6, జనవరి 2019, ఆదివారం

అరె ఏందిరా భయ్ ఈ కొత్త సంవత్సరం లొల్లి

మనది కాని ఈ కొత్త సంవత్సరం అసలు జరుపుకోవడం అవసరమా? అరె ఏందిరా భయ్ ఈ కొత్త సంవత్సరం లొల్లి! దీనికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వడం అనే పెడసరి ధోరణితో కొందరు,  'దీన్ని బహిష్కరిద్దాం, శుభాకాంక్షలు చెప్పుకోవలసిన అవసరం లేదు' అని సోషల్ మీడియాలలో క్లాసులు పీకుతున్నారు.

Be a roman, when you are in Rome అంటారుగా, మరి మనమున్నది ఈ గ్లోబల్ యుగంలో కాబట్టి ఉలిపి కట్టెలా ఉండకుండా జనవరి ఫస్ట్ కు కూడా ప్రాధాన్యత ఇద్దాం. తప్పేముంది ఉగాది ని జరుపుకుందాం, జనవరి ఫస్ట్ జరుపుకుందాం. రెండు సార్లు మితృలకు శుభాకాంక్షలు తెలుపుదాం, వీలయితే పర్సనల్ గా కలిసి మరీ చెబుదాం.

కొత్త సంవత్సరం అని చెప్పి మితృలతో కలిసి లిమిట్ వరకు తాగడం, తందనాలు ఆడటం లో  తప్పేం లేదు, ఏదో ఒక రకంగా కనీసం మిత్రులతో సరదాగా గడిపేసినట్లే కదా. After all, some times, we just need a break from the routine.

ఫ్రెండ్ ఒకతను వాళ్ళింట్లో థర్టీ ఫస్ట్ నైట్ పార్టీ ఏర్పాటు చేస్తే దాదాపు 6 ఫామిలీస్ కలిసాము అక్కడ. పేకాట ఆడేవాళ్లు పేకాట ఆడుతూ,  ఆడని వాళ్ళు, ఆడవాళ్లు హాయిగా కబుర్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ,మ్యూజికల్ చైర్స్ లాంటి ఆటలాడుకుంటూ ఉంటే ఇక పిల్లలందరూ వాళ్ళింటిని కిష్కింధ గా మార్చేసి సంతోషంగా ఆడుకున్నారు అర్ధరాత్రి వరకు.

మగాళ్లు కాసేపు పేకాట పక్కనెట్టి, మ్యూజికల్ చైర్స్ ఆట ఆడాలని ఆడాళ్ళు డిమాండ్ చేస్తే, వారి డిమాండ్ కి తలొగ్గి ఆ ఆట ఆడి రెండు ప్లాస్టిక్ చైర్స్ విరగ్గొట్టేశాము. (మేడ్ ఇన్ చైనా చైర్స్ మరి విరగక ఛస్తాయా, ఈ ఆస్ట్రేలియా లో 50% మేడ్ ఇన్ చైనానే వస్తువులైనా, మనుషులైనా 😊)

12 కాగానే పిల్లలు కేక్ కట్టింగ్ కు రెడీ అయిపోయారు, దేనికోసమైతే వాళ్ళు వేచి ఉన్నారో ఆ పని కానిచ్చేసి (వాళ్లకు ఇష్టమైన చాకోలెట్ కేక్ తినేసి) ముసుగు తన్నేసారు. 



మరుసటి రోజు అనగా జనవరి ఫస్ట్ తారీకు రోజు అందరిలాగే యధావిధిగా దైవ దర్శనానికై గుడికి వెళ్లి ఫేస్బుక్ లో పెట్టడానికి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము   😊

అదే రోజు మధ్యాహ్నం నేను తీసుకున్న రెసొల్యూషన్ లిస్ట్ లో పాయింట్ 3 ని అమలుచేయలేక పోయాను. విధి రాత తప్పించుకోలేక 'అమర్ అక్బర్ ఆంథోని' అనే అత్యంత చెత్త చిత్రాన్ని చూసాను మిత్రులతో కలిసి. 

సిడ్నీ చుట్టుపక్కల  100  బీచ్ ల దాకా ఉన్నాయి, వారానికో బీచ్ కి వెళ్లినా ఆ బీచ్ లన్నీ చూసేలోగా స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు దాంతో నేను తీసుకున్న రెసొల్యూషన్ లిస్ట్ లోని పాయింట్ 7 లో ఒక పార్ట్ ని కంప్లీట్ చెయ్యొచ్చు అని అనుకున్నా 😊

వెదుకుతున్న తీగ కాలికి  చందంగా మిత్రులందరూ మరుసటి రోజు Wattamolla బీచ్ కి వెళదామన్నారు. Wattamolla ఈజ్ వన్ అఫ్ ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ బీచెస్ ఎవర్ ఐ హావ్ సీన్.  (Wattamolla means "place near running water") 

నేను సీ దగ్గరికి వెళ్ళగానే 'లాంగ్ టైం నో సీ' అని నన్ను పలరించినట్లైంది. సముద్రం అంటే పిల్లలు యెంత ఇష్టపడతారో, దానికి పదింతలు నేను ఇష్టపడతా.  ఆ సముద్రంలో అలలను చూడగానే నాలోని బాల్యం బయట పడింది, దానికిదే రుజువు.



ఈ బీచ్ లో ఒక వైపు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అలలు ఉండవు, కాబట్టి స్విమ్మింగ్ కి అనువుగా ఉంటుంది.  పిల్లలు హాయిగా ఆడుకున్నారు, అల వచ్చి లాక్కెళ్తుందని భయం లేకుండా. 



ఈ విధంగా కొత్త సంవత్సరం సందర్బంగా రెండ్రోజులు ఫోన్ కి దూరంగా, ఫామిలీ మరియు ఫ్రెండ్స్ కి దగ్గరగా ఉన్నాను. After all, some times, we just need a break from the routine.

