27, డిసెంబర్ 2018, గురువారం

అభిమానం వెర్రి తలలు వేస్తోందా?

నిన్నటి నుంచి వాట్సాప్ లో ఒక మెసేజ్ తెగ తిరుగుతోంది, 'వినయ విధేయ రామ' సినిమా ఆడియో ఫంక్షన్ కి వెళ్లిన అభిమానులకు తగినన్ని పాసులు ఇవ్వకపోవడం వల్ల, ఎక్కడెక్కడి నుంచో హైదరాబాదు చేరుకున్న అభిమానులు నిరుత్సాహం తో నిరాశ చెందారు  అని.

అది చదివాక ఎవరికైనా మనసులో అనిపించే ఒకే ఒక మాట 'బుర్ర తక్కువ వెధవల్లారా, వాడెవడో హీరో ఆడియో ఫంక్షన్ కు మీరు ఎగేసుకొని వెల్లడమేమిట్రా' అని. 

అభిమానం ఉండచ్చు ఎంతవరకు అంటే మహా అయితే మొదటి రోజు సినిమా చూసే వరకు, లేదంటే ఏ హీరో అయినా మీ ఊరు వస్తే అతన్ని చూడటానికి వెళ్లడం వరకు.

సినిమా అభిమానులు:

నేను టెన్త్ చదువుతున్నప్పుడు నా మిత్రుడు ఒకడు ఉండేవాడు, ఆడు అరివీర భయంకర కరడు గట్టిన చిరంజీవి అభిమాని. రాత్రి పూట ఫాన్స్ షో చూసొచ్చి రెండున్నర గంటల సినిమాని ఐదు గంటల సేపు చెప్పేవాడు. రిక్షావోడు సినిమా కూడా పెద్ద హిట్టు అని వాదించే అతి మూర్ఖపు అభిమాని. 

అల్లాంటివాడు అభిమాన సంఘం అదీ ఇదీ అని చెప్పి వాడి చదువంతా నాశనం చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ నాన్నవాడికో బట్టల కొట్టు పెట్టిస్తే మళ్ళీ అభిమానం అనే పేరుతో 'స్నేహం కోసం' సినిమాని థియేటర్ లో నూరురోజులు ఆడించడానికి వీడి జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టి అప్పుల పాలై జీవితం అంతా నాశనం చేసుకున్నాడు.  

ఇతననే కాదు ఇంకొంత మంది అభిమానం అనే వెర్రితో సినిమా హీరోల బ్యానర్ లు కట్టడాలు, పాలాభిషేకాలు, ఒకే సినిమాను థియేటర్ లో పది సార్లు చూడటం లాంటివి చేసి వాళ్ళ సమయాన్ని, డబ్బునే కాక జీవితాలను కూడా నాశనం చేసుకుంటారు. 

ఇంకొంచెం ఓల్డ్ జనరేషన్ అభిమానులు అయితే దూడ పేడ వేయడం ఆలస్యం, దాన్ని గోడ మీదున్న ఆపోజిట్ పార్టీ హీరో పోస్టర్ మీదకు చేర్చేసేవారు.  అదో రకం వెర్రి.

వరదలు, భూకంపాలు లాంటి విపత్తులు సంభవించినప్పుడు, ఈ అభిమానులు స్పందించి చేతనైనంత సహాయం చేస్తుంటారు. ఈ విషయంలో వీరిని అభినందించాల్సిందే. 

రాజకీయ  అభిమానులు:

రాష్ట్రం లో ఇంకే సమస్య ఉన్నా పట్టని 'కత్తి మహేష్, శ్రీరెడ్డి, రాం గోపాల్ వర్మ'  లాంటి మేధావి వర్గం (!!?)  అప్పుడప్పుడూ పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతుంటారు.  

ఇంట్లో వారికుండే సమస్యలు తీర్చుకోవడం చేతకాని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఫాన్స్ అని పేరెట్టేసుకొని బండ బూతులు తిడుతుంటారు ఆ విమర్శకులని. 

