అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నారు కానీ అవన్నీ పాత కాలం మాటలు. లైంలైట్ లో ఉండాలంటే ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలి ఇప్పుడు.
శివాజీ, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఒక్కరని ఏం చెపుతాం, ఆచి తూచి మాట్లాడే చిరంజీవి కూడా లేడీస్ హాస్టల్ అనేసి ఆ తర్వాత తూచ్ నేనా ఉద్దేశ్యంతో అనలేదు అన్నాడు.
నిన్నటికి నిన్న శివాజీ .. సామాన్లు, దరిద్రపు *** అంటూ బూతులు మాట్లాడి బురద అంటించుకున్నాడు.
రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ మధ్య తరచుగా బూతులు వాడుతూ లైంలైట్ లో ఉంటున్నాడు. ఈయన కాస్త నయం, తోటి మగ నటులపైనే బూతులు మాట్లాడాడు కాబట్టి సరిపోయింది.
ఈ మధ్య చాలా మంది స్టేజి ఎక్కితే కళ్ళు తాగిన కోతులే, మత్తులో ఏదేదో వాగడం ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం. మోటు సామెత, కాకపోతే సందర్భానికి సరిపోతుందని చెప్తున్నా. "అచ్చమైన సంసారి ఉచ్చపోసి ఇల్లలికాడట" అట్లుంది శివాజీ వ్యవహారం. ఆయన చెప్పేది ఆయనకి ఒప్పు అనిపించచ్చు కానీ అదేదో కాస్త పద్దతిగా మంచి మాటలతో చెప్పి ఉంటే బాగుండేది. మొన్నా మధ్య వచ్చిన "కోర్ట్" సినిమా లోని మంగపతి క్యారెక్టర్ ట్రాన్స్ లోంచి బయటికి వచ్చినట్లు లేరు ఈ శివాజీ ఇంకా.
ఇప్పుడో చిన్న పిట్ట కథ. అనగనగా ఒక ఊర్లో ఒక పేదవాడు తన దరిద్రాన్ని వదిలించుకోవడానికి, అడిగిన వారికి కాదనకుండా సహాయం చేస్తారనే పేరున్న ఆ దేశపు రాజు గారి దగ్గరికి వెళ్ళి తనకు చేతనైనంతలో ఒక టెంకాయ సమర్పించి, కాస్త సహాయం చేయమని అర్థించాలనుకున్నాడు.
రాజుగారి దగ్గర "మహారాజా! ఈ టెంకాయను పుచ్చుకోండి, కాస్త డబ్బు ఇచ్చి నా పేదరికాన్ని పోగొట్టండి." అని అర్ధించడానికి ఏమి మాట్లాడాలో ముందుగానే ప్రిపేర్ అయ్యాడు.
రాజభవనాన్ని, రాజుగారి మందిమార్బలాన్ని, ఆడంభరాలని చూడగానే ఆ పేదవాడికి నోటా మాట పడిపోయింది. చాలాసేపు ఎదురు చూసిన రాజు గారు "నీకేం కావాలి?" అని సింహంలా గర్జించారు.
కుందేలు పిల్లలా భయపడిపోయిన ఆ పేదవాడు భయంతో, కంగారులో తడబడుతూ "మహారాజా టెంకాయ పిచ్చికొండ" అన్నాడట. అక్కడ అతను భయంతో ఒక మాట కు బదులు వేరే మాట మాట్లాడినట్లు వీళ్ళు జనాల్ని, ప్రెస్ ని చూడగానే రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా పచ్చిగా మాట్లాడేస్తారేమో.
అయినా ఇలాంటి వాటిల్లో మా దబిడి దిబిడి బుల్ బుల్ బాలయ్య తర్వాతే ఇంకెవరైనా.
వీళ్ళు స్టేజ్ ఎక్కే ముందు ఆల్కహాల్ టెస్ట్ చెయ్యాలి.
రిప్లయితొలగించండి