గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం లాంటి రెండు జండూబామ్ సినిమాల తర్వాత మళ్ళీ పెద్ద సినిమా అదీ థియేటర్ లో అంటే భయం వేసింది కానీ ఏదో కాస్త వెరైటీ గా ఉంటుందని అంటున్నారుగా అని ధృవ సినిమా కు టికెట్స్ బుక్ చేసుకున్నాను. తని ఒరువన్ అనే తమిళ పడం కి ఇది రీమేక్ అని తెలిసినప్పటి నుంచి తని ఒరువన్ మూవీ నా దగ్గర ఉంది కావాలంటే చూడు అని నా తమిళ మిత్రుడు ఎంతగా టెంప్ట్ చేసినా చూడకుండా కంట్రోల్ చేసుకున్నాను. ఏమైనా మన భాషలో చూస్తే అదో ఆనందం.
శనివారం షో కి శుక్రవారం టికెట్ బుక్ చేస్తున్నప్పుడు కూడా చాలా వరకు ఖాళీ గా ఉన్న సీట్స్ నన్ను వెక్కిరించాయి కానీ శనివారం ఉదయానికి కంప్లీట్ గా సోల్డ్ అవుట్ అయినట్లు చూడగానే సినిమా మీద కాస్త ఇంటరెస్ట్ కలిగింది. ఆ తర్వాత రెండు ఎక్స్ట్రా షోస్ కూడా వేస్తున్నట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలకు తప్పితే రామ్ చరణ్ సినిమాలకు జనాలు మరీ అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోరు ఇక్కడ.
శనివారం షో కి శుక్రవారం టికెట్ బుక్ చేస్తున్నప్పుడు కూడా చాలా వరకు ఖాళీ గా ఉన్న సీట్స్ నన్ను వెక్కిరించాయి కానీ శనివారం ఉదయానికి కంప్లీట్ గా సోల్డ్ అవుట్ అయినట్లు చూడగానే సినిమా మీద కాస్త ఇంటరెస్ట్ కలిగింది. ఆ తర్వాత రెండు ఎక్స్ట్రా షోస్ కూడా వేస్తున్నట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలకు తప్పితే రామ్ చరణ్ సినిమాలకు జనాలు మరీ అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోరు ఇక్కడ.
ఈ నగరానికి ఏమైంది అనే సోది లేకుండా సినిమా మొదలైంది మా 14 నెలల బుడ్డోడి ఏడుపుతో పాటు. వాడికి ఒక చోట ఖాళీగా కూర్చోవడం అంటే నచ్చదు. ఇది మేము ఊహించిందే కాబట్టి ఒక చాకొలేట్ ఇస్తే ఏడుపును మొదటి పాట అయ్యేవరకు ఆపుకున్నాడు. ఈ సారి కాసింత పాప్ కార్న్ ఇచ్చి వాడి ఏడుపును రెండవ పాట అయ్యేవరకు ఆపగలిగాము. ఇక మా దగ్గరున్న అస్త్రశస్త్రాలు అయిపోయాయని కనికరించి వాడే నిద్రలోకి జారుకున్నాడు.
ఈ తెలుగు సినిమాకు ఏమైంది అసలు మూడవ పాట రాకుండానే ఇంటర్వెల్ ఎలా పడుతుంది అనుకోగానే ఇక ఇంటికి వెళదామా నాన్నా అంది మా పాప పాపం సినిమా అయిపోయిందనుకొని. ఇష్టం లేకపోయినా సైలెంట్ గా కూర్చొని సినిమా చూస్తుంది మా నాలుగేళ్ల పాప, చిన్నప్పటి నుంచి అంతే మెతక, మా బుడ్డోడి లాగా రెబెల్ కాదు పాపం.
ఇక సినిమా గురించి చెప్పాలంటే ఓవరాల్ గా నచ్చింది, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ తప్ప. హీరోయిన్ I.P.S ట్రైనింగ్ లాంటివి మధ్యలో వదిలేయడం లాంటి సిల్లీ థింగ్స్ నచ్చలేదు. పైగా ఒక సీన్ లో ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ లాగా టకా టకా ఏమేమో చేసేస్తుంది, I.P.S ట్రైనింగ్ వదిలేసిన తర్వాత మరి అలాంటి కోర్స్ ఏమైనా చేసిందేమో మరి. ఇలాటి లోపాలు బొచ్చెడు ఉన్నాయి కానీ 'లాజిక్ ఎండ్స్ వెన్ ది మూవీ బిగిన్స్' అంటారు కాబట్టి ఇలాంటి వాటిని పట్టించుకోవద్దు.