ఆ మేధావులు (?) అతన్నితిడుతున్నారు అంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి.  తిడుతున్నా ఈయన మౌనంగా ఉన్నాడు అంటే బయట పడకూడని బొక్కలు బయట పడచ్చని. మధ్యలో బకరా గాళ్ళయ్యేది పవన్ కళ్యాణ్ ఫాన్స్ అని పేరెట్టేసుకున్న ఈ  వెర్రి వాళ్ళే.

కొంత మంది రాజకీయ అభిమానులేమో ఎప్పుడూ అవతల పార్టీ వాళ్ళను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. ఇంకొందరు అభిమానులు ఇతరుల మీద విషం చిమ్మకుండా ఆ విషం ఏదో వాళ్ళే తాగేస్తారు.  అతనెవరో మూర్ఖుడు మొన్న ఎలక్షన్స్ ముందు కెసిఆర్ గెలవాలని నాలిక కోసుకున్నాడు, అప్పుడెప్పుడో ఇంకోడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు, వీళ్ళిద్దరూ ఈ కింది కాటగిరీ లోకి వస్తారేమో నాకు తెలీదు, మీరే చదివి నిర్ణయించుకోండి. 

అభిమానులు కాని అభిమానులు:

కొన్నేళ్ళ క్రితం మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. ఏమిటి విషయం అంటే రాజ శేఖర్ రెడ్డి గారి మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని అన్నారు.

కొన్ని నెలల తర్వాత మా ఫ్రెండ్ ని కలిసినప్పుడు ఇదే విషయమై అడిగాను. అయినా మీ అన్నయ్యకు పాలిటిక్స్ అంటే అంత ఇష్టం ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదురా, అలాంటి వాడు ఇలా ఎలా చేసాడురా అని. 

"కుటుంబ సమస్యల్లో నలిగి ఆత్మహత్య చేసుకున్నాడు, కాకపొతే ఇంట్లో పెద్ద వాళ్ళు, ఊర్లో ఉండే పెద్ద మనుషులు కలిసి  మా అన్నని రాజ శేఖర్ రెడ్డి  గారి అభిమానిని చేసి ఆత్మహత్యని రాజ శేఖర్ రెడ్డి గారి ఖాతాలో వేసారు ఇంటి పరువు పోకుండా" అన్నాడు.

'ఊ పె కు హ' బ్యాచ్ అభిమానులు 

వాళ్ళ నాయకుడేదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు వాడి పుట్టిన రోజుకు, తద్దినానికి, వర్ధంతికి పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు. వీళ్ళను 'ఊ పె కు హ' బ్యాచ్ అభిమానులు అనొచ్చు.  ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి టైపు. 

ఆ మధ్య హోర్డింగ్స్, కటౌట్స్ విషయమై  ప్రభాస్ ఫాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి గొడవలు జరిగాయి అని విన్నాము కదా ఆ అభిమానులంతా కూడా ఈ బ్యాచ్ కిందకే వస్తారు.

ఈ సొల్లు అంతా రాసాక చివరిగా నే చెప్పొచ్చేదేమిటంటే "మీ జీవితానికి మీరే హీరో అవ్వండి, వేరెవరినో మీ జీవితంలో హీరోని చెయ్యకండి" అని. 

24, డిసెంబర్ 2018, సోమవారం

గాజు గ్లాస్ పగిలిపోద్దా లేక మెరిసిపోద్దా?

ఇంతకీ ఈ సారి మనం గెలుస్తామా?  సాయంత్రం టీ తాగుతూ మిత్రుడిని అడిగా. 

ఖచ్చితంగా, మేమంతా అండగా ఉండి గెలిపిస్తాం అన్నాడు. 

అయితే  సిడ్నీ లో జరిగే టెస్ట్ మ్యాచ్ కు వెళ్తున్నావన్న మాట. 

నేను గెలుస్తాం అన్నది మా జనసేన పార్టీ గురించి, నీ బోడి క్రికెట్ ఎవడికి కావాలి. 

