12, మార్చి 2020, గురువారం

కోవిడ్-19

ఈ మధ్య బాగా వైరల్ అయిన వైరస్ కరోనా అని అందరికీ తెలిసిందే. కాకపోతే కరోనా అనే పేరు గల వ్యక్తులు ఉండచ్చు కాబట్టి వారిని relate చేసినట్లు ఉండకూడదు అని 'CORONA' , 'VIRUS' , 'DISEASE' లోని మొదటి పదాలు కలుపుకొని, దానికి ఈ కరోనా ఏ సంవత్సరం లో మొదలైందో ఆ సంవత్సరాన్ని అనగా (2019) ని కలుపుకొని COVID-19 గా పిలుచుకుంటున్నారు.

కొన్ని సార్లు న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా, టీవీ చూడకపోతే మంచిది అనిపిస్తోంది, అనవసరమైన అపోహలు మొదలవుతున్నాయి.  మొన్న ఇలాగే సిడ్నీ లో కూడా 2 వారాలు షాప్స్ అన్నీ మూసేస్తారట అక్కడెక్కడో మూసేసినట్లు.. అని సొసైల్ మీడియా లో వార్త  స్పీడ్ గా స్ప్రెడ్  అవడం ఆలశ్యం అంత కంటే స్పీడ్ గా ఇండియన్ షాప్స్ లో ఎప్పటి నుంచో అమ్ముడుపోక ఎక్సపెరీ డేట్ కు దగ్గరలో ఉన్న సరుకంతా కూడా ఖాళీ.

ఇంపోర్ట్ సరుకు అంతా ఆగిపోతుందట. ఈ వార్త చాలు, దెబ్బకు టాయిలెట్ టిష్యూ పేపర్స్ అన్నీ ఖాళీ అవ్వడానికి, అదే జరిగింది ఇక్కడ సిడ్నీ షాప్స్ లో.  Kleenex  కంపెనీ వాళ్ళు మేము 24 గంటలు పని చేసి అయినా ఈ టిష్యూ పేపర్స్ డెలివర్ చేస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చినా వినకుండా స్టాక్ మొత్తం కొనడానికి షాప్స్ మీద పడి కొట్టుకున్నారు జనాలు. 


కొందరేమో ఒక ఇంగ్లీష్ ఆవిడ తన పుస్తకం లో దీని గురించి ఎప్పుడో రాసారు సంవత్సరంతో సహా అంటారు. మరొకరేమో మన పోతులూరి వీర బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు ఇలాంటి మహమ్మారి వస్తుందని అంటారు. 

సోషల్ మీడియాలో అయితే మీరు ఇలా చేస్తే ఈ వైరస్ వ్యాపించదు అని బోలెడు సలహాలు ఇస్తున్నారు. ఏది ఏమైతేనేం మన ప్రాచీన పద్దతులు ఈ వైరస్ వ్యాప్తి ని అడ్డుకుంటాయి అని అంటున్నారు కాబట్టి అదీ మన మంచికే, పాటిస్తే మంచిదే. కరచాలనం కంటే నమస్కారం మంచిది అన్నది అలాంటిదే.  కరచాలనమా, ఇదేదో సైన్స్ లో వచ్చే తెలుగు పదంలా ఉందే అని అనిపించచ్చు తెలుగు తెలియని వారికి, దీన్నే Handshake అంటారు మన తెలుగులో.

ఈ కరోనా దెబ్బ వల్ల లాభపడ్డవారిలో ఈ టిష్యూ కంపెనీ పేపర్ ప్రొడక్ట్స్ వాళ్ళు, షాప్స్ వాళ్ళే కాదు అప్పుడెప్పుడో పదేళ్ళ క్రితం విడుదల అయిన హాలీవుడ్ సినిమా నిర్మాత కూడా లాభపడ్డాడట. ఆ సినిమా పేరు కంటేజియన్, అల్ మోస్ట్ అటో ఇటో ఇలాంటి వైరస్ ను బేస్ చేసుకుని తీసిన కథే కావడం వల్ల ఆ సినిమాకు ఇప్పుడు లాభం చేకూరింది, అందరూ తెగ చూస్తున్నారట. 

మా కొలీగ్ ఒకతను వెకేషన్ పేరుతో ఒక నెల లీవ్ పెట్టి వాళ్ళ దేశంతో పాటు కొరియా లాంటి దేశాలు కూడా వెళ్ళొచ్చాడు, ఇప్పుడు తిరిగొచ్చి 2 వారాలు సెల్ఫ్-ఐసొలేషన్ పేరుతో ఇంట్లోంచే పని చేస్తున్నాడు. కాకపోతే అసలు విషయం ఏమిటంటే అతని సిమ్ కార్డు పని చేయట్లేదట. కేవలం మెయిల్స్ మాత్రమే access చేయగలడట. అంటే రెండు వారాలు ఎక్స్టెండెడ్ లీవ్ అన్నమాట :)

Work From Home అంటే మొన్న సోషల్ మీడియా లో సర్క్యూలేట్ అవుతున్న జోక్ గుర్తొచ్చింది,  తెలుగులోకి అనువదించాను నవ్వొస్తే నవ్వుకోండి. 

నేను నా భార్య కరోనా వైరస్ వల్ల ఇంట్లో నుంచి ఆఫీస్ కి కనెక్ట్ అయి వర్క్ చేస్తున్నాం.  మా చావు కరోనా వైరస్ చేతిలో లేదు,  మా ఇద్దరి చేతిలోనే ఉందనే విషయం మొదటి రోజే అర్థమైంది. 

ఈ Work From Home మీద మరో జోకు కూడా బాగా సర్క్యూలేట్ అవుతోంది. 

డియర్ H.R, నాకు కరోనా వైరస్ ఉందని అనుమానం కాబట్టి  ఒక 20 రోజులు  పెయిడ్ లీవ్ ఇవ్వండి, లేదంటే ఆఫీస్ కి వస్తాను. 

దానికి  రిప్లై ఇలా వచ్చింది H.R నుంచి 

డియర్  ఉద్యోగి, దయచేసి మీరు తప్పక ఆఫీస్ కి వచ్చి పని చేయండి. ఎందుకంటే ఉద్యోగులందరికీ  ఇంటి నుంచి పని చేయమని చెప్పాము. 

ఒకప్పుడు పక్కన ఎవరైనా తుమ్మితే 'చిరంజీవ' అనేవారు ఇప్పుడేమో 'థూ! నీ యవ్వ'  పక్కకెళ్ళి తుమ్ము అంటున్నారు, ఏం చేస్తాం అంతా కరోనా మహమ్మారి  మాయ.