Saturday, 11 May 2019

రేట్స్ పెంచితే ఎవరికి నష్టం?

రోబోట్స్ అమ్మే షాప్ కి వెళ్ళి ఒక్కో రోబోట్ రేట్ చూస్తున్నా. ఒక్కొక్క రోబోట్  మీద ఒక్కొక్క రేటు ఉంది.  లక్ష రూపాయలు,  2 లక్షల  రూపాయలు, 3  లక్షల రూపాయలు అని రాసి ఉంది.

అన్ని రోబోట్స్ ఒకేలా ఉన్నాయి, ఎందుకలా డిఫరెన్స్ రేటులో అని అడిగా షాప్ కీపర్ ని.

ఇదేమో గార్డెనింగ్ బాగా చేయగల రోబోట్, దీని రేటు లక్ష.

ఇదేమో ఇల్లు క్లీన్ చేసే రోబోట్, దీని రేటు 2 లక్షలు.

ఇదేమో వంట బాగా చేయగల రోబోట్ , దీని రేటు 3  లక్షలు.

ఆహా, మరి ఆ చివరి రోబోట్ మీద మాత్రం 5 లక్షలు అని రాశారు. ఏంటి దీని స్పెషాలిటీ? ఏయే పనులు బాగా చేస్తుంది.  అని అడిగా.

అది పని చేయగా ఎవరూ చూడలేదు, అసలు దానికి ఏ పని వచ్చో ఎవరికీ తెలీదు కానీ అన్ని రోబోట్స్ దాన్ని "మేనేజర్" అని పిలుస్తుంటాయ్, అందుకే దాని రేటెక్కువ.

సో, అలా రెట్లు తెలుసుకున్నాక ఇష్టమైతే కొనుక్కుంటాము లేదంటే కొనుక్కోకుండా వచ్చేస్తాము అంతే గానీ ఆ మేనేజర్ రోబోట్ కు ఎందుకంత రేట్ పెట్టావ్ అని గొడవ పెట్టుకోము.
                                                ********************

తర్వాత బట్టల  షాప్ కి వెళ్లి షర్ట్స్ చూపించమన్నాను.  కొన్ని చూపించాడు, అందులో ఒకటేమో 5000 అన్నాడు, ఇంకోటేమో 3000 అన్నాడు మరొకటి 2000 అన్నాడు.

అంత రేటెందుకు అన్నాను, క్వాలిటీ, స్టిచ్చింగ్, డిజైన్ ఇలాంటివేవేవో చెప్పి అందుకే రేట్ ఎక్కువ అన్నాడు.

ఆ షాప్ నుంచి బయటపడి ఇంకో షాప్ లోకి వెళ్ళాను.

కొన్ని చూపించాడు, అందులో ఒకటేమో 500 అన్నాడు, ఇంకోటేమో 300 అన్నాడు మరొకటి 200 అన్నాడు.

నాకు 200 రూపాయల షర్ట్ చాలనిపించింది. కొనుక్కొని వచ్చేశాను.

పనిలో పనిగా ఆ ముందు షాప్ కి వెళ్ళి, నువ్వు ఇంత రేట్ చెప్పడం అన్యాయం అని ఎవరైనా గొడవ పెట్టుకోవడం చూశామా?
                                      ***************************

తర్వాత థియేటర్ కి వెళ్ళాను, వాడు టికెట్ 500 అంటున్నాడు.  పక్కన ఇంకో సినిమాకు 200 అంటున్నాడు.

ఎందుకంత డిఫరెన్స్ అని అడిగితే  ఒకదాని బడ్జెట్ 100 కోట్లు, ఇంకో దాని బడ్జెట్ 10 కోట్లు అందుకే తేడా అన్నాడు.

మరి పై రెండు సిట్యుయేషన్స్ లాగానే నీకు ఏది నచ్చితే దానికి వెళ్ళాలి. అంతేగానీ టికెట్ రేట్స్ పెంచారు అని గొడవెట్టడం మూర్ఖత్వం.

ఆ బుద్ది చూసే వాళ్లకు ఉండాలి అంత ఖర్చు పెట్టుకొని చూడటం అవసరమా అని. ఎవడూ వెళ్ళి చూడకపోతే ఆ సినిమా వాడే దిగివస్తాడు రేట్స్ తగ్గించుకొని. లేదంటే బడ్జెట్ అదుపులో పెట్టుకుంటాడు అనవసర ఖర్చు పెట్టుకోకుండా.

మీకు నచ్చితే థియేటర్ కి  వెళ్లి సినిమా చూడండి లేదంటే కొన్ని నెలలు ఆగి టీవీ లో వచ్చినప్పుడు చూడండి.

మహర్షి సినిమా టికెట్ రేట్స్ పెంచారని పెద్ద న్యూస్ చేస్తున్నారు, అలా పెంచడం అన్యాయం అని. నాకైతే అది వాళ్ళిష్టం అనిపించింది. మరి ఇంత రేట్ మాత్రమే ఉండాలి అని ఏమైనా గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయోమో తెలీదు మరి. 

