30, జనవరి 2019, బుధవారం

బ్లడీ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్

బిజీ ఏం లేదు నాన్నా, ఇప్పుడే రూంకి వచ్చా.. నువ్వు ఫోన్ చేశావు.   

అదేరా, డబ్బులు?

నెల నెలా పంపిస్తున్నట్లు నిన్న కూడా ఇరవై వేలు పంపించానుగా నా జీతం లోంచి, ఇంకేం?

జీతం డబ్బులేవో ఈ నెల నుంచి పదివేలు పెరిగాయని పార్టీ ఇచ్చావటగా మన సుబ్బు గాడు చెప్పాడు

అయితే ఇప్పుడేమంటావ్?

పది వేలు నువ్వొక్కడివే ఏం చేసుకుంటావ్, అందులోంచి 8 వేలు పంపరా, అమ్మకు మందులు, పంటకు పురుగుల మందులు కొనాలి. 

ఈ వయసులో ఇప్పుడా నష్టాలొచ్చే వ్యవసాయం చేయకపోతే వచ్చే నష్టమేమి నాన్నా? 

నువ్వే అన్నావు గదరా వ్యవసాయం అని అందులోనే సాయం ఉందిరా, కష్టమో, నష్టమో ఈ రైతులు ప్రపంచానికి చేస్తున్న సాయమే ఈ వ్యవసాయం. 

అయినా ఇప్పుడా సాయం అదే వ్యవసాయం చేసి ఎవరిని ఉద్దరించాలని?

అందరూ అలా అనుకుంటే తినడానికి కరెన్సీ కట్టలు తప్ప కూడు ఉండదురా కొడకా

సరే పంపిస్తాలే, అన్నిటికీ అన్నీ చెబుతావ్, నువ్వు చదువుకోలేదు కానీ లోకాన్ని బాగా చదివావ్, నీతో ఏం మాట్లాడగలను, అమ్మ కి ఫోన్ ఇవ్వు. 

ఏంటి డ్యూడ్ ! మీ డ్యాడా, డబ్బు పంపించమంటున్నాడా? ఈ బ్లడీ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ మారదు బ్రో, ఎంతసేపూ పిల్లలను బాగా చదివించి వాళ్ళ డబ్బు మీద బతికేయాలనుకుంటారు ఓల్డ్ అయ్యాక, అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే ఇలా వాళ్ళ పిల్లల నుంచి మనీ అస్సలు expect చెయ్యరు తెలుసా?

ఏరా అబ్బి, బాగున్నావా? ఏమన్నా తిన్నావా లేదా?

తిన్నాను కానీ, నీకేదో బాలేదంట. 

మీనాయన అట్లే చెబుతాడులేరా, ఎప్పుడూ ఉండే కాళ్ళ నొప్పులే, అవి మందులు మాకులతో పోవు, నాతోనే పోవాల, టైం కు తింటా ఉండు, జాగ్రత్త.  

సరే అమ్మ, ఉంటా మరి. 

                                      *****************************

నాకు ఫోన్ చేసింటే బస్సు స్టాండ్ కి వచ్చి బైక్ లో పికప్ చేసుకునేవాడ్నిగా నాన్నా?

పర్లేదు లేరా, మీ రూమ్ దగ్గరేగా బస్టాండ్ నుంచి, అందుకే నడిచే వచ్చేశా. 

అమ్మ బాగుందా?

బాగుంది, ఇదిగో నీకోసం తినడానికి యేవో పంపించింది.  

ఈ వయసులో అమ్మ ఇలా కష్టపడకపోతేనేం నాన్నా, కాళ్ళ నొప్పులు పెట్టుకొని. 

దానికి నీ మీద ఉన్న ప్రేమ, దాని కాళ్ళ నొప్పుల్ని మరిపించేస్తుందిరా. అది సరే గానీ, ఉద్యోగం ఏమన్నా దొరికినాదిరా ?

