బాహుబలి-1 కి బాహుబలి-2 కి బాగా గ్యాప్ వచ్చినా పర్లేదు కానీ నువ్వు రాసే ఈ ప్లాట్ నెంబర్ 62 సిరీస్ కి ఇంత గ్యాప్ వస్తే ఎవరికి గుర్తుఉంటుందబ్బాయ్ అని మీరు అనుకుంటుంటారు కానీ తప్పలేదు కాస్త పని ఒత్తిడి వలన తరచూ రాయలేకపోతున్నాను.
ఆ ఎక్కడ ఉన్నాం? తిరుపతి లో మిర్చి బజ్జి తింటూ, టీ తాగుతున్నాం కదా!
కొత్త చెప్పులు కొనాలి షాప్ కి వస్తావా అని మా చిన్ని భయ్యా అడిగితే వెళ్ళొద్దని చెప్పాను కదా అని వాళ్ళ ఊరికి వెళదామని పిలిస్తే మాత్రం వెళ్లడం మానకండి. ఆప్యాయతకు, ప్రేమకు కేర్ అఫ్ అడ్రస్ అయిన మా చిన్ని వాళ్ళ అమ్మను నాన్నను కలిసే అవకాశం మీరు మిస్ అయినట్లే.
గుండె నాలుగు గదులంటారు కదా ఆ నాలుగు గదుల్లో వారి ఆప్యాయతను నింపుకొచ్చాను వారింటికి వెళ్లిన 4 సార్లలో. ఇక నింపుకోవడానికి ఖాళీ లేదనేమో ఇంకో సారి వెళ్లే అవకాశం నాకు దొరకలేదు :(
ఏంటి కళ్ళలో నీళ్ళొచ్చేశాయా..రావా మరి, మిర్చి బజ్జి తింటే, మరీ ఇంత సున్నితమైన మనుషులైతే ఎలాగండీ? కళ్ళు సరిగ్గా తుడుచుకొని చూడండి మా సుబ్బు, చంద్ర లని. ఒంటి బరువు తక్కువుండటం వలన మామూలుగానే కంటికి సరిగా కనపడరు మా ఈ జంట మిత్రులు. కనీసం 10 గ్రాములైనా పెరగాలని తెగ అవస్థలు పడుతుంటారు ఇద్దరూ. తమిళనాడు లో పుట్టవలసిన వాళ్ళు ఆంధ్రా లో పుట్టారు అంత అభిమానం వీరికి రజనీ కాంత్ అంటే.

స్వాతి, ఆంధ్ర జ్యోతి లాంటి పుస్తకాలు మాత్రమే తెలిసిన మాకు క్షమించాలి నాకు, ఎందుకంటే మా శీను భయ్యాకి 'చిలక', 'మేనక' లాంటి అద్భుతమైన(?) పుస్తకాల నుంచి 'దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు' 'ఇనుప కచ్చడాలు' లాంటి తాపీ ధర్మారావు గారి పుస్తకాల వరకు చాలా జ్ఞానం ఉండేది అది వేరే విషయం. (ఇళ్ళు కట్టడమే కాకుండా ఖాళీ సమయాల్లో ఇలా పుస్తకాలు కూడా రాసేవాడు కాబోలు అని అనుకునేవాడిని అతని పేరులోని 'తాపీ' ని చూసి)
అలా ఏవో స్వాతి, ఆంధ్ర జ్యోతి, జ్యోతి చిత్ర, సితార వంటివి కాకుండా ఏవేవో పుస్తకాలు (నాకు తెలిసి చస్తేగా మీకు ఖచ్చితంగా చెప్పడానికి) ఉండేవి అతని దగ్గర. వాటిని తూకం వేస్తే మాత్రం అతనికి రెట్టింపు బరువు తూగుతాయని ఖచ్చితంగా చెప్పగలను. పదండి రూమ్ కెళ్ళి మీ కళ్ళతో మీరే చూద్దురు గాని.
ఇక మా చంద్ర గురించి చెప్పాలంటే నేను రాముడనుకుంటే తను లక్ష్మణుడు. ఇక్కడ నేను రాముడినని చెప్పుకోవడం కేవలం మా చంద్ర గొప్పతనాన్నితెలియజేయడానికి మాత్రమే సుమా. అలాంటి అనుబంధం మాది.