రైతులకు తప్ప ప్రతీ ఒక్కరికీ తమ ప్రొడక్ట్ మీద రేట్ ఫిక్స్ చేసుకునే వెసులుబాటు ఉన్నట్లుంది చూస్తుంటే.

74 comments:

 1. కాదేదీ రేటుపెంపునకనర్హం అనుకుంటే సరి .... మీరన్నట్లు రైతులకు తప్ప (మేరా భారత్ మహాన్) 😩.
  (సినిమా టిక్కెట్ల రేటు పెంపునకు తమ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం వారన్నారని ఓ వారం రోజుల క్రితం వార్తాపత్రికల్లో చదివినట్లు‌ గుర్తు)

  ReplyDelete
  Replies
  1. ఈ మహర్షి సినిమా కూడా రైతుల సమస్యల పైనే తీశారని చూసిన వారు అంటున్నారు మేష్టారు.

   Delete
  2. అనుమతి కోసం Govt కి ఎంతో కొంత ముట్టచెప్పలేమో, అప్పుడు వీళ్ళు నిర్ణయించిన రేట్ కి అమ్ముకోవచ్చేమో టికెట్స్

   Delete
  3. # పవన్ గారు
   “మహర్షి” సినిమా నేనింకా చూడలేదు (టీవీలో వచ్చినప్పుడే చూస్తానని నా పోలసీ కదా 🙂). ఆ సినిమాను మెచ్చుకుంటూ “పల్లెప్రపంచం” బ్లాగ్ లో “అందరూ చూడాల్సిన సినిమా ‘మహర్షి’ “ అని 11వ తారీఖున ఒక పోస్ట్ వచ్చింది.

   http://blog.palleprapancham.in/2019/05/blog-post_11.html

   ఆ పోస్ట్ క్రింద “బుచికి” గారు ఈ కామెంట్ వ్రాశారు 👇. మీరేమంటారు?
   ————————————
   “బుచికి May 11, 2019 at 4:17:00 PM GMT+5:30
   రైతు సమస్యలను దైన్యాన్ని కూడా తెలివిగా సినిమా బిజినెస్ కు వాడుతున్నారు. వందల కోట్ల బడ్జట్ తో సినిమాలు తీస్తూ పదుల కోట్లు పారితోషికం తీసుకుంటున్న వారు నిజంగా రైతులకు సహాయమ చేస్తే బాగుంటుంది. ఒకవైపేమో అమెరికాలో కార్పొరేట్ అధిపతి చాలా సులభంగా అయిపోతాడు హీరో. మన దేశంలో మాత్రం కార్పొరేట్ బూచితో పోరాడతాడు. ఇదే సినీ మాయ.”
   ————————————-

   Delete
  4. ఇంట్లో టీవిలో వచ్చినప్పుడు చూడటం మంచి పని మేష్టారు.


   ఇక బుచికి గారెవరో కరెక్ట్ గా చెప్పారు, సినిమా వాళ్ళు ఇంతేగా. మహేష్ బాబు మాత్రం ఎన్ని కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడరో ఎవరికి తెలీదు. Thumbs Up లాంటివి మంచిది కాదు అని తెలిసీ ప్రమోట్ చేయడానికి ఒప్పుకుంటారు, అదే సినిమాలో ప్రజల తరపున పోరాడతారు, అంతా డబ్బు మాయ.

   Delete

  5. ఆ సాఫ్ట్ డ్రింక్ కోసం బ్రిడ్జీల పైనుండీ, ఎత్తైన భవనాల పైనుండీ దూకినట్లు చూపించే అడ్వర్టైజ్మెంట్ లు. బాధ్యతారాహిత్యం? హిపోక్రసీ?

   Delete
 2. ఈ దిక్కుమాలిన సినిమా మాయలో పడి మనవైన కళలను(సంగీతం, నాట్యం, నాటకం లాంటివి) ఆదరించడం మానేసి ఒకటి రెండు తరాలు గడిచిపోయాయి. ఇప్పటికీ పసలేని సినిమాలు చూడటం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదనుకుంటున్నాం. మల్టీప్లెక్స్ లో సినిమా, ఆపైన రెస్టారెంట్ లో భోజనం అంటూ తగలెయ్యక ఏ పాత సినిమానో స్పోర్ట్సో చూస్తూ బొబ్బట్లో బూరెలో లేక బిరియానీ యో సొంతంగా వండుకు తినటం ఉత్తమం.

  ReplyDelete
  Replies
  1. అవును సూర్య గారు, నాటకాలు, డ్రామాలు దిక్కులేకుండా పోయాయి ఈ దిక్కుమాలిన సినిమా మాయలో

   Delete
  2. ఈ తరం వారు బొబ్బట్లు, బూరెలు ఇంట్లో వండాలటే ఆ విద్య తెలిసుండాలిగా సూర్య గారు? అయినా స్వగృహ ఫుడ్స్ ఉండగా ఏల ప్రయాస? 🙂

   Delete
 3. మీరన్నది కరష్టు!!