మూవీ స్టార్టింగ్ లో 'నాకు ధృవ స్ఫూర్తి అని, అతనిచ్చిన వాచ్ చూపించి' నవదీప్ పొగిడినప్పుడు అనవసరంగా హీరో పాత్రను, గొప్పదనాన్ని ఎలివేట్ చేయడానికి ఒక సీన్ రాసుకున్నారు అనుకున్నాను కానీ, ఇంటర్వెల్ తర్వాత ఆ వాచ్ కొక పర్పస్ పెట్టినప్పుడు మాత్రం ఆ సీన్ వృధా కాలేదనిపించింది. 'ఒక సీన్ లో తుపాకీ చూపిస్తే ఆ సినిమా అయిపోయేలోగా ఆ తుపాకీ ని వాడి తీరాలి' అనే సినీ సూత్రాన్ని విస్మరించలేదని అర్థమైంది. ఇలా ధృవ లో వృధా అనిపించే సీన్స్ కానీ పాత్రలు కానీ పెద్దగా లేవనే చెప్పచ్చు.
హీరో బగ్ గురించి తెలుసుకున్నాక థియేటర్ లో వచ్చిన రెస్పాన్స్ అదుర్స్. ఈ మధ్య నేను చూసిన సినిమాల్లో నాని 'జెంటిల్ మెన్' మూవీ తర్వాత బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న సినిమా ఇదే అని నా ఫీలింగ్ . సినిమా చూసి రెండు రోజులవుతున్నా ఇప్పటికీ ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నా మైండ్ లో ప్లే అవుతూనే ఉంది.
కామెడీ ట్రాక్ అంటూ ప్రత్యేకంగా లేదు కానీ ఇందులో ఎంటర్టైన్మెంట్ పార్ట్ అంటే పోసానిదే. 'ఇంతకీ దోమ చచ్చిందా నాన్న' అని అడిగిన డైలాగ్ కి ఒక నిముషం లేటుగా థియేటర్ లో మొదలైన నవ్వులు రెండు నిముషాల దాకా ఆగలేదు. (ఆ డైలాగ్ వెనుక ఉన్న కామెడీని సీరియస్ మూడ్ లో ఉన్న ప్రేక్షకులు అర్థం చేసుకోవటానికి కాస్త టైం పట్టింది )
'తినగా తినగా వేప తియ్యగుండు అలాగే వినగా వినగా రాగాలు బాగుండు' అని నేను నమ్ముతాను కాబట్టి శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం లోగా ఆ సినిమాలా పాటలు కనీసం ఓ మూడు సార్లు విని ఉంటాను. అందువల్ల కాస్తో కూస్తే ఆ పాటలు ఓ.కే అనిపించాయి కానీ లేకపోతే వామ్మో అవేం పాటలు రా బాబోయ్ అని అనిపించేది. ఇక చివరి పాటలో అయితే ఆ సింగర్ పెట్టే కేకలు విన్నారంటే , సింహం పెట్టే కేకలు విని పారిపోయే మేకల లాగా మనమూ పారిపోవాల్సిందే. ఇక ఉన్న నాలుగు పాటల్లో నాకు అంతో ఇంతో నచ్చిన పాట 'చూశా చూశా చూశా ..ఒక హృదయాన్నే హృదయాన్నే'.
ఇంతకీ మా పాప ఇంటర్వెల్ తర్వాత కూడా సినిమా చూసిందా, లేక నిద్రపోయిందా ? పడుకున్న మా బుడ్డోడు మళ్లీ ఎప్పుడు లేచాడు లాంటి వన్నీ రాస్తే ఈ పోస్ట్ మరీ పొడుగై పోతుంది లేదంటే పార్ట్-2 రాయాల్సివస్తుందని ఆ వివరాలన్నీ రాయలేదు. అలాగే ఈ సినిమా ని కూడా ముగించాలి కాబట్టి క్లైమాక్స్ ని సింపుల్ గా ముగించారు లేదంటే వాళ్ళు కూడా 4 గంటల సినిమా ను తీయాలి లేదంటే బాహుబలి-2 లాగా ధృవ -2 తీయాలి.