లేదు నాన్న, రెసిషన్ కదా, ఎక్కడా జాబ్స్ దొరకట్లేదు. 

సరే ఈ డబ్బు ఉంచరా, ఖర్చులకు ఉంటది. 

వద్దులే నాన్నా, నేనే ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటాను. మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది. 

ఇది నువ్వు పంపించిన డబ్బు లోదేలేరా. 

ఖర్చయిపోలేదా? తోటకి, ఇంటి రిపేర్లకు ఖర్చులున్నాయని అని అన్నావ్?

లేదురా, ఇన్నేళ్లు ఎవరి ముందు చెయ్యి చాచకుండా నిన్ను చదివించి ఈ జీవితాన్ని ఇలా నెట్టుకొచ్చాను, ఇప్పుడు మాత్రం నీ ముందు చెయ్యి ఎలా చాచుతాననుకున్నావురా? నా తిప్పలేవో నేను పడ్డాను, నీ డబ్బులు అస్సలు ఎప్పుడూ వాడాలనుకోలేదు.  

మరి నెలా నెలా డబ్బులెందుకు పంపమనేవాడివి?

ఈ కాలం కుర్రాళ్ళు పార్టీలని, ఫ్యాషన్లని డబ్బంతా వృధా చేస్తారని భయపడి, ప్రతీ నెలా నీ దగ్గరి నుంచి అడిగి తీసుకొని, నా పేరు మీద బ్యాంక్లో వేసేవాడిని, నేను సీనియర్ సిటిజెన్ ని కదా నా పేరు మీద వేస్తే కొంచెం వడ్డీ ఎక్కువస్తది. అలా అప్పుడు దాచిన సొమ్మే ఇప్పుడు నీకు ఉపయోగపడుతోంది.  

హే డ్యూడ్! ఈయనేనా మీ డాడ్? 

అవును బాబూ, ఆ బ్లడీ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్  ఉన్నవాడిని నేనే, రూపాయికి రూపాయి కూడబెట్టి బిడ్డల బాగు కోసం మిగలబెట్టాలని ఆశ ఉన్న ఇండియన్ తండ్రిని, కట్టె కాలేవరకు ఈ బ్లడీ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ మారదు. ఇంతే మేమింతే. 

                                        ****************************

ఎప్పుడూ యేవో కబుర్లే రాస్తుంటాను కదా అందుకని, నా స్కూల్ కాదని తెలిసీ 'కథ' ఒకటి రాయడానికి పూనుకొని చివరికి ఏదో రాసేసాను దీన్ని మరి 'గిథ' అనో 'గాథ' అనో అనచ్చేమో 😊.  

నా కొలీగ్ అయిన ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి 'బ్లడీ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్' అంటూ ఉంటుంది ఎప్పుడూ, సో ఆ పాయింట్ మీద ఒక కథ రాయాలని అనుకొని ఏదో గెలికేశాను. నచ్చితే మెచ్చుకోండి 😊, నచ్చకపోతే హెచ్చరించండి ⚠️ఇక ముందు ఇలాంటివి రాయకుండా ఉండటానికి 😭 

29 కామెంట్‌లు:

 1. నాకు నచ్చిందండి మీ కథ. ఇంకా ఇంకా రాయండి. రాయగా, రాయగా రాగాలూరు మీ కథలు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ ఎంకరేజిమెంట్ లలిత గారు

   తొలగించండి
 2. >>>ఏంటి డ్యూడ్ ! మీ డ్యాడా, డబ్బు పంపించమంటున్నాడా? ఈ బ్లడీ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ మారదు బ్రో, ఎంతసేపూ పిల్లలను బాగా చదివించి వాళ్ళ డబ్బు మీద బతికేయాలనుకుంటారు ఓల్డ్ అయ్యాక, అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే ఇలా వాళ్ళ పిల్లల నుంచి మనీ అస్సలు expect చెయ్యరు తెలుసా?