  బుధ్ధిలేని జనాలని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కాదు. వాడు టికెట్లను వెయ్యిక్కకపోతే పదివేలకు అమ్ముకుంటాడు. మన బుధ్ధి ఏగంగలో కలిసింది? సినిమా అనేది నిత్యావసర వస్తువో, సేవో కాదు అలాంటప్పుడు టికెట్ ధర ఇంతే ఉండాలని ప్రభుత్వాలు రూల్స్ పెట్టడం పూర్తిగా అనవసరమైన చర్య.

  ReplyDelete
  Replies
  1. భలే చెప్పేసినారు కరస్ట్ గా మీరు.

   Delete
 4. "ఎవడూ వెళ్ళి చూడకపోతే ఆ సినిమా వాడే దిగివస్తాడు రేట్స్ తగ్గించుకుని" - ఇది భలే సరైన మాట, పవన్‌గారు!

  ReplyDelete
  Replies
  1. నచ్చినందుకు థాంక్స్ లలిత గారు. వాడు రేట్లు పెంచుకుంటూ పోతున్నాడు అంటే అది మన తప్పే, మనం చూస్తూ ఉన్నంతవరకు వాళ్ళు ఇలానే చేస్తుంటారు అని నా ఉద్దేశ్యం.

   Delete
 5. గిరాకీ & సరఫరా బట్టే ధరలు ఉంటాయన్నది (law of demand & supply) ఆర్ధిక శాస్త్రానికి ప్రాధమిక సూత్రం. ఎంత చెత్త సినిమా అయినా "ధైర్యంగా" చూసే ప్రేక్షకులు ఉన్నంతవరకు రేట్లను అదుపు చేయడం కుదరదు. అంచేత పవన్ గారి వంటి "వినియోగదారులు" విన్నకోట వారి రూటులోకి (టీవీలో ఫ్రీ అయితేనే చూడడం) వస్తే ఉత్తమం.

  ReplyDelete
  Replies
  1. నాదెప్పుడూ విన్నకోట వారి రూటే జై గారు, మరీ సినిమా బాగుంది అని టాక్ వస్తే తప్ప మొదటి వారం సినిమాకి వెళ్లి చూడను. ఏదో కొన్ని సినిమాలు గ్రహచారం బాగోక మొదటి వీకెండ్ లోనే చూసి బుక్కయిపోయా అప్పుడెప్పుడో మూడేళ్ళ క్రితం.

   టీవీ లో అయితే ఖర్చు లేని పని కాబట్టి, ప్రతీ అడ్డమైన సినిమా చూస్తా.

   Delete
  2. Thanks for your blessings Jai gaaru. I think those who are not going to Theatre and watching the movies there are considered as old generation.

   Delete
  3. # Pavan
   Welcome to the “old generation” club (mentally) 💐 🙂.

   Delete
  4. మేస్టారూ, మొన్నా మధ్య 'అర్జున్ రెడ్డి' అనే బంపర్ హిట్ చిత్రం నాకు నచ్చలేదని చెప్తే నన్ను ఓల్డ్ జనరేషన్ కిందే లెక్క కట్టారు కొందరు.

   Delete
  5. డబ్బు ఖర్చు (దండుగ) పెట్టకుండా టీవీలో ఫ్రీగా చూడడం పీసిరిగొట్టుల క్లబ్ అవుతుందేమోనండీ. (మనలో మాట: నాదీ ఈ రూటే)

   Delete

  6. // “(టీవీలో ఫ్రీ అయితేనే చూడడం)” //

   Whoa, Jai garu ✋.

   మీరన్నది, “జిలేబి” గారు పద్యరూపంలో అన్నది (వారి “వరూధిని” బ్లాగ్ లో FRIDAY, NOVEMBER 30, 2018 నాటి టపా “దత్తపది - అల కల తల వల - అన్యార్థం లో - పాదాది లో - రామాయణార్థం లో !” క్రింద కామెంట్లలో “టీవీ లోవస్తేనే / నే వసతిగ నింట చూతు నే సినిమానే / కేవల మా చిత్రంబుల / కై వార్నీ డబ్బు లేల కైదాట వలెన్ :)” అని నామీద విసురుతో వారు పద్యరూపంలో చేసిన ఇవాళ్టి వ్యాఖ్య) ముఖ్య కారణం కాదు.. మీరిరువురూ అన్నది టీవీలో - టీవీలోనే - సినిమాలు చూడడం వలన కలిగే ఒక లాభమే no doubt, అయితే నాకు అది ఒక incidental / collateral benefit మాత్రమే. ఒకప్పుడు నేనూ సినిమా హాళ్ళకు మహారాజ పోషకుడినే. క్రమేపీ సినిమా హాళ్ళ దోపిడీని భరించలేక డబ్బిచ్చి మరీ బాధపడనేల అని ఆలోచించి సినిమా హాళ్ళకు వెళ్ళడం మానేశాను - అదిన్నూ టీవీల రంగప్రవేశం జరగకముందే. తరువాత తరువాత టీవీలు వచ్చాక సినిమా చూస్తే ఇంట్లో కూర్చుని టీవీలోనే చూడడం ఉత్తమం అనే నిర్ణయం తీసుకోవడం మరీ తేలికయింది. ఇప్పుడు మల్టీప్లెక్స్ లు వచ్చినా కూడా వాటి ఆధునిక దోపిడీ పద్ధతుల గురించి వినడం మూలాన ఆనాటి నా విముఖతలో మార్పేమీ రాలేదు. ఏదో ఇలా హాయిగా గడిచిపోతోంది 🙂.

