పొద్దుటే పడక మీద నుంచి లేచి పాచి మొహాలు కడిగేసుకొని పరుగు పరుగున పనులు చేసేసుకొని, మాతో పాటే పొద్దుటే లేచి ఎం చేయాలో తెలీక జుట్టు పట్టుకు కొట్టేసుకుంటున్న పిల్లకాయలను పట్టేసుకుని నీటి తొట్టి లో కూర్చోపెట్టిసి కాసిన్ని నీళ్లు పట్టి పోసేసి, ఆట్టే మాకు స్నానాలు చేసే టైం లేక పెర్ఫ్యూములు, పౌడర్లు కొట్టేసుకొని లిఫ్ట్ లేని మా రెండు ఫ్లోర్ల అపార్టుమెంట్ లో మెట్ల మీదుగా మూడు పెద్ద పెద్ద పెట్టెల్ని కష్టపడి పోర్టికోలోకి పట్టుకొచ్చి క్యాబ్ కోసం పడిగాపులు కాస్తుంటే ఆ ముదనష్టపు క్యాబ్ వాడు చెప్పిన టైం కంటే పది నిముషాలు లేటుగా అదీ రెండు పెట్టెలు కూడా పట్టని పిట్టంత కార్ పట్టుకొస్తే ఎట్టుంటుందో ఇప్పుడిట్టా మాటల్లో చెప్పాలంటే కష్టం.
ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి లగేజ్ ఎక్కువుంది కాస్త పెద్ద టాక్సీ పంపండి అని బుక్ చేసే ముందే మొత్తుకొని చెప్పినా చిన్నకారు పంపారు ఇక్కడి కాబ్ కంపెనీ వాళ్ళు. ఇండియా లోనే అనుకుంటాము కానీ ఎక్కడైనా ఇంతేనేమో ఈ క్యాబ్ వాళ్ళు. ఇండియా నుంచి తిరిగి వచ్చేప్పుడు కూడా బెంగుళూరు లో ఒక కంపెనీ క్యాబ్ వాళ్ళు ఇండికాను పంపారు. కాకపొతే అక్కడ రూల్స్ అంత స్ట్రిక్ట్ గా ఉండవు కాబట్టి లగేజ్ అంతా కార్ లో ఇరికించేశాడు ఆ డ్రైవర్.
ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి లగేజ్ ఎక్కువుంది కాస్త పెద్ద టాక్సీ పంపండి అని బుక్ చేసే ముందే మొత్తుకొని చెప్పినా చిన్నకారు పంపారు ఇక్కడి కాబ్ కంపెనీ వాళ్ళు. ఇండియా లోనే అనుకుంటాము కానీ ఎక్కడైనా ఇంతేనేమో ఈ క్యాబ్ వాళ్ళు. ఇండియా నుంచి తిరిగి వచ్చేప్పుడు కూడా బెంగుళూరు లో ఒక కంపెనీ క్యాబ్ వాళ్ళు ఇండికాను పంపారు. కాకపొతే అక్కడ రూల్స్ అంత స్ట్రిక్ట్ గా ఉండవు కాబట్టి లగేజ్ అంతా కార్ లో ఇరికించేశాడు ఆ డ్రైవర్.
కానీ ఇక్కడ రూల్స్ గట్రా ఉంటాయి కాబట్టి అలా లగేజ్ ఇరికించలేదు క్యాబ్ డ్రైవర్. దాంతో బాగా లేట్ అయిపోతోందే అని మా బాధ. ఇక్కడ కొని ఇండియా కు తీసుకెళ్తున్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కు ఎయిర్పోర్ట్ లో G.S.T క్లెయిమ్ చేసుకోవాలి కాస్త తొందరగా వెళితే బాగుండు అని మా ఉద్దేశ్యం. ఇంతలో వెదకబోయిన తీగ ఎదురొచ్చినట్లుగా అదే రోడ్ లో ఖాళీగా వెళ్తున్న పెద్ద టాక్సీ ఎదురు రావడంతో ఆ టాక్సీ మాట్లాడుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్ళాము. ఇక తొందరగా ఎయిర్పోర్ట్ కి వెళ్లొచ్చనుకున్నాము కానీ సమస్య ఏమిటంటే ఆ టాక్సీ కన్నా ఆ టాక్సీ మీటరే ఫాస్ట్ గా పరిగెత్తింది.