  హే డ్యూడ్! ఈయనేనా మీ డాడ్?

  అవును బాబూ, ఆ బ్లడీ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ ఉన్నవాడిని నేనే, రూపాయికి రూపాయి కూడబెట్టి బిడ్డల బాగు కోసం మిగలబెట్టాలని ఆశ ఉన్న ఇండియన్ తండ్రిని, కట్టె కాలేవరకు ఈ బ్లడీ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ మారదు. ఇంతే మేమింతే. >>>>

  పై రెండు పేరాలూ ఎవరు ఎవరితో అన్నారో స్వగతమో తెలియటం లేదు. మెసేజ్ మాత్రం బాగుంది. బాగా వ్రాసారు కానీ మీగురించే వ్రాసినట్లనిపిస్తుంది ఎందుకో ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. స్వగతం కాదండి నీహారిక గారు, ఏదో అలా రాసేసాను అంతే. మెసేజ్ నచ్చినందుకు ధన్యవాదాలు.

   తొలగించండి
  2. పై రెండు పేరాలు ఎవరు ఎవరితో అన్నారో చెప్పలేదు మీరు.

   తొలగించండి
  3. 'డ్యూడ్' అన్న డైలాగులు ఆ అబ్బాయితో కలిసి ఉన్న రూమ్ మేట్ వి.


   ఏమైనా clarity మిస్ అయిందంటారా? ఇంకొంచం క్లియర్ గా రాసి ఉంటే బాగుండేదేమో?

   తొలగించండి
  4. ఆ అబ్బాయి నాన్నతో ఫోన్ లో మాట్లాడుతున్నపుడు అమ్మకి ఫోన్ ఇవ్వు అన్నాడు, ఈ లోపల ఫ్రెండ్ అన్న మాటలు అతని నాన్న విన్నాడన్నమాట !

   తొలగించండి
 3. కథ చాలా బాగా వచ్చింది. "నచ్చితే మెచ్చుకోండి. నచ్చకపోతే ...." అంటూ అదేదో సినిమాలోని మోహన్ బాబు తరహా డైలాగ్ చెప్పకండి 🙂. కథ నిజంగా బాగుంది.

  మీ కథలాంటి దాన్ని పోలిన షార్ట్ ఫిల్మ్ ఒకటి నాకు నచ్చింది ఉంది. "మా నాన్న" అనే పేరుతో ప్రముఖ సినీనటుడు ఎల్.బి.శ్రీరాం 2017 లో తీసిన he"art" film. కాస్త తేడా ఉంటుంది కానీ ఇంచుమించుగా మీ కథలాంటిదే. తండ్రి మనస్సు మీద ప్రధాన ఫోకస్ పెట్టి బాగా తీశారు. ఈ క్రింది లింక్ లో చూడచ్చు 👇.
  మా నాన్న

  మీ సహోద్యోగి అయిన ఆ "నార్త్ ఇండియన్ అమ్మాయి"కి రేపు తన పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ దృష్టిలో తనది కూడా " 'బ్లడీ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్' " అనుకునే రోజు వస్తుందేమో, ఎవరు తెలుసు?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ......... రోజు వస్తుందేమో, డబ్బు విషయంలో కాకపోయినా అనేక ఇతర అంశాల గురించి ?

   తొలగించండి
  2. ఎల్. బి శ్రీరామ్ గారు షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తున్నారంటే షార్ట్ ఫిల్మ్స్ కు మంచి రోజులు వచ్చాయనే అనిపిస్తోంది. తప్పకుండా చూస్తాను ఆ షార్ట్ ఫిల్మ్ నరసింహా రావు గారు.

   ఇక ఆ అమ్మాయి, అమ్మ అయిన తర్వాత అర్థం చేసుకుంటుందేమో మీరన్నట్లు.