   Delete
  7. # పవన్ గారు
   // “అర్జున్ రెడ్డి' అనే బంపర్ హిట్” //

   హా హా, నేనా చిత్రరాజాన్ని చూడలేదు. దాన్ని గురించి వినుండడం వలన, విన్నది నచ్చకపోవడం వలన ఆ సినిమా ఈ నాటికీ చూడలేదు - టీవీలో అడపాదడపా ఫ్రీగా చూపిస్తున్నా కూడా 🙂. ఎంతైనా ఓల్డ్ జనరేషన్ వాళ్ళం కదా 😀.

   Delete
  8. హమ్మయ్య, నేనొక్కడినే ఉలిపి కట్టె గా ఉండిపోతానేమో అనుకున్నా, మీరున్నారు సంతోషం.

   Delete
  9. అర్జున్ రెడ్డి టీవీలో వేసేటపుడు నీట్ గానే చూపిస్తున్నారు.కాంచన గారి నటన కోసం చూస్తాను. ఉలిపికట్టెలందరూ చూడవచ్చు.

   Delete
  10. కాంచన గారి నటన కోసం సినిమా అంతా భరించడం కష్టం నీహారిక గారు, అసలు మద్యం, సిగరెట్ లాంటివి మరీ ఎక్కువ ఈ సినిమాలో. అదేదో మంచి పని అయినట్లు ఫ్యాషన్ కింద మార్చేస్తున్నారు సినిమాల్లో ఈ తాగుడిని.

   Delete
  11. (పైన అనుకోకుండా వేలు తగిలి డిలీట్ అయిపోయిన నా వ్యాఖ్య ఇది 👇 🙂)
   # పవన్ గారు,
   // "కాంచన గారి నటన కోసం ............" //
   --------------------------------------------------------
   అదీ లెక్క. బాగా చెప్పారు, పవన్ గారూ 👌.

   గతకొన్నేళ్ళుగా వస్తున్న అధికశాతం సినిమాల్లో ... మీరన్న మద్యంతో బాటు (సిగరెట్లు పాతకాలపు సినిమాల్లో కూడా ఉన్నవేగా) ... mindless violence, ఫిజిక్స్ సూత్రాలకందని చిత్రవిచిత్ర ఫైట్ల విన్యాసాలు, రివెంజ్ లు, నిర్లక్ష్యపు ప్రవర్తన, అందరినీ చీటికిమాటికీ చెంపదెబ్బలు కొడుతూ మాట్లాడడం , తల్లిదండ్రులతో కూడా సంస్కారం లేకుండా మాట్లాడడం ... హీరో గారిని "elevate" (సినిమా జనాల పరిభాషలో) చేస్తాయనే అపోహతోనూ, హీరోయిజం అంటే ఇదేననే భ్రమతోనూ (ఉదాత్తమైన పనులు చేసి హీరో అనిపించుకోవడం తక్కువ) సినిమాల్లో జొప్పించడం ఎక్కువవుతోంది. ఈయన గారికి పక్కన అప్పుడప్పుడు న్యూరోటిక్ గా ప్రవర్తించే హీరోయిన్. ఆవిడ గారితో కలిసి, వెనకాల ఓ నలభైమంది మూక ఎగురుతుండగా డ్రిల్ మాస్టార్ చేయించే డ్రిల్ లాంటి డాన్సులు చేయడం కూడా హీరో గారికి elevation ఏమో?

   ఇవన్నీ సమాజం మీద - ముఖ్యంగా యువత మీద - చెడుప్రభావం చూపిస్తాయనే స్పృహ / సామాజిక బాధ్యత సినిమా వారికీ ఉన్నట్లు లేదు (సినిమా అంటే వ్యాపారమే అన్న వాదన కదా వారిది) , సెన్సార్ వారికీ ఉన్నట్లు లేదు. అందుకే ఇవాళ్టి (14-05-2019) Deccan Chronicle (Hyd) నాలుగో పేజ్ లో (Crime) వచ్చిన ఈ వార్త 👇 చాలా refreshing గా అనిపించింది. ఈ పని చేసిన వారు నిబద్ధతతోనే చేశారో, పబ్లిసిటీ కోసమే చేశారో, కేసు చివరకు ఏమవుతుందో .... వేరే సంగతి గానీ మొత్తానికి మంచి పని చేశారు.

