25, అక్టోబర్ 2021, సోమవారం

నాగేంద్ర బాబు - ఫెయిల్యూర్ స్టార్

ఈ మధ్య కాలంలో సినిమాల ద్వారా కాకపోయినా వివాదాల మధ్య నలిగిన పేరుగా నాగబాబు బాగా గుర్తుండిపోయాడు.  

మంచి ఎత్తు, పర్సనాలిటీ ఉన్న నాగబాబుని చిరంజీవి మంచి డైరెక్టర్స్ చేతిలో పెట్టలేదేమో అని నా అనుమానం.  పోటీ కొస్తాడని భయపడ్డాడా లేక హీరో మెటీరియల్ కాదని అనుకున్నాడా? అయినా ఈ నాగార్జున, వెంకటేష్ మొదట్లో చేసిన యాక్షన్ కంటే బానే చేశాడు, కనీసం కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న మంచి డైరెక్టర్స్ అయిన దాసరి, కోదండరామి రెడ్డి, జంధ్యాల, వి మధు సూధన రావు లాంటి వారి డైరెక్షన్ లో ట్రై చేశాడు గానీ ఒక్క బజార్ రౌడీ తప్పితే సోలో హీరోగా పెద్దగా హిట్స్ ఏమీ కొట్టలేకపోయాడు గానీ సోలో హీరోగా డజన్ సినిమాలతో లక్ చెక్ చేసుకున్నాడు. మరి నాగేంద్ర బాబు సోలో హీరో గా వర్క్ అవుట్ కాలేడని మూడు నాలుగు సినిమాలతోనే చిరంజీవి డిసైడ్ అయ్యారా లేక నిర్మాతలే ముందుకు రాలేదా?

అఫ్ కోర్స్  కొడుకు, తమ్ముడు ఒకటే కాకపోవచ్చు. లేదంటే 'తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే' అని అప్పటికే చిరంజీవి పక్కన అల్లుకుపోయిన వారెవరైనా ఎగదోశారా? జస్ట్ అస్కింగ్. 

మొన్నా మధ్య పాత సినిమాల వైపు మనసు లాగితే పనిలో పనిగా దాదర్ ఎక్ష్ప్రెస్స్ , 420 లాంటి సినిమాలు చూశా.

దాదర్ ఎక్ష్ప్రెస్స్ సినిమా మసాలాలు ఉండని కాస్త డ్రై సబ్జెక్టు. మాటల రచయిత గా సత్యానంద్ గారిది అందె వేసిన చెయ్యి కావచ్చేమో గానీ డైరెక్షన్ మరీ బాడ్ గా ఉంది దానికి తోడు యాక్షన్ అంటే స్పెల్లింగ్ కూడా తెలీని హీరోయిన్ వల్ల సినిమా అస్సలు ఆకట్టుకోదు. అప్పట్లో ఈ సినిమా మీద వివాదం రేగి చివరకు సూపర్ ఎక్ష్ప్రెస్స్ అని పేరు మార్చి రిలీజ్ చేశారు.  దాదర్ ఎక్ష్ప్రెస్స్ లో అలాంటి సంఘటన జరగలేదని అనవసరంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయరాదని సెన్సార్ వాళ్ళు అడ్డుకున్నట్లు ఉన్నారు. 

ఇక 420 సినిమా గురించి వినడమే గానీ చూడటం ఇదే తొలిసారి. దీనికి ఈవీవీ సత్య నారాయణ డైరెక్టర్. అప్పటికే సీతా రత్నం గారి అబ్బాయి, ఆ ఒక్కటి అడక్కు లాంటి హిట్లతో ఫామ్లో ఉన్నాడు. ఈ సినిమాలో పాటలు అనవసరంగా ఫ్లో కు అడ్డుపడ్డాయి గాని మాంచి టైంపాస్ మూవీ. తాడి మట్టయ్య అనబడే క్యారెక్టర్ లో కోట, కానిస్టేబుల్ గా మల్లి ఖార్జున రావు పాత్రలని ఎక్స్టెన్షన్ లాగా మళ్ళీ హలో బ్రదర్ లో వాడుకున్నాడు కాస్త సెంటిమెంట్ టచ్ లాస్ట్ లో అద్దేసి. 

ఆ తర్వాత హాండ్స్ అప్, కౌరవుడు లాంటి సినిమాల్లో ట్రై చేసాడు గానీ అప్పటికే యంగ్ జెనెరేషన్ వేగంలో అవి సరిపోవు అనిపించింది 

నాగబాబు ఉంటే ఆ సినిమా ఫట్టవుతుందని అప్పట్లో నాకో గట్టి నమ్మకం ఉండేది, ఆ నమ్మకాన్ని అతను నటించిన చాలా సినిమాలు వమ్ము కాదని ప్రూవ్ చేశాయి. 

