25, జులై 2016, సోమవారం

ముఖ్యమంత్రి ఇంకొకరి కాళ్ళు పట్టుకున్నట్లు కార్టూన్ వేయడం ఎంతవరకు సమంజసం?

ఒకానొక గ్రేటెస్ట్ పేరున్న వెబ్ పత్రికలో చంద్రబాబు కాళ్ళ బేరానికి వచ్చాడు అన్నట్లు ఒక ఆర్టికల్ రాసి అందులో ఆయన ఒకరి కాళ్ళు పట్టుకున్నట్లుగా కార్టూన్ వేశారు.

ఛా! ఏంటి ఇంత చెత్తగా జర్నలిజం తయారైందా అని బాధ కలిగింది. ఆయన సవాలక్ష తప్పులు చేసి ఉండవచ్చు కానీ మెజారిటీ జనం ఆయనకి ఓటు వేసి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఆయనకి వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు కనీసం ఆయన ప్రస్తుత పదవిని గుర్తుపెట్టుకొని అయినా గౌరవం ఇస్తే మంచిది. 

నా కిష్టమైన ఒక పెద్ద హీరో ఇంకొకరి కాళ్ళు పట్టుకున్నట్లు కార్టూన్ వేసినా నేనంత బాధపడేవాణ్ణి కాదు ఎందుకంటే రీల్ లైఫ్ లో అతనొక హీరో అంతే తప్ప రియల్ లైఫ్ లో ప్రజలెన్నుకున్న బాధ్యతా పదవిలో లేరు కాబట్టి. 

ఆంధ్ర తరపున ఆయనొక representative, మన కుటుంబంలో ఒక పెద్ద మనిషి లాంటి వాడు అలాంటి హోదా గల వ్యక్తి ని ఇలా ఇంకొకరి కాళ్ళు పట్టుకున్నట్లు కార్టూన్ లో వేయడం నాకైతే నచ్చలేదు. ఆయనే చాలా సార్లు అని ఉంటారు నా కోసం మా పార్టీ కోసం పాటుపడుతున్న కార్యకర్తలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను అని.  ఆయనే అలా అన్నాడు కదా అని మొత్తం వాళ్ళ పార్టీ కార్యకర్తల కాళ్ళు పట్టుకున్నట్లు కార్టూన్ వేస్తే బాగోదు కదా. అంతెందుకు మీ కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నా నోటితో తీస్తా అని K.C.R గారు అన్నారు కదా అని అలాగే ఒక కార్టూన్ వేస్తే ఏం  బాగుంటుంది చెప్పండి. 

కార్టూన్ కదా సరదాకి తీసుకోవాలి అని ఎవరైనా నాకు సుద్దులు చెపితే నేనేమి చేయలేను. 

ఎవరు తప్పు చేసినా ఉతికి ఆరేసే బాధ్యత పత్రికలది ముఖ్య మంత్రి అయినా ప్రధాని అయినా దీనికి అతీతులు కాదు. పత్రికలూ ఉన్నదే ఎవరైనా తప్పులు చేస్తే ఎత్తి చూపి విమర్శలు గుప్పించడానికి, అంతే కానీ ఇలాంటి అడ్డగోలు కార్టూన్స్ వేయడానికి కాదని నా అభిప్రాయం.  బ్లాగ్స్ రాయడం లో బచ్చాని అయిన నాకు అనిపించిన మూడు ముక్కలు మీ ముందుంచాను తప్పైతే విజ్ఞులైన మీరు మన్నించాలి. 

నేను రాసే ఈ అల్లాటప్పా బ్లాగ్ లోనే ఏదైనా రాస్తే ఎవరినైనా కించపరిచినట్లు అవుతుందేమో అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను అలాంటిది ఒక బాధ్యతాయుతమైన పత్రికా యాజమాన్యం ఇలాంటివి ఎలా అనుమతిస్తోందో మరి. 

P.S: నేను తెలుగు దేశం పార్టీ సపోర్టర్ నో లేక చంద్ర బాబు గారి అభిమానినో కాదు. ఒక వేళ జగన్ గారు సి.ఎం గా ఉండి ఆయన మీద ఇలా ఒక కార్టూన్ వేసినా కూడా నేను ఇలాగే రియాక్ట్ అయ్యేవాడిని. 






