చొక్కాదేముంది చినగనీ , మన చిరంజీవి సినిమా టికెట్స్ దొరికాయి చాలు.
ఎప్పుడు చూడు చిరంజీవి, చిరంజీవి అంటూ సినిమాలేనా, చదివేది ఏమైనా ఉందా?
ఈ సారి తిరణాలకు భలే జనం వచ్చినారు, ఏదో చిరంజీవి సినిమాకి వచ్చినట్లు.
మనూర్లో వాడొక్కడే చిరంజీవిని చూసొచ్చాడు, అందుకే అంత బడాయి వాడికి.
చిరంజీవి తర్వాత , ముందు బాగా చదువుకో రేపు నువ్వు పెద్దయ్యాక కూడెట్టేది అదే.
నేను పెద్దయ్యాక చిరంజీవితో ఒక సినిమా తియ్యాల.
ఇలాంటి మాటలు బాగా విన్న జనరేషన్ మాది. ఆ జనరేషన్ లో స్కూల్ లో ఎవడన్నా చిరంజీవి ఫ్యాన్ కాదు అని తెలిస్తే వాడికి సినిమా పిచ్చి లేదని అర్థం, వేరే హీరో ఫాన్స్ లేరని కాదు గానీ, వారిని వేళ్ళ మీద లెక్కట్టచ్చు.
అప్పుడు మొదలైన చిరంజీవి అనే మత్తు ఇప్పటికీ వదల్లేదు. ఇప్పటికీ T.V లో చిరంజీవి పాట వస్తుంటే యెంత ముఖ్యమైన పనున్నా ఆ పాట చూసి కానీ కదలను. ఆ పాటలో శ్రీదేవి ఉంటే చిరంజీవి మీద నుంచి చూపు కాస్త మళ్లుతుందేమో కానీ వేరే హీరోయిన్ ఉంటే కాన్సంట్రేషన్ మొత్తం మా బాస్ మీదే.
అలాంటి మా బాస్ ఇప్పటికీ హీరో అంటే చెప్పుకోవడానికి మాకు ముఖ్యంగా నాకు కొద్దిగా అసహనంగా ఉంది, వద్దులే అసహనం అనే మాట వింటే మనోభావాలు గట్రా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎబ్బెట్టుగా ఉంది అని అంటాను ఎందుకంటే ఈ వయసులో ఇంకా డ్యూయెట్స్ పాడుతూ హీరో ఏమిటి అని? కాకపోతే ఆయన వయసుకు తగ్గ పాత్రలైతే హుందాగా ఉంటుంది అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు సైరా (తన వయసుకు కాస్తో కూస్తో తగ్గ పాత్రే అనుకుంటున్నా, ఏ మగధీరో, బాహుబలో అనకుండా) అంటూ వస్తున్నాడు కాబట్టి ఆ ఇబ్బంది లేదు.
గత రెండు రోజులుగా ఏ ఇద్దరు మిత్రుల మధ్యన సంభాషణ మొదలైనా సైరా కి వెళ్తున్నావా అని మాట్లాడుకోవడం వింటూనే ఉన్నాను. తెలుగులో తన తరం హీరోలు ఈ తరం హీరోలతో పోటీ పడలేక వెనకబడి పోతుంటే మా బిగ్ బాస్ మాత్రం ఇప్పటికీ 'సై' రా అంటూ 'వయసైపోయినంత మాత్రాన కొదమ సింహం గడ్డి తినడం మొదలెట్టదు, రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంటుంది బాక్సులు బద్దలయ్యేలా' అని ఈ తరం హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నారు అరవయ్యేళ్ళ మా చంటబ్బాయ్.
మధ్య మధ్య కాస్త ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నా రాజా విక్రమార్కలా తన ప్రయత్నాలు మాత్రం ఎప్పుడూ ఆపకుండా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ వచ్చారు అందుకే అనొచ్చు బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్ అని. సినిమాల్లో అందరివాడు అనిపించుకుని రాజకీయాల్లో మాత్రం ది జంటిల్మెన్ అని అనిపించుకోలేకపోవడం కాస్త వెలితిగా అనిపిస్తుంది.
అడవికి రారాజు మృగరాజు అయితే తెలుగు సినిమా ప్రపంచంలో మగ మహారాజు మా హీరో. రిక్షావోడైనా, గ్యాంగ్ లీడర్ లైనా, ముఠామేస్త్రి లైనా, ఆఖరికి హిట్లర్ లాంటి వారైనా ఆయన్ను తెర మీద చూసి జై చిరంజీవా అని జేజేలు కొడుతూ మిమ్మల్ని ఎప్పటికీ తెర మీదే చూడాలని ఉంది అన్నయ్య అని మైమరచి పోతారు.
