2, జూన్ 2016, గురువారం

బయ్యర్లకు భారమైన బ్రహ్మోత్సవం

మొన్న ఏదో వెబ్సైటు లో చదివా ఈ న్యూస్. '24' సినిమా కథతో దర్శకుడు విక్రం కుమార్ మొదట  మహేష్ బాబు దగ్గరికే వెళ్ళాడని, ఓల్డ్ getup లో  విలన్ గా తను ఆ పాత్రకు న్యాయం చేయలేనేమో  అని అలాగే  ఆడియన్స్ తనను అలా  రిసీవ్ చేసుకోరేమో అని ఇలా రకరకాల కారణాలతో  కాదన్నాడు అని ఆ తర్వాత బ్రహ్మోత్సవం కు ఓకే చెప్పాడని తెలిసింది. ఇది చదివాక  'గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట' అనే సామెత గుర్తొచ్చింది. నాకు తెలిసి బ్రహ్మోత్సవం లాంటి సినిమా చేయడం కన్నా 24 లాంటి సినిమా చేయడం మేలేమో అనిపిస్తుంది . మన హీరోలు ఇమేజ్ అనే చట్రం లో ఇరుక్కుపోయి  అవే రకమైన సినిమాలు చేస్తున్నారు. 1 సినిమా తో మంచి attempt అనిపించుకున్నాడు of course అది ప్లాప్ అయి ఉండవచ్చు. కానీ నాతో పాటు పని చేసే చాలా మంది నార్త్ ఇండియన్స్ కు ఆ సినిమా నచ్చింది. చూడమని నేనే వాళ్లకు రెఫర్ చేసాను. 

బ్రహ్మోత్సవం సినిమా కు సగానికి సగం నష్టం వచ్చిందని అన్ని వెబ్సైటు లలో ఊదరగొడుతున్నారు. అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా అన్నట్లు  ఎంత మహేష్ బాబు సినిమా అయితే మాత్రం అంత  ఖర్చుపెట్టడం అవసరమా. బయ్యర్లు కూడా పోటి పడి సినిమా ను అధిక రేట్లకు కొనేసారు. సినిమా లో ఆడాళ్ళు పచ్చళ్ళు పెట్టేటప్పుడు కూడా పట్టు చీరలు కట్టుకొని ఉంటారు విడ్డూరంగా. ఈ సినిమాలో మహేష్ బాబు అందంగా ఉన్నాడు అనేది ఎంత నిజమో సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని బడ్జెట్ అమాంతం పెంచేసారనేది అంతే  నిజం. 

 హంస నడకలు రాకపోయే - ఉన్న నడకలు మరిచిపోయే అన్న చందాన ఏదో మంచి సినిమాలు తీస్తాడు అనుకునే శ్రీకాంత్ అడ్డాల సినిమాలు రాను రాను దారుణంగా తయారవుతున్నాయి. మొన్న ముకుంద ఇప్పుడు ఈ  బ్రహ్మోత్సవం. మరీ బాడ్ సినిమా అనిపించలేదు కానీ రామాయణం లో పిడకల వేట లాగా ఏడూ తరాలు అనే కాన్సెప్ట్ అనవసరంగా ఇరికించాడు. ఏది ఏమైతేనేం  రావురమేష్ విషయం లో మాత్రం శ్రీకాంత్ అడ్డాల ను మెచ్చుకోవచ్చు అతని అద్భుతమైన నటనను బయటపెట్టే క్యారెక్టర్ ను సృష్టించినందుకు. ఇప్పటికైనా పరభాష నుంచి సహాయ నటులను, విలన్లను అరువు తెచ్చుకోకుండా రావురమేష్ లాంటి వాళ్ళను ఎంపిక చేసుకుంటే మంచిది.

నేను ఒక్కడినే టీ పెడితే బాగుంటుంది లేదా నా భార్య ఒక్కతే టీ పెడితే మరీ బాగుంటుంది. ఎప్పుడైనా ఇద్దరం కలిసి టీ పెడితే  అది కాస్తా చక్కర పాకం లాగానో లేదంటే పంచదార మర్చిపోవడం వలన కషాయం లాగానో అవుతూ ఉంటుంది. కాబట్టి too many cooks spoil the broth అన్నట్లుగా  పరుచూరి బ్రదర్స్ కూడా కథలో వేలు పెట్టేసి  సినిమాను  కిచిడి చేసేసినట్లు ఉన్నారు.

P.S : నువ్వు ఏమైనా చెప్పు ఆస్ట్రేలియా అనేదే  మన తెలుగు సినిమాలకు అచ్చిరాదు అన్నది ఇక్కడి నా ఫ్రెండ్ మూర్ఖ వాదన. ఆస్ట్రేలియా/సిడ్నీ లో తీసిన కొన్ని తెలుగు సినిమాలలో ఒక్క మగాడు, ఆరంజ్, శంఖం లాంటివి  ప్లాప్ అయ్యాయి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటివి హిట్ అయ్యాయి. బ్రహ్మోత్సవం లో కాజల్ ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్లు చెప్తారు. U.S నుంచి వచ్చినట్లు చూపించాల్సింది అన్నది వాడి వాదన.



7 కామెంట్‌లు:

  1. మీరు వాడిన సామెతలు బావున్నాయి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సామెతలే సామెతలు. బాగుంది.

      తొలగించండి
    2. థాంక్స్ అండీ లలిత గారు మరియు శ్యామలీయం గారు. ఏవైనా తప్పులు లాంటివి కనిపిస్తే సరిదిద్దగలరు.

      తొలగించండి
  2. 'పచ్చళ్ళు పెట్టేటప్పుడు పట్టుచీరలు' ..... :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను అంతగా గమనించలేదండి..ఏదో ఫ్లో లో అలా రాసేసినట్లు ఉన్నాను. థాంక్స్ అండీ కామెంట్స్ రాసినందుకు

      తొలగించండి
  3. గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట,
    అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా
    సినిమా లో ఆడాళ్ళు పచ్చళ్ళు పెట్టేటప్పుడు కూడా పట్టు చీరలు కట్టుకొని ఉంటారు విడ్డూరంగా
    హంస నడకలు రాకపోయే - ఉన్న నడకలు మరిచిపోయే
    రామాయణం లో పిడకల వేట
    మీ పోస్ట్ కు సామెతలకు సన్మానం అని నేను పేరు పెడుతున్నాను

    too many cooks spoil the broth


    రిప్లయితొలగించండి
  4. హేమ కుమార్ గారు సామెతలన్నీ okka chota consolidate చేసినందుకు థాంక్స్

    రిప్లయితొలగించండి