భార్యా భర్తల సంభాషణ:
భార్య: పెళ్ళికి ముందు నేనంటే ఎంత ఇంటరెస్ట్ చూపించేవాడివో?
భర్త: చేపకు ఎర వేస్తాం పడ్డాక ఇంకా ఎర అవసరం ఏముంది?
అమ్మ బిడ్డల మధ్య సంభాషణ:
బిడ్డ: ఏదో తాయిలం ఇస్తానని చెప్పావ్ అన్నం తిన్నాక .. ఏదీ ఇవ్వమ్మా
అమ్మ: అలా అయితే అన్నం తింటావని చెప్పాను. ఇప్పుడు కాదు రేపు ఇస్తాను పడుకో రాత్రి అయింది
ఇలాంటివి మన ఇంట్లో జరగడం చూస్తుంటాము. ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోనక్కరలేదు.
మేనేజర్, ఉద్యోగి మధ్య సంభాషణ:
ఉద్యోగి: ప్రమోషనో లేదంటే జీతమో పెంచుతామని చెప్పారు మీరు .. కానీ ఏది ఇవ్వలేదు
మేనేజర్: టీం లో అందరికి ఇదే చెప్పాను. నీ కంటే ఇంకొకరు బాగా పని చేశారు (సోప్ రాశారు). అందుకే నీకు ఇవ్వలేదు.
ఇలాంటివి మన ఆఫీసుల్లో జరగడం చూస్తుంటాము. ఒక్కోసారి మనము రియాక్ట్ అయి కంపెనీ మారుతుంటాము లేదా వచ్చే సంవత్సంరం వరకు మళ్ళీ ఆగుతాము ప్రమోషన్ కోసమో లేదంటే జీతం పెరుగుతుందనో.
మోడీ కి ఓటర్ కు మధ్య సంభాషణ:
ఓటర్: స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పారు
మోడీ: ఓట్లు పడటానికి సవా లక్ష చెబుతాం అవన్నీ నిజమనుకుంటే ఎలా?
ఇలాంటివి ప్రతీ ఐదేళ్ల కొకసారి చూస్తుంటాము. ఏమీ చేయలేము మళ్ళీ అయిదేళ్లవరకు వేచి చూస్తాం ఈ సారి గెలిచే పార్టీ వాళ్ళయినా ఇచ్చిన మాట నిలబడతారని. ఇదంతా షరా మామూలే.
ఓడ ఎక్కే దాకానే ఓడ మల్లయ్యలం ఎక్కి ఒడ్డు దాటేశాక ఆ ఐదేళ్లు మనం బోడి మల్లయ్యలం.
చెడ్డీ తొడుక్కుని గొడ్లు కాసే పిల్లాడి నుంచి బడ్డీ కొట్టు దగ్గర బీడీ తాగే బుల్లయ్య వరకు ప్రతి ఒక్కరూ బాబు గారిని ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించడం లేదని విమర్శించేసరికి రక్తం ఉడికిపోయి పుష్కరాలకు మోడీ ని ఆహ్వానించడమే కాకుండా అప్పటికప్పుడు ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ తీసుకురావడానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ముప్పయ్యో మూడో సారి మోడీ గారిని కలవడానికి వెళ్లారు.
తీరా అక్కడికి వెళ్ళాక మోడీ గారి P.A అపాయింట్మెంట్ ఇవ్వనన్నారు.
అసలు నేనెవరో నా రేంజ్ ఏంటో తెలియాలంటే నీకొక చిన్న పిట్ట కథ చెబుతా విను. చాలా ఏళ్ళ క్రితం నేను ట్రైన్ లో వెళ్తున్నప్పుడు అక్కడ టీ అమ్ముకుంటున్నపిల్లాడిని చేరదీసి పాలిటిక్స్ లో చేర్పించాను
పిల్లాడిని స్కూల్లో చేర్పిస్తారు గానీ పాలిటిక్స్ లో చేర్పించడమేమిటి సార్
నేనంతే ఎవరినైనా చూడగానే పట్టేస్తాను వాళ్ళు ఏ ఫీల్డ్ కు కరెక్టో. అలాగే అప్పట్లో సత్య నాదెళ్ల అనే ఒక కుర్రాడిని చూడగానే అతనికి I.T ఫీల్డ్ కరెక్ట్ అని ఒక కంప్యూటర్ కొనిచ్చా నా సొంత డబ్బులతో.