   తొలగించండి
 4. మీ కొలీగ్ "నార్త్ ఇండియన్" అమ్మాయి అని ప్రత్యేకించి రాయడం దేనికి? బ్లడీ సౌత్ ఇండియన్ మైండెసెట్ కాకపోతే!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అంత వివక్ష ఏమీ లేదండీ సూర్య గారు నాకు, మీ లాంటి వాళ్లే కాదు కదా ఇక్కడ నాతో పనిచేసేవాళ్ళు కూడా అడుగుతారుగా ఎవరు అలా అన్నది అని, అందువల్ల అలా మెన్షన్ చేశాను కానీ, నాకు అటువంటి వివక్ష లేదు. మరీ మీకు అంత ప్రత్యేకంగా కనిపించి ఉంటే క్షమించాలి.

   చదివి కామెంట్స్ పెట్టినందుకు ధన్యవాదాలు.

   తొలగించండి
  2. సూర్య గారు జోకినట్లున్నారు లెండి పవన కుమారా. అయినా నార్త్ ఇండియన్ల సంగతి తెలిసినదేగా, సూర్య గారూ? ఇండియన్ జాగ్రఫీలో ఓనమాలు కూడా రాని ఉత్తర భారతదేశస్థులు దక్షిణాది మొత్తాన్ని "మద్రాసు" అంటుంటారు, దక్షిణాత్యులందరినీ కట్టగట్టి "మద్రాసీలు" అంటుంటారు. వాళ్ళూ, వాళ్ళ "బ్లడీ" నార్త్ ఇండియన్ మైండ్ సెట్ 🙂🙂.

   తొలగించండి
  3. మీరు చెప్పారంటే ఓకే, నాకంటే లోకాన్ని బాగా చదివినవారు, పెద్దవారు (అనే అనుకుంటున్నాను, అన్ని విషయాల మీద మీకున్న knowledge ని బట్టి) ఇక ఆ మాటకు తిరుగేముంది. మీరన్నట్లు అది జోక్ కాకపోయినా ఇప్పటి యూత్ పరిభాషలో లైట్ తీసుకోవడమే.

   తొలగించండి
  4. విన్నకోట వారు పడోసన్ సినిమా మరిచి పోలేదనుకుంటా. నేను ఢిల్లీలో మూడేళ్ళున్నాను, ఆ తరువాత కూడా డజన్ల సార్లు వెళ్లాను. మద్రాసీ అనే పదం ఎవరూ వాడినట్టు ఎక్కడా వినలేదు, కనలేదు.

   తొలగించండి
  5. చేతన్ భగత్ వ్రాసిన "టూ స్టేట్స్" చదివారా ? మద్రాసీ అని కొడుకుని పెళ్ళి చేసుకోవద్దని చెపుతుంది. తెలబాన్ లు అని అనడం అయినా విన్నారా ?

   తొలగించండి
  6. నేను ఆ పుస్తకం చదువలేదు కానీ అందులో సదరు అమ్మాయి తమిళులన్నట్టు వినికిడి. Even if the book uses the term "Madrasi" it is about Tamils, not *all* south Indians.

   పుస్తకాలలో రాసినవి & సినిమాలలో చూపించినవి నిజ జీవితానికి అన్వయించగలమా? ఇందిరా గాంధీ చిక్కమగళూరు & మెదక్ నుండి పోటీ చేసారు: ఆవిడకు ఇవి మద్రాసు కాదని తెలీదని నమ్మడానికి నేనయితే సిద్ధంగా లేను.

   తెలబాన్లు అన్న పదం వాడింది ఉత్తరాది వారు కాదు కనుక ఇది అప్రస్తుత ఉదాహరణ.

   తొలగించండి
  7. @ జై గారు
   మొదటి సంగతి, నేను “పడోసన్” సినిమా చూడలేదు (మెహమూద్ నటించినదేనా?). దక్షిణాది వారిని అంత ఎగతాళి చేసిన సినిమా చూడడానికి నా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి అనే పట్టుదలతో. మెహమూద్ చాలా వేషాలు వెకిలి హాస్యమేలెండి.