మొత్తానికి సినిమా చూడచ్చా లేదా అంటే రెండు సార్లు చూడొచ్చు ఒకసారి థియేటర్ లో ఇంకోసారి టి.వి లో వచ్చినప్పుడు.
ఈ పోస్ట్ టైటిల్ కి జస్టిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చాననుకుంటాను. ఇవ్వలేదనుకుంటే థియేటర్ లోనే మీరు ధృవ సినిమాను రెండు సార్లు చూడాలి అర్థం అవడానికి.
చివరి పేరాలోని ".... అర్ధం అవడానికి" అనే కొసమెరుపు బాగుందండి 😀. మీ టపా సారాంశం అంతా దాంట్లోనే ఉంది. (అన్నట్లు కొసమెరుపుల స్పెషలిస్ట్ బ్లాగర్ ఒకాయన ఉన్నారు susrihome.blogspot.in దాంట్లో టపాలు సరదాగా ఉంటాయి. కాకపోతే ఆ బ్లాగులో వ్యాఖ్యలు వ్రాయడం అంత "వీజీ" కాదు, సభ్యులకి మాత్రమే అనుమతి అని ఈ మధ్యనే నిబంధన పెట్టారు. సభ్యులు కానివారు టపాలు చదివి ఆనందించడం వరకే ☹️)
రిప్లయితొలగించండిఅవును పవన్ గారూ, మూడో పేరాలో "ఈ నగరానికి ఏమైంది అనే సోది ....." అన్నారు అర్ధం కాలేదు. ఏమా "సోది", అది ఎక్కడ తగులుచుండును?
మీ విశ్లేషణ కు కామెంట్స్ కు ధన్యవాదాలండి నరసింహా రావు గారు.
తొలగించండివారి బ్లాగ్ నేనూ చదువుతానండి చాలా ఫన్నీ గా ఉంటాయి వారి పోస్ట్స్.
ప్రతీ సినిమా ముందు థియేటర్ లో ఈ నగరానికి ఏమైంది ఒక వైపు పొగ అంటూ 'స్మోక్ చేయకండి' అని అదేదో న్యూస్ రీల్ వేస్తారుగా దాని గురించి.
ఓహో అదా సంగతి. థాంక్స్. నేను సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్లడం మానేసి చాలా ఏళ్ళయిందిలెండి, అందువల్ల తెలియరాలేదు.
రిప్లయితొలగించండిముందు పాటలు విని తర్వాత సినిమాకి వెళ్లే మీ ఐడియా నచ్చింది నాకు - మీరన్నట్లే చెవులకి అలవాటవడంతో సినిమలో బానే వున్నట్టనిపిస్తాయి.
రిప్లయితొలగించండిఇప్పుడొస్తున్న సినిమాల్లో పాటలు భరించడానికి ఆ మాత్రం ప్రిపరేషన్ లేకపోతే కష్టమండి లలిత గారు అందుకే ఆ ముందు జాగ్రత్త. ఈ కాలం పాటలు నచ్చట్లేదంటే నువ్వు యూత్ స్టేజ్ దాటేసినట్లే అని మా కోలీగ్ అంటూ ఉంటాడు నాతో.
తొలగించండినేను బహుశః ఈసినిమాను నేరుగా రెండవసారి చూస్తానండి, టీవీలో వచ్చినప్పుడు.
రిప్లయితొలగించండిరెండు నెలల్లోనే వేసేస్తారులేండి టి.వి లో శ్యామలీయం గారు, అప్పుడు నేరుగా మొదటి సారి చూడొచ్చు. ఈ కాలం లో థియేటర్ కి వెళ్ళి మరీ చూడాల్సినంత గొప్ప సినిమాలేవీ రావట్లేదు లెండి. థాంక్స్ ఫర్ ది కామెంట్స్
తొలగించండి