9, జులై 2016, శనివారం

రిజర్వేషన్ గోల

అవి బాగా బతికున్న రోజులు అంటే I.T ఫీల్డ్ లో కాకుండా స్కూల్ లో ఉన్నరోజులు.

ఛ ఈ రిజర్వేషన్ లతో పెద్ద చావొచ్చి పడిందిరా అన్నాడు మా రమేష్

అవునురా నిజమే నేను ఇబ్బంది పడ్డాను ఈ రిజర్వేషన్ తో

సరే పద దీని మీద ధర్నా చేస్తున్నారు మనమూ వెళ్లి సపోర్ట్ చేద్దాం అంటూ కదిలాడు

అటు వైపేందుకు రైల్వే స్టేషన్ వైపు వెళ్ళకుండా ఓహ్..భాషా బజ్జీ ల షాప్ దగ్గరికా .. రెండు పొట్లాలు ఎక్కువే తీసుకెళదాం తింటానికి పనికొస్తాయి ధర్నా మధ్యలో

ఎప్పుడూ తిండి గోలేనా

తిండి కలిగితే కండ కలదోయ్  కండ కలవాడే మనిషోయ్ అన్నారుగా గురజాడ

ఇలాంటివి మాత్రం భలే గుర్తుపెట్టుకుంటావ్ సమర్థించుకోవడానికి

మరి అటు వైపెందుకు వెళ్తున్నావ్ రైల్వే స్టేషన్ ఇటు వైపు ఉంటే

మాటి మాటికీ రైల్వే స్టేషన్ అంటావ్ అక్కడేం పనిరా

ధర్నా చేస్తుండేది అక్కడ కాదా మరి

అక్కడెందుకు చేస్తారు .. కలక్టరేట్ దగ్గర చేస్తున్నారు

రైల్వే స్టేషన్ దగ్గర కాకుండా అక్కడెందుకు చేస్తున్నారు

నీ రైల్వే స్టేషన్ గొడవేమిట్రా

మొన్న మేము తిరుపతి కి ట్రైన్ లో వెళ్ళినప్పుడు రిజర్వేషన్ చేసుకోలేదు అందుకే ఇబ్బంది పడ్డాము . ఈ రైల్వే లో రిజర్వేషన్  తీసేస్తే ఏ బాధా ఉండదు కదా అందుకే ఆ ధర్నా రైల్వే స్టేషన్ దగ్గర చేస్తున్నారేమో అందుకే అటు వెళదాం అన్నాను

ఏడ్చినట్లే ఉంది నీ తెలివి .. నేను మాట్లాడేది క్యాస్ట్ రిజర్వేషన్  ల గురించి

అదేం రిజర్వేషన్ ?

లోక జ్ఞానం లేదురా  నీకు

లోకా వాళ్ళ గురించి నాకెందుకు తెలీదు ఆ రెడ్డి వాళ్ళుండేది మా వీధిలోనే వాళ్ళఅమ్మాయి గురించి వాళ్ళ అమ్మ నాన్న కన్నా నాకే ఎక్కువ తెలుసు. అంతే కాదు వాళ్ళింట్లో ఉండే ప్రతి ఫ్యాక్షనిస్ట్ లు, ఫెమినిస్టులు కూడా తెలుసు నాకు.

ఫ్యాక్షనిస్ట్ లు సరే ఫెమినిస్టులు వాళ్ళింట్లో ఉండటమేమిట్రా ?

అన్నీ తెలుసంటావ్ ఫెమినిస్టులు తెలీదా

తెలుసు గానీ వాళ్ళింట్లో ఫెమినిస్టులు ఏమిటి అని

వాళ్ళది ఫ్యాక్షన్ ఫ్యామిలీ కదా మగవాళ్ళనైతే ఫ్యాక్షనిస్ట్ లు అంటారు అదే ఆడాళ్ళనైతే ఫెమినిస్టులు అంటారు ఆ మాత్రం తెలీకపోతే ఎలారా

ఖర్మ నిన్ను మార్చడం ఎవరి వల్లా కాదు

ఎందుకు కాదు .. రమణ సారు మార్చాడుగా నన్ను ..  ఏడో తరగతి నుంచి ఐదవ తరగతికి  

4 కామెంట్‌లు:

  1. గూగులమ్మ ఒక్క పేరయితే ఒప్పుకోదు కనుక నేను ఇదివరకు నీహారికా నాయుడు అని పేరు పెట్టుకున్నాను.నాయుడు అని పేరుపెట్టుకున్నావు కాబట్టి నువ్వు రిజర్వేషన్ల గురించి (వ్రాయ)మాట్లాడకూడదు అని బెదిరించారు.బెదిరిస్తే బెదిరిపోయే టైప్ కాదుకానీ నాయుళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నారని తెలిసి నాయుడు పీకిపడేసి నీహారికనే తెలుగులోనూ ఇంగ్లీష్ లోనూ పెట్టుకున్నాను.ఫెమినిష్టులను (భానుప్రియ స్టైల్లో)అర్ధంచేసుకోరూ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరన్నది నిజమండి నీహారిక గారు. ఈ రిజర్వేషన్ అన్నదే పెద్ద రొచ్చు.

      తొలగించండి
  2. వాళ్ళ అమ్మానాన్నల కంటే ఎక్కువ తెల్సా ? ☺👌 Lol

    రిప్లయితొలగించండి
  3. ఏదో సరదాకి అంతే :) ఉన్నదున్నట్లు రాస్తే ఎవరూ చదవరు కదా మేష్టారు

    రిప్లయితొలగించండి