.  ఇప్పటికి మించిపోయింది లేదు , చరవాణి చేతిలోకి తీసుకొని జండూబామ్ తెప్పించుకోండి. గత 6 నెలల్లో సేల్స్ బాగా తగ్గిపోయాయని ఒకటే గగ్గోలు.