మొన్న ఉదయాన్నే అప్రైసల్ డిస్కషన్ కి మా మేనేజర్ సుబ్బారావ్ పిలవగానే ఉత్సాహంగా మీటింగ్ రూమ్ లోకి వెళ్ళాను .
![]() |
నేను - డిస్కషన్ ముందు |
"పవన్, ఈ ప్రాజెక్ట్ లో గత సంవత్సర కాలంలో నీ అచీవ్మెంట్ గురించి చెప్పు" అని అడిగాడు మా సుబ్బారావ్ (మేనేజర్).
సీ మిస్టర్ సుబ్బారావ్, సైరా ప్రాజెక్ట్ సురేందర్ రెడ్డి చేతికి వెళ్ళినప్పుడు ఇతను హేండిల్ చేయగలడా అని అందరూ సందేహించినట్లే, ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు చాలా మంది 'పవన్ ఇంత కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలడా?' అని అనుమాన పడ్డారు. అందరి నోళ్ళు మూయించేలా నేను ఈ ప్రాజెక్ట్ లో పొడిచేసాను, దంచేసాను, రుబ్బేసాను, ఉతికి ఆరేశాను, ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒంటి చేత్తో నిలబెట్టాను. ఇంతకంటే అచీవ్మెంట్ ఇంకేం కావాలి అన్నాను సినిమా సక్సెస్ అయిన తర్వాత జరిగిన అభినందన సభలో హీరోలా రెట్టించిన ఉత్సాహంతో.
నా ఉత్సాహం మీద నీళ్లు చల్లేస్తూ "అభినందన్ గురించి నీకేం తెలుసు?" అన్నాడు.
మన టీం లో అలాంటి పేరు ఎప్పుడూ వినలేదే?
టీం లో కాదు టీవీ లో చూసి ఉంటావ్ గా అతన్ని.
అతనెందుకు తెలీదు సర్, మన దేశం పరువు నిలబెట్టిన వీర సైనికుడు.
మరి దేశ పరువు నిలబెట్టిన అతనిది గొప్ప అచీవ్మెంట్ అనుకుంటున్నావా? లేక ప్రాజెక్ట్ ని ఒంటి చేత్తో నిలబెట్టిన నీదా?
ముమ్మాటికీ అతనిదే?
మరి నీది అసలు అచీవ్మెంట్ కానే కాదని ఒప్పుకున్నట్లేగా?
నేనొప్పుకోను, అయినా మోకాలికి బోడి గుండుకి ముడిపెడతారేంటి?
అదే కదా మేనేజర్ మొదటి క్వాలిఫికేషన్, అది లేకే నువ్వలా ఉండిపోయావ్ నేనిలా మేనేజర్ లా ఎదిగిపోయా.
అది కాదు సుబ్బారావు గారు, ఎప్పుడో మా అమ్మాయి పుట్టక ముందు నుంచి ఇస్తున్న శాలరీ ఇది, మా అమ్మాయి పెరిగిపోయింది కానీ, నా శాలరీ మాత్రం ఒక్క సెంట్ కూడా పెరగలేదు. అంతెందుకు విజయ్ దేవరకొండ నిక్కర్లు వేసుకునే వయసులో నేను ఈ కంపెనీ లో చేరాను. ఇప్పుడతను అవే నిక్కర్లు, చొక్కాలు తన బ్రాండ్ నేమ్ తో అమ్ముకునే స్థాయికి ఎదిగాడు, నేనేమో ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా అదే పొజిషన్ లోనే ఉన్నాను. కరెక్ట్ గా చెప్పాలంటే చిరంజీవి సినిమాలు ఆపేసినప్పడు చేరాను నేనీ కంపెనీలో. ఇప్పుడాయన 150,151 వ సినిమా కూడా పూర్తి చేసి 152 వ సినిమా మొదలుపెట్టాడు, నేనేమో ఏ శాలరీతో ఈ కంపనీలో నా ప్రయాణం మొదలెట్టానో అక్కడే ఆగిపోయాను.
శాలరీ, ప్రమోషన్ అని అంటున్నావ్ గానీ, యెంత శాలరీ పెంచినా మనిషికి సంతృప్తి అనేది ఉండదు పవన్, సరే సంతృప్తికి డెఫినిషన్ ఇవ్వు ముందు, తర్వాత ఆలోచిద్దాం.
