29, మే 2016, ఆదివారం

మా ఇంటికి వచ్చిన అతిధి వారానికి కానీ వెళ్ళలేదు

ఎవరి పేరు చెబితే జనాలు భయపడి పారిపోతారో, ఎవరి పేరు చెబితే జనాలు  గాలి పీల్చడం కూడా కాసేపు ఆపేస్తారో అతను మేము పిలవకపోయినా పోయిన వారం మా ఇంటికివచ్చాడు. అతిధి మా ఇంటికే కాదు ఒకే టైం లో శ్రీ కృష్ణ పరమాత్మునిలా లోకమంతటా అందరి ఇళ్లనూ చుట్టేస్తుంటాడువచ్చేవాడు ఒక్కడే రావచ్చు కదా అలా రాడండోయ్ మొహమాటం గట్రాలు అస్సలు లేవు కాబట్టి గర్ల్ ఫ్రెండ్స్ ను కూడా వెంటబెట్టుకు వచ్చేసాడు. మేము అతన్ని సాదరంగా ఆహ్వానించకపొయినా అతనికి చనువెక్కువ కాబట్టి  ఇంట్లో అందరిని పలకరించే వెళ్ళాడు పాపం మాటలు రాని మా చంటోడ్ని కూడా పలకరించేసాడు. దాంతో చంటోడు అతనికి భయపడి పగలు మా చంక దిగకపోవడాలు, రాత్రి పూట నిద్రపోకుండా ఆరున్నొక్క రాగాలు తీయడాలు  జరిగింది గత వారం రోజులుగా

అతిధి ని జలుబు, పడిసం, రొంప అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతొ పిలుచుకుంటూ ఉంటారు. మా ఆవిడయితే  దానికో బిరుదు తగిలించి 'గబ్బు జలుబు' అని గౌరవిస్తూ ఉంటుంది. తను ఇంతవరకూ గబ్బు అని బిరుదు తగిలించాకుండా పలకడం నేనింతవరకూ వినలేదు.  

పడిసం పది రోగాల పెట్టు అని పెద్దలు ఊరికే అనలేదు. పడిసం ఒక్కటి పట్టిందంటే జ్వరం, వొళ్ళు నొప్పులు, తల నొప్పి, దగ్గు ఇలాంటివన్నీబంపర్ ఆఫర్ స్కీం కింద ఫ్రీ గా వచ్చేస్తాయివెధవ జలుబు మందులు వాడితే  వారం రోజుల్లో వాడకపోతే  ఏడు రోజుల్లో పోతుంది అనే సామెతను నేను బలంగా నమ్మినా  కూడా మరీ పిల్లల విషయం లో మనం మందులు, చిట్కా వైద్యాలు వాడకుండా ఉండలేము కదా అయినా కూడా సామెత ప్రకారమే  మందులు వాడినా వారానికి తగ్గింది

జలుబు అనేది మేకలకు కూడా వస్తుందని  ఎక్కడో చదివాను. మరి మిగతా ప్రాణులకు, aliens కు, దేవతలకు కూడా వస్తుందేమో మరి తెలియదు. పోకిరి సినిమా టైం లో మహేష్ బాబు కు కూడా వచ్చి ఉంటుంది ఇదేదో బాగుందని హీరో characterization కింద మార్చి ఉంటాడు పూరి జగన్నాధ్. 

శీతాకాలంలో జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు ఎక్కువగా వుంటాయి కదా వీటిని తగ్గించడానికి సనాతన వైద్య విధానం ఒకటి చైనాలో ఇంకా ఆచరణలో ఉందని గూగుల్ చేస్తే తెలిసినది . వీటి నివారణకు చైనాలోని కొన్ని ప్రాంతాల్లో మద్యంతో తడిపిన క్లాత్ను మండించి, రోగి శరీరభాగాలపై ఒక రకం క్లాత్ను వేసి, దానిపై మండుతున్న క్లాత్ను నిర్ణీత కాలం పాటు వుంచుతారట . ఇదేమంత బాధాకరంగా వుండదని అక్కడివారు చెబుతారు. అయితే కార్యక్రమం అంతా నిపుణుడైన వైద్యుని పర్యవేక్షణలోజరుగుతుందట

ఈ జలుబు తో పాటు భయపెట్టేది ఇంకొకటి కూడా ఉందండోయ్ అదే ఈ సోమవారం. ఈ జలుబన్నా చెప్పా పెట్టకుండా ఎప్పుడో ఒకసారి వస్తుంది కాని ఈ  సోమవారం మాత్రం చెప్పి మరీ  ప్రతీ వారం వస్తుంది వచ్చేసింది ఇక ఆఫీసు కి బయల్దేరాలి .   




8 కామెంట్‌లు:

  1. meerannatlu ee jalubu joliki manam vellakapoyinaa ade manalni vedukutoo vastundi. maa frined eppudu jalubu chesinaa guppedu guppedu tablets vesukuntuntaadu kaani vaaramaina jalubu vaadini vadaladu.

    రిప్లయితొలగించండి
  2. ఏమయ్యా పవన్ నీ పాసుగుల ఆ చిట్కా యాడన్నా పిల్లకాయలు చదివి తగలడితే ఏమ్చేసేది , గూగుల్ లో చదివినోడివి చదివినట్లుండాలి గాని ఇలా బ్లాగోర (దండోరా) వేస్తె ఎలాగాప్ప

    రిప్లయితొలగించండి
  3. హరీష్ గారు మీ మిత్రుడిని గట్టిగా చిద మనండి, అప్పుడు అది తనను వదిలేసి పక్కోడిని పట్టుకొన్తుంది

    రిప్లయితొలగించండి
  4. అవునండి నాది సీమ, కదిరి, అనంతపురం జిల్లా

    రిప్లయితొలగించండి
  5. మీ భాష చూడగానే అనుకున్నాను మీది సీమ అని. మీది సీమే మాది సీమే :) మాది తాడిపత్రి దగ్గర ఒక పల్లెటూరు.

    రిప్లయితొలగించండి
  6. ఛంద్ర ముఖి లొ రజ్ఞీ కాంత్ చెప్పినట్లు, జలుబు టాబ్లెట్ వాడితె 1 వీక్ లొ తగ్గుతుంది,వాడకపొతె ఏడు రొజుల్లొ తగ్గుతుంది. మీరు చెప్పిన టెక్నిక్ ఎవరైన టెస్ట్ చేసి రిసల్ట్ చెపితె బాగుండు.

    రిప్లయితొలగించండి
  7. తేడా కొట్టి జలుబు బదులు ప్రాణాలే పోయాయంటే అంతే సంగతులు

    రిప్లయితొలగించండి