'ఈస్టర్ వస్తోంది కాబట్టి పిల్లల స్కూల్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి పైగా 4 రోజులు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. సో, ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం' అంది మా హోమ్ మినిస్టర్.
'ప్రేమ యాత్రలకి బృందావనము, నందనవనము ఏలనో, కులుకులొలుకు చెలి చెంత నుండగా వేరే స్వర్గము ఏలనో' అని అక్కినేని వారి స్టైల్ లో పాట అందుకున్నా.
ప్రేమ యాత్రల టైం ఎప్పుడో అయిపోయింది ఇది కుటుంబ యాత్ర కాబట్టి వెళ్ళి తీరాల్సిందే. పైగా మన పక్కింటి పెన్నీ వాళ్ళు (పిన్ని కాదు పెన్నీ అనబడే తెల్ల దొరసాని) పది నెలల శాలరీ ఖర్చు పెట్టి అటెటో వెళ్లొచ్చారు, వెనకింటి విన్నీ వాళ్ళు వాళ్ళ ఇళ్ళు తాకట్టులో పెట్టి మరీ ఎటెటో వెళ్ళి వచ్చారు, కాబట్టి డబ్బులు లేకపోయినా నిన్ను నువ్వు తాకట్టు పెట్టేసుకొని అయినా మమ్మల్ని తీసుకెళ్ళాల్సిందే అంది శుభలగ్నం సినిమాలో ఆమని ని గుర్తుచేస్తూ.
సరే తప్పుతుందా అని ట్రిప్ ప్లాన్ చేసి accommodation కోసం వెతుకుతుంటే దొరకట్లేదు. నిన్న సాయంకాలం 6 కి మొదలెడితే రాత్రి 12 అయింది ఓ రెండు రోజులు ట్రిప్ కి accommodation బుక్ చేయడానికి. ఎక్కడ చూసినా సోల్డ్ అవుట్ అనే బోర్డ్స్ వెక్కిరించాయి.
టూరిస్ట్ స్పాట్ నుంచి ఒక 100 కిలోమీటర్లు అటో ఇటో వెదకాలి accommodation దొరకబుచ్చుకోవడానికి.
చెప్పడం మరిచిపోయా, నేను accommodation బుక్ చేసుకున్న చోట స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, ఈత రాకపోయినా సరే అంత డబ్బులు కట్టినందుకైనా అందులో దిగి ఈత కొట్టినట్లు ఒక ఫోటో తీసుకోవాలి (పిల్ల చేష్టలు పోలేదు ఇంకా). డ్రైవింగ్ నేర్చుకునే పని అయిపోయింది కానీ స్విమ్మింగ్ నేర్చుకోవడం అన్నది ఇంకా పెండింగ్ లో ఉండిపోయింది ఈ పని ఎప్పుడు మొదలెడతానో ఏమిటో ...
Foot-loose అంటారు అటువంటి శాల్తీల్ని 🙂 (మిమ్మల్ని కాదు, ఆ తెల్లవాళ్ళని).
రిప్లయితొలగించండిహోటల్ రూము సరే, మరి ఆ ఊళ్ళకు వెళ్ళడం ఎలా? కారు కొనేశారా (going against Murali Mohan Theory 🙂)? డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించేశారా? అయితే ఓకే. శుభం. ఏ రకంగా ప్రయాణించినా హాయిగా వెళ్ళి ఆనందించి రండి 👍.
ఈ గొడవంతా లేకుండా మా చిన్నతనంలో ఊళ్ళల్లోకి ఒకడు నాలుగు పలకల పెట్టె ఒకటి పట్టుకుని వస్తుండేవాడు అప్పుడప్పుడు. దాని లోపల నాలుగు వైపులా కొన్ని ప్రముఖ ఊళ్ళ బొమ్మలు అతికించి ఉండేవి. మన దగ్గర నుండి డబ్బులు తీసుకుని (అర్థణానో, అణానో ... గుర్తు లేదు), ఆ పెట్టెలోకి చూడనిచ్చేవాడు. ఒక వైపు చూసాక పెట్టెని తిప్పేవాడు, ఇంకో సైడు మన ముందుకి వచ్చేది. ఆ రకంగా నాలుగు సైడులూ చూపించేవాడు. ఆ రకంగా విహారయాత్ర చేయించేవాడు. వాడి స్లోగన్ “కాశీపట్నం చూడర బాబూ” 😁😁.
Foot-loose అంటే footware బ్రాండ్ అనే తెలుసు. ఈ అర్థం కూడా ఉందన్నమాట. థాంక్స్ మేస్టారు.
తొలగించండిసెకండ్ హ్యాండ్ కార్ కొనడం అయ్యింది మేస్టారు. ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం waiting. ఇంకో రెండు వారాల్లో ఉంది. అది ఫెయిల్ అయితే ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకున్నా ట్రిప్ కి ఇబ్బంది రాకుండా.
కాశీ పట్నం స్లోగన్ విన్నాను కానీ ఆ విహార యాత్ర చూళ్ళేదు ☺️