అంత ధీమానా మీ పార్టీ గెలుస్తుందని? ఒకవేళ గెలవకపోతే?

గెలవకపోతే సాయం చేస్తాం, అదే గెలిస్తే న్యాయం చేస్తాం. ఇదే మా సిద్ధాంతం అన్నాడు టీ తాగుతున్న గ్లాస్ పైకెత్తి. 



అదేంటి నీ కప్పు ఏమై పోయింది, గాజు గ్లాస్ లో టీ తాగుతున్నావ్ అని అడిగా.

ఇది మా పార్టీ సింబల్ అన్నాడు.

నిన్నటి వరకు స్టేటస్ సింబల్ అని అదేదో పోష్ గా ఉండే టీ కప్పు లో తాగే వాడివి.

ఇవాల్నుంచి టీ అయినా, నీళ్లయినా, మందయినా ఈ గాజు గ్లాస్ లోనే . అంతే కాదు నీక్కూడా ఒక గాజు గ్లాస్ కొన్నాను, రేపటి నుంచి నువ్వూ దాంట్లోనే తాగు.

దాంతో పాటు ప్లేట్ కూడా కొనాల్సింది దాంట్లోనే తినేవాడిని, ఎనీ హౌ, గ్లాస్ కొనిచ్చినందుకు థాంక్స్

ఒట్టి థాంక్స్ సరిపోదు, నువ్వు కూడా నాలుగు గ్లాసులు కొని నలుగురికి ఇవ్వు, ఆ నలుగురిని ఇంకో నలుగురికి ఇవ్వమని చెప్పు 

ఏంటి, స్టాలిన్ సినిమానా?

ఏమైనా అనుకో, దెబ్బకు జనాలకు మా పార్టీ సింబల్ గుర్తుండిపోవాలి.   అంతే కాదు ఆంధ్రా లో ప్రతీ టీ కొట్టు వాళ్లకు మా పార్టీ సింబల్ ఉండే గాజు గ్లాసులు ఫ్రీ గా ఇస్తున్నాం.

ఎవరి జేబుల డబ్బుల్లోంచి

మా జేబుల్లోంచే, మా దేవుడి కోసం ఆ మాత్రం చేయలేమా?

అభిమానులు మీరు ఏమైనా చేస్తారు, కానీ నిలకడ లేని మీ దేవుడి మీదే అనుమానం, ఆయన మాటలు నీటి మూటల్లా, ఆవేశం ఐసు ముక్కల్లా అనిపిస్తున్నాయి.

ఆయన మాటలు నీటి మూటలు కాదు, బులెట్ లోంచి దూసుకు వచ్చిన తూటాలు. ఆయన ఆవేశం ఐసు ముక్క కాదు చల్లారిపోవడానికి అదో మండుతున్న నిప్పు కణిక. 

అంటే ఆయన గెలిస్తే జనాల సమస్యలన్నీ తీర్చేస్తాడంటావ్?

ఆయన గొడుగు లాంటోడు, నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం రక్షణ కలిగిస్తాడు అంతే కానీ సమస్యలన్నీ తీర్చేస్తాడానను. 

ఏమో మరి. మొదలు పెట్టిన సినిమా నే సరిగ్గా పూర్తి చేయడు. చివర్లో ఏదో హడావిడిగా షూటింగ్ కానిచ్చేస్తాడు అల్లాంటి వాడు మరి ఈ పార్టీ ని నిలుపుకుంటాడా,ఎన్నికల్లో నిలుస్తాడా, అభిమానులను గర్వOగా తలెత్తుకునేలా చేస్తాడా అన్నదే ప్రశ్న. 

ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయస సంత్రుస్తులై
ఆరంభించిబరిత్యజింతుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహస్య మానులగుచున్ థృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్.


ఆటంకాలకు భయపడి ఏ పనిని మొదలుపెట్టలేరు నీచులు.
పనిని మొదలెట్టి, విఘ్నాలు కలిగితే వదలిపెట్టేవారు మధ్యములు.