మొన్నటికి మొన్న 150 వ సినిమాతో విజేత అనిపించుకుని ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనే ఖైదీ గా నిలిచిపోయారని నిరూపించారు. ఇప్పుడీ 151 వ సినిమా కూడా మా చక్రవర్తి కీర్తి కిరీటం లో మరో కలికితురాయిగా చేరుతుందని మా చిరంజీవి అభిమానుల అభిలాష. ఇల లోని ఈ విజయాలన్నీ అక్కడి ఇంద్ర లోకం నుంచి స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు చూసి మా అల్లుడా! మజాకా! అని మరో సారి పొంగిపోవాలి.
మా కరడు కట్టిన చిరంజీవి అభిమాని ఖాసీం కి మాట ఇచ్చినట్లు ఈ సినిమా రిలీజ్ మొదటి రోజు చూడటం లేదు. చిరంజీవి ఫాన్స్ ఎవరైనా ఇది చదువుతూ ఉండి ఉంటే కాస్త ఊపిరి పీల్చుకోండి. కాకపోతే సీట్స్ ఇంకా ఖాళీ ఉన్నాయ్ కాబట్టి ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు.
సైరా కి పోటీ అంటున్న హిందీ సినిమా 'వార్' పరిస్థితి ఇంతకంటే ఘోరంగా ఉంది. దిక్కుమాలినన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి. ఏది హిట్ అవుతుంది అనేది తర్వాత విషయం, క్రేజ్ విషయంలో యూత్ హీరోలతో పోటీ పడగలుగుతున్నాడు అని మాత్రం చెప్పొచ్చు.
ముసలోడికి ఇప్పుడు సైరా లాంటి సినిమా అవసరమా? ప్రభాస్ లాంటి మంచి ఫిజిక్ ఉన్న హీరో అయితే బాగుండు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మాకు అవేమీ పట్టవు, ప్రభాస్, మహేష్ మాకొద్దు. మేమింతే! చిరంజీవి అనే మత్తు వదలదు అదంతే , మేమింతే. ఈ జన్మకి చిరంజీవి ఫాన్స్ గానే ఉండిపోతాం మా ప్రాణాలు పోయేదాకా. మంచికో, చెడుకో కొందరికి తాగుడు, జూదం అంటూ ఏదో ఒక వ్యసనం ఉంటుంది మాకూ చిరంజీవి అనే వ్యసనం ఉంది, అదలానే ఉండిపోనీ నష్టమేముంది.
ఏంటి డాన్స్ నేర్చుకుంటావా? వీడో పెద్ద చిరంజీవి మరి, డాన్స్ నేర్చుకుంటాడట మొహం చూడు.
అవును మరి డాన్స్ గురించి ఎవరైనా అంటే మా చిరంజీవే గుర్తొస్తాడు ఇప్పటికీ, ఎప్పటికీ. ఆయనొక మాస్టర్ పీస్, డాన్స్ లో ఆ గ్రేస్, స్టైల్ మరెవరికీ లేదు, రాదు.
ఏంటో ఈ వెర్రి "సినిమా హీరోలకి అభిమానులు" అట? వాళ్ళేం సాధించారని అదంతా దర్శకుల గొప్పతనం? అనే వాళ్ళు అననీ. ఒక సామాన్యుడు ఈరోజు కొన్ని కోట్ల మంది తన గురించి మాట్లాడుకునేలా చేసాడంటే ఆ స్వయంకృషి విలువ సామాన్యం కాదు, ఆ కష్టపడే తత్త్వం ఆదర్శంగా తీసుకుంటే మనమూ అద్భుతాలు సృష్టించచ్చు...
సృష్టించచ్చు ... అంటూ చచ్చు మాటలెందుకూ చచ్చే లోగా మనమూ అద్భుతాలు సృష్టిద్దాం.
మరి సీట్లు ఎందుకు ఖాళీ ఉన్నాయి?🙂
రిప్లయితొలగించండిమా ఇంటి దగ్గర ఉండే మల్టిప్లెక్స్ లోనే 10 షోస్ వేస్తున్నారు, అదీ వర్కింగ్ డే రోజు. ఆఫీస్ వదిలేసి ఎవరు వెళ్తారు మేష్టారు. ఇక ఆ వార్ సినిమా 4 షోస్ వేస్తేనే 1/4 సీట్స్ కూడా నిండలేదు, మరి మా బాస్ మూవీ కే క్రేజ్ ఎక్కువ ఉన్నట్లు కదా 😊
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమీ బాసుకే క్రేజ్ ఎక్కువున్నట్లంటారా? అయితే, తన ఒక సినిమాలో ... ఫాన్సే బాసూ, మనల్ని ఈ రోజు ఈ లెవెల్లో నిలబెట్టింది ... అని మీ బాసు వ్రాయించుకుని వల్లించిన డైలాగ్ నిజంలాగే ఉంది ఫాన్సుని చూస్తుంటే 😃.
