12, జనవరి 2023, గురువారం

మరో ఫ్రాక్చర్ స్టోరీ

చంద్రుని మీద:

స్టార్టింగ్ సీన్ లో చంద్రుని మీద లాండ్ అవుతాడు నాసా లో పనిచేసే నసీర్.  

అక్కడ గుడారాలు వేసుకొని అమెరికా మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదుల మీద ఒక చేత కత్తి మరో చేత సుత్తి పట్టి ఒక భీభత్సమైన ఫైటింగ్ సీన్. 

చంద్రుడి మీద నీరు ఉందో లేదో తర్వాత విషయం, రక్తం మాత్రం ఏరులై ప్రవహిస్తోందని మా శాటిలైట్స్ కనిపెట్టాయి అని రష్యా ప్రపంచానికి తెలియచెప్పింది ఈ లోగా. 

ఆ తర్వాత అక్కడే చందమామ మీద నసీర్ తన అభిమానులతో కలిసి ఒక ఇంట్రడక్షన్ సాంగ్  

మా బ్లడ్డు బ్రీడు వేరే 

మా ఫుడ్డు బ్రెడ్డు మీ ప్రేమే  

మా బ్లడ్ బ్రదర్స్ మీరే 

మీకిక మిగిలేది గాడిద గుడ్డే 


వైట్ హౌస్ లో :

అమెరికన్స్ మన హీరోని అభినందించి ఒక పార్టీ ఏర్పాటు చేస్తారు. అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ గా విజయశాంత్ అని మన తెలుగువాడే ఉంటాడు. అతను మన హీరో దగ్గరికి వెళ్ళి అమెరికాలో ఉగ్రవాదులని ఏరివేసి నీ కర్తవ్యం నెరవేర్చావు, కానీ ఇండియా లో నువ్వు చెయ్యాల్సిన పని ...... అని చెప్పబోతూ ఆగిపోతాడు. 

చెప్పండి, మీరేదో నా దగ్గర దాస్తున్నారు. 

చెప్తాను విను నడిపి సింహా రెడ్డి 

వాడెవడు?

అది నీ పేరే, శత్రువుల కంట పడకుండా నీ అసలు పేరు అయిన నడిపి సింహా రెడ్డి ని నసీర్ గా మార్చాము. మీది సీమలో చంద్రమూరి వంశం. మీకు ఆ సూర్యమూరి వంశానికి పడదు. 


అదే సోది ఫ్లాష్ బ్యాక్ 

అప్పట్లో మీ నాయనమ్మ గారే ఆ ఊర్లో వైద్యులు, ఆ సూర్యమూరి వంశస్తుడి ప్రాణం నిలబెడితే "పగవారు నిలబెట్టిన ప్రాణం ఉంటే యెంత పోతే యెంత" అని అప్పుడే వచ్చిన ఇంద్ర సేనా రెడ్డి సినిమా చూసి తన ప్రాణం తానే తీసుకున్నారు. 

ఆ తర్వాత అప్పుడెప్పుడో వచ్చిన ఎమ్మెస్ రెడ్డి, కేవీ రెడ్డి, సమర సింహా రెడ్డి, రాజ శేఖర్ రెడ్డి, జయ ప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి , జగన్మోహన్ రెడ్డి , ఎ  రెడ్డి, బి రెడ్డి , జెడ్ రెడ్డి అని ఫాక్షన్ సినిమాలన్నీ చూసేసి ఈ సీమ లో ఎవరూ కత్తి పట్టకూడదు రక్తపాతం చిందకూడదు అని నరుక్కు చచ్చారు. చివరికి మీ వంశంలో మిగిలిన ఒకే ఒక్క వంశోద్ధారకులు, వారసులు, అరిసెలు, జిలేబీలు, జాంగ్రీలు, వడలు, పకోడాలు అన్నీ మీరే బాబు. 

చివరికి చంపడానికి మీ వంశస్తులు లేక, ఆ సూర్యమూరి వంశస్తులు కత్తులు పట్టడమే మానేశారు. దాంతో తరతరాలుగా కత్తులు చేసేవారు, కత్తులు నూరేవారు తినడానికి పట్టెడన్నం దొరక్క 'అలో  స్విగ్గీ' అంటూ పీజ్జాలు, బర్గర్లు ఆర్డర్ చేసుకొని తింటున్నారు. 


