ఏమిటోయ్ నువ్వు రెండో బ్రూస్లీ కావాలనుకుంటున్నావా?
కాదు మొదటి జాకీ చాన్ ను అవ్వాలనుకుంటున్నాను.
ఇలాంటి డైలాగు ఎక్కడో ఈ మధ్యే విన్నట్లు ఉంది కదూ, అవును మీరు ఊహించింది నిజమే, ఇది కథానాయకుడు సినిమాలో A.N.R తో అన్వయించి N.T.R పాత్రకు పెట్టిన డైలాగ్. ఇది జాకీ చాన్ సినిమాల్లోకి వెళ్లిన కొత్తలో ఎవరో ఎగతాళిగా అంటే అలా సమాధానమిచ్చాడట. మరి అప్పట్లో N.T.R గారికి కూడా సినిమాల్లోకి రాక మునుపు అంత కాన్ఫిడెన్స్ ఉండేది అని చూపెట్టడానికి ఆ సీన్ పెట్టినట్లున్నారు.
ఇప్పుడు ఇది ఎందుకు ప్రస్తావించానంటే, యాత్ర సినిమా స్టార్టింగ్ సీన్ లో కూడా రాజశేఖర్ రెడ్డి కూడా త్వరలో నేను ముఖ్యమంత్రి ని అవుతాను అనుకునే లాంటి కాన్ఫిడెన్స్ ఎలివేట్ చేసే సీన్ తో ప్రారంభిస్తారేమో మరి.


దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సాగించిన పాద యాత్ర ను బేస్ చేసుకొని నిర్మిస్తున్న సినిమా యాత్ర ఇవాళ రిలీజ్ అవుతోంది. మమ్ముట్టి నటిస్తున్నారు కాబట్టి మలయాళం లో కూడా రిలీజ్ చేస్తున్నారేమో తెలీదు మరి.
అమెరికా లో ఈ సినిమా ప్రీమియర్ షో ఫస్ట్ టికెట్ ను వేలం వేస్తే, వైఎస్ అభిమాని ఒకరు 6,116 డాలర్లకు ఈ టికెట్ ను దక్కించుకున్నారట. దీన్ని క్రేజ్ అని కొందరు అంటున్నారు కానీ ఇది పిచ్చేమో అని నా అనుమానం.
మొన్నొచ్చిన కథానాయకుడు సినిమాకు దీనికి పోలిక పెట్టడం సరి కాదు. అది ఒక వ్యక్తి (కాదు శక్తి అంటారు కొందరు) జీవిత చరిత్ర అయితే ఇది ఒక నాయకుడి పొలిటికల్ జర్నీ లో ఒక ముఖ్యమైన ఘట్టం చుట్టూ అల్లుకున్న కథ. మా సినిమా గొప్ప అంటే మా సినిమా గొప్ప అని ఇక్కడ గొడవ పడుతున్నారు మా ఫ్రెండ్స్ బ్యాచ్ లో కొందరు. మా N.T.R దేవుడు అంటే, కాదు మా సీమ జనాల కష్టాలను తీర్చాడు కాబట్టి మా Y.S.R దేవుడు అని వాదించుకుంటారు. కాకపొతే ఇద్దరి ఫొటోస్ పూజ రూముల్లో పెట్టుకున్న అభిమానులను చూసాను కాబట్టి ఒక రకంగా వారికి ఈ ఇద్దరు దైవ సమానులే.
బడ్జెట్ పరంగా, కాస్టింగ్ పరంగా కూడా ఈ రెండు సినిమాలకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి పోలిక అనవసరం. 'యాత్ర' సినిమాకు 25 కోట్ల బడ్జట్ అంటున్నారు కానీ నాకెందుకో నమ్మశక్యం కావట్లేదు అంత ఖర్చు నిజ్జంగా అయి ఉంటుందా అని నా అనుమానం.
కథానాయకుడు సినిమా బాగుందని చాలా మంది మెచ్చుకున్నా కాసులు రాలలేదు, మరీ అంత క్లాస్ టచ్ బాలకృష్ణ ఇమేజ్ కి సూట్ అవలేదేమో మరి.
ఈ 'యాత్ర' సినిమా ప్రశంసలతో పాటు పైసలు కూడా తెచ్చిపెడుతుందేమో చూద్దాం ఆ దర్శక నిర్మాతలకు.
కథానాయకుడు సినిమా బాగుందని చాలా మంది మెచ్చుకున్నా కాసులు రాలలేదు, మరీ అంత క్లాస్ టచ్ బాలకృష్ణ ఇమేజ్ కి సూట్ అవలేదేమో మరి.
ఈ 'యాత్ర' సినిమా ప్రశంసలతో పాటు పైసలు కూడా తెచ్చిపెడుతుందేమో చూద్దాం ఆ దర్శక నిర్మాతలకు.