సాధారణంగా కథలు Once Upon A Time అనో లేదంటే It Was a nice sunny day అనో మొదలవుతాయి. అలాగా నేను కూడా It Was a nice sunny day అని మొదలుపెట్టాలి కథ కాని ఈ పోస్ట్ ని. ఎందుకంటే నిన్న వర్షం రాకుండా బాగా ఎండ కాయడం వలన పోయిన ఆదివారం భారీ వర్షాల కారణంగా cancel అయిన మా పాప birthday పార్టీ ని ఈ శనివారం ఏ ఇబ్బంది లేకుండా జరపగలిగాము. కాకపోతే పార్టీ జరిగిన హోటల్ చుట్టుపక్కల కొంత రోడ్ repairs కారణంగా రోడ్స్ కొన్ని బ్లాక్ చేయడంతో కాస్త ట్రాఫిక్ జామ్ అయింది.
సిడ్నీ ట్రాఫిక్ జామ్ ని మన బెంగుళూరు,ముంబై, హైదరాబాద్ లాంటి ట్రాఫిక్ జామ్ లతో పోల్చడమంటే నదిని పట్టుకొని సముద్రం తో పోల్చినట్లే. కానీ మన ఇండియన్స్ ముంబై ట్రాఫిక్ అంటే ఎంత భయపడతారో ఈ ఆస్ట్రేలియా వాళ్ళకు కూడా సిడ్నీ ట్రాఫిక్ అంటే అంత భయం. నా ఆస్ట్రేలియన్ ఫ్రెండ్ ఒకతను పోయిన సంవత్సరం కాన్బెర్రా నుంచి సిడ్నీ కి ట్రాన్స్ఫెర్ అయి వచ్చాడు. ఇక్కడి ట్రాఫిక్ కి భయపడి మూడంటే మూడే నెలల్లో తిరిగి కాన్బెర్రా కు ట్రాన్స్ఫెర్ చేయించుకున్నాడు. కాన్బెర్రా ట్రాఫిక్ గురించి పైన చెప్పినట్లు పోలికలో చెప్పాలంటే అదో పిల్ల కాలువ. ఇక అతను పొరపాటున ఏ బెంగుళూరు కో ముంబై కో వచ్చాడంటే అక్కడి ట్రాఫిక్ చూసి విరక్తి చెంది ఏ మురుగు కాలువో చూసుకొని దూకడమో లేదా ఏ ట్రక్కు కిందో తల పెట్టేయడమో ఖాయం.
పార్టీ కి వచ్చిన అతిధులను ఒకరిని ఒకరికి పరిచయం చేయవలసిన అవసరం రాలేదు . వరల్డ్ ఈస్ సో స్మాల్ అంటారు కదా అలా ఇక ఈ సిడ్నీ అయితే మరీ స్మాల్ అనిపిస్తుంది ప్రతి తెలుగు వాడికి ఇంకో తెలుగు వాడు ఫ్రెండో లేదంటే ఫ్రెండ్ కు ఫ్రెండో లేదంటే ఓల్డ్ colleague గానో పరిచయం ఉండే ఉంటుంది. కాబట్టి పార్టీ కి వచ్చిన వాళ్ళంతా ఏదో ఒక రకంగా ఒకరికి ఒకరు పరిచయస్తులే. మన తెలుగు వాళ్ళే కాకుండా 3 తమిళ్ ఫ్యామిలీస్, 2 శ్రీలంకన్ ఫ్యామిలీస్, 3 నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా వచ్చారు
ఇక్కడ హైదరాబాద్ పారడైస్ బిర్యాని అని మన తెలుగు వాళ్ళదే ఒక రెస్టారెంట్ ఉంది. పార్టీ శనివారం జరపడం వలన వచ్చిన వాళ్ళలో సింహ భాగం non-veg తినని వాళ్ళే ఉన్నారని ముందే తెలియడంతో పూర్తిగా వెజిటేరియన్ డిషెస్ తో పార్టీ అరేంజ్ చేసాము. వంటలు అదిరిపోయాయి అని కితాబు ఇచ్చారు వచ్చిన వాళ్ళు ఇక బిర్యాని రుచి గురించి అయితే ప్రతీ ఒక్కరూ తెగ మెచ్చుకున్నారు. ఇదైతే మేము expect చేసిందే ఎంతైనా చెఫ్ మన