13 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. http://d2na0fb6srbte6.cloudfront.net/read/imageapi/clipimage/882842/aeb3fb1f-48c6-4a48-8aa7-7acf03b1d172

      తొలగించండి
    2. మీ కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నా నోటితో తీస్తా అని ఖ్.ఛ్.ఋ గారు అన్నారు కదా అని అలాగే ఒక కార్టూన్ వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి.

      మీడియాలో కేసీఆర్ మీద కార్టూన్ వేసే దమ్ముందా ఎవడికైనా.TV9,ABN ల గతి ఏమైందో తెలియదా ? పదవిలోకి వచ్చిన మర్నాడే మీడియా నోరు నొక్కేసారు. ఒక ముఖ్యమంత్రికి అవమానం జరిగింది అంటే ప్రజలంతా ఫీలయ్యే రోజులు ఎన్‌టీఆర్ మీద చెప్పులువేసిన నాడే పోయాయి.ఈ (తొక్కలో) ముఖ్యమంత్రులంతా ఎన్ టీ ఆర్ కాలిగోటికి కూడా సరిపోరు.ఎవరు చేసుకున్న ఖర్మ వారు అనుభవించవలసిందే !

      బాధ్యతాయుతమైన పత్రికా ?
      పేరులో గ్రేట్ ఉందికదా అని గ్రేట్ పత్రిక అని మీరు ఫీలవుతున్నారా ? ఆ పత్రికకీ జిలేబీ గారి పద్యాలకీ తేడా లేదు.అమెరికాలో ఉండే తెలుగువాళ్ళూ,పద్యాలు వ్రాయడం వచ్చిన పండితులు మాత్రమే చదువుతారు.

      P.S: నేను తెలుగు దేశం పార్టీ సపోర్టర్ నో లేక చంద్ర బాబు గారి అభిమానినో కాదు. ఒక వేళ జగన్ గారు సి.ఎం గా ఉండి ఆయన మీద ఇలా ఒక కార్టూన్ వేసినా కూడా నేను ఇలాగే రియాక్ట్ అయ్యేవాడిని.

      రాహు(కా)ల్ గాంధీ అంటే నేను చాలా ఫీలయ్యాను మరి !

      తొలగించండి
    3. Thanks for the Comments Niharika gaaru and Jai gaaru.
      నీహారిక గారు, రాహుకాల గాంధీ సారీ రాహుల్ గాంధీ విషయం లో క్షమించేయండి :)

      జై గారూ మీరన్నట్లు ఆ కార్టూన్ చెత్తగానే ఉంది విషయ పరంగా క్వాలిటీ పరంగా

      తొలగించండి
    4. "రాహుకాల గాంధీ సారీ రాహుల్ గాంధీ విషయం లో క్షమించేయండి"

      ఉన్నదున్నట్లు రాసిన మీరెందుకు సారీ? అయినా ఒకరు ఫీలయ్యారని మీరు ఫీలయ్యేట్లయితే అలా ఫీలవుతూనే ఉండాలి మీరు. ఫీలవకండి :) ఫీలయ్యింది ఫీలయ్యినట్లు నిజాయితీగా రాస్తూనే ఉండండి.

      తొలగించండి
    5. మీ కామెంట్స్ కు సంతోషమండీ.
      రాహుల్ గాంధీ విషయం లో నీహారిక గారు ఫీల్ అయ్యాను అన్నది జోక్ గా అన్నారు అనుకుంటానండి.

      తొలగించండి
  2. 100% మీతో ఏకీభవిస్తాను పవన్ గారు. ఎన్నుకున్న నాయకుడి మీదే గౌరవం లేకపోతే ఎలాగా ? మరీ సోషల్ మీడియా వచ్చాక ఇలాంటివి ఎక్కువయ్యాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ ది కామెంట్స్ చంద్రిక గారూ

      తొలగించండి
  3. స్వాతంత్ర్యం వచ్చాక నాయకులమీద గౌరవం పోయింది అని అనడం కరెక్టేమో ? బానిసత్వం ఉన్నా కలిసిమెలిసి ఉన్నారు.సోషల్ మీడియా వచ్చాక అమ్మలక్కలూ,కొబ్బరిచిప్పల బ్యాచ్ కూడా తెలిసీతెలియకుండా రాజకీయాలు మాట్లాడగలుగుతున్నారు.అదొక్కటే తేడా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈనాటి చాలా మంది జర్నలిస్ట్ ల కంటే వాళ్ళే చాలా బెటర్ లేండి నీహారిక గారు.

      తొలగించండి