ఇంతకీ ఆ పాలిటిక్స్ లో చేర్పించిన పిల్లాడి గురించి చెప్పనేలేదు
చెప్పేదేముంది ఆ పిల్లాడైన మోడీనే నేను గైడ్ చేసి ఇప్పుడు ప్రధానిని చేశాను.
మీరూ ఆయన ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళే కదా మీరూ అప్పుడు పిల్లాడిగానే ఉంటారు కదా..మరి ఇదంతా ఎలా చేయగలిగారు.
అప్పుడు నేనూ పిల్లాడినే కానీ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా అలానే నేనూ. అంతెందుకు ఇంత వరకు ఎవరికీ చెప్పలేదు కానీ అసలు నేను మా అమ్మ కడుపులోంచే రామారావు గారి టాలెంట్ గుర్తించి లాస్ట్ మినిట్ లో 'మన దేశం' సినిమాలో చిన్న రోల్ ఇప్పించాను. ఇలా చెప్పుకుంటూ పొతే ఈ ప్రపంచం లో ప్రతి ప్రముఖుడి ఎదుగుదల వెనుక ఎదో ఒక రకంగా నా హస్తం ఉంది.
పిట్టల దొరల గురించి వినడమే కానీ చూడటం ఇదే ఫస్ట్ టైం సార్ . మీరు చెప్పిన ఈ పిట్ట కథే మోడీ గారికి కూడా చెప్పి అలాగే మీరు ఆయనను కలుసుకోవడానికి వచ్చారని చెప్పనా.
అదంతా అవసరం లేదు గాని మోడీ గారి కోసం వజ్రాలు పొదిగిన సూట్ ఒకటి తెచ్చానని చెప్పు, ఆయనే నన్ను కలుసుకోవాలని ఉత్సాహపడతారు.
మీరు చెప్పింది నిజమే సార్ అలా చెప్పగానే ఇలా మోడీ గారు మిమ్మల్ని కలవడానికి రెడీ అన్నారు.
చెప్పండి బాబు గారు ఇలా వచ్చారేమిటి?
ఈ రెండేళ్లలో మిమ్మల్నికలవడానికి నేనో 33 సార్లు వచ్చి ఉంటాను ఢిల్లీ కి .
ఈ రెండేళ్లలో నేనూ 33 దేశాలు తిరిగాను అయితే ఏంటట .. మ్యాప్ లో ఉన్న అన్ని దేశాలు తిరిగి రావాలన్నది నా కోరిక. వీలయితే చంద్ర మండలం మీదకు కూడా.
వీలయితే నా చంద్ర మండలం అదే నా ఆంధ్ర ప్రదేశ్ కు కూడా వచ్చి చూడండి మోడీ గారు. ప్రత్యేక హోదా కోసం మేము ఎంతగా తపిస్తున్నానో. పోయిన సారిలా మనీ (మట్టి నీళ్లు) తో కాకుండా ప్రత్యేక హోదా తీసుకు వస్తే బాగుంటుంది.
మాటలతో కోటలు కట్టగలిగే టాలెంట్ ఉన్నవారు మీరు అలాంటిది అమరావతి కట్టడం మీకొక లెక్కా, అయినా మీ లాంటి గొప్ప ముఖ్య మంత్రి ఉండగా ఆంధ్రాకు మళ్ళీ ప్రత్యేక హోదా అవసరమంటారా చెప్పండి.
కరెక్టే మోడీ గారూ నేను ఆంజనేయుడి లాంటి వాడిని నా బలం నాకు తెలీదు మీరు గుర్తు చేశారు. వెంటనే వెళ్లి ప్రత్యేక హోదా ఆంధ్రా కు అవసరం లేదని ప్రజల్ని నమ్మిస్తాను.
Baagaa churakalu tagilinchaaru..nice one..keep posting
రిప్లయితొలగించండిThanks for the comment Harish gaaru
రిప్లయితొలగించండి