ఇక మా చంద్ర గురించి చెప్పాలంటే నేను రాముడనుకుంటే తను లక్ష్మణుడు. ఇక్కడ నేను రాముడినని చెప్పుకోవడం కేవలం మా చంద్ర గొప్పతనాన్నితెలియజేయడానికి మాత్రమే సుమా. అలాంటి అనుబంధం మాది.
పదండి ఎగ్-365 చేశాను డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం
ఎగ్-65 గురించి విన్నాను గానీ ఈ ఎగ్-365 ఏమిటా అని ఆశర్యపోతున్నారా? అది మామూలు ఎగ్ బుర్జీ నే, కాకపొతే సంవత్సరం లో 365 రోజులు మేము అదే తింటాము కాబట్టి దానికి ఆ పేరెట్టాను అంతే.
అలా తిని తినీ నాకు గుడ్డు మేనియా తో పాటు గుడ్డో ఫోబియా కూడా పట్టుకుంది.
మళ్ళీ ఇదేమిటంటారా? ఇలా ప్రతి రోజూ రెండు పూటలా గుడ్డు తింటూ ఉంటే ఏదో ఒక పూట నేనే కోడి లాగా గుడ్డు పెట్టేస్తానేమో అని భయపడుతూ ఉంటాను. దీన్నే గుడ్డో ఫోబియా అని నామకరణం చేసాను లెండి.
మాతృదేవోభవ,
పితృదేవోభవ,
ఆచార్యదేవోభవ,
గుడ్డుదేవోభవ
అని గుడ్డు ను కూడా అందులో కలిపి తీరాల్సిందే. ఈ మాటను 90% బ్యాచ్ లర్స్ ఒప్పుకుని తీరతారు అని నా గట్టి నమ్మకం (ఒప్పుకోని ఆ 10% మంది గుడ్డు తినని వాళ్ళు అయి ఉండచ్చు అని నా అంచనా) . కాబట్టి కుల దైవం లాగా మా లాంటి యువ కుల దైవం ఈ గుడ్డు.
ఇక మేము తిరుపతి లో ఉండటం వలన ఏదో ఒక రకంగా తిరుమల నుంచి లడ్డు వచ్చేది. ఎంతగా తిన్నామంటే లడ్డు అనే పేరు విన్నా విరక్తి కలిగేటంతగా. ఏదో ఫలహారం తిన్నట్లుగా ప్రతి రోజూ తినేవాళ్ళము (హి...హి...హి..ఏదో రకంగా ఈ పోస్ట్ టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చేశా)
అందరి గురించి చెప్పి మరో రూమ్ మేట్ అయినా మా మను గురించి చెప్పలేదు కదా. "అసలు అదృష్టం ఉండాలంటే పెట్టి పుట్టాలి అంటారు" కదా అలాంటి వాడే మా మను ...చూశారా మనం ఇంతలా మాట్లాడుతున్నా కూర్చునే నిద్రపోతున్నాడే తనే మా మను, మరి అంతటి అదృష్టం ఎవరికీ దొరుకుతుందండీ?
ఏమిటి? బాగా బోర్ కొట్టించానా, దమ్ము కొడదామనుకుంటున్నారా, దయచేసి మా రూమ్ బయటికి వెళ్ళి దమ్ము కొట్టి రండి. ఎందుకంటే రూమ్ లో మేమింతమంది ఉన్నా ఏనాడూ సిగరెట్, మందు, పేక లాంటి దురలవాట్లను, బలహీనతలను మా రూమ్ లోకే కాదు, అసలు మా జీవితాల్లోకి కూడా జొరబడనీయలేదు. అదే మాకు, మా రూమ్ కు ఉన్న విశిష్టత.
అలాగని మాకే బలహీనత లేదనుకోకండి, ఉంది అదేమంటే ఒక్కసారి మేము ప్రేమించడం మెదలెట్టామంటే విపరీతంగా ప్రేమ పెంచుకుంటాం అది సినిమాలైనా, ఇష్టపడ్డ వ్యక్తులైనా.