లక్ష్యం 

అయితే నేను మా ఊరికి వెళ్ళి నా కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిందే విజయశాంత్. 

వద్దు బాబూ వద్దు ఏదో పొరపాటున ఈ వైట్ హౌస్ లో మాన్షన్ హౌస్ ఎక్కువ తాగేసి నిజం చెప్పేశాను. కావాలంటే ఈ అమెరికన్ ప్రెసిడెంట్ పదవి రాసిస్తా, అసలు ఈ పదవే మీ వంశం పెట్టిన భిక్ష, మీరు ఇక్కడ ఉండటమే మీకు రక్ష, ఎందుకు బాబూ ఈ కక్ష్య. 

ఇకపై నా లక్ష్యం నాసా లో చంద్రుడు, సూర్యుడు, కక్ష్య కాదు, సీమలో మా చంద్రమూరి వంశ రక్ష, ఆ సూర్యమూరి వంశానికి శిక్ష. 

అట్నే గానీ బాబు. శానా సేపు ఎమోషన్ నడిసినాది, ఎంటర్టైన్ మెంట్ కోసం ఒక ఐటెం సాంగ్ ఏర్పాటు చేసినా , మీరు డాన్స్ చెయ్యాల్సిందే. 

ఐటెం సాంగ్ 

నా పేరు జారు మిఠాయి

పుట్టిందేమో బొంబాయి 

నేనిపుడే ఊరుతున్న ఊరగాయి 


నేనొక రాలుగాయి 

వాయిస్తా నీ సన్నాయి 

ఆపై నంజుకుంటా నిన్నమ్మాయి  

సీమలో కత్తులు తయారు చేసే కాలనీలో: 

ఇక మీరు పస్తులతో పడుకునే టైం ముగిసిపోయింది, ఇకపై రకరకాల డిజైన్స్ లో కత్తుల తయారీని మొదలుపెట్టండి. ఈ కత్తుల పరిశ్రమే కాదు మరే పరిశ్రమని మన ఆంధ్రా దాటి వెళ్లనివ్వను. ఆకలేస్తే అమృతాంజనం, జలుబు చేస్తే జండూబామ్ తింటున్న మీరు ఇకపై రోజూ బిర్యానీ తినేలా చేస్తా. 

"మరి బాత్రూములు ఎవడు కట్టిస్తాడు? మీ బాబా?" అప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ ఇద్దరు 

అవును మా బాబే, ఈ సారి పదవిలోకి వచ్చేది మా బాబే, అప్పుడు కట్టిస్తాడు పేదలకు బాత్రూములు, ఈ లోగా అడ్డొచ్చిన వారికి కట్టేస్తాను సమాధులు. 

అది మీ నాన్న తరం కూడా కాదు 

తెలుగు జాతి కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది మా నాన్న, అలాంటి మా నాన్న ఊసెత్తిన నీ కుత్తుకని రపరపా రంపంతో కోసేయ్యకపోతే నేను చంద్రమూరి వంశస్తుడనే కాదు. 

అంటే నువ్వు మా అన్న నడిపి సింహా రెడ్డి వా?

అవును తమ్ముళ్ళు , మీరెవరు?

నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాం అన్నా ఇన్నాళ్లు. నేను కుసిర్ వీడు ఎసిర్. 

అవేం పేర్లు, తేడాగా ఉన్నాయే?

మేము పుట్టగానే నీకు కుడిభుజంగా ఉండాలని కుడి సింహా రెడ్డి, తమ్ముడు ఎడమ భుజంగా ఉండాలని ఎడమ సింహా రెడ్డి అని బొడ్డు కూడా కోయకుండానే పేర్లు పెట్టేసారు మా ఇంట్లో వాళ్ళు. కానీ మీరు లేని టైం చూసి మమ్మల్ని బానిసలని చేసి వాళ్ళు మా పేర్లను ఇలా మార్చేశారు. 