   Complaint filed on movie over edgy content

   Delete
  12. వారు సామాజిక భాధ్యత తో చేసి ఉండొచ్చు. ఇక టీవీ వాళ్ళు live debates పెట్టి free publicity ఇస్తారు ఆ 3 సినిమాలకి

   Delete
  13. అదీ నిజమేనండోయ్. ఎంతకైనా సమర్థులు కదా.

   Delete
 6. Aa aakhari vaakyam undi chusaruu... Akkada pindesaarandii....

  ReplyDelete
  Replies
  1. మీరు చదివి మెచ్చినందుకు ధన్యవాదాలు Phaneendra గారు.

   Delete
 7. సినిమా అనేది వ్యాపారం మాత్రమే. అది ఒక కళా రూపం గా నేటి సమాజం లో చూడలేం.
  రైతు సమస్యే కాదు మరే సమస్య పై నైనా సినిమా తీసి కోటానుకోట్లు సంపాదించుకోవడం వారి వ్యాపారం లో భాగమే.
  నటీనటులు సామాజిక బాధ్యత తో వ్యవహరించడం ఏనాడో ముగిసిందని నా అభిప్రాయం. కొంత మంది ఉన్నారేమో ఇప్పటికీ.
  సినిమా చూడడం అనేది దురద వస్తే గోక్కోవడం లాంటిదని ఎక్కడో చదివిన గుర్తు. కళాభిమానుల కంటే నటీ నటుల అభిమానుల కోసమే సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో, ఆయా అభిమానులు తనివి తీరా గోక్కుని వారి అభిమానం చాటుకుంటున్నారంతే.

  ReplyDelete
  Replies
  1. "ఆయా అభిమానులు తనివి తీరా గోక్కుని వారి అభిమానం చాటుకుంటున్నారంతే" - ఇది కేక మాధవ్ గారు

   Delete
  2. రైతు సమస్యలు రైతుల కంటే సినిమా వాళ్ళకే బాగా తెలుసుననే అహంభావం వల్లనే కాబోలు ఎద్దు పాలిస్తుందని నమ్మబలికారు!

   Delete
  3. మహర్షి సినిమాలో అలా చూపించారా ఏమిటి జై గారు?

   Delete
  4. లేదండీ, గోదావరి పుష్కరాలు "లైవ్ షో" ఫేమ్ బోయపాటి సీను అనే ఆయన టీడీపీ ఎన్నికల ప్రచారం కోసం కొన్ని ad films తీసాడు. అందులో ఒకటి సదరు "పాలిచ్చే ఎద్దుకు పసుపు కుంకుం" షార్ట్ ఫిలిం.

   PS: నేను మహర్షి సినిమా చూడలేదు.

   Delete
  5. అప్పటికి ఆవు దొరక్క యెద్దు తో షూటింగ్ కానిచ్చేసారేమో. అదేదో రజినీకాంత్ సినిమాలో శివలింగం సమయానికి దొరక్క, పొడుగాటి స్టీల్ గిన్నెను బోర్లించి బ్లాక్ పెయింటింగ్ వేశారట (నిజమో కాదో ఖచ్చితంగా తెలీదు).

   Delete
  6. కమర్షియల్ సినిమాలో డూపులు/substitute materials మామూలే లెండి. ప్రచార చిత్రాలలో కాస్త వళ్ళు దగ్గర పెట్టుకోవాలనే సోయి ఉండాలి.

   ఇదే సిరీసులో ఉంకో షార్ట్ ఫిలింలో ఖరీదయిన ఆడీ కారు నుండి బాబాయి గారు దిగుతారు. ఎగిరి గంతులేస్తున్న కుర్రాళ్లను చూసి "ఏమిట్రా సంతోషంగా ఉన్నారు?" అని అడిగితే "మాకు కియా కారు కంపెనీలో ఇంజనీరు ఉద్యోగం దొరికిందోచ్" అంటూ అబ్బాయి గారి జవాబు. ఆడీ కారున్న కోటీశ్వరుడి పిల్లకాయలు ఆఫ్టరాల్ చిన్న ఉద్యోగానికే గంతులేయడం ఎందుకో అనిపిస్తుంది.

   దర్శకుడికి కాస్త తెలువుంటే బాబాయి గారికి బక్క రైతు వేషం వేయించి బడుగు రైతుల పిల్లలకు కొలువిప్పించిన ఘనత మా "వ్యవసాయం దండుగ" పార్టీదే అని చెప్పుకోవొచ్చు కదా.

   Delete
  7. ఆ యాడ్ ఫిల్ములో వాడింది ఆవునే. ఆ ఆవు యజమాని పేపర్‌కి ఎక్కి మరి ఎవడ్రా నా ఆవుని ఎద్దు అన్న గాడిద అని తిట్టిపోసాడు. ఐనా కొన్ని గాడిదలు ఓండ్రపెడుతూనే ఉంటాయి.

