హిజ్రా పాత్రలను కమెడియన్స్ గానూ, విల్లన్లుగానూ చూపించడం తప్పు - ప్రకాష్ రాజ్
ఈ మధ్య వస్తున్న సినిమా పాటల్లో బూతులు ఎక్కువగా వాడుతున్నారు. అలాంటి పాటలను గాయకులు పాడకపోవటం మంచిది - S.P బాలసుబ్రమణ్యం
ఇప్పుడొస్తున్న సినిమాల్లో ద్వందార్థాల డైలాగులు, వెకిలి చేష్టలు ఎక్కువయ్యాయి.. అందుకే ఈ మధ్య సినిమాలు తగ్గించుకున్నాను. సీనియర్స్ అంటే గౌరవం చూపడం లేదు -- గిరిబాబు
ఈ మధ్య ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ చూసినప్పుడు 'వృద్ధ నారీ పతివ్రతా' అన్న సంస్కృత వాక్యం గుర్తుకు వస్తుంది.
ప్రకాష్ రాజు గారు ఒకప్పుడు ఒక సినిమాలో హిజ్రా గా విలన్ పాత్రలో నటించారు. ఇప్పుడేమో అలా చూపడం మంచిది కాదు అంటున్నారు. అప్పుడేదో అలా చేసాను కానీ ఇప్పుడైతే అలా చేయను అన్నది ఆయన గారి స్టేట్మెంట్. (బహుశా కొత్త సినిమాలో విక్రమ్ చేస్తున్న హిజ్రా విలన్ పాత్ర గురించి కాబోలు). హిజ్రాలను అలా చూపడం ముమ్మాటికీ తప్పే. నేనూ ఆయనతో అంగీకరిస్తాను కానీ ఆయన ఒకప్పుడు అలాంటి పాత్రలను పోషించి ఇప్పుడు అలాంటి పాత్రలు వేయకండి ఆనుతున్నారు కాబట్టే నాకు 'వృద్ధ నారీ పతివ్రతా' అన్నది గుర్తుకు వస్తుంది.
ఇక S.P బాలసుబ్రమణ్యం గారి గురించి మాట్లాడే వయసు, అర్హత నాకు లేదు అని తెలుసు కానీ ఆయన కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు మంచి పాటలే కాకుండా బూతు అర్థాలు ఉన్న పాటలు పాడారన్న విషయం ఆయనకూ తెలుసు. నా వరకైతే బాలు గారు సినిమాల్లో పాడటం తగ్గించాక కొత్త పాటలు వినటం కూడా తగ్గించాను. ఎందుకో మరి ఆయన వాయిస్ తప్ప చాలా కొద్దీ మంది వాయిస్ వినడానికే ఇష్టపడతాను అంత పెద్ద ఫ్యాన్ ని నేను ఆయనకి. కానీ ఆయన స్టేట్మెంట్ విన్నాక 'వృద్ధ నారీ పతివ్రతా' అన్నది గుర్తుకు వస్తుంది.
ఇక గిరిబాబు గారి విషయానికి వస్తే ఆ కాలంలో సినిమాలు చూసిన పాత తరం వారికి గిరిబాబు వేసేవి వెకిలి వేషాలుగా అనిపించి ఉండచ్చు. ఈ కాలంలో మిగతా నటులు వేసే పాత్రలు ఆయనకి వెకిలి వేషాలుగా అనిపించి ఉండచ్చు.
అసలు ఒక సంస్కృత కవి ఏమన్నాడో తెలుసా
అసమర్థస్య సాధూనాం
నిర్దనస్య జితేంద్రియః
వార్ధక్యో దేవతాభక్తి
వృద్ధ నారీ పతివ్రతా
అసమర్థుని మంచి తనము, డబ్బు లేని వాడి ఇంద్రియ నిగ్రహము, వయసు మళ్ళాక దైవ భక్తి, వయసు పైబడిన స్త్రీ పాతి వ్రత్యము ఒక్కలాంటిదే అని.
ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నట్లు గుర్తు. మీలో చాలా మంది ఇంగ్లీష్ మీడియం లో చదువుకొని ఉంటారు కాబట్టి తెలుగు లో చెబితే అర్థం అవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పులుంటే మన్నించండి.. అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించండి.
మీరు సినిమా ప్రేమికులైతే పెదరాయుడులో మోహన్ బాబు గారి డైలాగ్ గుర్తొచ్చి ఉండాలి ఈ పాటికే.
ఒకసారి మోహన్ బాబు గారు స్టేజి మీద సినిమా టీం మెంబెర్స్ గురించి మాట్లాడుతూ సినిమా సెట్స్ మీద, తెర వెనుక మీరు ఎలాగైనా పిలుచుకోండి వారితో ఎలాగైనా బిహేవ్ చేయండి అది మీ ఇష్టం అంతే కానీ స్టేజి మీద మాత్రం తోటి సినిమా వారిని అగౌరవించకండి అన్నారు. మరి ఆయనే స్టేజి మీద ఎన్నో సార్లు రజని గాడు అని పిలడవం విన్నాను. ఆయనకు రజిని కాంత్ గారు క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు ఒరేయ్ ఒరేయ్ అని పిలుచుకునేంత చనువు ఉండచ్చు, కానీ స్టేజి మీద రజని గాడు, వాడు, వీడు అని సంబోధించినప్పుడు మాత్రం మనస్సు చివుక్కుమంటుంది. అవును మరి వారు చేస్తే శృంగారం మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారం.

avunu nijame......vrudha naree prathivratha...
రిప్లయితొలగించండిThanks for the Comments
తొలగించండినేను మోహన్‍బాబు కాలేజీలోనే చదివాను. రజినీ కూడా మోహన్‍బాబుని బాగా ఆటపట్టిస్తాడు వెనక. ఇక స్టేజ్ మీద ప్రవర్తన గురించి, స్టేజ్ మైక్ చూస్తే మోహన్‍బాబుకి ఒళ్ళు తెలీదు. ఐనా ఆ మనిషి సంగతి తెలిసినవాళ్ళెవ్వరూ ఆశ్చర్యపోరు.
రిప్లయితొలగించండిమీరన్నది కరెక్టే నండి. Thanks for sharing more details
తొలగించండిపవన్ మీవ్రాతలు దినదిన ప్రవర్ధమానమవుతున్నాయి. మంచి వ్యాసం.
రిప్లయితొలగించండిమీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండి.
తొలగించండిమీ పోస్ట్ లో pun & satire బాగున్నాయి :)
రిప్లయితొలగించండి~Lalitha
థాంక్స్ అండీ లలిత గారు
తొలగించండిhttps://www.youtube.com/watch?v=6SMzBn3kyaY
రిప్లయితొలగించండిఇది చేసింది మీరేనా పవన్ రెడ్డి గారూ!
- శ్రవణ్
It's not me Sravan gaaru. I don't have that much talent.
తొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిదయచేసి ఇంకొకరిని ఇలా దూషించకండి
తొలగించండిపవన్ గారు,
రిప్లయితొలగించండిపైన అజ్ఞాత చేసిన వ్యాఖ్య మీరు ప్రచురించడం భావ్యం కాదండి.వ్యక్తిగత దూషణలను దయ చేసి ప్రోత్సహించకండి.
sorry for that comment from someone Madhav gaaru. I was not active in blog for past one month and I couldn't check these comments.
తొలగించండిI will delete these kind of comments immediately in future.
I think you should consider moderating the comments to filter these kind of things,
తొలగించండిI am bit new to this blogging and I don't even know about this option till now Madhav gaaru. I will see and find out how to do it.
తొలగించండిThanks for the suggestion. :)