మొన్నొక రోజు ఉదయం ఉప్మా తింటుంటే 500,1000 నోట్లు రద్దు చేశారట అంది మా ఆవిడ
ఉప్మాలో రాయి పడింది అన్నాను నేను.
ఉప్మా లో కాదు ఆవాల్లో నల్ల రాళ్లు ఉన్నట్లున్నాయ్ .. అవి పారేస్తాలే అంది
ఎందుకు పారేయడం ఏరితే సరిపోద్దిగా
ఎన్నని ఏరమంటావ్ ..దాన్నిండా రాళ్ళు ఉన్నట్లున్నాయ్. అయినా నేనొకటి మాట్లాడుతుంటే నువ్వు ఇంకేదో మాట్లాడతావేంటి అంది.
నోట్ల రద్దు పుకారు అయ్యుంటుందిలే అని ఆఫీస్ కి బయలుదేరాను.
ఆర్ట్ సినిమాల్లో ఉండే ఆర్టిస్టుల్లా ఎప్పుడూ సైలెంట్ గా ఉండే మా ఆఫీస్ వాళ్ళు కృష్ణ వంశీ సినిమాలో లాగా పని మానేసి గుంపులు గుంపులు గా చేరి ఈ నోట్ల రద్దు గురించి మాట్లాడుతుంటే అప్పుడర్థమైంది నోట్ల రద్దు నిజమేనని.
పేస్ బుక్ లో ఈ నోట్ల రద్దు పై జోక్స్ చక్కర్లు కొట్టడం మొదలెట్టాయి. అందులో నాకు బహుబాగా నచ్చిన జోక్: మోడీజీ, 500, 1000 నోట్లతో పాటు 500, 1000 ఎపిసోడ్స్ రన్ అవుతున్న సీరియల్స్ కూడా రద్దు చేయండి అని విన్నవించుకుంటున్న మొగుళ్లు.
ఇక్కడ సిడ్నీ లో కూడా దాదాపు అందరి దగ్గర కొద్దో గొప్పో ఆ నోట్లు ఉన్నాయి. వాటిని మార్చుకోవడానికి ఎవరి తిప్పలు వాళ్ళు పడుతున్నారు.
ఒకతను ఏమో తన దగ్గర ఉన్న కొన్ని నోట్లను పోస్ట్ లో పంపాను అన్నాడు.
ఇంకొందరేమో క్రిస్మస్ లీవ్స్ కు ఇండియా వెళ్తున్న వాళ్లకు ఈ నోట్లు అంటగడుతున్నారు. వాళ్ళేమో కస్టమ్స్ వాళ్ళ కళ్ళు కప్పి 20000 కంటే ఎక్కువ తీసుకెళ్ళలేము బాబోయ్ అని మొత్తుకుంటున్నారు.
ఇక నేనేమో ఇక్కడి బ్యాంక్స్ కూడా కరుణించి నోట్లు మార్చుకునే అవకాశం కల్పిస్తాయేమోనని గోతి కాడ నక్క లా ఎదురుచూస్తున్నాను.
నిన్న రాత్రి బెంగుళూరు లో ఉండే నా మిత్రుడితో ఫోన్ లో మాట్లాడుతూ మంచి రోజులు రావాలంటే కొన్నిరోజులు ఈ కరెన్సీ కష్టాలు పడక తప్పదు అన్నాను.
ఓసోస్...నీకేం అక్కడుండే వాడివి మా కరెన్సీ కష్టాలు నీకెలా తెలుస్తాయి? ప్రాణాలు కూడా పోతున్నాయి ఇక్కడ ఈ నోట్ల రద్దుతో అని పేపర్లలో వచ్చిన వార్తల గురించి ప్రస్తావించాడు.
నాన్నా! వర్షం పడుతోంది ..వేస్ట్ పేపర్స్ ఉంటే ఇవ్వు పడవ చేసుకొని ఆడుకుంటా అంది మా పాప నేను ఫోన్ పెట్టెయ్యగానే.
షెల్ఫ్ లో ఉండే బాగ్ లో కొన్ని వేస్ట్ పేపర్స్ఉండాలి తీసుకొని చేసుకోమ్మా అని చెప్పా.
ఇంతలో మా ఆవిడ భోజనానికి పిలవడంతో .. తిన్నాక ఆడుకుందువు లే చిట్టీ అన్నాను.
యాక్ కాకరకాయ చేదు, వేరే కూర చేసి ఉండచ్చుగా అంది మా పాప.
అది మొదట్లో కాస్త చేదే ఉండచ్చు కానీ పొట్ట లో పురుగులు చచ్చిపోయి కడుపు క్లీన్ అవుతుంది వచ్చి తిను అంది వాళ్ళ అమ్మ తనకు అర్ధమయ్యే పద్దతిలో నచ్చచెప్తూ.
First let me Thank You for changing the comment options.
రిప్లయితొలగించండిఅందులో నాకు బహుబాగా నచ్చిన జోక్: మోడీజీ, 500, 1000 నోట్లతో పాటు 500, 1000 ఎపిసోడ్స్ రన్ అవుతున్న సీరియల్స్ కూడా రద్దు చేయండి అని విన్నవించుకుంటున్న మొగుళ్లు.
మరప్పుడు 2000 ఎపిసోడ్ సీరియల్ మొదలైతే?
అసలైన పంచ్ వేసారుగా లలిత గారు :)
తొలగించండి