ఇవాళ మరో రెసొల్యూషన్ తీసుకున్నాను అదేమిటంటే, కనీసం నెలకు నాలుగు పోస్టులు అయినా రాస్తూ ఉండాలని. అందరికి తెలిసిన విషయమైనా సరే లేక కొత్త విషయమైనా, ఏదైనా సరే రాస్తూ పోవడమే.  జస్ట్ లైక్ డైరీ లా ప్రతీ విషయం నోట్ చేద్దామనుకుంటున్నాను. 

2, జనవరి 2019, బుధవారం

న్యూ ఇయర్ రెసొల్యూషన్ లిస్ట్


తెలిసిన జోకే అయినా ఇది సరైన సందర్భం కాబట్టి ఇక్కడది చెప్పుకుందాం. 

న్యూ ఇయర్ రోజున ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు. 

బాబాయ్ ఒక సిగరెట్ ఇవ్వు అన్నాడు మొదటి వాడు  

రాత్రే కదా, న్యూ ఇయర్ రోజు నుంచి సిగరెట్లు మానేస్తానని నిర్ణయం తీసుకున్నావ్? అన్నాడు రెండో వాడు

అవును తీసుకున్నాను, దాంట్లో భాగంగానే మొదటి స్టేజిలో ఉన్నాను. 


మొదటి స్టేజి అంటే?


సిగరెట్లు కొనేది మానేయడం

నాకు సిగరెట్, మందు లాంటి అలవాట్లు లేవు కాబట్టి అవి మానేయాలి అనే రెసొల్యూషన్స్ లేవు గానీ, యేవో కొన్ని ఉన్నాయి.  ఇవి ఏ రోజు నుంచి అయినా ఫాలో అవచ్చు, కాకపొతే న్యూ ఇయర్ రెసొల్యూషన్ అని పెట్టుకోవడం వల్ల గుర్తుండిపోతుంది కదా లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా. 

  1. కాలమతి నుంచి సుమతి గా మారడం (గత 20 ఏళ్లుగా ఫెయిల్ అవుతూనే ఉన్నాను ఇందులో)
  2. కొత్త వాళ్లతో అంత తొందరగా మాటలు కలపలేను. ఇందులో కాస్త ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేయడం. 
  3. వీలయితే ఒక్క మగాడు, బ్రహ్మోత్సవం, అజ్ఞాత వాసి లాంటి సినిమాలకు దూరంగా, కామెడీ సినిమాలకు దగ్గరగా ఉండటం. 
  4. నడక తగ్గించడం, రోజుకు 6-7 కిలోమీటర్లు నడుస్తున్నాను, వీలయితే అది కాస్త తగ్గించడం. 
  5. 63 కిలోల నుచి 62.5 కిలోలకు తగ్గడం (500 గ్రాములు పెరగడం ఈజీ కానీ, తగ్గడం కష్టం )
  6. 🐓 🐑 🍕 లాంటివి మానేసి 🥑 🥕 🥦 🍄 🌽 🐟 లాంటివి ఎక్కువగా తినడం (కష్టమే, కానీ ట్రై చేస్తే ఆరోగ్యానికి మంచిది)
  7. జీవితంలో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన రెండు ముఖ్య విషయాలైన స్విమ్మింగ్ మరియు డ్రైవింగ్ నేర్చుకోవడం.
  8. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి 10 నిముషాలు ముందే బయలుదేరడం, హడావిడిగా లేటుగా బయలుదేరకుండా.
  9. మిత్రుల, కుటుంబ సభ్యుల, బంధువులకు  అన్ని రకాల విషెస్ చెప్పడం లాంటివి. (నా వరకు నాకు ఎందుకో ఈ పండుగ విషెస్, బర్త్ డే విషెస్ లాంటివి చెప్పాలంటే అంత ఇష్టం ఉండదు, దాన్ని మొహమాటం అంటారో ఏమో నాకే తెలీదు మరి)
  10. ఇక నుంచైనా ప్రతీ రోజూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. (చదివితే మరింత జ్ఞానం పెరిగి మంచి మంచి పోస్టులు రాస్తానని ఆశ)
  11. ఆ మధ్య చేయడం ఆపేసిన యోగా ను మళ్ళీ కంటిన్యూ చేయడం. 
  12. పైన చెప్పిన లిస్ట్ అంతా నెక్స్ట్ ఇయర్ రెసొల్యూషను లిస్ట్ లోకి మూవ్ చేయడం😜

వీటిలో ఏది మిస్ అయినా చివరిది మాత్రం మిస్ కాకుండా చూసుకుంటానని మీ అందరి ఎదుట ప్రామిస్ చేస్తున్నాను.

"మీ జీవితం లో ఈ కొత్త సంవత్సరం మరింత అదృష్టాన్ని, సంతోషాన్ని, సంపదను తీసుకొస్తుందని  ఆశిస్తూ 'కొత్త సంవత్సర శుభాకాంక్షలు' తెలుపుతున్నాను".


హమ్మయ్య కాస్త లేటయినా పైన చెప్పిన శుభాకాంక్షలతో తొమ్మిదవ పాయింట్ లో మొదటి స్టేజి కంప్లీట్ చేయగలిగాను నా రెసొల్యూషన్ లిస్ట్ లో నుంచి.

నేనేదో రాంగ్ ఫోటో పెట్టానని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే, ఎందుకంటే ప్రతి సంవత్సరం  జరిగే సిడ్నీ fireworks లో భాగంగా జరిగిన పొరపాటు అది. హ్యాపీ న్యూ ఇయర్ 2019 అని కాకుండా 2018 అని డిస్ప్లే చేయడం.