8, ఏప్రిల్ 2019, సోమవారం

చూద్దాం ఎవరు గెలుస్తారో ఎన్నికల్లో ఈ సారి

ఒక సారి స్కూల్ లో జనరల్ నాలెడ్జి మీద టెస్ట్ ఉంటుంది ప్రిపేర్ అవ్వండి అన్నారు.

ఆ తర్వాత దాని గురించి మా బడదల్ తో డిస్కషన్ మొదలైంది. మన దేశ ప్రధాని ఎవరు అని వాడు అడిగాడు ?

దీనికి ఆన్సర్ తెలియకపోతే మన తెలుగోడి పరువు తీసినట్లే? ఆయన మన తెలుగు జాతి ముద్దు బిడ్డ అన్నాను నేను.

హమ్మయ్య! వీడు కరెక్ట్ ఆన్సర్ రాసినట్లే ఉన్నాడు అని సంతోషించి, పేరు చెప్పు మరి అన్నాడు.

ఇంకెవరు నీ క్వశ్చన్ లో ఆన్సర్ ఉంది. ఇంకెవరు మన అన్న ఎన్టీఆర్ గారు.

నీ మొహం, ఆ తెలుగు బిడ్డ P.V నరసింహా రావు, ఆయన మన ప్రధాని. మా నాన్న వాళ్ళు మాట్లాడుకుంటుండగా విన్నాను.

నువ్వు కరెక్ట్ అయి ఉండచ్చు, నేనే పొరపడ్డాను మన రాష్టానికి ప్రధాని ఎన్టీఆర్.

అయ్యి ఉండచ్చు. అవును ఎందుకైనా మంచిది మన దేశంలో ఉండే అన్ని రాష్టాల ప్రధాన మంత్రులు, ముఖ్య మంత్రుల గురించి కూడా తెలుసుకోవాలి.  ఇంతకీ మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటావ్?

ఉండవూ ఒక వంద?

ఉండే ఉండచ్చు. మరి జిల్లా ప్రధాని గురించి అడిగితే? ఇంతకీ దేశంలో మొత్తం జిల్లాలు ఎన్ని ఉండచ్చు.

ఉండవూ ఒక యాభై?

దేశం మొత్తంలో రాష్ట్రాలే వంద ఉంటే జిల్లాలు అంత కంటే ఎక్కువ ఉండచ్చు.

అవును నువ్వు కరెక్ట్, మొత్తం జిల్లాలు నూటొక్కటి.

అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవ్?

సినిమా జ్ఞానం వల్ల, ఈ పెద్దోళ్ళు సినిమాలు చెడగొడతాయంటారు కానీ సినిమాల వల్ల ఎన్నో తెలుసుకోవచ్చు. మన నూతన ప్రసాద్ డైలాగ్ గుర్తు తెచ్చుకో 'నూటొక్క జిల్లాల అందగాడిని'

అంటే మొత్తం దేశంలో నూటొక్క జిల్లాలు ఉన్నాయంటావ్. మరి అంత మంది ప్రధానుల పేర్లు గుర్తు పెట్టుకోగలమా?

ఖచ్చితంగా కుదరదు, కాబట్టి వదిలేద్దాం.
     
                                                        *******కొన్నేళ్ల తర్వాత *********

వీధుల్లో చక్రం (గాను) తిప్పుకుంటూ ఆడుకునే రోజుల్లో చంద్రబాబు ఢిల్లీ లో చక్రం తిప్పుతున్నాడు అని మాట్లాడుకునేవాళ్ళు పెద్దోళ్లు. ఓహో, మేము వీధుల్లో పరిగెడుతూ సైకిల్ టైర్ తిప్పుకుంటుంటే, చంద్రబాబు ఢిల్లీ వీధుల్లో తిప్పుతున్నాడేమో,  ఛాన్స్ దొరికితే నేనూ ఢిల్లీ లో చక్రం తిప్పుతా, మరి దీనికెందుకంత గొప్పగా చెప్తున్నారు అని అనుకునేవాడిని అప్పట్లో.