ఎయిర్పోర్ట్ లో చెకింగ్ అని చెప్పి ద్రౌపతీ వస్త్రాపహరణం లాగ వేసుకున్న జెర్కిన్, పెట్టుకున్న బెల్ట్, వాచ్ అన్నీ విప్పించి గానీ వదలలేదు. ఇక్కడే జరిగింది ఒక విచిత్రమైన సంఘటన. ఒకావిడ తన కేబిన్ లగేజ్ తో పాటు స్కూటర్ కూడా తీసుకెళ్తానని గొడవపెట్టింది. చెకింగ్ అథారిటీస్ వాళ్లేమో అలా తీసుకెళ్లడానికి వీల్లేదు అని, ఈవిడేమో నా మనవడికి తీసుకెళ్తున్నాను వదలమని వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంది. కానీ అక్కడ రూల్స్ ఫాలో అవ్వాలి తప్ప ఎమోషనల్ ఫీలింగ్స్ కి తావు ఉండదు కదా మరి అందుకే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా ఓపెన్ చేయని packed piece అయితే ఒప్పుకునేవాళ్ళేమో కానీ ఆల్రెడీ ఓపెన్ చేసేసి సెట్ చేసినది కాబట్టి ఒప్పుకోలేదనుకుంటాను. చూస్తున్న వాళ్లలో అయ్యో పాపం అనుకున్నవాళ్ళు కొందరైతే చాటుగా నవ్వుకున్నా వాళ్ళు మరికొందరు.
ఎప్పటిలాగానే ..ఫ్లైట్ ఎక్కగానే చిరునవ్వు మొహాన పులుముకొని ఎయిర్ హోస్టెస్ వచ్చింది. అదేంటో సినిమాల్లోనే అందమైన ఎయిర్ హోస్టెస్ లను చూసింది .. నేనెక్కిన ఫ్లైట్ లో ఎప్పుడూ అలాంటి వాళ్ళను చూడలేదు. ఈ ఎయిర్ హోస్టెస్ వయసు ప్రకారం చూస్తే మా పెద్దక్క క్లాసుమేట్ అయి ఉండచ్చు అని అనుకున్నాను.
కౌలాలంపూర్ లో దిగి బెంగుళూరు ఫ్లైట్ ఎక్కాము.
అక్కడా నవ్వుతూ ఎయిర్ హోస్టెస్ స్వాగతించింది. ఈ సారి డౌట్ లేదు confirm ఈవిడ మా పిన్ని క్లాస్ మేట్ అయుండచ్చు ఇదే చివరి ట్రిప్ అనుకుంటా ఎయిర్ హోస్టెస్ గా ఈవిడకి. బెంగుళూరు లో ఈ రోజు సాయంత్రమే తన రిటైర్మెంట్ పార్టీ అరెంజ్ చేసి ఉంటారు.
కౌలాలంపూర్ లో దిగి బెంగుళూరు ఫ్లైట్ ఎక్కాము.
అక్కడా నవ్వుతూ ఎయిర్ హోస్టెస్ స్వాగతించింది. ఈ సారి డౌట్ లేదు confirm ఈవిడ మా పిన్ని క్లాస్ మేట్ అయుండచ్చు ఇదే చివరి ట్రిప్ అనుకుంటా ఎయిర్ హోస్టెస్ గా ఈవిడకి. బెంగుళూరు లో ఈ రోజు సాయంత్రమే తన రిటైర్మెంట్ పార్టీ అరెంజ్ చేసి ఉంటారు.
ఫ్లైట్ లో నాకూ, మా పాపకు వెనుక వైపు ఇచ్చి బుడ్డోడు ఉన్నాడు కాబట్టి మా ఆవిడకు ముందు వైపు సీట్ ఇచ్చారు. అందరూ ఒక చోట కూర్చుంటే పిల్లలను మేనేజ్ చేయడం ఈజీ గా ఉంటుందని అక్కడ విండో సీట్ లో కూర్చున్న అతన్ని రిక్వెస్ట్ చేస్తే టాట్ టూట్ వీల్లేదు నాకు విండో సీటే కావాలని అక్కడే కూర్చున్నాడు. ఎర్ర బస్సు లో విండో సీట్ అడిగారంటే ఓకే అనుకోవచ్చు ఎదో వామిటింగ్ ప్రాబ్లమ్ ఉండి ఉండచ్చు అని సర్ది చెప్పుకోవడానికి, మరీ ఎయిర్ బస్సు లో కూడానా. విండో సీట్ కావాలి అని మా పాప ఒకటే ఏడుపు. అతను మా పాప ఏడుపు చూసి కూడా కనికరించలేదు. ఏదోలోగా మా పాపకు సర్ది చెప్పి మాకు కేటాయించిన మధ్య సీట్ లలో వెళ్లి కూర్చున్నాము. ఫ్లైట్ బయలు దేరిన కాసేపటికి ముందు సీట్ లో మా బుడ్డోడి కోసం బసినేట్(చిన్న పిల్లలకు పడుకోవడానికి బెడ్ లాంటి చిన్న తొట్టి) అరెంజ్ చేసాక కాళ్లు చాపుకోవడానికి అది ఇబ్బంది అనిపించి తనే అడిగాడు సీట్ మారతానని.
