ఇండియాలో నా మూడు వారాల vacation లో జరిగిన విషయాలకు కాస్త ఉప్పు కారం తగిలించి రాస్తున్న పోస్ట్ ఇది.
బెంగుళూరు వెళ్ళగానే మా ఆవిడ ఎదో లిస్ట్ ఇచ్చిఅవన్నీ కొనుక్కురమ్మంది. లిస్ట్ బాగా పెద్దదే కానీ అందులో చాలా వరకు మెడికల్ షాప్ లో దొరికేవే కనుక మెడికల్ షాప్ వెతుక్కుంటూ వెళ్ళాను.
హిమగిరి మెడికల్ షాప్ అని బోర్డు కనపడింది. ఎదో బార్ కో రెస్టారెంట్ కో ఆ పేరు సూట్ అవుతుంది కానీ మెడికల్ షాప్ కేంటి హిమగిరి అని అనిపించింది.
ఈ రోజు నేను చేసే షాపింగ్ తో నీ హిమగిరి షాప్ వారం పాటు మూసేసుకొని నువ్వు నీ ఫ్యామిలీతో కలిసి హిమాలయాలకో, కాశ్మీర్ కో ట్రిప్ వెళ్ళి రావచ్చు అని మనసులో అనుకుని '10కేజీల వెయిట్ ఉండే పిల్లాడికి సరిపోయే డైపర్లు ఇవ్వు తమ్ముడూ' అన్నాను.
10 డైపర్లు ఉండే ప్యాక్ ఇమ్మంటారా లేక 20 ఉండేవా ?
10, 20 ఏంటి 50 ఉండేవి ఉంటె ఇవ్వు
80 ఉండేవి ఉన్నాయి సర్
లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూస్కో. మంచి బ్రాండ్ ఇవ్వు డబ్బులు ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూస్కో అలాగే ఆకలి వెయ్యడానికి మంచి టాబ్లెట్స్ యివ్వు. తిన్నాక ఆకలి వెయ్యడం లేదు అలాగని మరీ ఎక్కువేమీ తినట్లేదు కానీ రోజుకు 4 పూటలే తింటున్నాను.
ఇంకా ఏమైనా కావాలా సర్?
అయినా ఈ బెంగుళూరు ఎండలు ఏమిటయ్యా ఇలా ఉన్నాయ్, తల వేడెక్కి పోతోంది. ఆ నవరత్న హెయిర్ ఆయిల్ ఇవ్వు. ఇంకా పిల్లల సెరిలాక్, Wipes, Pediasure, మన్నా హెల్త్ మిక్స్ ఇంకా $$@#@#$@#$@#$@ &&&**%^ #$#$@#$@#$ ఇవ్వు
ఇప్పుడు చెప్పు బిల్ ఎంత అయింది
22800 సర్
నీ షాప్ కు నువ్వు కట్టే రెంట్ గురించి నేను అడగడం లేదు తమ్ముడూ నేను కొన్న వాటికి బిల్ ఎంత అని అడిగాను
నేనూ మీ బిల్ గురించే చెప్పానండి, అయినా బెంగుళూరు లో ఇలాంటి షాప్ 22800 రెంట్ కు అద్దె కిచ్చే పిచ్చి సన్నాసి ఎవడున్నాడు?
నా దగ్గర ఉండేదేమో 17000 రూపాయలు మాత్రమే .. బిల్ 22800 అంటున్నాడు కాబట్టి తీసుకున్న వాటిలోంచి కొన్ని ఐటమ్స్ తగ్గించడం మొదలెట్టాను.
అయినా ఇక్కడి డైపర్లు సరిగ్గా ఫిట్ అవుతాయో లేదో ఆ 80 డైపర్లు ఉండే ప్యాక్ వద్దు కానీ ఆ 10 ఉండే ప్యాక్ ఇవ్వు. అయినా మనిషన్న వాడు రోజుకు 4 పూటల కంటే ఎక్కువ ఏమి తింటాడు. ఆ టాబ్లెట్స్ వద్దులే. అవీ తీసేసి బిల్ ఎంతో చెప్పు
19200 సర్
ఇంతకు ముందు ఇదే బెంగుళూరు లో 10 ఏళ్ళు ఉండి ఇప్పుడు ఈ ఎండలకు తల వేడేక్కుతోందంటే ''ఏమిటి రాజా ఆ కొక్కిరి బిక్కిరి వంకర కాయలు" అని వెనకటికి ఆవిడెవరో అన్నట్లు ఉంటుంది కాబట్టి ఆ నవరత్న హెయిర్ ఆయిల్ కూడా తీసేయ్. అలాగే...
'ఇంతకీ ఆ కొక్కిరి బిక్కిరి వంకర కాయలు ఏమిటో, ఆవిడ ఎవరో చెప్పనే లేదు..మీ తాలూకానా' అన్నాడు మధ్యలో అడ్డు తగులుతూ
మా తాలూకా కాదు జిల్లా కాదు. ఎదో అదృష్టం బాగుండి అలాగే అందంగా ఉండబట్టి వంకాయలు అమ్ముకునే ఆవిడ రాజు గారి పెళ్ళాం అయింది. అలాంటి ఆవిడ ఒక రోజు కోట మీద నిల్చుని ఉంటే దారిలో ఒకావిడ గంపలో వంకాయలు పెట్టుకొని వెళ్తూ ఉందట. అది ఈ రాణి గారు చూసి పక్కనున్న రాజు గారితో 'ఆ కొక్కిరి బిక్కిరి వంకర కాయలు ఏమిటి రాజా' అని అడిగిందట...అది ఆవిడ కొక్కిరి బిక్కిరి వంకర కాయల కథ అన్నాను.