తొలగించండిఅయినప్పటికీ "వర్కింగ్ డే" నాడు ఎవరు వెడతారు అంటారా? ఒక సినిమాలో లవర్, తండ్రి, అన్నలు చూస్తుండగానే హీరోయిన్ కొండపై నుండి క్రింద నదిలోకి దూకేస్తుంది. అమ్మా, అమ్మా అంటూ తండ్రి, అన్నలు కొండ గట్టు వరకూ పరిగెట్టి తొంగి చూస్తూ నిలబడతారు. ప్రేమించినవాడు ఈలోగా క్రిందకు దూకేస్తాడు. చివర్లో హీరోయిన్ .. ఏం నాన్నా, మీ ప్రేమ గట్టు దగ్గిరే ఆగిపోయింది .. అంటుంది. అలాగ, మీ బాసుడి సినిమా చూడ్డానికి మీ మొక్కవోని అభిమానం ఆఫీసుకు ఒక రోజు సెలవు పెట్టడం దగ్గరే ఆగిపోయిందే అని నాకు కడుంగడు విచారముగానున్నది అంటే నమ్మండి 🙁 ... 🙂.
Anyway all the best 👍.
నేను అభిమాని దగ్గరే ఆగిపోయాను మేష్టారూ, కరడు కట్టిన అభిమానిని కాను😊
తొలగించండిGood. అక్కడే ఆగండి.
తొలగించండిసైరా బ్యానర్ కడుతూ కరెంట్ షాక్ కి గురైన ముగ్గురు యువకులు - వీళ్ళు కరడు కట్టిన అభిమానులంటే. అవసరమా వీళ్లకు, ఏదో సినిమాకి వెళ్ళామా ఎంజాయ్ చేశామా అన్నట్లు ఉండాలి.
తొలగించండిమూర్ఖపు అభిమానం. తెలివితక్కువతనం. వీళ్ళకోసం చిరంజీవి (or ఏ హీరో కూడా) ఏమీ చెయ్యడు.
తొలగించండిచుట్టుపక్కల ఎమున్నాయో చూసుకోకుండా అజాగ్రత్తగా పనిచేసే వారికోసం ఏ హీరో అయినా ఏం చేస్తాడు? చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది.
తొలగించండివిజయ్ కాంత్ అభిమానులైనంత మాత్రాన కరెంట్ కే షాక్ ఇచ్చెయ్యగలమని ఎవరైనా అనుకుంటారా ఏమిటి?
ఏమీ చెయ్యరనే అంటున్నాను. తమ పబ్లిసిటీ కోసమే చనిపోయిన ఆ మూర్ఖాభిమాని కుటుంబాన్ని కనీసం పరామర్శించడం కూడా సందేహాస్పదమే. సోకాల్డ్ అభిమానులు వెర్రెక్కినట్లు వీధుల్లో ఎగురుతుంటే, కటౌట్లు కడుతుంటే, స్వంత డబ్బులు (mostly అమ్మానాన్నల డబ్బు అయ్యుండే అవకాశాలే ఎక్కువ) ఖర్చు పెడుతూ సినిమాహాళ్ళ చుట్టూ తిరుగుతుంటే ... హీరోలకు కమ్మగానే ఉంటుంది. అలా టైమ్ వృధా చేసుకోకండి, చదువుకోండి, లేదా ఏదన్నా పని వెతుక్కోండి అని ఒక్క హీరో కూడా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు నాకు గుర్తు రావడంలేదు. అందుకే .. yes I agree with you .. ఈ మూర్ఖులు తమ జాగ్రత్తలో తాముండాలి.
తొలగించండిఊరుకోండి మేస్టారూ మీరెప్పుడూ మా హీరోల మీద దుమ్మెత్తి పోయడానికి రెడీ గా ఉంటారు, వాళ్ళు తెరమీద మాత్రమే హీరోలు నిజజీవితంలో కాదు అర్థం చేసుకోండి ప్లీజ్
తొలగించండితమిళ హీరోలు "నో కటౌట్స్ ప్లీజ్" అంటున్నారట.
