అబ్బిగాడు: ఏమిటి సుబ్బిగా... దీర్ఘంగా ఆలోచిస్తున్నావు
సుబ్బిగాడు: ఏమి లేదు నా పేరు నలుగురి నోళ్ళలో నానాలంటే ఏమి చెయ్యాలా అని
అబ్బిగాడు: ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది
సుబ్బిగాడు: మొన్న ఒక పెళ్ళికి వెళ్తే అక్కడందరూ నన్ను మల్లమ్మ మొగుడుగానే పరిచయం చేశారు. నాకంటూ ఒక గుర్తింపు కావాలి అర్జెంటుగా
అబ్బిగాడు: పటం చిత్వా ఘటం భిత్వా
సుబ్బిగాడు: ఈ మాత్రం దానికే తిట్టాలేంట్రా
అబ్బిగాడు: తిట్టడం కాదు.. పటం చిత్వా ఘటం భిత్వా అంటే నలుగురు జనాలు ఉన్న చోట వేసుకున్న చొక్కా చింపేసుకోవడమో లేదంటే జంక్షన్ లో ఓ కుండ పగలకొట్టడమో చేసేయ్ అని..అలా చేస్తే నలుగురు నిన్ను గుర్తిస్తారు
సుబ్బిగాడు: మరీ చొక్కా చించుకోవడం బాగోదేమో .. అయినా ఈ కాలంలో కుండ ఎక్కడి నుంచి తేవాలి. ఇదంతా ఓల్డ్ ట్రెండేమో అబ్బిగా
అబ్బిగాడు: మరైతే రాఖీ సావంత్ ను ఫాలో అయిపో
సుబ్బిగాడు: ఏం చేసిందేమిటి తను.. చొక్కా చింపుకుందా
అబ్బిగాడు: చొక్కా చింపుకోవడం లాంటివి ఎప్పుడో చేసేసింది లేటెస్ట్ గా కొత్త చొక్కా కుట్టించుకొని వేసుకొంది అంతే
సుబ్బిగాడు: యేటి దానికే ఆవిడ పేరు జనం నోళ్ళలో నానుతోందా
అబ్బిగాడు:నానదా మరి నువ్వే చూడు ఆవిడ కుట్టించుకున్న చొక్కా
Funny one..:)
రిప్లయితొలగించండి