నెక్స్ట్ వీక్ నుంచి నేనుండే ఇంటికి వీక్లీ రెంట్ పది డాలర్స్ పెరుగుతోంది అంటే నెలకు 40 డాలర్లు, కనీసం ఆ మాత్రం శాలరీ పెరిగితే అదే తృప్తి, సంతృప్తి అన్నాను ఒక సారి.
మరీ ఎక్కువ ఆశిస్తున్నావ్, ఫ్యూచర్ లో లోకేష్ బాబు C.M అవ్వచ్చు, పాల్ P.M అవ్వచ్చు, అంతెందుకు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు మొదలెట్టచ్చు గానీ ఇది జరగడం అసాధ్యం. వేరే ఏదైనా చెప్పు.
ఇప్పుడు నేను ఆఫీస్ కు సైకిల్ లో వస్తున్నానుగా, కనీసం దాని మైంటెనెన్సు ఖర్చులు 20 డాలర్లు వస్తోంది, కనీసం ఆ మాత్రం నెలకు పెరిగితే సంతృప్తి .
ట్రైన్లోనే, బస్సు లోనో వస్తే కనీసం 120 డాలర్లు అవ్వుద్ది, కాబట్టి ఇంకా నువ్వు డబ్బులు మిగిలిస్తున్నావ్. ఇంకోటి చెప్పు.
కనీసం బయట కాఫీ తాగాలంటే 5 డాలర్లు ఖర్చు అవుతుంది, ఆ మాత్రం నెలకు పెరిగితే...
థూ! సిగ్గుండాలయ్యా, 5 డాలర్లు పెరిగితే మాత్రం సిగ్గు లేకుండా ఎవరితో మాత్రం ఎలా చెప్పుకుంటావ్ 5 డాలర్లు పెరిగిందని.
అర్థమైంది మహానుభావా, ఈ సారి కూడా పెరగదు అనేగా.
అంతేగా! అంతేగా! కాబట్టి 'అప్రైసల్ వద్దు, వస్తున్నదే ముద్దు' అని అనుకో.
మరి ప్రమోషన్?
సంపూర్ణేష్ బాబు రేంజ్ మహేష్ బాబు రేంజ్ ని దాటొచ్చు అంతెందుకు మోహన్ బాబు కొడుకులు కూడా స్టార్ హీరోలు అవ్వచ్చు గానీ ...
మళ్ళీ అర్థమైంది మహానుభావా, ఈ మాత్రం దానికి ఈ తొక్కలో డిస్కషన్ ఎందుకు సుబ్బారావ్ గారు.
మరి ప్రమోషన్?
సంపూర్ణేష్ బాబు రేంజ్ మహేష్ బాబు రేంజ్ ని దాటొచ్చు అంతెందుకు మోహన్ బాబు కొడుకులు కూడా స్టార్ హీరోలు అవ్వచ్చు గానీ ...
మళ్ళీ అర్థమైంది మహానుభావా, ఈ మాత్రం దానికి ఈ తొక్కలో డిస్కషన్ ఎందుకు సుబ్బారావ్ గారు.
ఫార్మాలిటీ అమ్మా ఫార్మాలిటీ, ఫాలో అవ్వాలి. పద డిస్కషన్ అయిపోయింది.
అపజయం ఎరుగని రాజమౌళిలా ఠీవీగా మీటింగ్ రూమ్ లోకి వెళ్ళిన నేను పరాజయానికి కేరాఫ్ అడ్రస్ గా మిగిలిపోయిన మెహర్ రమేష్* లా మీటింగ్ రూమ్ లోంచి బయటపడ్డాను.
![]() |
నేను - డిస్కషన్ తర్వాత |
పోస్ట్ పెద్దది అవుతోంది మిగతాది తర్వాత పోస్ట్ లో కంటిన్యూ చేస్తా.
P.S: మెహర్ రమేష్ గురించి తెలియని వాళ్ళు 'శక్తి', 'షాడో' లాంటి సినిమాలు చూడండి, జన్మలో అతని పేరు మర్చిపోలేరు.
P.S: మెహర్ రమేష్ గురించి తెలియని వాళ్ళు 'శక్తి', 'షాడో' లాంటి సినిమాలు చూడండి, జన్మలో అతని పేరు మర్చిపోలేరు.