27, జనవరి 2019, ఆదివారం

సిడ్నీ లో సంక్రాంతి సంబరాలు

ప్రతీ సంవత్సరం లాగానే, ఈ సంవత్సరం కూడా తెలుగు దేశం పార్టీ వాళ్ళు సిడ్నీలో  సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.

దీని గురించి రాస్తున్నానని, నేనేదో తెలుగు దేశం పార్టీ వాడిని అనుకునేరు, నేను ఏ పార్టీ కి చెందిన వాడిని కాదు. ఏ రాయయినా ఒకటే తల పగులకొట్టుకోవడానికి అని నా ఉద్దేశం. కాబట్టి ఇలాంటి సంబరాలు ఏ పార్టీ వాళ్ళు అరేంజ్ చేసినా వెళ్తాను, నాకు అలాంటి పట్టింపులు లేవు. 

మొదట్లో అందరం వెళదాం అనుకున్నాం కానీ, ఈ సంబరాలు ఈవెనింగ్ టైం అరేంజ్ చెయ్యడం, మా ఇంటికి బాగా దూరం అవడం వల్ల, బాగా నైట్ లేట్ అవుతుందేమో, పిల్లలు పడుకుంటారు అని అనుమానంతో నేనూ, పిల్లలు వెళ్ళలేదు కాబట్టి అక్కడి విశేషాలను తెలియజేయలేను. దానికి తోడు వర్షం పడే సూచనలు ఉండటంతో వెళ్ళడానికి కుదరలేదు, అసలే కొత్త గొడుగు కొన్నాను  వర్షం లో వెళితే కొత్త గొడుగు తడిసిపోతుందేమో అని 😊

కాకపోతే ఈ పోస్ట్ రాయడానికి ఒక ముఖ్య కారణం,  నిన్న జరిగిన ఈ సంబరాల్లో మా ఆవిడ డాన్స్ ప్రోగ్రాం ఉండటం.

ఎప్పుడో మా పెళ్లి  కాకముందే మరచిపోయిన తనలోని కళని ఇప్పుడిలా వెలికి తీసింది, నాకు తెలిసి దాదాపు 17 సంవత్సరాల తర్వాత అనుకుంటా తను ఇలా డాన్స్ చేయడం, అదీ తన  పుట్టినరోజున కావడం విశేషం.

మీరూ క్రింది లింక్ మీద ఒక లుక్కేసి చెప్పండి మరి, తను ఎలా డాన్స్ వేయగలిగిందో ఆఫ్టర్ ఏ  లాంగ్ గ్యాప్

https://www.youtube.com/watch?v=4WUhSya8oNw&feature=youtu.be

పింక్ డ్రెస్ లో ఉన్నది మా ఆవిడ, పక్కన రెడ్ డ్రెస్ వేసుకున్నది మా ఆవిడ ఫ్రెండ్ మంజు, కాలేజ్ లో ఎన్నో బహుమతులు గెల్చుకున్న డాన్సర్. ఆవిడ వేద్దామని మా ఆవిడని అడగ్గానే డాన్స్ మీద ఉన్న ఆసక్తితో, ఎన్నో ఏళ్ళ నుంచి డాన్స్ వేయకపోయినా ఒక రెండు, మూడు  గంటలు ప్రాక్టీస్ చేసి నలుగురి ముందు (నలుగురు అంటే నలుగురు అని కాదు, ఫ్లో కోసం అలా రాశాను అంతే ) బెరుకు లేకుండా ఉత్సాహంగా వేయగలిగింది.



సిడ్నీలో తెలుగు దేశం ఆధ్వర్యం లో జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే రేంజ్ లో జరిగాయి. అమ్మయ్య! టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చేశా 😊

9 కామెంట్‌లు:

  1. 👏 👏
    మీరుంటున్నది మెల్-బోర్న్ లో అనుకున్నానే 🤔. కాదా?

    రిప్లయితొలగించండి
  2. ఇద్దరూ భలే ఉత్సాహంగా డాన్స్ చేసారండీ 👏👏👏👏 పాతపాటలు సెలెక్ట్ చేసుకున్నారు కానీ కొత్త పాటలు అయితే ఇంకా అదరగొట్టేవాళ్ళు.

    రిప్లయితొలగించండి
  3. చూసి మెచ్చినందుకు ధన్యవాదాలు నీహారిక గారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వయసయిపోయాక ఇలా చేసేకంటే ఎంచక్కా మీరు ఇపుడే ఒక మంచి వీడియో సాంగ్ చేయవచ్చు కదా ?

      https://youtu.be/vjieOdKAQFY

      తొలగించండి
    2. భలే ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు లైఫ్ ని ఆయన తన వైఫ్ తో కలిసి. నేను డ్యాన్స్లో కృష్ణ గారితో పోటీ పడే రకం, నాకు అవి సెట్ అవవు.

      మీరెలాగూ మంచి ఐడియా ఇచ్చారు కాబట్టి, ఫాలొ అవడానికి ట్రై చేస్తాను వయసై పోయేలోగా :)

      తొలగించండి
    3. ఈ డాక్టర్ గారికి కళాపోషణ ఓ పాలు ఎక్కువలెండి 🤣.

      తొలగించండి
  4. మీ గీత గారికి Belated Happy Birthday Wishes!
    డాన్స్ బాగా చేశారు.

    రిప్లయితొలగించండి