   Delete
  8. Jai gaaru మరిన్ని విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

   Anonymous గారు కోపం ఎందుకండీ, ఏదో సరదాకి పంచుకుంటున్న కబుర్లు అంతే.

   Delete
  9. పవన్ గారూ,

   కౌంటర్ పడ్డది 'హోలియర్ ద్యాన్ దౌ' పార్టీ మీద, వారి అనుచరుల మీదా అయినప్పుడు సరదాలూ .. గట్రా ఉండవండీ.

   ఆమాటన్నోడు ఆంద్రా ద్రోహే, తెలంగాణా వాడు అయితే తెలబానే.. ఆల్ల రాజకీయాలు, రియాక్షన్లు అలానే ఉంటాయి. పోను పోను మీకే అలవాటు అవుతుందిలెండి..

   Delete
  10. హోలియర్ ద్యన్ దౌ .. ఇదేదో puzzle లాగా ఉంది శ్రీకాంత్ గారు, అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నా.

   Delete
  11. # పవన్ గారు,
   holier-than-thou అర్థమయింది కదా? ఇది వినండి.
   ఆ పదాలు విన్నప్పుడల్లా నాకు ఒక పాత కార్టూన్ గుర్తొస్తుంది. . 1970ల్లో Middle East లో oil boom మొదలై అరబ్బుల ప్రభ వెలుగుతున్న రోజులు. ఆనాటి ఒక ఇంగ్లీష్ వార్తాపత్రికలో (పేరు గుర్తుకు రావడం లేదు) వచ్చిన ఒక కార్టూన్లో .... పక్కనే ఉన్న తమ అరబ్బు కొలీగ్ గురించి ఒక తెల్లవాడు తన తెల్లస్నేహితుడితో I don’t like his ‘oilier-than-thou’ attitude .... అంటాడు 😀.

   Delete
  12. మీ దగ్గర టన్నుల కొద్దీ విషయ పరిజ్ఞానం ఉన్నట్లుంది మేష్టారు. చాలా నేర్చుకోవచ్చు నేను మీ దగ్గర.

   holier-than-thou, ఇది వినటం ఇదే ఫస్ట్ టైమ్. వివరించిన మీకు, పరిచయం చేసిన శ్రీకాంత్ గారికి థాంక్స్.

   Delete
  13. చాలా విషయాలు అంటే, ఇవాళ ఉదయం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది.

   నాన్నా, do you know everything? అని అడిగింది మా అమ్మాయి

   No అన్నాను నేను.

   Is there anybody who knows everything? మళ్ళీ అడిగింది.

   I don't think so అన్నాను నేను

   How about God? I think he knows everything. అంది తనే.

   ఈ సారి 'is there anybody who knows everything?' అని అడిగితే విన్నకోట నరసింహారావు గారు అని మీ పేరే చెబుతాను. 😀

   Delete
  14. అయ్యో, అంత లేదండి 😧. ఏదో కాలక్షేపం కబుర్లు చెప్పే ఓ సొమాన్యుడను మాత్రమే. మీరు వెలిబుచ్చిన అభిమానానికి సంతోషం, ధన్యవాదాలు 🙂.

   Delete
  15. నాదీ PK గారి అభిప్రాయమే ,
   పెద్దలు నరసింహరావుగారి మీద .

   Delete
  16. చూశారా నరసింహారావు గారు, మరో ఓటు పడింది మీకు.

   మీ ఫీలింగ్స్ share చేసినందుకు ధన్యవాదాలు రాజారావు గారు.

   Delete
  17. నా ఓటు కూడా విన్నకోట వారికే. Unanimous choice of the public VNR garu.

   Delete
  18. @ Srikanth M,

   pachi abaddalatho pade pade vetakaralu pote adi sarainadi. abaddanni etti chupiste adi holier than thou mentality aipotunda. super.

   Delete
  19. అతనెవరో జూనియర్ ఆర్టిస్ట్ కెమెరా ముందుకొచ్చి "ఆ పశువు నాదే, అది ఎద్దు కాదు ఆవు" అంటూ డైరెక్టర్ ఇచ్చిన స్క్రిప్ట్ నుండి డయలాగు చదివాడ"ట". అది చూసి "సంబరం ఆశ్చర్యం" పడ్డ పచ్చ మీడియా పత్రికేదో మొదటి పేజీలో అచ్చేసింద"ట". సదరు వార్త చదివి "పరవశం" పొందిన "ఛీ"బీఎన్ ఆర్మీ అనామకోత్తముడు ఎవరో వ్యాఖ్య రాసేసాడ"ట".

   ఇన్ని "ట"లు ఎందుకు మన కళ్ళతో మనమే వీడియో చూస్తే తెలుస్తుంది. అవసరం అయితే pause & zoom సౌకర్యాలు వాడుకోవొచ్చు. అంత "సమయం లేదు మిత్రమా" అనుకుంటే ఈ కింది లింకులో ఫోటోలతో సహా ఉన్న కథానిక చదువుకుంటే సరి.