తెలుగు తమ్ముళ్ళారా,  ఇక సహించేది లేదు, ఇష్టమొచ్చినట్లు పేర్లు, ఊర్లు మారిస్తే ఊరుకునేది లేదు. నేను రంగం లోకి దిగనంతవరకే వార్ టూ సైడ్, దిగానంటే వన్ సైడే. కంటి చూపుతో శాసిస్తా, పంటి కొనలతో నమిలేస్తా, కత్తి వేటుతో నరికేస్తా.  ఇకపై మనదే రాజ్యం పదండి ముందుకు. 

జై బాబయ్య జై జై బాబయ్య 

14 కామెంట్‌లు:

  1. ఇక్కడ ఆకాశం నుంచి ఊడి పడ్డ వాళ్ళు ఎవరూ లేరు.
    అందరూ అమ్మ కడుపు నుంచి జారి పడ్డ వాళ్ళే.

    అయినా సింహాలు, వంశాలు అని రంకెలు ఎందుకో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందుకేగా వాళ్ళ బ్లడ్డూ బ్రీడ్ వేరనేది బోనగిరి గారు

      తొలగించండి
  2. అల్లో అల్లో అల్లో, ఏమయిపోయారు ఇన్ని రోజులూ? మొత్తం రెడ్డిమయం చేసి ఓ పోస్ట్ పెట్టారా ఇవాళ, రెడ్డి గారూ 🙂? మీలో మంచి టేలెంట్ ఉందండీ 👌

    ఈ ఫ్యాన్స్ ఆగడాలు మరీ మితిమీరుతున్నాయండీ. ఇవాళ అమెరికాలో ఓ ధియేటర్లో ఫాన్స్ రచ్చ భరించలేక ధియేటర్ యాజమాన్యం షో ఆపేసి, జనాల్ని బయటకు తోలేశారని తాజా వార్త.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతా మీ అభిమానం మేష్టారు.

      స్కూల్ సమ్మర్ హాలిడేస్ కదా, ఒక పది రోజుల ట్రిప్ వెళ్లివచ్చాం అలా ఒక రెండు రాష్ట్రాలు చుట్టొద్దామని. ఇక మిగిలిన రోజులు పిల్లలతో టెన్నిస్, స్మిమ్మింగ్ అంటూ బిజీ బిజీ గా గడిచిపోతున్నాయి.

      అదీ మన మాస్ కున్న పవర్ అని మన హీరోలు మీసం మెలేస్తారుగా ఈ విషయాలని చూపి

      తొలగించండి
  3. బాబయ్య సినిమా కాంట్రాక్ట్: నా సినిమాలో నటించే నటీనటులంతా నా కన్నా వయసులో చాలా చిన్నవాళ్ళై ఉండాలి. నా పాత్ర మట్టుకు సినిమాలో ఆ నటీనటులకి తమ్ముడిగానో, అల్లుడుగానో, కొడుకుగానో, మనవడుగానో నటించేలాగా ఉండాలి.

    రిప్లయితొలగించండి
  4. బాపట్ల బాబయ్య గురించి విపులంగా తెలియజేసారు. ధన్యవాదాలు. మరి ఇజీనారం ఈరయ్య గురించి కూడా ఇలాగే రాస్తారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈరయ్య గురించి రాయడానికేమీ లేదిక కాంత్ గారూ, దుకాణం సర్దేసుకోవాల్సిన సమయం దగ్గర పడింది. నాకు తెలిసి ఈరయ్య క్రేజ్ బాబయ్య కంటే తగ్గినట్లే అనిపిస్తోంది గత రెండు సినిమాలు చూస్తే.

      తొలగించండి
    2. ముసలోళ్ళకి సంక్రాంతి పండుగ అంటే ఇదే!!!

      తొలగించండి
  5. సంక్రాంతి పండుగకు ' వీర ' బాదుడు. తాత హీరోలు మీకో నమస్కారం.

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. బాగుంది మీ ఆవేదన శ్యామలీయం గారు.

      ముసలి హీరోల సినిమాలు థియేటర్ కి వెళ్ళి చూడటం మానేశాను. క్రికెట్/స్పోర్ట్స్ చూడటం మానేసి పదేళ్ళు దాటిపోయింది, ఆడటం బెస్ట్ అని తెలుసుకున్నా చూసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే. ఇక రాజకీయాలకు ఆమడ దూరం.

      తొలగించండి