ఒక ప్రముఖ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి ఆంధ్ర, తెలంగాణాలలోని తమ తమ బ్రాంచ్ సేల్స్ ఎగ్జిక్యుటివ్ మేనేజర్స్ అందరికీ హైదరాబాద్ లో జరగబోయే రేపటి సమావేశానికి అర్జెంటుగా రమ్మని మెసేజ్ వచ్చింది. అందరూ మరుసటి రోజు సమావేశానికి హాజరయి ఈ అర్జెంటు సమావేశానికి కారణం ఏమిటో తెలియక అటూ ఇటూ తిరుగుతూ పక్కవారి చెవులు కొరకడమే కాకుండా అందిన కాడికి తమ తమ చెవులు కూడా కొరుక్కుంటున్నారు.
ఇంతలో మేనేజింగ్ డైరెక్టర్ రావడం చూసి గోడ మీది బల్లి అతుక్కు న్నట్లు ఎవరి సీట్ కి వాళ్ళు అతుక్కుపోయారు. అతను వచ్చీ రాగానే టేబుల్ మీద ఉన్న ఒక పిన్ కింద పారేసి ఆ శబ్దం విని హ్యాపీ గా ఫీల్ అయి మాట్లాడటం మొదలుపెట్టాడు.
గత 4-5 వారాలలో ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలోనే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో గల ఇండియన్ షాప్స్ లో కూడా మన ప్రోడక్ట్ సేల్స్ విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. గత 4 వారాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న రెండు కొత్త తెలుగు సినిమాలు రిలీజ్ అవడం ఇందుకు కారణం అని మన కంపెనీ బ్రాంచ్ ల బయట నిద్రపోయే వాచ్ మెన్ ను నిద్ర లేపి అడిగినా చెబుతాడు. కానీ అంతు చిక్కని విషయం ఏమిటంటే పోయిన వారం నుంచి మరింత జోరుగా మన ప్రోడక్ట్ సేల్స్ పెరుగుతున్నట్లు సమాచారం. స్వతహాగా సినిమా పిచ్చివాడి నయిన నాకు తెలిసినంత వరకు పోయిన వారం కాని ఈ వారం కాని రిలీజ్ అయిన తెలుగు సినిమాలకు మన ప్రోడక్ట్ సేల్స్ పెంచే దమ్ము లేదన్నది అందరికి తెలిసిన నిజం, మరి మన ప్రోడక్ట్ సేల్స్ పెరగడానికి గల కారణాలేవో తెలియడంలేదు అని నెత్తి మీద ఉన్న నలభై వెంట్రుకలలో నాలుగు వెంట్రుకలు పీక్కున్నాడు
మన ప్రోడక్ట్ సేల్స్ పెరుగుతున్నాయని మనకు అర్థం అవుతోంది కాబట్టి మనం సంతోషించాల్సిన విషయం కదా ఇది. అంతే కాని దాని బదులు ఉన్ననలభై వెంట్రుకలు పీక్కోవడం వల్ల కబడ్డీ కబడ్డీ ఆడడానికి సరిపోయే గ్రౌండ్ ను 20-20 మ్యాచ్ ఆడటానికి సరిపోయే గ్రౌండ్ గా మార్చుకోవడం అవసరమంటారా అన్నాడొక బ్రాంచ్ సేల్స్ ఎగ్జిక్యుటివ్ మేనేజర్.
అందుకేనండి పి.పి గారు మిమ్మల్ని మన ఎర్రగడ్డ బ్రాంచ్ కు సేల్స్ ఎగ్జిక్యుటివ్ మేనేజర్ ను చేసింది. మన ప్రోడక్ట్ సేల్స్ పెరగడానికి గల కారణాలేవో తెలుసుకుంటే ఆ కారణాలను ఉపయోగించుకొని మనం మరింత సేల్స్ పెంచుకోవచ్చు. కాబట్టి మై డియర్ ఎంప్లాయిస్ మీలో ఆ కారణం తెలిసిన వారు ఎవరైనా ఉంటే కాలో చెయ్యో ఎత్తి మాట్లాడండి అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్.
కాసేపు వెయిట్ చేసి టేబుల్ మీద ఉన్నమరొక పిన్ కింద పారేసి ఆ శబ్దం విని ఈ సారి కోపం గా మాట్లాడటం మొదలుపెట్టాడు. కారణం తెలిసిన వారు ఎవరూ లేరు కాబట్టి ఒక త్రిసభ్య కమిటీ ని వేద్దాము. వారు ఒక మూడు రోజుల్లో నివేదిక అందించవలసి ఉంటుంది అని ముగ్గురు మెరికల లాంటి సేల్స్ ఎగ్జిక్యుటివ్ మేనేజర్ ను ఎంపిక చేసాడు. అందులో పి.పి గారిని కూడా ఎంపిక చేసి ఉంటాడు అని అనుకున్నవాళ్ళు నేరుగా ఎర్రగడ్డ కు వెళ్ళాలని మనవి.