బాగుంది సర్ కథ. ఇంతకూ ఆ రాజు అవి యేమని చెప్పాడు సర్
పర్లేదయ్యా బాగా ఖాళీగా ఉన్నట్లున్నావ్ .. నేను చెప్పే చెత్త వినడమే కాకుండా మళ్ళీ ప్రశ్నలు కూడా అడుగుతున్నావ్ అనుకొని మా నాన్నను అడిగి చెప్తానులే అన్నాను
మీ నాన్నను అడగటం ఎందుకు సార్ అన్నాడు
ఎందుకంటే ఆ సామెతను నేను మా నాన్న ద్వారా చిన్నప్పుడు విన్నాను కాబట్టి. సరే బిల్ ఎంత అయిందో ఒకసారి చెప్పు.
19000 సర్
అయినా పిల్లోళ్ల ముడ్డి తుడవడానికి తెల్లోళ్ళ పద్దతి మనకెందుకు, wipes బదులు శుభ్రంగా నీళ్లతో కడిగేస్తే పోతుంది. ఆ Wipes తీసేయ్. అలాగే $#$@#%@#% కూడా తీసేసి బిల్ ఎంత అయిందో చెప్పు
16800 సర్
పర్ఫెక్ట్ .. ఇదిగో డబ్బు అని ఇచ్చేసి మిగిలిన 200 రూపాయలతో హెయిర్ కట్ కోసం సెలూన్ కు బయలుదేరాను.
అయినా ఈ రెండేళ్లలో రేట్లు ఇంతగా పెరిగివుంటాయని ఊహించలేదు. రెండేళ్ల క్రితం నేను ఇండియా వెళ్లినప్పటికి, ఇప్పటికి ధరలు చాలా మటుకు అలోమోస్ట్ double అయినట్లు నాకు అనిపించింది.
గత నాలుగేళ్లుగా సిడ్నీ లో ఉంటున్నాను కానీ ఇక్కడ మరీ ఈ రేంజ్ లో రేట్స్ పెరగడం చూడలేదు. అలా పోల్చి ఇండియా ను తక్కువ చేయాలన్నది నా ఉద్దేశ్యం కాదు కానీ ప్రతీ సారి ధరలు అదుపులో ఉంచుతాము అని పాలకులు గుప్పిస్తున్న హామీలు ఎప్పుడు అమలులోకి వస్తాయన్నదే నా ప్రశ్న.
>> ప్రతీ సారి ధరలు అదుపులో ఉంచుతాము అని పాలకులు గుప్పిస్తున్న హామీలు ఎప్పుడు అమలులోకి వస్తాయన్నదే నా ప్రశ్న.
రిప్లయితొలగించండిసో, కాశీకి పోయొచ్చినా పిచ్చి కుదరలేదంటారు కదా ఇదే గాబోలు. లేకపోతే ఆ రాజకీయ నాయకులు చెప్పడం మీరు నమ్మడమూనా, హవ్వ! ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎన్ని హామీలిచ్చినా మన దేశం అంతే గురువు గారూ, జీతాలు అమెరికాలోలా ఇవ్వకపోయినా ధరలు మాత్రం న్యూ యార్క్, సిడ్నీలకి పోలేలాగ దీటుగా ఉంటాయి. లేకపోతే మరి మన మంత్రిగారు ప్రజాధనంతో పొద్దున్న అమెరికా, మధ్యాహ్నం దుబాయ్, సాయంత్రం బ్రెజిల్ ఎలా వెళ్తారనుకుంటున్నారు? ఆయన స్వఛ్ఛ భారత్ కి డబ్బులూ, (ఊడ్చడానికి చెత్తా) ఎక్కడ్నుంచి వస్తాయని మీ ఉద్దేశ్యం?
మీరన్నది నిజమండి
తొలగించండిపవన్ గారు! పునః స్వాగతం ! మీ నాన్నగారు చెప్పిన "కొక్కిరి బిక్కిరి వంకరకాయల సామెత కథ" బావుంది. మళ్లీ మీ కబుర్లు మొదలైనందుకు సంతోషం.
రిప్లయితొలగించండిథాంక్స్ అండీ లలిత గారు
తొలగించండిఓ మూడు, నాలుగు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇండియా వెళ్ళే చాలా మందికి తగిలే ధరాఘాతమే ఇది.
రిప్లయితొలగించండిమీ 'సామెతల కలబోత శైలి' లో బాగా రాస్తున్నారు పవన్ గారు!
శ్రీ గారూ, ధన్యవాదాలండి
తొలగించండికొక్కిరి బిక్కిరి వంకరకాయల కథ... hmm.. nice..
రిప్లయితొలగించండిThanks for the compliments
తొలగించండి