   రెండవ సంగతి ... నార్త్ ఇండియన్స్ గురించిన నా అభిప్రాయం సినిమాలు చూసి, పుస్తకాలు చదివి ఏర్పరుచుకున్నది కాదు. స్వయంగా చూసినది. నేను బెనారస్ లో మూడేళ్ళు ఉన్నాను. మద్రాసీలు అనడమే నేను విన్నది .... విద్యార్థులే కాక లెక్చరర్స్ కూడా. వారి జాగ్రఫీ (ఇండియన్) పరిజ్ఞానం ఏపాటిదో నేను ప్రత్యక్షంగా చూసినదే. అందువల్ల ఎవరి అనుభవాలు వారివి. ఇందిరా గాంధీ లాంటి విశిష్టవ్యక్తి మాట వేరు.

   ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల వలన కొంత మంది ఉత్తరాది వారికి అవగాహన కాస్త పెరిగి ఉండచ్చు.

   తొలగించండి
  8. విన్నకోట వారూ,

   నేను ఢిల్లీలో ఉన్నప్పుడు (సాఫ్ట్ వేరు యుగం కంటే ముందే) & ఉత్తరాదిలో తిరిగినప్పుడు నాకెప్పుడూ ఇటువంటి వారు తారసపడలేదు. మీ అనుభవం వేరేలా ఉంది, bad luck.

   జాగ్రఫీ తెలీకపోవడంలో అన్ని ప్రాంతాలు సమానమే అన్నది నా స్వానుభవం.

   మహమూద్ పడోసన్ సినిమా దాదాపు మక్కీకిమక్కీ తెలుగులో (పక్కింటి అమ్మాయి) తీసారు, సూపర్ హిట్ అయింది కూడా. అదేదో మలయాళం సినిమా తెలుగులో రీమేకు చేసి దేనైకయినా రెడీ అంటూ నాలుగయిదు కులాలను ఎగతాళి చేయడం ఈ మధ్యనే చూసాం. సినిమాల రంగంలో ఇటువంటి పైత్యాలు ఎప్పుడు తగ్గుతాయి ఏమో!

   తొలగించండి
  9. తెలబాన్లు అంటే ఏమిటో కాస్త ఎవరైనా చెప్పండి. తాలిబన్లు అనే మాట విన్నా కానీ ఈ మాట ఎపుడూ వినలేదు.

   తొలగించండి
  10. ఫలానా( ) వారివల్లే మేము వెనకబడి ఉన్నాము, విడిపోతే తప్ప మేము బాగుపడము అనేవాళ్ళందరూ తెలబాన్లే !

   తొలగించండి
 5. //“పెద్దవారు (అనే అనుకుంటున్నాను, ...)”// 🤔
  వయసులో .. ఎస్. జ్ఞానంలో .... తెలియదు. థాంక్స్ ఎనీవే. సరే, అది వదిలెయ్యండి గానీ ఎల్.బి.శ్రీరాం గారి “మా నాన్న” షార్ట్ ఫిల్మ్ చూశారో లేదే, నచ్చిందో లేదే చెప్పనేలేదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చూశానండి చెప్పడం మర్చిపోయాను, చాలా బాగుంది కానీ, స్లో నరేషన్ కాబట్టి ఈ జనరేషన్ వాళ్లకు నచ్చుద్దో లేదో. ఇదే కాదు కానీ మిగతావి కూడా చూశాను, బాగున్నాయి. నేనింకా ఆయన కేవలం నటించారేమో అనుకున్నాను గానీ కథ, డైరెక్షన్ కూడా కూడా ఆయనే.

   తొలగించండి
 6. రిప్లయిలు
  1. ఎన్నాల్లకెన్నాల్లకు మీ నుంచి కామెంట్ చూస్తున్నా, థాంక్స్ ఫర్ the comments Hema Kumar గారు

   తొలగించండి
 7. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  రిప్లయితొలగించండి