   హే బుల్బుల్. సారే జహాసే కచ్చా పొటాష్ బాచ్ కా "నారా"!

   Delete
  20. https://muchata.com/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%87-%E0%B0%8E%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF/

   Delete
  21. // “నాదీ PK గారి అభిప్రాయమే , పెద్దలు నరసింహరావుగారి మీద .” // (రాజారావు)
   // “నా ఓటు కూడా విన్నకోట వారికే.” // (Jai Gottimukkala)

   నన్నొగ్గేయండి 🙏.

   Delete
  22. విషయ మేదైనను విఙ్ఞాన ఖని తాను
   మూడు భాషలయందు బుధుడు గాన
   నాబోటి జగడాల ఆబోతులకు తాను
   ముకుతాడు వేయు , బోధకుడు గాన
   ఎదుటి వాళ్ళెవరైన చదురాడినా తాను
   మాట జారడు సంయమ మతి గాన
   పరిచయ మైనచో విరి పద్మమై తాను
   చెలిమి హస్తము చాచు , స్థిరుడు గాన

   నొనర యోగ్యత లెన్నియో యుండి కూడ
   నిండు కుండ వోలె తొణకని ఘనుడు , జన
   వినుతుడు , నరసింహారావు విన్నకోట
   వారు , ప్రస్తుతించ దగు మాష్టారు మాకు .

   Delete
  23. మూతి ముప్పై వంకర్లు తిప్పడాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి
   🦁 గారూ ?
   ఎమోటికాన్ అయినా పర్వాలేదు.☹

   Delete
  24. రాజా రావు గారూ, విన్నకోట వారి గురించి మీ పద్యం బాగుంది.

   జై గారు. విన్నకోట వారికి మీ ఓటు వేసినందుకు థాంక్స్.

   నీహారిక గారు, ఇది మరీ కష్టమైన పరీక్ష.

   Delete
  25. # నీహారిక గారూ
   // "మూతి ముప్పై వంకర్లు ....." //

   ఆ విన్యాసం ఆడవారి డిపార్ట్-మెంట్ కదా, కాబట్టి మీకే బాగా తెలిసుండాలి 😎.

   Delete
  26. ee mooti vankarlu tippe vinyaasalu english desallo aadavallaki teleedanukunta. anduke aa basha lo deeniki expression lenattundi.

   Delete
  27. నా అవగాహన కూడా అదే, Anonymous గారూ 🙂. అందుకే ఆంగ్లపదం ఉండదనే నా అనుమానమున్నూ. మహా .. మహా .. అయితే twisting the mouth అనేది కాస్త దగ్గరగా వస్తుందేమో?

   Delete
  28. విన్నకోట గారూ, అది కాస్త దగ్గర గానే ఉన్నట్లు అనిపిస్తోంది.

   Anonymous గారు, థాంక్స్ ఫర్ the comments.

   మన తెలుగు పద సంపద అంత గొప్పది, ఇంగ్లీష్ లో దానికి సమాన అర్థం వెదకడం కష్టం

   Delete
 8. # పవన్ గారు
  పసలేని సినిమాల మాట వదిలెయ్యండి. మీ క్రితం పోస్ట్ క్రింద “ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి?” అని ఒక కామెంటుంది (సినిమాల పరంగా). To Let అనే సినిమా చూడండి. ప్రైమ్ విడియోలో ఉంది. తమిళ చిత్రం; మీకు తమిళభాషతో పరిచయం ఉంటే ఫరవాలేదు, రాదు అంటే sub-titles పెట్టుకుని చూడండి. ఒక కామన్ సమకాలీన సమస్య మీద తీసిన ఆలోచనీయమైన చిత్రం.

  ReplyDelete
  Replies
  1. పవన్ గారూ,
   🦁 ఆ కమెంట్ మీకా ? నాకా ?

   Delete
  2. @నీహారిక గారు: ఎవరి కైతే ఏముంది లెండి, మంచి సినిమా అని చెప్తున్నారుగా చూసేద్దాం.


   @ విన్నకోట వారు: తమిళ్ తో అనుబంధం ఈ నాటిది కాదు లెండి, గత 19 ఏళ్లుగా సాగుతోంది. తమిళ్ లో తోపు అని చెప్పను కానీ బాగా అర్థమవుతుంది, కూసింత మాట్లాడగలను కూడా.

   Delete
  3. అలాగా, తమిళం తెలుసా 🤓 ? మరయితే “కన్యాశుల్కం” నాటకంలో చెప్పినట్లు ..... “జిలేబి” గారూ, మీరూ ఒక్క పర్యాయం తమిళంలో మాట్లాడండి, పవనూ .... 🙂🙂.

   Delete
  4. జిలేబి గారి మాతృ బాష తమిళా ఏమిటి మేష్టారూ?

   ఈ కన్యాశుల్కం లో ఏమన్నారు, నేనసలే బాగా వీక్, పుస్తకాలు గట్రా చదివే మంచి అలవాటు లేదు.