అలా విండో సీట్ దొరికినందుకు మా పాప సంతోషించింది. కాసేపయ్యాక నాన్నా మనం క్లౌడ్స్ కన్నా పైన ఉన్నాం కదా మరి మన కన్నా పైకి ఆస్ట్రోనౌట్స్ వెళ్తారు కదా అంది మా పాప. పర్లేదు స్కూల్ కు వెళ్ళక ముందే ఈ కాలపు పిల్లలు T.V చూసి కాస్తో కూస్తో నేర్చుకుంటున్నారు అనిపించింది.
ఫ్లైట్ నుంచి దిగేప్పటికీ 2 కిలోల వెయిట్ పెరిగి ఉంటాను కారణం వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ తిని, ఫ్రీ గా వాళ్ళు ఇచ్చిన జ్యూస్ లు తాగి. నా లాంటివాళ్లే మరో ఇద్దరు ఉన్నట్లున్నారు ఫ్రీ గా ఇస్తున్నారని తాగే రకాలు, కాకపొతే వాళ్ళు తాగింది నా లాగా జ్యూస్ కాదు మందు. ఆ తాగిన మందు ఎక్కువై ఆ ఇద్దరు యువకులు కాస్త అల్లరి చేశారు. అదొక్కటే కాస్త ఇబ్బంది పెట్టింది ఫ్లైట్ లో అందరినీ.
అప్పుడే ఇండియా వెళ్లడం రావడం రెండో టపా వ్రాయడం కూడా అయిందా మీది? మిమ్మల్ని చూసి నా జెట్ లాగ్ ఇక వదిలించుకోవాలి :)
రిప్లయితొలగించండివెల్కమ్ బ్యాక్ చంద్రిక గారూ. మీ కామెంట్ కు ధన్యవాదాలు. మీ ఇండియా ట్రిప్ హ్యాపీ గా ముగిసిందనుకుంటాను.
తొలగించండిబస్సు రైలు తప్పించి మరో ప్రయాణ సాధనం మీద ప్రయాణం చెయ్యలేదు, ఏ మనుకోవద్దూ, నవ్వకండీ!!! :)బారిస్టర్ పార్వతీశం లాటివాడిని, అందుకు కొంచం అనుమానాలు తీర్చరూ?
రిప్లయితొలగించండిజెట్ లాగ్ అంటే?
తలదిమ్ముగా ఉండడం వగైరా అంటారా? మరి పెద్ద పెద్దోళ్ళు ఏకబిగిని ప్రయాణాలు చేసేసి రాత్రి అక్కడికి చేరుకుని ఉదయమే షెడ్యూల్ కి తయారైపోతారు, వాళ్ళకి జెట్ లాగ్ ఉండదా? అసలు జెట్ లాగ్ ఎందుకొస్తుంది? మందేసుకుంటే, అదేనండి మెడిసిన్ వేసుకుంటే జెట్ లాగ్ ఉండదా?
వివరించ ప్రార్థన
డొమెస్టిక్ ఫ్లైట్స్ లో ట్రావెలింగ్ చేస్తే జెట్ లాగ్ లాంటివి అంతగా ఉండవు ఎందుకంటే అదే కంట్రీ లోఅంత టైం డిఫరెన్స్ ఉండదు కాబట్టి. అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ట్రావెలింగ్ చేస్తే అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ కి వెళ్ళినప్పుడు టైం డిఫరెన్స్ ఉండటం వలన ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడి టైమింగ్ కు అడ్జస్ట్ అవడానికి ఒకటి రెండు రోజులు పడుతుంది.
