ముందుగా ఒక జోక్ తో మొదలెడదాం, నాకు గుర్తున్నంతవరకు ఆ జోక్ ఇది.
అప్పుడెప్పుడో చేసిన సర్వే ప్రకారం పంజాబ్ భారతదేశంలో అతి తక్కువ ఆహార కొరత కలిగిన రాష్ట్రంగా మొదటి స్థానం లో నిలిచిందట. దాంతోపాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించారట. అందులో అడిగిన ప్రశ్న
"మిగతా దేశాల్లో ఆహార కొరతను అధిగమించడానికి మీ దేశం లో మీరు ఏం చెయ్యగలుగుతారో దయచేసి మంచి సూచనలు మరియు అభిప్రాయాలు నిజాయితీ గా తెలియ పరచండి"
ప్రపంచంలో వాళ్ళ దేశం తప్ప వేరే దేశాలంటూ లేవని నమ్మడం USA వాళ్ళు,
ఆహారమంటే ఏమో తెలియక ఆఫ్రికా వాళ్ళు,
కొరత అంటే ఏమిటో తెలియని వెస్ట్రన్ యూరోప్ వాళ్ళు,
దయ అంటే ఏమో తెలీక సౌత్ అమెరికా వాళ్ళు,
నిజాయితీ అంటే ఏమో తెలీని ఈస్ట్రన్ యూరోప్ వాళ్ళు,
మంచి అంటే ఏమిటో తెలీని పాకిస్తాన్ వాళ్ళు,
సూచనలు అంటే ఏమిటో తెలీని మిడిల్ ఈస్ట్ వాళ్ళు,
అభిప్రాయాలు అంటే ఏమిటో తెలీక చైనా వాళ్ళు,
ఆ టెలిఫోన్ సర్వే లో వాడిన వాయిస్ మన ఇండియన్ వారిది అవడం తో ఆక్సెంట్ అర్థం కాక ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి కంట్రీస్ వాళ్ళు ,
ఫోన్ పెట్టేశారు. దాంతో ఆ సర్వే ఫెయిల్ అయిందట.
ఆ టెలిఫోన్ సర్వే లో వాడిన వాయిస్ మన ఇండియన్ వారిది అవడం తో ఆక్సెంట్ అర్థం కాక ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి కంట్రీస్ వాళ్ళు ,
ఫోన్ పెట్టేశారు. దాంతో ఆ సర్వే ఫెయిల్ అయిందట.
ఇక సర్వేల విషయానికి వస్తే, ఎవరైనా 'మా వాడు రోడ్లు సర్వే చేస్తుంటాడు' అంటే అదేదో నిజంగానే జాబ్ అనుకున్నా చిన్నప్పుడు, తర్వాత తెలిసింది పని లేక ఖాళీగా రోడ్ల వెంట తిరగడం అని.
అలా మొన్నటి దాకా రోడ్లు సర్వే చేస్తున్నవాళ్ళు కూడా , ఇప్పుడు ఎలక్షన్స్ కదా, ఏ పార్టీ కి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని మీద సర్వే చేసేశారు. మళ్ళీ ఎలక్షన్స్ అయ్యాక రోడ్లు సర్వే చేసే పని వాళ్ళకెలాగూ ఉంటుంది అది వేరే విషయం. ఈ సారి అందరి చూపు తెలంగాణా ఎన్నికల మీదే ఉంది. ఎవరి సర్వే లెక్కలు వారికున్నాయి. వాటిని విశ్లేషించడం ఈ పోస్ట్ ముఖ్య ఉద్దేశం కానే కాదు.
మొన్నటికి మొన్న "ప్రపంచ ప్రతిభావంత యువనేతల్లో లోకేష్" అని ఏపోలిటికల్ సంస్థ చేసిన సర్వే యెంత కామెడీ పంచిందో తెలియనిది కాదు.
ఆ మధ్య ఏదో సంస్థ 'అర్థరాత్రి నిద్ర మధ్య లో లేచి తినే వాళ్ళు ఎంతమంది?' అనే దాని మీద సర్వే చేశారట. మరి ఈ సర్వే లు ఎవరికి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఇక్కడ అప్రస్తుతం.
అలాంటిదే ఇవాళ విడుదల చేసిన ఫోర్బ్ సర్వే కూడా. ఎవరి ఆదాయం ఎక్కువో చెప్పేది ఆ సర్వే. మరి నల్ల డబ్బు కన్సిడర్ చేస్తారో లేదో తెలీదు.
కాకపొతే ఇలాంటి సర్వే రిజల్ట్స్ లో నిజాయితీ తక్కువ, అబద్దాలు ఎక్కువగా ఉంటాయి.
అదేదో సినిమా లో బాబుమోహన్ కొండను ఎత్తుతాను ఫలానా తేదీ అందరూ వచ్చి నా ప్రతాపం చూడండి అని దండోరా వేయిస్తాడు.
తీరా అందరూ పోగయ్యాక చేతులు పైకెత్తి "ఊ, కొండను తెచ్చి నా చేతుల్లో పెట్టండి మోస్తా" అంటాడు. అలా ఉంది మన పవన్ కళ్యాణ్ వ్యవహారం.
తెలంగాణా ఎన్నికల్లో జనసేన మద్దత్తు ఎవరికో అయిదవ తేదీన ఇస్తానహో అని ఒక చాటింపు వేశాడు. వీడో పగటి వేషగాడు అని తెలిసిన వాళ్ళు పట్టించుకోలేదు. మిగతా కొద్దీ మందీ కుతూహలంతో వెయిట్ చేశారు. తీరా నిన్న 'తక్కువ అవినీతితో మంచి పాలన అందించే వారికి మీ ఓటు వెయ్యండి' అని ఒక సలహా పారేశాడు. కొండంత రాగం తీసి లల్లాయి పాట పాడినట్లు ఈ మాత్రం దానికి అంత హంగామా అవసరమా?
బాబుమోహన్ కాస్త నయం ఆ సినిమాలో కామెడీ అన్నా పండించాడు.
లగడపాటి సర్వే ప్రకారం కెసిఆర్ ఓడిపోయే ఛాన్స్ ఉందని తెలిసిన పవన్ కళ్యాణ్, కేసీఆర్ కు మద్దత్తు ఇవ్వడాన్ని ఉపసంహరించుకున్నాడని ఇంకో సర్వే ప్రకారం తెలిసిన వార్త.