ఎన్ని విఘ్నాలు కలిగినా ధైర్యంతో ఎదుర్కొని మొదలుపెట్టినకార్యాన్ని వదలకుండా పూర్తి చేస్తారు ధీరులు. 

మరి పవన్ కళ్యాణ్ గారు యే కేటగిరీ లో చేరుతారో ఆయనే నిర్ణయించుకోవాలి. (గారు అనకపోతే అల్లు అర్జున్ గారికి మా చెడ్డ కోపం వచ్చేస్తుంది మరి ). 

తర్వాత మా వాడు ఈ కింది మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశాడు నాకు. అందులోని ఎనాలిసిస్ యెంత వరకు నిజమో గానీ, ఆ రాసిన వారికి hats off.  

జూదంలో భార్యని ఒడిన ధర్మరాజు గోప్పోడు
కానీ జనం కోసం కుటుంబాన్ని వదిలిన వాడు మాత్రం చెడ్డోడు...

తండ్రి కోసం అడవులకెళ్ళిన రాముడు గోప్పోడు..
ధర్మం కోసం కష్టాలు కోనితెచ్చుకున్నోడు చెడ్డోడు..

అహింస కోసం రాజ్యం వదిలిన బుద్దుడు మంచోడు
జనం కోసం తన వృత్తిని వదిలేసిన వాడు చెడ్డోడు..

సత్యం కోసం భార్య,బిడ్డలను అమ్మిన హరిశ్ఛంద్రుడు గోప్పోడు..
అదే సత్యం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన వాడు మాత్రం చెడ్డోడు..

ఆనాడు రాముడికి ధర్మం తోడురాకపోవచ్చు

ధర్మరాజుకి ధర్మం గుర్తు రాకపోవచ్చు 

హరిశ్ఛంద్రుడికి సత్యం సహయపడకపోవచ్చు

బుద్ధుడికి అహింస అండ లేకపోవచ్చు..

కానీ మా దేవుడికి మాత్రం మేమున్నాం...

కష్టం ఆయన కాంపౌండ్ దరిచేరకుండా కాపలా కాస్తాం....

ధర్మమైనా  ■ అధర్మమైనా
నీతైనా.     ■ న్యాయమైనా...
హింసైనా.  ■అహింసైనా...

చావైనా , బ్రతుకైనా ఆయనకి అండగా మేముంటాం.
మా జీవితాంతం ఆయనకి ఋణపడి ఉంటాం....

ఎందుకంటే.....

మదమెక్కిన వాడు టీడీపీ తో నడుస్తాడు......

మత్తులో ఉన్నవాడు వైస్సార్ కాంగ్రెస్ తో నడుస్తాడు...

మార్పు కోరుకున్న వాడు జనసేన తో నడుస్తాడు....

#మదం #కొద్దిరోజులు #ఉంటుంది..

#మత్తు #ఇంకొద్ది #రోజులు #ఉంటుంది...

#కానీ #ఆయన #మీద #అభిమానం #చచ్చే #.వరకు #ఉంటుంది.

అందుకే మేము ఆయన తో జీవితాంతం ఉంటాం.....

17, డిసెంబర్ 2018, సోమవారం

జీవితం అంటే ఇంతే

ఓ నాలుగైదు నెలల క్రితం అనుకుంటాను, చేస్తున్న ప్రాజెక్ట్ అయిపోతోంది. కొత్త ప్రాజెక్ట్ కోసం చకోర పక్షి లా ఎదురు చూస్తున్న సమయంలో 

మా సుబ్బారావు* నన్ను పిలిచి

నాలుగు రెస్యూమ్స్ పంపిస్తా 

నలుగురు టీం మెంబెర్స్ ని ఫార్మ్ చేసుకో 

నాలుగు రోజుల్లో ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది

అన్నాడు. 