తొలగించండిసిడ్నీ కి బెంగుళూరు కి నాలుగున్నర్ర గంటల తేడా ఉంటుంది. బెంగుళూర్ వెళ్లిన మొదటి రెండు రోజులు సాయంత్రం 5 అవ్వగానే నిద్రవచ్చేస్తూ ఉండేది ఎందుకంటే సిడ్నీ లో అప్పటికి నైట్ 9:30 అయి ఉంటుంది కాబట్టి. ఈ టైం డిఫరెన్స్ కు పెద్దలము మేము ఒకటి రెండు రోజుల్లో అడ్జస్ట్అయ్యాము కానీ పిల్లలు అడ్జస్ట్ అవడానికి నాలుగైదు రోజులు పట్టింది. మా పది నెలల బుడ్డోడు అయితే తెల్లవారుజామున మూడు గంటలకే లేచి ఇబ్బంది పెట్టేసాడు ఒక 4 రోజుల పాటు.
ఉదయం 7 గంటలకే లేచే అలవాటున్నా సిడ్నీ కి తిరిగి వచ్చిన తర్వాత మొదటి రోజు ఉదయం 7 గంటలకే లేవడం అన్నది కష్టం అయింది ఎందుకంటే ఇండియన్ టైం జోన్ కు అలవాటు పడ్డాము కాబట్టి. పెట్టుకున్న అలారం పీక నొక్కేసి తొమ్మిది గంటలవరకు పడుకొని అతి కష్టం మీద లేచి ఆఫీస్ కి లేటుగా వెళ్లాను.
ఇది ఒక రకమైన జెట్ లాగ్ గా చెప్పొచ్చు శర్మ గారు. వీటితో పాటు కొందరికి తల దిమ్ముగా ఉండటం, చెవి పోటు రావడం కూడా జరుగుతుంటుంది. అందుకే చంటి పిల్లలకు ఫ్లైట్ టేకాఫ్ అయ్యేప్పుడు లాండ్ అయ్యేప్పుడు పాల పీకల్లాంటివి నోటిలో పెట్టడమే కాకుండా, దూది లాంటివి చెవిలో పెట్టమని చెబుతుంటారు డాక్టర్లు.
u mean 2 say that, the body, I mean the mind trying to adjsut with the body clock. Am I rt?
తొలగించండిThe other symtoms of the body are only insignificant
కరెక్ట్ అండి శర్మ గారు . నాకు తెలిసినంతవరకు అంతేనండి. ఎదో టైం బాగుండి I. T జాబ్ చేయబట్టి ఫ్లైట్ ఎక్కే అదృష్టం కలిగింది గానీ ఇంతకూ ముందు అంతా నేను ఎర్ర బస్సు తప్ప ట్రైన్ కూడా పెద్దగా ఎక్కలేదండి.
తొలగించండిమీరు విమానం ఎక్కేరు, నేను గాల్లో ఎగురుతుంటే చూడ్డమే! ఎప్పుడూ లోపలికి ఎక్కి చూసే సావకాశమే కలగలేదు జీవితంలో, ఇంకొద్దు కూడా! :) నా ఊహల్లోనే విమానం అందంగా ఉండిపోయింది కదా!!! :)
రిప్లయితొలగించండిపాపం నేటి మీ యువతరమంతా దేశం వదలి పొట్టపట్టుకుని తలలమ్ముకుబతుకుతున్నారే అనేదే నా బాధ. ఒక రకంగా నాటికంటే నేడు బాగా బతుకుతున్నారనే సంబరం. ఎక్కువ మాటాడేనా? మన్నించండి.
మీరు అన్న దాంట్లో కొంచెం కూడా తప్పు లేదండీ. మేము వలస వచ్చిన కూలీలం. ఎదో పక్కనున్న టౌన్ లో ఎక్కువ కూలి ఇస్తారని తెలిసి పల్లెల నుంచి పనులు చేసుకునే వాళ్ళు వెళ్తారు కదా అలాగే మేము ఇక్కడ ఎక్కువ కూలి కి పనిచేస్తున్నాము.
తొలగించండిPavan garu! You're so humble!
రిప్లయితొలగించండిమీ విమాన ప్రయాణపు కబుర్లు , మీ పాప astronauts తో రిలేట్ చేసుకోవడం బహు బాగు!
Thanks for the compliment Lalitha gaaru
తొలగించండిహాయ్ పవన్ గారు జట్ లాగ్ గురించి బాగా అర్థం అయేలా చెప్పారు .
రిప్లయితొలగించండిThanks mestaaru
తొలగించండిఎంటండి మిత్రుణ్ణి, మాస్టార్ను చేసారు , మిత్రునిగానే ఉండనివ్వండి
రిప్లయితొలగించండిAlaage..my dear friend
తొలగించండి