రాజకీయ నాయకులు కప్ప దాట్లు వేసినట్లు నేను కూడా ఆ రోజుల్లో అన్న గారి పార్టీ నుంచి కృష్ణ పార్టీ కి ఆ తర్వాత చిరంజీవి పార్టీ కి మారాను.
విసన కర్రలు పోయి టేబుల్ ఫ్యాన్ లు వచ్చిన కాలం అది. అలాంటి టైం లో అన్న గారి సినిమా T.V లో వచ్చిందంటే ఆ సినిమా అయ్యేవరకు దేవతలకుండే కన్ను ఆర్పని లక్షణం నాకు ట్రాన్స్ఫర్ అయ్యేది. అలా అలా ఎన్టీవోడి మీద ఇష్టం పెరిగి టేబుల్ ఫ్యాన్ కు ఈ ఎన్టీవోడి ఫ్యాన్ కూడా తోడయ్యాడు మా ఇంట్లో. ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాలు T.V లో వేస్తే చూసి అవి కొత్త సినిమాలేమో ఎన్టీవోడు అలాగే యంగ్ గా ఉంటాడేమో అని భ్రమ పడేవాడిని.
బార్బర్లు ఇంటి దగ్గరికే వచ్చి అరువు మీద కట్టింగ్ చేసే రోజులు పోయి మనమే సెలూన్ కి వెళ్లి కటింగ్ చేయించుకునే రోజులొచ్చాయి. అలా ఓ రోజు మా నాన్న నన్ను కటింగ్ షాప్ కి తీసుకెళితే, నాకు ఎన్టీవోడి హెయిర్ స్టయిల్ కావాలి అని అడిగా. ఆయనది బట్ట తలరా, సినిమాల్లో విగ్ వాడుతారు నువ్వు కూడా ఇంకో 50 సంవత్సరాలు వచ్చాక ఆయన స్టయిల్లోనే కటింగ్ చేయించుకోవచ్చు అని చెప్పి ఎప్పటిలాగానే ఒక 3, 4 నెలల వరకు కటింగ్ ఆవరసం లేకుండా డిప్ప కటింగో చిప్ప కటింగో చేయించేశాడు.
ప్రేమ సింహాసనం, సూపర్ మాన్ లాంటి లేటెస్ట్ మూవీస్ కర్నూల్ లో చూసినప్పుడు గాని సత్యం బోధపడలేదు. మా నాన్న నిక్కర్ వేసుకున్న కాలం లో రిలీజ్ అయిన సినిమాలు నేను నిక్కర్ వేసుకుని తిరిగే రోజుల్లో T.V లో వస్తున్నాయని అర్థం అయింది.

ఇక కొన్నాళ్ళ తర్వాత అదే ఎన్టీవోడు గ్రీన్ కలర్ కోట్ వేసుకొని, దాచినా దాగని ఫ్యామిలీ పాక్ ను గాట్టిగా బెల్ట్ తో బిగించి, పసుపు కలర్ పాంట్ వేసుకొని తల్లి, చెల్లి, చెలి అనే తేడా లేకుండా సినిమాలో ఆడాళ్ళను చపాతి పిండి పిసికినట్లు పిసికేయడం మెదలుపెట్టాడు. ఇక నాగేశ్వర రావు గారు కూడా కుర్ర వేషాలు మొదలు పెట్టేశారు పోటీగా. వీళ్ళు రిటైర్ కాకుండా అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో తమ లోని నటనను నిద్రపుచ్చి అతిని బయటకు తీసుకొచ్చేవారు. ఇప్పటి పిల్లలు కనుక ఆ సినిమాలు చూశారంటే "రూపాయికి డాలర్ యాక్షన్ చేస్తున్నారు..ఎవరు వీళ్ళు" అని అడిగినా ఆశ్చర్యం లేదు.