(ఆహా ఏమి నా భాగ్యము! నాలుగు రెస్యూమ్స్ లోంచి నలుగురిని సెలెక్ట్ చేసుకోవాలట. ధర్మ ప్రభువులు నాలుగు కాలాల పాటు చల్లగా ఉండాల. అయినా నాకర్థం కాదు కానీ ఈ సుబ్బారావులు అందరూ ఇలాగే ఉంటారా?

సుబ్బారావులు! మీరు భుజాలు తడుముకోకండి )

అది కాదు సుబ్బారావ్! ఆ నలుగురు ఇండియా నుంచి, నేను ఇక్కడి నుంచి పనిచేయడం వల్ల కోఆర్డినేషన్ సరిగ్గా ఉండదు, వాళ్ళను ఇక్కడికి పిలిపిస్తే బాగుంటుందేమో.  

ఐడియా బాగుంది కానీ చిన్న చేంజ్, నువ్వే ఇండియా వెళ్ళు అప్పుడు వాళ్ళతో కలిసి పని చేసుకోవచ్చు. కోఆర్డినేషన్ సరిగ్గా ఉంటుంది అన్నాడు. 

అబ్బే! కోఆర్డినేషన్ కష్టమేమీ కాదు, నేను మానేజ్ చేసుకుంటాను అని ప్రాజెక్ట్ దొరికింది అన్న ఆనందంలో విధి నా వైపు వక్ర చూపు చూస్తోందని తెలీక ఆనంద తాండవం చేశాను. (విధి అంటే నిధి లాగా ఓ అమ్మాయి అనుకుంటున్నారా ఏమిటి ? కాదు విధే)

మరుసటి రోజు వేడి వేడి కాఫీ తాగుతూ 'యడ్డ్యూరప్ప ఒక్కరోజులోనే సి.ఎం సీట్ నుంచి దిగిపోయాడట పాపం' అనే సబ్జెక్టు మీద కొలిగ్స్ తో వేడి వేడి  చర్చల్లో ఉన్నప్పుడు, సుబ్బారావు వచ్చి బడ్జెట్ లేక ప్రాజెక్ట్ కాన్సుల్ అయింది. కాబట్టి 

ఓ  నాలుగు వారాల  టైం తీసుకో

తట్ట బుట్ట ,పెట్టె బేడ సర్దుకో

బెడ్డు, ఫ్రిడ్జ్ లాంటివి Gumtree* లో సేల్ కు పెట్టుకో

నీ రెస్యూమ్ H.R కు పంపుకో

ప్రాజెక్ట్ ఏది దొరక్క పొతే ఇండియా వెళ్ళిపో

అన్నాడు

జీవితమంటే ఇంతే ..

రెస్యూమ్స్ ఫిల్టర్ చేసే స్థాయి నుంచి రెస్యూమ్స్ పంపించే  స్థాయికి పడేస్తుంది

జాబ్ ఇంటర్వ్యూ తీసుకునే రేంజ్ నుంచి జాబ్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చే రేంజ్ కి తోసేస్తుంది

సింపుల్ గా చెప్పాలంటే ఎత్తి కుదేస్తుంది , ఉతికి ఆరేస్తుంది, ఐరన్ చేసి మడత పెట్టేస్తుంది, మళ్ళీ చించి అతికిస్తుంది , అతికించి చించేస్తుంది. 

పర్మనెంట్ రెసిడన్సీ కోసం  ట్రై చేయకుండా ఆరున్నర్ర సంవత్సరాల నుంచి వీసా మీదే ఉన్నావా ?  నీకు ఇలా జరగాల్సిందే అని మనసు హెచ్చరించింది. 

టెంపోరరీ వర్క్ వీసా మీద ఉండటం వల్ల నేను పని చేస్తున్న కంపనీకే బుద్దిగా బద్దుడనై ఉండాలి. బయట జాబ్స్ వెతుక్కోవడం చాలా కష్టం. కాలమతి గా ఉండటం వల్ల ఎదురయిన సమస్య ఇది కాబట్టి, కాలమతిలా ఇప్పటికిప్పుడు ప్రమాదకర స్థితి నుంచి బయటపడాలి అని నేను పని చేస్తున్న కంపెనీ లో తెలిసిన వారందరికీ రెస్యూమ్ పంపించాను.