అందరూ నాల్గవ రోజు సమావేశమయ్యారు. వాళ్ళ రిపోర్ట్ కూడా మన దేశంలో అన్ని కమిటీ లు సమర్పించినట్లుగానే అతి పెద్ద రిపోర్ట్ ని అంటే 333 పేజీల రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తూ చదవడం మొదలుపెట్టారు. ఇప్పటి తెలుగు సినిమా కథల్లో కథ లేనట్లుగా ఆ రిపోర్ట్లో కూడా పనికొచ్చే విషయం శూన్యం అని అర్థమయ్యాక, నిద్ర పోకుండా సిన్సియర్ గా ఆ రిపోర్ట్ విన్న వాళ్ళందరికీ తమ కంపెనీ ప్రోడక్ట్ అవసరం ఎంతైనా ఉందని గుర్తించి ఫ్రీ గా డిస్ట్రిబ్యూట్ చేశారు.
సరిగ్గా అప్పుడే మన హీరో పి.పి చినిగిన బట్టలతో లోనికి వచ్చాడు. అసలే కారణం తెలియక ఫ్రస్ట్రేషన్ లో ఉన్న M.D కి ఇలా ఆలస్యంగా అదీ చిరిగిపోయిన బట్టలతో రావడం పుండు మీద కారం చల్లినట్లుగా అనిపించడంతో పాత సినిమాల్లోని బాలయ్య లాంటి వాడు నందమూరి బాలయ్య లా గాండ్రించి ఆలస్యానికి కారణం అడిగాడు.
మా తమ్ముడు గత వారం నుంచి విపరీతమైన తలనొప్పి తో బాధపడుతుంటే పక్కనే ఉంది కదా అని ఎర్రగడ్డ హాస్పిటల్ కు తీసుకెళ్ళాను. అక్కడ మా తమ్ముడు డాక్టర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు మన ప్రోడక్ట్ సేల్స్ పెరగడానికి కారణం అర్థమైపోయింది ఆ సంతోషంలో బట్టలు చించుకున్నాను అంటూ పక్కనున్న బోర్డు మీదా చార్ట్ గీసాడు
అంతే దాన్ని చూసిన M.D పి. పి కో లక్ష రూపాయల బోనస్, 'నా కబుర్లు' బ్లాగ్ రాస్తున్న నాకో 2 లక్షల రూపాయల చెక్ ని గిఫ్ట్ గా పంపించడం తో పాటు ఇంకా తమ ప్రోడక్ట్ సేల్స్ కనుక మరింతగా పెంచగలిగితే అమరావతి లో నిర్మించబోయే తమ కొత్త బ్రాంచ్ కు నన్ను జనరల్ మేనేజర్ ని చేస్తానని ప్రపోసల్ కూడా పెట్టాడు కాబట్టి మీరంతా నా యందు దయగలవారై నా బ్లాగు క్రమం తప్పకుండా చదువుతూ ఉంటారని, అలాగే మీకు శత్రువులు (అంటే బాసులు, భార్యలు/భర్తలు మరియు వారి తరపు బంధువులు లాంటి వారు అన్నమాట) ఉంటే వారికి కూడా నా బ్లాగ్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పి నా బ్లాగ్ చదివేట్లు చేస్తారని ఆశిస్తూ ప్రపోసల్ కు ఒప్పుకుంటున్నాను.
అంతే దాన్ని చూసిన M.D పి. పి కో లక్ష రూపాయల బోనస్, 'నా కబుర్లు' బ్లాగ్ రాస్తున్న నాకో 2 లక్షల రూపాయల చెక్ ని గిఫ్ట్ గా పంపించడం తో పాటు ఇంకా తమ ప్రోడక్ట్ సేల్స్ కనుక మరింతగా పెంచగలిగితే అమరావతి లో నిర్మించబోయే తమ కొత్త బ్రాంచ్ కు నన్ను జనరల్ మేనేజర్ ని చేస్తానని ప్రపోసల్ కూడా పెట్టాడు కాబట్టి మీరంతా నా యందు దయగలవారై నా బ్లాగు క్రమం తప్పకుండా చదువుతూ ఉంటారని, అలాగే మీకు శత్రువులు (అంటే బాసులు, భార్యలు/భర్తలు మరియు వారి తరపు బంధువులు లాంటి వారు అన్నమాట) ఉంటే వారికి కూడా నా బ్లాగ్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పి నా బ్లాగ్ చదివేట్లు చేస్తారని ఆశిస్తూ ప్రపోసల్ కు ఒప్పుకుంటున్నాను.
వెరైటీ గా బావుంది.
రిప్లయితొలగించండిమీ తెలుగు వ్రాత నాకు ఎవరో కార్టూనిస్ట్ ని గుర్తుకుతెస్తోంది.
మీ కామెంట్ కు థాంక్స్ శ్రీ గారు.
రిప్లయితొలగించండిNice article. We will help to you to get that G.M post.
రిప్లయితొలగించండిThanks for the comments Harsih
రిప్లయితొలగించండిSuper mama keep it up
రిప్లయితొలగించండిథాంక్స్ ఫర్ ది కామెంట్ మామా
రిప్లయితొలగించండిబాగుంది పవన్ గారు ఇలాగె దుసుకేల్లండి
రిప్లయితొలగించండిథాంక్స్ ఫర్ ది కామెంట్ హేమ కుమార్ గారు. దూసుకేల్తా నండి నిజం రాకెట్ లా కాకపోయినా దీపావళి రాకెట్ లా అయినా
రిప్లయితొలగించండి