ప్రతీ నటుడికి లాండ్మార్క్ లాంటి ఒక మూవీ ఉంటుంది చెప్పుకోవడానికి.  కానీ నటించడం మొదలెట్టిన ఇన్నేళ్లయినా అలాంటి సినిమా ఒక్కటి కూడా లేకపోవడం ఇతనికి లోటే. చందమామ, రుక్మిణి లాంటి సినిమాల్లో కాస్తో కూస్తో గుర్తుంచుకో గలిగే పాత్రలు చేశాడు గానీ అవి ఎంతమందికి గుర్తుంటాయి అనేది ప్రశ్నార్ధకమే. ఇకపైన అయినా  కనీసం అలాంటి ఒక సినిమా తాను చేయగలడని సినిమాల్లో ఫెయిల్యూర్ లా మిగిలి పోవద్దని  ఆశిస్తూ ఇంకో రెండు మూడు రోజుల్లో 60 వ వడిలో అడుగు పెట్టబోతున్న మా నాగబాబు కి జన్మదిన శుభాకాంక్షలు. ఏం మెగా స్టార్. పవర్ స్టార్ కేనా ఫాన్స్ ఉండేది టవర్ స్టార్స్ కి ఉండరా?

12 కామెంట్‌లు:

  1. టవర్ స్టార్ :) హైట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, పవన్ గారూ 😀😀

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకంత సీన్ సీన్ లేదు లలిత గారు, దిక్కుమాలిన సినిమాలన్నీ చూస్తూంటానా అందులో ఏదో పేరు కూడా గుర్తు లేని ఒక దిక్కుమాలిన సినిమాలో నాగేంద్ర బాబు ని 'టవర్ స్టార్ ఫ్యాన్ అఫ్ పవర్ స్టార్' అని చూపిస్తారు. ఆ సినిమాలో వాడిన పద ప్రయోగాన్ని నేను ఉపయోగించుకున్నాను అంతే. చదివినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
    2. ఫెయిల్యూర్ స్టార్ అనేదే నా పద ప్రయోగం అంతే, సినిమాల్లో ఫెయిల్ అయినా సినిమా రంగం లో స్టార్ గా వెలుగుతున్నట్లు అనిపిస్తుంటాడు కాబట్టి

      తొలగించండి
    3. ఆ పదం వెయ్యి అబధ్ధాలు అనే చిత్ర రాజం లో వాడారు.

      తొలగించండి
    4. కరక్ట్ ఇప్పుడు గుర్తొచ్చింది మాధవ్ గారు

      తొలగించండి
  2. నిజానికి తీసిపారెయ్యాల్సిన నటుడేమీ కాదు నాగబాబు. మరి ఏం రాజకీయాలు మీరన్నట్లు “అల్లుకున్నాయో”?

    అయితే “జబర్దస్త్” టీవీ షోలో కనిపిస్తున్నాడని విని (జబర్దస్త్, బిగ్ బాస్, ఆ బాపతు ఇతర టీవీ షోలు - “మీలో ఎవరు కోటీశ్వరుడు” మినహా - నేను చూడను) అతని విచక్షణా శక్తి మీద నాకు గౌరవం తగ్గింది.

    రిప్లయితొలగించండి
  3. నా డౌటనుమానం లో కాస్తో కూస్తో అర్థం ఉందన్నమాట.

    నవ్వు రాకపోయినా విరగబడి నవ్వాలంటే యెంత నటించాలి, కాబట్టి జబర్దస్త్ పరంగా చూసుకుంటే ఆ షో కి వచ్చే జడ్జెస్ అంతా మంచి నటులే అనుకోవాలేమో మేష్టారు.

    రిప్లయితొలగించండి
  4. // “ నవ్వు రాకపోయినా విరగబడి నవ్వాలంటే యెంత నటించాలి.” //

    ఆహా, ఇది కదా చెక్కు చెదరని అభిమానం అంటే ! 🙂🙂

    రిప్లయితొలగించండి
  5. నా దృష్టిలో నాగబాబు హీరో మెటీరియల్ కాదు. హీరోకి బాడీ ఒక్కటే ఉంటే సరిపోదు. నవరసాలు పండించాలి. మీరు " రాక్షసుడు" సినిమా, చిరంజీవిది చూసి ఉంటే నాగబాబు అర్ధమవుతాడు.
    అలాగే " లీడర్" సినిమా చూసినప్పుడే నాకు రానా విలన్ గా బాగుంటాడని అనిపించింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరన్నదీ నిజమే బోనగిరి గారు. కాకపోతే మంచి నటుడు అనిపించుకోవాలంటే ఆ నవరసాలు పలికించాలేమో గానీ, తెలుగు సినిమాల్లో హీరో అవ్వడానికి అవేమీ అవసరం లేదేమో అని నా ఫీలింగ్. చిరంజీవి, బెల్లంకొండ వారసులు అందుకు ఉదాహరణ.

      తొలగించండి
    2. మోహన్ బాబు పెద్ద వారసుడు మరో ఉదాహరణ.

      తొలగించండి