మా నాన్నకు వేరే పల్లెకు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడే మా బడదల్ (చిన్నప్పటి మిత్రుడు. అందరూ వాడిని అలాగే పిలిచే వాళ్లు, ఎందుకో తెలీదు ) పరిచయం అయ్యాడు. వాడి గురించి సరిగ్గా చెప్పాలంటే ఇల్లు కాలుతుంటే జల్లెడతో నీళ్ళు పోసేంత అమాయకుడు పాపం. అలా ఒక ఎన్టీవోడి ఫ్యాన్ కి ఇంకో ఎన్టీవోడి ఫ్యాన్ కలవడం జరిగింది.

అప్పుడప్పుడే వడియాలు పాతబడి పోయి అప్పడాలు మార్కెట్ లోకి వస్తున్న రోజులు. అటువంటి టైం లో T.V లో jamesbond, cowboy లాంటి కాన్సెప్ట్ లతో వచ్చే కృష్ణ గారి సినిమాలు ఆకట్టుకున్నాయి . ఆ వయసులో ఆయన యంగ్ గా స్మార్ట్ గా భలే ఉండేవారు. అచ్చు కృష్ణ గారి స్టెప్స్ లాంటివే స్కూల్లో సాయంకాలం డ్రిల్ల్ క్లాస్ లో మాతో చేయించేవారు.
ఒక రోజు నేను, మా బడదల్ అరుగు మీద కూర్చొని శెనగలు తింటూ మాట్లాడుకుంటుంటే ఎన్టీవోడి పార్టీ నుంచి కృష్ణ పార్టీకి మారదాం అని ప్రపోసల్ పెట్టాను.
అలా ఎలా కుదురుతుంది..ఇది అన్యాయం అని లేచి నిలబడ్డాడు మాదాల రంగారావు నటించిన ఎర్ర సినిమాలేమైనా చూసాడేమో మరి అప్పటికే.
మొన్నటి వరకు ఈ శెనగలు పేపర్ పొట్లాల్లో కట్టి ఇచ్చేవాడా ఆ షాప్ వాడు ఇప్పుడేమో అదే షాప్ వాడు ప్లాస్టిక్ కవర్ లో ఇస్తున్నాడు. కాబట్టి కాలం తో పాటే ఆ షాప్ వాడు మారినట్లు మనం కూడా update అవ్వాలి తప్పులేదు అని "కృష్ణ" బోధ చేసి కన్విన్స్ చేశాను. ముందే చెప్పానుగా మా వాడు జల్లెడతో నీళ్ళు పోసే రకం అని, నా మాటకు తలూపాడు.
మొదటి కప్పదాటు ప్రారంభం .. ఎన్టీవోడి పార్టీ నుంచి కృష్ణ పార్టీ కి మారాము.
రెండవ కప్పదాటు గురించి తర్వాతి టపాలో.
రెండవ కప్పదాటు గురించి తర్వాతి టపాలో.
Nice one..waiting for the next post :)
రిప్లయితొలగించండిThanks for the comment Harish.
తొలగించండిNenu first nundi chiru party ne .. Ayana party pettaka nenu party vadilesa 😜
రిప్లయితొలగించండిmanchi pani chesaav Mitta
తొలగించండిNice way of writing Pavan..
రిప్లయితొలగించండిThanks for the comment Sharath.
తొలగించండివిసన కర్రలు పోయి టేబుల్ ఫ్యాన్ లు వచ్చిన కాలం అది
రిప్లయితొలగించండిబార్బర్లు ఇంటి దగ్గరికే వచ్చి అరువు మీద కట్టింగ్ చేసే రోజులు పోయి మనమే సెలూన్ కి వెళ్లి కటింగ్ చేయించుకునే రోజులొచ్చాయి
వడియాలు పాతబడి పోయి అప్పడాలు మార్కెట్ లోకి వస్తున్న రోజులు
మొన్నటి వరకు ఈ శెనగలు పేపర్ పొట్లాల్లో కట్టి ఇచ్చేవాడా ఆ షాప్ వాడు ఇప్పుడేమో అదే షాప్ వాడు ప్లాస్టిక్ కవర్ లో ఇస్తున్నాడు
ఇవి చాలండి రోజులేలా మారాయో తెలుసుకోడానికి, మీ బ్లాగ్ చరిత్రకు సాక్షం
Thanks for the consolidation hema kumar gaaru
తొలగించండి