నేను బెంగళూరు వెళ్తున్నానని తెలిసి ఇక్కడి మిత్రుడొకతను నన్ను కలిసి 'మా ఇంటివి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇస్తాను మా బాబాయికి ఇవ్వు' అన్నాడు.
అదెంత పని సరే అన్నాను.
నువ్వసలే కుండల మీది దుమ్ము రోకలితో దులిపే రకానివి జాగ్రత్తగా మా బాబాయికి అందజేయి అని చెప్పాడు.
కుందేటి కొమ్ము కూడా సాధించుకొచ్చే వాడిని నన్ను నమ్ము అన్నాను.
పులి పాలు సాధించుకు వస్తానన్నా నమ్మే వాడిని కానీ ఉండని కుందేటి కొమ్ము కూడా సాధించుకొస్తానంటున్నావ్ అదే నా భయం అన్నాడు.
అలాంటి భయాలేమి పెట్టుకోకు అని అభయమిచ్చా.
బెంగుళూరు కి వెళ్లిన మొదటిరోజు సిం కార్డు తీసుకుందామనుకుంటే ఏవేవో డాకుమెంట్స్, అడ్రస్ ప్రూఫ్ లాంటివి అడిగారు దాంతో అక్కడ ఉండే రెండు మూడు రోజులకి ఫోన్ లేకున్నా పర్లేదులే అనుకున్నాను.
మా వాడు ఇచ్చిన డాక్యూమెంట్స్ వాళ్ళ బాబాయికి అందచేద్దామని ఫోన్ చేశా మా కజిన్ ఫోన్ లోంచి
రేపు సాయంత్రం పలానా పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఉంటాను వచ్చి ఇవ్వండి అన్నాడు
మీరు ఖచ్చితంగా చెప్పిన టైం కు అక్కడ ఉండండి అంకుల్ నా దగ్గర ఫోన్ కూడా లేదు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నాను.
మరుసటి రోజు సాయంత్రం చెప్పిన టైం కన్నా పది నిముషాలు ముందుగానే పార్క్ దగ్గరికి వెళ్లాను
ఒక వ్యక్తి అప్పటికే పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాడు
మోడీ మ్యాన్లీగా ఉంటాడు అన్నాను అతని దగ్గరికి వెళ్ళి
నేను కూడా బ్రూస్లీలా ఉంటానని అందరూ అంటూ ఉంటారు యు సిల్లీ ఫెలో అని అక్కడి నుంచి కాస్త దూరం జరిగాడు నన్నో పిచ్చోడి కింద జమకట్టి
కాసేపటికి ఇంకో వ్యక్తి వచ్చి ఎంట్రన్స్ దగ్గర నిల్చున్నాడు.

నేనూ మాడా లా ఉంటానని అందరూ అంటారు అన్నాడు కాస్త తేడాగా .. ఈ సారి నేను కాస్త దూరం జరిగాను
కాసేపటికి ఇంకో వ్యక్తి వచ్చి నిలబడితే అతని దగ్గరికి వెళ్లి మోడీ మ్యాన్లీగా ఉంటాడు అన్నాను
మాయావతి కూడా అన్నాడు.
మీ నెత్తి మీద పడింది కాకి రెట్ట అన్నాను
దాన్ని కవర్ చేసుకోవడానికి నా దగ్గర ఉంది జామకాయల బుట్ట అన్నాడు
నేను కలుసుకోవలసిన బ్రోకలీ మీరేనన్నమాట
డాక్యుమెంట్స్ అందజేసే డ్రాక్యులా నువ్వేనన్నమాట .. నైస్ టు మీట్ యు అన్నాడు
ఫోన్ లో మాట్లాడుకున్నట్లే కోడ్ వర్డ్స్ అన్నీ మ్యాచ్ అవడంతో డాక్యుమెంట్స్ ఇచ్చేసాను.
'నువ్వేమయినా పాత సీక్రెట్ ఏజెంట్ సినిమాలు, కృష్ణ జేమ్స్ బాండ్ సినిమాలు ఇప్పటికీ చూస్తూ ఉంటావా' అని అడిగాడు
అర్రే భలే కనిపెట్టారే అన్నాను
మా వాడినడిగి ఫేస్బుక్ లో నా ఫోటో చూస్తే సరిపోయేదిగా .. ఈ కోడ్ వర్డ్స్ బదులు అన్నాడు.
మనిషిని పోలిన మనుషులు ఉంటారని యెన్ని సినిమాల్లో చూడలేదండి
ఖర్మరా బాబు .. ఉత్తి సినిమా పిచ్చోడిలా ఉన్నావే అని థాంక్స్ చెప్పేసి వెళ్లిపోయాడు.
అయినా ఈ వయసులో సినిమా పిచ్చి లేని తెలుగు వారు ఎవరుంటారు? మీరే చెప్పండి.
గూగుల్ లో గాలించి కొట్టుకొచ్చిన కార్టూన్...గీసిన వారికి ధన్యవాదాలు.

మీ code భాష quotable!
రిప్లయితొలగించండిThanks for the nice comment Lalitha gaaru.
రిప్లయితొలగించండి