ఆ తర్వాత లక్కీ గా సమ్మర్ హాలిడేస్ లో  నేను ఢిల్లీలో ఉన్న మా బాబాయ్ దగ్గరకు వెళ్లాను. అప్పుడు సైకిల్ చక్రం ఢిల్లీ వీధుల్లో తిప్పి వచ్చాను. ఈ విషయం తెలిసి ఊరూ వాడా ఏకమై నన్ను చంద్ర బాబు కన్నా ఎక్కువ పొగుడుతారని ఊహించా. కానీ నన్ను మా బడదల్ తప్ప ఎవరూ పొగడకపోవటం నిరాశకు గురి చేసినా, ఈ లోకం తీరే ఇంత అని సరి పుచ్చుకున్నాను.

                                             *******చాలా ఏళ్ల తర్వాత..అంటే ఇప్పుడు  *********

రాజకీయ జ్ఞానం పెరిగిందని మీరనుకోవద్దు, ఏదో వయసుతో పెరిగే జ్ఞానమే తప్ప రాజకీయ జ్ఞానం అయితే పెరగలేదు.  మొన్నా మధ్య కొలీగ్ ఒకతను మీ  ఊరు ఏ నియోజక వర్గం కింద వస్తుంది అని అడిగితే, పులివెందులో, జమ్మలమడుగో, పొద్దుటూరో అయి ఉండచ్చు లేదా వేరే నియోజక వర్గం కిందకు రావచ్చు అని తిక్క తిక్కగా సమాధానమిచ్చి పక్కకు తప్పుకున్నాను ఆ డిస్కషన్ నుంచి. 

సో, అప్పటికీ ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు రాజకీయాల్లో నా నాలెడ్జి విషయంలో. కాబట్టి ఈ సారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద విశ్లేషణ నేను చేయలేను. ఎలెక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే దాని మీద ఒక్క పోస్ట్ కూడా రాయలేదెందుకు అని కొందరు అడిగిన దానికి పై సోది అంతా చెప్పుకోవాల్సి వచ్చింది. 

నాకు గుర్తున్నంతవరకు ఎన్నికల్లో ఒకే ఒక్కసారి వోట్ వేసినట్లు గుర్తు. పలానా పార్టీ కే వెయ్యి అని మా బంధువులంతా ఫోర్స్ చేశారు కాబట్టి ఆ పార్టీ కి కాకుండా వేరే పార్టీకి దేనికో వేసినట్లు గుర్తు. అసలే నేను ఉలిపిరి కట్టెను మరి. 

చిన్నప్పుడు మా సొంతూరు వెళ్ళినప్పుడు భలే కన్ఫ్యూషన్ గా ఉండేది, ఎవరు ఏ పార్టీ నోతెలీక.  ఎవరూ ఏ పార్టీ లో శాశ్వతంగా ఉండరు అని తెలుసు గానీ, మరీ సంవత్సరానికి ఒకసారి ఊరు వెళ్ళినప్పుడల్లా పక్కింటి వాళ్ళతో మాటల్లేవు వాళ్ళు వేరేపార్టీ, ఆ మర్రి చెట్టు పక్కన ఉండే ఇంట్లో వాళ్ళు ఇప్పుడు మన పార్టీ అనేవాళ్ళు.

నాకు రాజకీయాల గురించి, ఇప్పుడు పోటీ చేస్తున్న పార్టీల గురించి తెలిసింది కొంచెమే. అదేంటో మీరే చూడండి.

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు - పార్టీ :

నేను చెబుతూ ఉన్నది ఎవరి గురించో ఈ పాటికే తెలిసే ఉంటది. సినిమా పబ్లిసిటి stunts చేస్తుంటాడు, చాప మీద కూర్చొని మట్టి కుండలో తినడాలు, తనకు ఇష్టమైన లీడర్ అని చెప్పి వంగి కాళ్లకు దండం పెట్టడాలు లాంటివి అన్నమాట. 


స్వతహాగా నేను అతని అభిమానినే కానీ అతని పార్టీ మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు. 

సినిమా తారలుండే పార్టీ:

చోటా మోటా నటుల నుంచి రోజా, మోహన్ బాబు లతో పాటు ఎక్కడ ఎప్పుడు ఏ పార్టీలో తేలతారో తెలియని రాజశేఖర్, జీవిత లాంటి బడా తారలంతా ఉండే పార్టీ ఇది. వీళ్ళ మొహాలు చూసి ఎన్ని ఓట్లు రాలతాయో తెలియదు కానీ ఆ పార్టీ అధినేత యొక్క తండ్రి ప్రభావం వల్ల పడే ఓట్లే ఎక్కువ.  