   Delete
 9. Replies
  1. ఇప్పుడు ఆ మూడు సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీ దొరికినట్లే మేష్టారు. T.V వాళ్ళు ఆ సినిమా వాళ్ళను పిలిచి డిబేట్స్ అని పెట్టి రచ్చ రచ్చ చేస్తారు.

   Delete
 10. "జిలేబి" గారి మాతృభాష తెలుగే. సరిహద్దు జిల్లా వారననుకుంటాను. అయితే తమిళంతో వారికి అనుబంధం ఉన్నట్లు తోస్తోంది. తత్ఫలికంగా తమిళభాష మీద వారికి బాగానే పట్టు ఉన్నట్లుంది. బ్లాగుల్లో తరచూ మనల్ని తమిళంతో కొడుతుంటారు గదా, మీరూ గమనించే ఉంటారు 🙂. మీకూ తమిళం వచ్చన్నారు కాబట్టి మీరిద్దరూ తమిళంలో మాట్లాడుకుంటుంటే చూద్దామని 🙂

  ఇక "కన్యాశుల్కం" నాటకం (19th century లో publication) లోని సందర్భం ఏమిటంటారా .... గిరీశం అని ఒక షోకిల్లారాయుడు తన మాటలతోనూ, అరకొర ఇంగ్లీషుతోనూ జనాల్ని బుట్టలో పెడుతూ తన పబ్బం గడుపుకుంటుంటాడు.. వెంకటేశం అనే స్కూల్ స్టూడెంట్ కు ట్యూషన్ చెప్పటానికి కుదురుకుంటాడు. గిరీశం వల్ల ఆ కుర్రాడికి పెద్దగా అబ్బిన చదువేమీ లేదు ఏవో నాలుగు బట్లరింగ్లీషు ముక్కలు తప్ప. వేసవి సెలవులలో తన భుక్తి గడుపుకోవడానికీ, ఉన్న ఊళ్ళోని కొన్ని ఇబ్బందుల్ని తప్పించుకోవడానికీ సెలవులలో కూడా ట్యూషన్ చెబుతానని ఆ కుర్రాడితో బాటు అతని (కుర్రాడి) ఊరికి జేరుకుంటాడు. అక్కడ ఆ కుర్రాడింట్లో తల్లి .... మా అబ్బాయీ, మీరూ ఒక్క పర్యాయం యింగిలీషు మాట్లాడండి బాబూ .... అని గిరీశాన్ని అడుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ తడుముకోకుండా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటూ ఇంగ్లీష్ మాట్లాడేస్తారు 🙂

  "కన్యాశుల్కం" పుస్తకాన్ని చదవ లే....దా...!!? అలా ఎలా పవన కుమారా, తెలుగుబిడ్డయ్యుండీ? వెంటనే ఈ క్రింది లింకులో నుండి PDFను దింపుకుని, చదివి ఆనందించండి 👍.
  "కన్యాశుల్కం" నాటకం

  ReplyDelete
  Replies
  1. వివరించినందుకు థాంక్స్ మేస్టారు. Download చేసుకున్నాను. చదువుతాను మేష్టారు. ఎప్పటి నుంచో తెలుగు రచయితల పాపులర్ రచనలన్నీ చదివి కాస్త తెలుగు మీద పట్టు సాధించాలని కోరిక. ఇకపైన ఆ పని కూడా పెట్టుకుంటాను.

   Delete
 11. # పవన్ గారూ,

  వీకెండ్ వచ్చింది, వెళ్ళింది. మరి పైన నేను సూచించిన To Let చిత్రం చూశారా, చూసుంటే నచ్చిందా లేదా .... చెప్పనేలేదు. అఫ్కోర్స్ వీకెండులో మీకుండే పనులు మీకుంటాయిలెండి, కాదనను.

  అలాగే "కేసరి" (Kesari) హిందీ సినిమా కూడా (అవసరమైతే సబ్-టైటిల్స్ సాయంతో) చూడండి వీలుచేసుకుని. అక్షయ్ కుమార్ నటించిన చిత్రం. బ్రిటిష్ పాలనాకాలం నాటి ఒక యధార్థ గాధ. నాకు నచ్చింది.

  ReplyDelete
  Replies
  1. లేదు మేష్టారు, యూ ట్యూబ్ లో అప్లోడ్ అయి ఉన్న సినిమాలు చూడటానికే టైం దొరకట్లేదు అని, ఈ ప్రైమ్ subscription లాంటి వాటి గురించి ఆలోచించలేదు, అనవసర ఖర్చు ఎందుకు అని.

   మీరు సూచించిన రెండు సినిమాలు తప్పక చూస్తాను మేష్టారు. థాంక్స్ మేష్టారు, ఇలాంటివే మంచి సినిమాలు ఉంటే సూచించండి.

   Delete
 12. మీకు వీలున్నప్పుడే చూడండి 👍. తొందరేముంది, అవి ఎక్కడికీ పోవు.

  ReplyDelete