ఒకరోజు ఇంటర్వ్యూ కి రమ్మని ఒక క్లయింట్ నుంచి కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి పేరు వెల్మురుగన్ అంటే అరవోడు*, అరచి గీ పెట్టినా మనల్ని తీసుకోడు, ఆశలకు సమాధి కట్టేసుకోవచ్చు అని తెలిసీ వెళ్ళాను. 

ఏ లాంగ్వేజ్ వచ్చు నీకు?

జావా , సి++,  Tibco, webmethod , HTML , XML , PLSQL ,డాట్ నెట్, ఇంటర్ నెట్ , ఫిష్ నెట్, మస్కిటో  నెట్ ఇలా ఆల్మోస్ట్ మార్కెట్ లో ఉన్న అన్ని  లాంగ్వేజెస్ మీద పట్టు ఉంది. 

హౌ అబౌట్ తమిళ్ లాంగ్వేజ్ ?

ఐ డోంట్ నో 

"దెన్ వుయ్ డోంట్ నీడ్ యు" అని డిసైడ్ అయిపోయి 'వుయ్ విల్ లెట్ యు నో ' అన్నాడు. 

సకల టెక్నికల్  లాంగ్వేజెస్ నేర్చుకున్నా, తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకోకపోవడం వలన  జరిగే నష్టం గురించి అప్పుడే తెలుసుకున్నా. 

ఇంకో క్లయింట్ నుంచి కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి పేరు వెంకట రావు, అరే మన తెలుగోడే* 

ఏ లాంగ్వేజ్ వచ్చు నీకు ?

జావా , సి++, డాట్ నెట్, Tibco, webmethod , HTML , XML , PLSQL ,హైబర్నేట్, స్ప్రింగ్ , సమ్మర్ , వింటర్ ఇలా ఆల్మోస్ట్ మార్కెట్ లో ఉన్న అన్ని  లాంగ్వేజెస్ మీద పట్టు ఉంది.  అంతే కాదు తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చు. 

#@$@#$, ^^!*&^& వచ్చా ?

అదొక్కటే రాదు. బట్ ఛాన్స్ ఇస్తే నేర్చుకుంటా 

సారీ, వుయ్ డోంట్ నీడ్ యు. 

తెలుగు పీతల కథ అప్పుడెప్పుడో విన్నాను కానీ, అది నిజం అయి ఉండచ్చు అని అనుకున్నదిఆ రోజే.  చచ్చినా అరవోళ్లలో ఉండే ఐక్యమత్యం  మన తెలుగు వాళ్ళలో ఉండదు అని నిర్దారించుకున్నా.

అలా ఏ ప్రాజెక్ట్ లో చోటు దొరకక  ఇబ్బంది పడుతూ,  ఒక రోజు ఉదయం ఆఫీస్ లో అడుగు పెట్టగానే నిధి నన్ను చూసి నవ్వింది. (ఇక్కడ నిధి అంటే అమ్మాయే, H.R డిపార్ట్మెంట్ )


తర్వాత నా దగ్గరకొచ్చి "వెళ్ళి సుబ్బారావ్ ని కలువు, కాన్సల్ అనుకున్న ప్రాజెక్ట్ మళ్ళీ మొదలవబోతోంది" అంది. 

ఇంతలో ఫోన్ 

GumTree లో ఫ్రిడ్జ్ 100$ లకు సేల్ పెట్టారు, ఫ్రీ గా ఏమైనా ఇస్తారా? అని అవతల నించి వాయిస్ 

నువ్వు తెలుగు వాడివా? అన్నాను 

అవును 

అయితే చచ్చినా ఇవ్వను అని ఫోన్ పెట్టేసాను. తర్వాత వెల్మురుగన్ నుంచి కాల్ వచ్చింది. 

