24, మార్చి 2022, గురువారం

RRR Review - బాక్సాఫీస్ బద్దలే

 RRR టికెట్స్ బుక్ చేద్దామని సైట్ ఓపెన్ చేస్తే 28$ అని వెక్కిరించింది. మొన్న 20$ పెట్టి భీమ్లా నాయక్ చూసొచ్చాము, ఇప్పుడు ఈ సినిమాని ఆస్ట్రేలియా వరకు 1.5 మిలియాన్ డాలర్లు పెట్టి డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి రికవరీ కోసం టికెట్ రేట్స్ ఎక్కువ పెట్టారని తెలిసింది. మా టికెట్స్ వరకు ఓకే గానీ మా పిల్లలు ఈ సినిమాలు చూడరు ఆ డబ్బు మాత్రం కృష్ణార్పణం అనుకోవాల్సిందే. మాకు నలుగురికి కలిపి 125$ దాకా సమర్పించుకోవాలి అవసరమా అనిపించి నెక్స్ట్ వీక్ టికెట్ రేట్స్ $25 కి తగ్గిస్తే వెళదాం లేదంటే ఇంకో 3 నెలల తర్వాత టీవీ లో చూద్దాం అని డిసైడ్ అయ్యాం. 

"ముష్టి మూడు డాలర్ల కోసం మూడు రోజులు సినిమా చూడటం వాయిదా వేస్తావా, టికెట్ రేట్స్ తగ్గించకపోతే OTT కి వచ్చినప్పుడు టీవీ లో చూస్తావా? అసలు థియేటర్ లో చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు థియేటర్ లో చూడకపోయినా వచ్చే నష్టం లేదు ఏదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వి కాబట్టి చూసావు సరే. ఒకప్పుడు ఎవడు, వన్ నేనొక్కడినే లాంటి సినిమాలకు 35$ ఖర్చు పెట్టి మరీ వెళ్ళావు మరి ఇప్పుడు నీలోని సినిమా ప్రేమ తగ్గిపోయిందా?అసలు RRR లాంటి సినిమాలు థియేటర్ లోనే చూడాల్సిందే అని నీకు తెలీదా" అని నా లోని సినిమా ప్రేమికుడు రాత్రి కలలోకి వచ్చి క్లాస్ పీకితే జ్ఞానోదయమై ఉదయాన్నే పిల్లలను స్కూల్ లో దిగబెట్టివచ్చి నీ పని కావాలంటే సాయంకాలం చేసిపెడతా, ఓ నాలుగు గంటలు నన్ను వొగ్గేయి దొరా బాంచన్ నీ కాల్మొక్కుతా అని మా బాస్ ని ఉదయం స్టాండప్ కాల్ లో బతిమాలుకొని టికెట్స్ బుక్ చేసేసుకొని మా ఆవిడతో పాటు 10 గంటల షోకి వెళ్ళిపోయాను. 

నాలాంటి సినిమా ప్రేమికులు చాలా మంది ఉన్నారని అర్థం అయింది థియేటర్ లోనికి వెళ్ళగానే. సినిమా మొదలవగానే షరా మామూలే విజిల్స్ కేకలు, మా ఊర్లో థియేటర్ లో చూసిన ఫీలింగ్ కలిగింది. 

అబ్బో, బాణానికి బాంబును జోడించి వదలడాలు, సైన్స్ పాఠాలు మొత్తం తప్పు అని నిరూపిస్తూ రాజమౌళి ఇద్దరు హీరోలతో సినిమాలో చేయించిన విన్యాసాలు పెద్ద స్క్రీన్ లో చూసి తీరాల్సిందే. ఎన్ని ఇంగ్లీష్ సినిమాల లోంచి కొట్టుకొచ్చాడో ఒక్కొక్కరు బయట పెట్టి ట్రోలింగ్ చేస్తారేమో రాజమౌళి ని త్వరలో.  తన గ్యాంగ్ తో బ్రిటిష్ వారి కోటలోకి చొరపడే సీన్లో అడవి మృగాలతో కలిసి ఎన్టీఆర్ ట్రక్ లోంచి దూకే సన్నివేశం అయితే ఫాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. 

