18, మార్చి 2021, గురువారం

సరదాకి....ఇవాళ్టి జోకులు

ఇవాళ ఇద్దరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. వస్తూనే అన్నం పెడితే తింటూ, నాన్నా! ఇవాళ ఇల్లు ఎందుకంత సైలెంట్ గా ఉందని అడిగింది మా పిల్లల్లో పెద్దదైన అమ్మాయి. 

మీ అమ్మ లేదు ఇంట్లో, అందుకే అన్నాను నవ్వుతూ. 

సర్లెండి, నేను మాట్లాడేది పైన నేనన్న జోక్ గురించి కాదు. ఇవాళ మా పిల్లలు చెప్పిన జోక్స్ గురించి. మా అమ్మాయికి వాళ్ళ స్కూల్లో ప్రతీ వారం ఒక స్కూల్ మ్యాగజైన్ ఇస్తారు అందులో జోక్స్, పజిల్స్, కథలు భలే బాగుంటాయి. ఇవాళ ఇచ్చిన మ్యాగజైన్ లో ఒక జోక్ చదివి చెప్పింది మా అమ్మాయి. 

ఒక వ్యక్తి వచ్చి కుర్చీ లో కూర్చొని  'నా టేబుల్ కి ఒక ప్లేట్ ఫిష్&చిప్స్  పంపిస్తారా?' అంటాడు. 

'హేయ్, ఇది లైబ్రరీ' అంటాడు ఆ లైబ్రేరియన్. 

కుర్చీలోంచి ఆ వ్యక్తి లేచి ఇతని దగ్గరగా వచ్చి చెవిలో 'నా టేబుల్ కి ఒక ప్లేట్ ఫిష్&చిప్స్  పంపిస్తారా?' అని శబ్దం లేకుండా చెప్తాడు. 

నాకు ఆ జోక్ నచ్చి నవ్వి, నైస్ జోక్ అన్నాను. దానికి మా అయిదేళ్ళ బుడ్డోడికి ఇగో హర్ట్ అయి నేనొక జోక్ సారీ ఒక question  అడుగుతాను, ఆన్సర్ చెయ్యండి అన్నాడు. 

కౌబోయ్ సూపర్ హీరో మూన్ ని ఎందుకు డస్ట్ బిన్ లో వేశాడు?

ఎందుకంటే అతనికి మూన్ అంటే ఇష్టం లేదు అందుకు అన్నాడు. 

సరే, బాగుంది అన్నాను తనని సంతోషపరచడానికి. 

'ఒక సూపర్ rat అదే మూన్ ని డస్ట్ బిన్ లోంచి బయటికి తీసి తినాలని ట్రై చేసింది. ఎందుకు?' అని  అడిగాడు మళ్ళీ వాడే. 

ఆ పిచ్చి ఆన్సర్ కూడా నువ్వే చెప్పు అన్నాను.  

'ఆ మూన్ యెల్లో కలర్ లో కనపడేసరికి దాన్ని చీజ్ అనుకొని ఆ సూపర్ rat తినాలని ట్రై చేసింది' అన్నాడు. 

యేవో కాసిన్ని పిచ్చి కబుర్లు ఏదో ఒకటి రాయాలనిపించి రాశాను. 

విషయానికి వస్తే ఇక్కడ సిడ్నీ లో గత ఐదు రోజులుగా వర్షాలు తెగ కురుస్తున్నాయి ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు! కుండ పోత వర్షాలు అంటారు కదా అలా. అవును! కుండ పోత వర్షం అంటే కుండతో పోసినట్లుగా అనా? ఎవరైనా తెలిసిన వారు సరి చేయండి. 

నెక్స్ట్ వీక్ కూడా వర్షాలు ఇలాగే కురుస్తాయట. predictions తప్పైతే బాగుండు లేదంటే బయటికి వెళ్లాల్సి వస్తే ఇలా వెళ్ళాలి 

    
                                                            ఇమేజ్ సోర్స్: గూగుల్ 

4 కామెంట్‌లు:

  1. ఈ పోస్ట్ మీ ఆవిడ గారి కంటపడనివ్వక పోవడం మీకే మంచిది 😁.
    పైన నీలం రంగు అక్షరాల్లో వ్రాసిన జోక్ సూపర్.

    “కుండపోత” అంటే మీరన్నది కరక్టే ✅. సరి చెయ్యవలసిన అవసరమేమీ లేదు.
    అన్నట్లు మీకు ఈత కొట్టడం వచ్చా 😁?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తను ఇంటికి రాగానే ఆ విషయం చెప్పాను, కాకపోతే ఈ జన్మకి తప్పదు అడ్జస్ట్ అయిపోమంది 😋

      ఈ సంవత్సరం ముగిసే లోగా దానికీ టిక్ మార్క్ పెట్టాలనే లక్ష్యం ఉంది, చూడాలి మేష్టారు ఏమవుద్దో.

      తొలగించండి
    2. అంతేగా అంతేగా 🙂🙂.

      ఈ సంవత్సరం ముగిసేలోగా కాదు మీ ఊళ్ళో ఈ వర్షాకాలం ముగిసేలోగానే ఈత నేర్చుకోండి ... అని నా భావం 😁👍

      తొలగించండి
    3. అంత త్వరగా అంటే కష్టం మేష్టారు, కాలమతి ఇక్కడ.

      తొలగించండి