హే బ్రో! దిస్ ఈజ్ వేల్, వెల్మురుగన్ 

ఎస్ వెల్మురుగన్ 

GumTree లో ఫ్రిడ్జ్ 100$ లకు సేల్ దా పెట్టి పూడ్చితివి కదా, 10$ లకు ఏమైనా ఇస్తివా?

లేదు, ఇవ్వను ఇవ్వలేను, నిన్ననే ఒక కాకి వచ్చి ఎత్తుకెళ్లింది. పెట్టెయ్ ఫోన్ అన్నాను. 



పదము 
అర్థం 
సుబ్బారావు 
 మేనేజర్ కు ఏదో పేరు ఉండాలి కాబట్టి అది పెట్టుకున్నాను
సుబ్బారావు అనే పేరు గల వ్యక్తుల మనోభావాలను కించపరిచి ఉంటె సారీ
GumTree 
ఆస్ట్రేలియన్ వెర్షన్ అఫ్ quicker. పాత వస్తువులు అమ్మే/కొనగలిగే ఆన్లైన్ మార్కెట్ 
కాలమతి
 మూడు చేపల కథ లో ఒక చేప పేరు.  
అరవోడు
అరవము అరవము అని అంటూనే అరుస్తూ ఉండేవాడు
పక్కన ప్రధాని కూర్చుని ఉన్నా దూరంగా ఒక తమిళ్ వాడు ఉన్నాడంటే వాడితోనే మాటలు కలిపేవాడు.  
తెలుగోడు 
తెలుగోడితో కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడేవాడు.
యూనిటీ విషయం లో అందరికన్నా ఒక మెట్టు కింద ఉండేవాడు.


మూడు నెలలుగా application architecture, design అంటూ డాక్యుమెంటేషన్ వర్క్ చేస్తున్నఎఫెక్ట్ పై టేబుల్. 



6, డిసెంబర్ 2018, గురువారం

సర్వేలు - బాబుమోహన్ని గుర్తుకుతెప్పించిన పవన్ కళ్యాణ్

ముందుగా ఒక జోక్ తో మొదలెడదాం, నాకు గుర్తున్నంతవరకు జోక్ ఇది. 

అప్పుడెప్పుడో చేసిన సర్వే ప్రకారం పంజాబ్ భారతదేశంలో అతి తక్కువ ఆహార కొరత కలిగిన రాష్ట్రంగా మొదటి స్థానం లో నిలిచిందట. దాంతోపాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించారట. అందులో అడిగిన ప్రశ్న

"మిగతా దేశాల్లో ఆహార కొరతను అధిగమించడానికి మీ దేశం లో మీరు ఏం చెయ్యగలుగుతారో దయచేసి మంచి సూచనలు మరియు అభిప్రాయాలు నిజాయితీ గా తెలియ పరచండి"

ప్రపంచంలో వాళ్ళ దేశం తప్ప వేరే దేశాలంటూ లేవని నమ్మడం USA  వాళ్ళు,

ఆహారమంటే ఏమో తెలియక ఆఫ్రికా వాళ్ళు,

కొరత అంటే ఏమిటో తెలియని వెస్ట్రన్ యూరోప్ వాళ్ళు,

దయ అంటే ఏమో తెలీక సౌత్ అమెరికా వాళ్ళు,

నిజాయితీ అంటే ఏమో తెలీని  ఈస్ట్రన్ యూరోప్ వాళ్ళు,

మంచి అంటే ఏమిటో తెలీని పాకిస్తాన్ వాళ్ళు,

సూచనలు అంటే ఏమిటో తెలీని మిడిల్ ఈస్ట్ వాళ్ళు,

అభిప్రాయాలు అంటే ఏమిటో తెలీక చైనా వాళ్ళు,

ఆ టెలిఫోన్ సర్వే లో వాడిన వాయిస్ మన ఇండియన్ వారిది అవడం తో ఆక్సెంట్ అర్థం కాక ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి కంట్రీస్ వాళ్ళు ,

ఫోన్ పెట్టేశారు. దాంతో  సర్వే ఫెయిల్ అయిందట 

ఇక సర్వేల విషయానికి వస్తే, ఎవరైనా 'మా వాడు రోడ్లు సర్వే చేస్తుంటాడు' అంటే అదేదో నిజంగానే జాబ్ అనుకున్నా చిన్నప్పుడు, తర్వాత తెలిసింది పని లేక ఖాళీగా రోడ్ల వెంట తిరగడం అని.