మొదటి సగం ఇద్దరు హీరోల ఫ్రెండ్ షిప్ తో ఇంటరెస్టింగ్ గా నడిస్తే, రెండవ సగం కాస్త స్లో అయినా సినిమా పూర్తయ్యేసరికి పెట్టిన డబ్బులకు, సమయానికి సరైన న్యాయం చేసి పంపిస్తారు రాజమౌళి. ఒక టైం లో ఫైటింగ్స్ గట్రా కాస్త మితిమీరినట్లు అనిపిస్తాయి గానీ కాస్త ఓపికపడితే ప్రాబ్లెమ్ ఏమీ లేదు. మాస్ క్యారెక్టర్ కాబట్టి సినిమాలో తక్కెడ కాస్త ఎన్టీఆర్ వైపే తూగినట్లు అనిపిస్తుంది, ఇక చరణ్ నటనలో ఇంప్రూవ్ అయ్యాడో లేక నేనే అలవాటు పడ్డానో తెలీదు గానీ మరింత నచ్చేశాడు.  చరణ్ ని అల్లూరి సీతా రామరాజు గా ప్రొజెక్ట్ చేయడానికి పెట్టిన కొన్ని లీడ్ సీన్స్ ఫోర్స్ గా అనిపిస్తాయి. ఇంతకి మించి చెబితే స్పాయిలర్ అయ్యే ప్రమాదం ఉంది. 

మొత్తానికి సినిమా అయితే బంపర్ హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సినిమా లో ఎమోషన్ బాగా పండింది. మొదటి సీన్ తో మొదలయ్యే ఎమోషన్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, రాజమౌళి సినిమాలకి మిగతా డైరెక్టర్స్ సినిమాకి అదే తేడా. 

ఇక అజయ్ దేవగన్, శ్రీయ, అలియా భట్ వీళ్ళంతా మెరుపు తీగలే. సినిమా మొత్తం హీరోలిద్దరే కనపడుతూ ఉంటారు. 

The StoRy

The WateR

The FiRe

అని సినిమా స్టోరీ అంతా నీటిని, నిప్పును బాగా వాడుకున్నాడు ఇద్దరు హీరోలను రెప్రజెంట్ చేస్తూ.

23, మార్చి 2022, బుధవారం

ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్

125 సంవత్సరాల స్వామి శివానంద గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం నిజంగా సంతోషించదగ్గ విషయం. నిన్న మాత్రమే ఈయన గురించి మొదటి సారి విన్నాను, నాకు పెద్దగా లోక జ్ఞానం లేకపోవడం ఒక కారణం కావచ్చు.

కాకపోతే ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్ గా నైనా ఇతని గురించి విని ఉండాలి కదా, అది కూడా జరగలేదే అని గూగుల్ చేస్తే రిజల్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. 

ఈ స్వామి శివానంద వారి బర్త్ డేట్ ని ధ్రువపరిచే సర్టిఫికెట్స్ లేకపోవడం లాంటి వాటి వలన ఇతన్ని 'ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్' గా రికార్డ్స్ లో ఉంచలేదా అని నా అనుమానం. 

గిన్నీస్ రికార్డ్స్ ప్రకారం ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్ ఒక జపనీస్ వ్యక్తి అని చూపుతోంది. 



ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్ ఇన్ ఇండియా అని చూస్తే స్వామి శివానంద గారిని చూపెడుతోంది. అంటే ఇండియా 'వరల్డ్' లో లేదా ఏమిటి??



రామాయణం లో పిడకల వేటలా ఏమిటీ చచ్చు ప్రశ్నలు అంటారా? ఊరికే, సమాధానం ఎవరికైనా తెలిసి ఉండచ్చేమో అని ఇలా పోస్ట్ చేయడం అంతే.