హైదరాబాదీ కదా. అయినా మన హైదరాబాదీ చెఫ్ వండే వంటల్లో బిర్యాని గురించి పొగడడమంటే మన చిరంజీవి సినిమా చూసి స్టెప్స్ బాగున్నాయని పొగిడినట్లు ఉంటుంది అదంతా సహజం అంతే . మన హైదరాబాద్ బిరియాని, మన చిరంజీవి స్టెప్స్ నా వరకైతే ఎప్పటికీ ప్రత్యేకమే. ఇంకా చిరంజీవి స్టెప్స్ ఏమిటి ఈ కాలంలో అంటారా మన త్రివిక్రమ్ గారు నువ్వే నువ్వే సినిమాలో చెప్పిన స్టైల్ లో చెప్పాలంటే అమ్మ, ఆవకాయి, అన్నయ్య స్టెప్స్ ఎప్పటికీ బోరు కొట్టవు అంతే.
ఇక పార్టీ లో భోజనం విషయానికి వస్తే ముందుగా సలాడ్, అప్పడం లతో స్వాగతం పలికి ఆ తర్వాత గోబీ మంచురియా, మిక్స్ వెజ్ పకోడా, వెజ్ కట్లెట్ వంటి స్టార్టర్స్ తో పొట్ట పూజ ప్రారంభించి తర్వాత రోటి, పనీర్ బట్టర్ మసాలా, గుత్తి వంకాయి, మిక్స్ వెజ్ కుర్మా ల మీదుగా వెజ్ బిర్యాని విత్ రైతా లతో కడుపును పూర్తిగా సంతృప్తి పరచి రసమలాయ్ తో తియ్యగా ముగించాము.
ఇక పిల్లలు వాళ్ళ వాళ్ళ ఆట పాటలతో సరిగా భోజనం చేయక కడుపు నింపుకున్నారో లేదో తెలీదు కాని వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళందుకున్న రిటర్న్ గిఫ్ట్ లతో వాళ్ళ కడుపు పూర్తిగా నిండిపోయి ఉంటుందని అనుకుంటున్నాను.
ఇక ఈ పార్టీ ఇంత బాగా జరగడానికి తోడ్పడిన మిత్రులకు ధన్యవాదాలు, ముఖ్యంగా ఉదయాన్నే అంత చలిని కూడా లెక్కచేయక హోటల్ లో పార్టీ జరిగే స్థలానికి వచ్ఛి బెలూన్లు అవీ వూది పార్టీ హాల్ ను అలంకరించడానికి వచ్చిన మిత్రులకు. ఇక ప్రత్యేకించి చెప్పవలసి మరొక వ్యక్తి ఉన్నారు ఆయనొక సర్దార్జీ. కొంత కాలం క్రితం పరిచయమైన ఒక మిత్రుడు, నా కన్నా వయసులో బాగా పెద్దవారు కూడా. పార్టీ జరిగే సమయం లో పార్టీ కి వచ్చిన వారి మంచి చెడ్డలు చూస్తూ ఆ బిజీ లో పడి మేము సరిగా తినకపోతే మా పనులలో ఆయన సాయపడుతూ మేము తినని విషయం ఆయన గుర్తుచేస్తూ తను ఎంతగానో బాధపడటం మేము ఎన్నటికీ మర్చిపోలేము. ఇంత మంచి మనసున్న సర్దార్జీ ల మీద facebook లో, పేపర్ లలో కనపడే జోకుల గురించి చూసినప్పుడల్లా మనస్సు చివుక్కుమంటుంది కానీ "పళ్ళున్న చెట్లకే కదా రాళ్ళ దెబ్బలు" అనే మాట గుర్తుకొచ్చి నాకు నేను సర్దిచెప్పుకుంటాను. పార్టీ అంతా అయిపోయాక చివర్లో మమ్మల్ల్ని ఇంటి దగ్గర కార్లో డ్రాప్ చేసినపుడు థాంక్స్ చెబితే "థాంక్స్ మత్ బోల్నా తుమ్ తో మేరా చోటే భాయి జైసా" అని ఒక హగ్ ఇచ్చి భుజం తట్టినప్పుడు నా కంట్లో తిరిగిన నీరే సాక్షం ఆయన మంచితనం గురించి చెప్పడానికి.
