21, డిసెంబర్ 2021, మంగళవారం

ఆ మాత్రం ఇంగ్లీష్ రాదనుకున్నారా?

ఆఫీస్ పార్టీ నుంచి వచ్చినప్పటి నుంచీ వెంకమ్మ బాగా కోపంగా ఉంది 

చివరకి కారణం అడిగేశాడు రామారావ్ 

"నాకున్న అనుమానం నిజమేనన్నమాట, నీకు ఆఫీస్ లో కూడా ఒక వైఫ్ ఉంది" అంది ముక్కు చీదుకుంటూ 

అదేంటి వెంకూ, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతావ్. 

మీరేగా మీ ఆఫీస్ పార్టీ లో నన్ను  పరిచయం చేస్తూ 'హౌస్ వైఫ్' అన్నారు, అంటే ఇంట్లో నేను ఉన్నట్లే ఆఫీసులో మీకు మరో వైఫ్ ఉన్నట్లేగా. నాకు ఆ మాత్రం ఇంగ్లీష్ రాదనుకున్నారా? అంది కోపంగా  

                                                           *******

ఇంట్లో పేరుకుపోయిన పేపర్స్ అన్నీ క్లియర్ చేద్దామని ఇవాళ కూర్చుంటే నేను ఆస్ట్రేలియా వచ్చిన కొత్తలో మా ఆవిడకి వీసా అప్లై చేయడానికి ఫిల్ చేసిన అప్లికేషన్ కళ్ళబడింది. అందులో spouse occupation అనే చోట 'హౌస్ వైఫ్' అని రాశాను. 

అప్పట్లో  'హౌస్ వైఫ్' అనే మాటే వాడే వాళ్ళం అని గుర్తు. ఆ తర్వాత  'హౌస్ వైఫ్' అనే మాట బాగా పాతది అయిపోయి, బదులుగా 'హోమ్ మేకర్' అని వాడుతున్నారు. ఆ పదం అయితే ఆడ, మగ యిద్దరికీ సరిపోతుంది కాబట్టేమో. 

8 కామెంట్‌లు:

  1. హౌస్ వైఫ్ కి ఇంత గూడార్ధ మున్నదని ఇంతవరకూ తెలియదు !

    రిప్లయితొలగించండి
  2. ఏదో సరదాకి లక్కరాజు గారు, కామెంట్స్ కి ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  3. బలే చెబుతారండీ మీరు. అలా అయితే విడాకులు తీసుకున్న స్త్రీని,  మగవాడినీ  “హోమ్ మేకర్” అని ఎలా అంటారండీ, వాళ్ళు చేసిన పని హోమ్ బ్రేకింగ్ అవుతుంది కదా? ఏం, మాకు ఆ మాత్రం ఇంగ్లీషు రాదనుకున్నారా, ఆఁయ్ ? 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హోమ్ మేకర్ అనే పదంలో ఈ ట్విస్ట్ కూడా ఉందా మేష్టారు, తెలియనే లేదే?
      మొన్నీ మధ్యే మందు పార్టీలో నేనో మూలన కూర్చొని ఉంటే 'are you teetotaller' అని అడిగాడు ఒక పరిచయస్తుడు నా దగ్గరకొచ్చి.

      అర్థం కాలేదు అంటే ఆల్కహాల్ ఎప్పుడూ తాగని వారిని అలా అంటారని అన్నాడు.

      చూస్తుంటే ఈ జీవితమంతా సరిపోయేలా లేదు నాకు ఈ ఇంగ్లీష్ భాషను వంట బట్టించుకోవడానికి

      తొలగించండి
    2. Home maker పదంలో ఆ ట్విస్ట్ నేను ఇరికించాను లెండి సరదాగా 😎. అయినా ఏ జెండర్ నీ ఉద్దేశించినట్లు ఉండకూడదనో (women’s lib వాళ్ళంటే భయమేమో?), “politically correct” గా (ఈ మధ్య కాలంలో మొదలై fashion గా మారిన పదప్రయోగం లెండి) మాట్లాడుతున్నామనుకునో …. స్వంత తెలివితేటలు ఉపయోగించి కొత్త పదాలు తయారు చెయ్యడం ఓ ట్రెండ్ అయిపోయింది. 

      అన్నట్లు ఆడ, మగ ఇద్దరికీ సరిపోయే పదం మా కాలంలో unisex అనేవారు. 

      అవునూ ఓ మూల కూర్చోవడానికైతే మందు పార్టీకి వెళ్ళడం ఏమిటి బాబూ? ఇంకా నయం టీటోటలర్ వా అని అడిగితే వేడిగా టీ ఇస్తే తాగుతాను థాంక్స్ అనలేదు. 

      తొలగించండి
    3. తప్పని సరి తద్దినాలు లాంటి ఆఫీస్ పార్టీలు ఉంటాయి కదా మేస్టారు వెళ్లక తప్పలేదు. మీ డెఫినిషన్ బాగుంది, మీరన్నట్లు టీ తెప్పించమని అడిగి ఉంటే బాగుండేది 🙂

      తొలగించండి
    4. టీటోటలర్ అంటే నాకు జరిగిన ఒక incident గుర్తొచ్చింది. ఒకసారి ఆఫీసులో కాఫీబ్రేక్ కి క్లాస్ నుంచి అందరం బయటికి వచ్చేము. నేను ఆ రోజుల్లో కాఫీ తాగేవాడ్ని కాదు. అందుకని ఊరికే నిలబడి ఉన్నాను. మా కొలీగ్ ఒకడు నన్ను చూసి అడిగితే "కాఫీ తాగను. టీ తాగుతా"నని చెప్పాను. అప్పుడతను అయితే నువ్వు టీటోటలర్ అన్నమాట అన్నాడు. నేను "లేదు. ఉదయం ఆఫీసుకి వచ్చేముందు బోర్నవిటా తాగుతాను" అన్నాను. వెంటనే అతను then you are బోర్న్-టీటోటలర్ అని అనేసి వెళ్ళిపోయాడు.

      పవన్‌గారూ, ఇంగ్లిష్ భాషని "వంట" బట్టించుకోవడం అంటే ఏంటండి. ఏదైనా వంట (cooking) చెయ్యడానికి ప్రయత్నమా? ఇదేమైనా homemaker అవడానికి క్వాలిఫికేషనా? Sorry, నాకు తెలుగు అంత బాగా రాదు. అందుకని ఈ ప్రశ్న :-)

      తొలగించండి
    5. మీరు చెప్పిన ఇన్సిడెంట్ బాగుంది, అంతకి మించి మీ పంచ్ బాగుంది కాంత్ గారూ :)

      తొలగించండి