ఇప్పటికీ చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే పార్టీ:

చెట్టు పేరు (అన్న గారి పేరు) చెప్పుకొని కాయలు అమ్ముకుంటూ ఉంటారు ఈ పార్టీ వాళ్ళు, కాకపోతే ఆ చెట్టుకు కాయలు కాయడం మానేసి కుక్క మూతి పిందెలు పుట్టుకొస్తున్నాయి. అన్నగారు ఎప్పుడూ కాంగ్రెస్ ను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కుక్క మూతి పిందెలు అని అంటూ ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు అదే పార్టీలో అలాంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. వారిలో ఇద్దరి గురించి పరిచయం అనవసరం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే సగం ట్రోలింగ్స్ వారి మీదే ఉంటాయి. సో వాళ్ళను నమ్ముకొని బాబు గారు ఈ ఎన్నికల్లో గెలవడం అనేది కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లే. పండిత పుత్ర పరమ శుంఠ అనేది వీరిద్దరికీ వర్తిస్తుంది.

పాలిటిక్స్ లో నా వయసంత అనుభవం ఉందంటుంటాడు ఈ పార్టీ అధినేత, కాబట్టి ఇప్పటికీ ఈయన చక్రం తిప్పి తన పార్టీ ని గెలిపించుకునే సమర్థత ఉన్న చాణుక్యుడే.

ఆటలో అరటి పండు పార్టీ:

పెద్ద పిల్లలు ఆడుకుంటున్నప్పుడు చిన్న పిల్లాడొచ్చి నేనూ ఆడతాను అని మారాం చేస్తే పోనీ లేరా ఆడిద్దాం ఆటలో అరటిపండు అని ఆడించుకునేవాళ్ళు. సో, ఈ పార్టీ కూడా అలాంటిదే. పిట్టలదొర లేని లోటు తీర్చుతుంటాడు ఈ పార్టీ లీడర్.

ప్రస్తుతానికి, నాకు మటుకు ఈ ఎన్నికల మీద ఎటువంటి ఇంట్రస్ట్ లేదు, ప్రస్తుతానికి నా ఇంటరెస్ట్, efforts, ఎదురు చూపులు అన్నీ నేను చేస్తున్న నా హోమం మీద దాని రిజల్ట్స్ మీద.

చివరిగా, ఈ ఎలెక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద నా వ్యూ ఏంటో క్లియర్ చెప్పలేను గానీ, ఒక చిన్న పజిల్ ఇస్తున్నాను మీకు (ఇంటర్నెట్ నుంచి అరువు తెచ్చుకున్నది).

Source From Internet

8 కామెంట్‌లు:

  1. తెలీదు తెలీదు అంటూనే థీసిస్ సబ్మిట్ చేసేశారు ������.

    రిప్లయితొలగించండి
  2. కోతులకు కారు తోలడం కొత్త కదా ?
    ఎటైనా పోవచ్చు (రాజకీయ)కోతి మూక !

    రిప్లయితొలగించండి
  3. ఓడిపోతున్నపుడల్లా ఈవీయం లు టాంపర్ చేసారనడం, తప్పుడు సర్వేలు అనడం,అపర చాణక్యం అనడం, పచ్చ మీడియా పైశాచికత్వం అనడం, మమ్మల్ని దోచుకున్నారనడం,ఆనక మళ్ళీ మాదే ధనిక రాష్ట్రం అనడం,70 ఏళ్ళగా జరగని అభివృద్ధి 5 స లలో జరిగిపోయిందనడం రాజనాల గారు అన్నట్లు తెలంగాణా వారు ...incorrigible souls !
    చూద్దాం ఎవరు గెలుస్తారో ఎన్నికల్లో ఈ సారి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భేష్, మీకు మంచి అవగాహన ఉన్నట్లుంది రాజకీయాల గురించి నీహారిక గారు.

      తొలగించండి
  4. మీ పోస్ట్స్ చాలా honest గా, sportive గా "నొప్పించక, తానొవ్వక" అన్నట్లుంటాయి. Keep it up, Pavan garu!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పదు అలా రాసెయ్యాల్సిందే లలిత గారు, లేదంటే ఎవరి మనోభావాలు దెబ్బ తింటాయో అర్థం కాని రోజులు మరి :)

      తొలగించండి