ఆరోగ్యం అంత బాగా లేకపోయినా కేకు ఆర్డర్ లతో పూర్తి బిజీ గా ఉండి కూడా మేము అడిగిన వెంటనే ఆవిడ ఛార్జ్ చేసే రేట్లో సగం రేటుకే అందమైన మిన్ని మౌస్ కేకు చేసి ఇచ్చి, పూర్తి డబ్బులు ఇచ్చినా తీసుకోని మా పక్కింటి ఆంటీ .. ఇలా ఎంతో మంది మంచి వారి మంచితనం మధ్య "ఇంగువ చుట్టిన గుడ్డలా" నాకూ కొంతైనా వారి మంచితనం అంటుకుంటే చాలు.
అయినా ఎప్పుడో అయిపోయిన పెళ్ళికి ఇప్పుడు బాజాలు ఎందుకు అన్నట్లు నిన్నేప్పుడో అయిపోయిన బర్త్ డే కి ఇంత సోది ఇప్పుడు అవసరమా అంటారా ఏదో నాడైరీ లో ఇదొక మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఇలా రాసుకున్నాను అంతే.
P.S : పైన నేను రాసిన హిందీ లో గ్రామర్ మిస్టేక్స్ ఉంటే క్షమించాలి. హిందీ లో నేనంత పర్ఫెక్ట్ కాదు of courese తెలుగు లో కూడా అనుకోండి.
>నిన్న వర్షం రాకుండా బాగా ఎండ కాయడం వలన పోయిన ఆదివారం భారీ వర్షాల కారణంగా cancel అయిన మా పాప birthday పార్టీ ని ఈ శనివారం ఏ ఇబ్బంది లేకుండా జరపగలిగాము.
రిప్లయితొలగించండిచాలా సంతోషం. ముందే చెప్పాను కదండీ. ఈ వారాంతంలో వర్షం రద్దుచేయటమైనదీ అని. మీ పాపకు బాగా అనందం కలిగిందని భావిస్తాను. అదే కావలసింది.
సిడ్నీ weather మీ ఆర్డర్ని గౌరవించి వర్షం పడదనే నమ్మకంతోనే శనివారం పార్టీ పెట్టుకున్నాము శ్యామలీయం గారు :)
తొలగించండి‘ఇంత మంచి మనసున్న సర్దార్జీ ల మీద facebook లో, పేపర్ లలో కనపడే జోకుల గురించి చూసినప్పుడల్లా మనస్సు చివుక్కుమంటుంది’ బాగా చెప్పారు. ఏదో సందేశానికి whatsapp గ్రూప్ లో నేను ఇలాగే చెప్తే ‘overreact అవ్వద్దు జోకు ని జోకు లాగా తీసుకోవాలి’ అన్నారు. ఈ over action, overreaction వల్లే బ్లాగులోకం లోకి వచ్చేస్తామేమో మరి :)
రిప్లయితొలగించండిమీరన్నది నూటికి నూటి పాళ్ళు నిజమండి చంద్రిక గారు
తొలగించండిNice one pavan
రిప్లయితొలగించండిThanks for the comments mitta
తొలగించండిబావుందండీ పోస్ట్. ఇంకా మీ పాప కూడా.
రిప్లయితొలగించండిథాంక్స్ అండీ nagarani గారు
రిప్లయితొలగించండి