అలా మొన్నటి దాకా రోడ్లు సర్వే చేస్తున్నవాళ్ళు కూడా , ఇప్పుడు ఎలక్షన్స్ కదా, పార్టీ కి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని మీద సర్వే చేసేశారుమళ్ళీ ఎలక్షన్స్ అయ్యాక రోడ్లు సర్వే చేసే పని వాళ్ళకెలాగూ ఉంటుంది అది వేరే విషయం. సారి అందరి చూపు తెలంగాణా ఎన్నికల మీదే ఉంది. ఎవరి సర్వే లెక్కలు వారికున్నాయి. వాటిని విశ్లేషించడం పోస్ట్ ముఖ్య ఉద్దేశం కానే కాదు.

మొన్నటికి మొన్న "ప్రపంచ ప్రతిభావంత యువనేతల్లో లోకేష్" అని ఏపోలిటికల్ సంస్థ చేసిన సర్వే యెంత కామెడీ పంచిందో తెలియనిది కాదు.

మధ్య ఏదో సంస్థ 'అర్థరాత్రి నిద్ర మధ్య లో లేచి తినే వాళ్ళు ఎంతమంది?' అనే దాని మీద సర్వే చేశారట. మరి సర్వే లు ఎవరికి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఇక్కడ అప్రస్తుతం.

అలాంటిదే ఇవాళ విడుదల చేసిన ఫోర్బ్ సర్వే కూడాఎవరి ఆదాయం ఎక్కువో చెప్పేది సర్వే. మరి నల్ల డబ్బు కన్సిడర్ చేస్తారో లేదో తెలీదు

కాకపొతే  ఇలాంటి సర్వే రిజల్ట్స్ లో నిజాయితీ తక్కువ, అబద్దాలు ఎక్కువగా ఉంటాయి



అదేదో సినిమా లో బాబుమోహన్ కొండను ఎత్తుతాను ఫలానా తేదీ అందరూ వచ్చి నా ప్రతాపం చూడండి అని దండోరా వేయిస్తాడు

తీరా అందరూ పోగయ్యాక చేతులు పైకెత్తి ", కొండను తెచ్చి నా  చేతుల్లో పెట్టండి మోస్తా" అంటాడు. అలా ఉంది మన పవన్ కళ్యాణ్ వ్యవహారం

తెలంగాణా ఎన్నికల్లో జనసేన మద్దత్తు ఎవరికో అయిదవ తేదీన ఇస్తానహో అని ఒక చాటింపు వేశాడు. వీడో పగటి వేషగాడు అని తెలిసిన వాళ్ళు పట్టించుకోలేదు. మిగతా కొద్దీ మందీ కుతూహలంతో వెయిట్ చేశారు. తీరా నిన్న 'తక్కువ అవినీతితో మంచి పాలన అందించే వారికి మీ ఓటు వెయ్యండి' అని ఒక సలహా పారేశాడు. కొండంత రాగం తీసి లల్లాయి పాట పాడినట్లు  మాత్రం దానికి అంత హంగామా అవసరమా

బాబుమోహన్ కాస్త నయం సినిమాలో కామెడీ అన్నా పండించాడు

లగడపాటి సర్వే ప్రకారం కెసిఆర్ ఓడిపోయే ఛాన్స్ ఉందని తెలిసిన పవన్ కళ్యాణ్, కేసీఆర్ కు మద్దత్తు ఇవ్వడాన్ని ఉపసంహరించుకున్నాడని ఇంకో సర్వే ప్రకారం తెలిసిన వార్త