Tuesday, 31 May 2016

మే నెల కబుర్లు - కృష్ణ గారి సినిమా, మల్లన్న పరిచయం చేసిన సినిమా, మా పాప ముచ్చట్లు

నిన్న కృష్ణ గారి బర్త్ డే . ఒకప్పుడు ఆయనకు పెద్ద  ఫ్యాన్ ని నేను. ఆ తర్వాత చిరంజీవి ఫ్యాన్ గా మారాననుకోండి. అదో పెద్ద స్టొరీ దాని గురించి ఇంకొక్కసారి  ఎప్పుడైనా రాస్తాను. ఇప్పటికీ  కృష్ణ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం especially ఫైటింగ్ మూవీస్.నేను చిన్నప్పుడు అగ్ని పర్వతం సినిమాను కృష్ణ కోసం మా ఊరి ధియేటర్ లో వరసగా 3 రోజులు  చూసినట్లు గుర్తు మా అన్నఅయితే ఏకంగా ఊరిలో ఆడిన వారం రోజులు వరసగా చూసాడు కానీ  విజయశాంతి కోసం అని కాస్త పెద్దయ్యాక తెలిసింది.  

మా ఆఫీసు లో ఒక మల్లన్న (మలయాళం అన్న) ఉన్నాడు. మొన్న ఏదో మాటల సందర్భం లో మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించిన NO:20 Madras Mail అనే మలయాళం సినిమా గురించి చెప్పాడు. గూగుల్ చేస్తే దొరికిన  తెలుగు dubbed  version చూశాను. శ్రీను వైట్ల ఈ మూవీ చూసి inspire అయి రవితేజ తో వెంకీ  సినిమా తీసి ఉంటారనుకుంటా. రెండు సినిమాల్లోనూ మొదటి సగ భాగం లో కథ  ఒకే రకంగా ఉంటుంది.   

సోమవారం మా టీం లో ఒక కొత్త మెంబర్ జాయిన్ అయ్యాడు. ఏదో మాట్లాడుతూ  పెళ్లి అయిందా అని అడిగాను అయింది నాలుగు సార్లు అన్నాడు. ఇక పిల్లల గురించి అడిగితే ఇంకేమి వినాల్సి వస్తుందో అని అక్కడితో ఆపేశాను.

మా పాప కు తెలుగు మాట్లాడటం వచ్చు కానీ ఇంగ్లీష్ మాట్లాడటం సరిగ్గా రాదు. మొన్న సాయంత్రం  నేను బాల్కనీ లో నిల్చుని మా బుడ్డోడికి చుక్కలు చూపిస్తూ దిక్కు మాలిన కథలు ఏవో చెప్తూ ఉంటే మా పాప  వచ్చి నాన్నా your life is calling అంది. ఏంటమ్మా !!  అన్నాను సరిగ్గా అర్థం కాక.  your life is calling from  the chicken అంది ఈ సారి మరింత ఇంగ్లీష్ పరిజ్ఞానము జోడించి . అప్పుడు ట్యూబ్ లైట్ వెలిగింది బుర్రలో కాదండి మా బాల్కనీ లో. నా భార్యామణి బాల్కనీ లో లైట్ వేసి నాతో  అంది అప్పటినుంచి  పిలుస్తున్నాను వినపడలేదా అని . అప్పుడు ట్యూబ్ లైట్ వెలిగింది నాకు ఈ సారి బుర్రలోనేనండోయ్  your wife  is calling from the kitchen కు వచ్చిన తిప్పలు ఇవి అని.

మా పాప ను పోయిన వారం నుంచే చైల్డ్ కేర్ కు పంపిస్తున్నాము. ముందు రోజు రాత్రి తన టాబ్ కి ఛార్జింగ్ పెట్టుకుంటోంది. ఎప్పుడూ ట్యాబు చూడడమే తప్ప ఛార్జింగ్ పెట్టని తనని అడిగాను ఎందుకమ్మా నువ్వే టాబ్ కు ఛార్జింగ్ పెడుతున్నావు  అని. స్కూల్ కు చార్జర్ తీసుకెళ్లడం ఎందుకు నాన్న అందుకే ఫుల్ గా ఇప్పుడే ఛార్జింగ్ పెడుతున్నాను  అంది . అమ్మా చిట్టీ!  చైల్డ్ కేర్ లో టాబ్ అలౌ చేయరు అక్కడే బోల్డన్ని టాయ్స్ ఉంటాయి వాటితో ఆడుకోవచ్చు అని చెప్పాను.  పెద్దలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా ఉండటం, గ్రాండ్ పేరెంట్స్ మరెక్కడో ఉండటం తో  పిల్లలు ఈ విధంగా ట్యాబు కు అడిక్ట్ అవుతున్నారు . మన బాల్యంలో ఈ టాబ్ లు గట్రాలు లేకపోవడం మన అదృష్టం. 

ఈ వీకెండ్ మా పాప బర్త్ డే ఉంది. మా పాప తనకు వచ్చే బర్త్ డే గిఫ్ట్ ల కోసం ఎదురుచూస్తూ ఉత్సాహంగా ఉంది.  మేము వచ్చిన పిల్లలకు ఇవ్వవలసిన రిటర్న్ గిఫ్ట్ ల కోసం, కేకు ఆర్డర్ కోసం, బర్త్ డే decorations  కోసం షాపింగ్స్  కు వెళ్ళాలి .  ఆ పనులతో కాస్త బిజీ గా ఉంటాను కాబట్టి  త్వరలో ఒక రెండు మూడు  రోజులు ఈ బ్లాగ్ కు సెలవు ప్రకటించ బోతున్నాను. 6 comments:

 1. Hi,
  Trying to contact you for a business deal.
  Regards,
  Rohit Vaddi.
  8008551361

  ReplyDelete
  Replies
  1. Hi Rohit,

   You can reach me on msg2pavan@gmail.com.

   Please let me know how I can help you.

   Thanks,
   Pavan

   Delete
 2. wife nu life anadam lo tappu ledemo brother. Baagunnayi nee kaburlu.

  ReplyDelete
  Replies
  1. అదీ ఒక రకంగా కరెక్టే.

   Delete
 3. మీ పాపకు హపిబర్త్డే

  ReplyDelete