తొలగించండి// "తెరమీద మాత్రమే హీరోలు నిజజీవితంలో కాదు" //
తొలగించండియే హుయీ న బాత్ 👌.
మూర్ఖపు అభిమానులు అది అర్థం చేసుకోవడం లేదు. టైమ్ వృధా చేసుకుంటున్నారనే నా విచారం. కానివ్వండి, ఎవరి ఖర్మ వారిది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి// "తమిళ హీరోలు "నో కటౌట్స్ ప్లీజ్" అంటున్నారట." //
తొలగించండి
ఆ ముక్క ... మొన్న చెన్నైలో ఒక భారీ కటౌట్ (రాజకీయ నాయకుడి కటౌట్) ఊగి / విరిగి క్రింద పడి అక్కడున్న ఒక యువతి ప్రాణాలు కోల్పోయినటు వంటి ప్రమాదాలు ... జరగక ముందు చెప్పాలి - హీరోలైనా, నాయకులైనా.
అప్పటి వరకు రోజూ రోడ్ల మీద కార్లో వెడుతున్నప్పుడు ఆకాశమంత ఎత్తున్న తమ కటౌట్లు చూస్తూ మురిసిపోయారుగా ... సినిమా హీరోలు, రాజకీయ నాయకులూ. ఎంత ఎత్తుగా ఉంటే అంత గొప్ప అనే gross ఆలోచనా? ఇప్పడు ప్రమాదం జరగడంతో రేపు తమ కటౌట్ ఏదన్నా కూడా కూలితే తమ మీదకెక్కడ నింద వస్తుందోనని తమ "ఇమేజ్" దెబ్బ తింటుందోననీ వణుకు పుట్టి, కటౌట్లు వద్దని ఇప్పుడు హీరోల విన్నపం. ఏం అవన్నీ ఇంతకాలం కమ్మగా ఉండి, ఆ మత్తులో కామన్ సెన్స్ కూడా కోల్పోయారా? ఇంకా ఎన్ని లీటర్ల రక్తం కారాలి అని అధికారులను మద్రాసు హైకోర్టు చివాట్లు పెట్టడంతో "హీరోలు"కు కూడా బెదురుపుట్టిందా?
వీళ్ళూ, వీళ్ళ hypocrisy నిండిన స్టేట్మెంట్లూ 😠.
ఒక ప్రాణం బలయిన తరువాత పబ్లిక్ మొహాన అటువంటి "విన్నపం" ఒకటి పడేశారన్నమాట? మూర్ఖాభిమానులు వినిపించుకుంటారనే ఆశిద్దాం ... అసలే ఆవేశంతో కూడిన అభిమానంతో పూనకం పట్టినట్లు ఊగిపోయే తమిళ జనాలు (సినిమాలు, రాజకీయాలు రెండింటికీనూ).
అవునూ, ఘనత వహించిన మన తెలుగు "నక్షత్రాలు", రాజకీయ నాయకులూ ప్రజలకు అటువంటి విన్నపం చేసినట్లు లేదే? మన దగ్గర ఏం జరగలేదు కదా అనే ఉదాసీనతేమో 🤔?
ఫాన్స్ ఎవరో మామ గారి భారీ కటౌట్ ఎక్కడో పెట్టారని ట్విట్టర్ లో వీడియో అప్లోడ్ చేశారట మన ఘన నక్షత్రపు గారి కోడలు. కాబట్టి కటౌట్ వద్దని చెప్పే సమస్యే లేదు మన తెలుగు ఫీల్డ్ లో.
తొలగించండిమామకు తగ్గ కోడలు. తండ్రికి తగ్గ కొడుకు.
తొలగించండిచల్ నే దో బాలకిషన్.
గాంధీ జయంతి నాడు ఇటువంటి సినిమాల విడుదలా? (డెక్కన్ క్రానికల్ పేపర్లో ఒకరి ఉవాచ)
రిప్లయితొలగించండి"Violent films ... on Gandhi Jayanti"
హింసో అహింసో అనవసరం, అంతా ప్లానింగ్ మేష్టారు, గాంధీ జయంతి రోజు హాలిడే లేకపోయి ఉంటే రిలీజ్ చేసి ఉండేవారు కాదు.
తొలగించండిగాంధీజయంతి నాడు ప్రపంచమంతా మందు మానేయ్యలేదుగా. అహింసతోనే ప్రతి దేశమూ స్వాతంత్య్రం పొందలేదుగా.
తొలగించండిఎవరి అభిప్రాయాలు వారివి. గాంధీజయంతి నాడు గాడ్సే భజన చెయ్యనంతవరకు ఓకె
"గాడ్సే భజన ...,"
తొలగించండిదాన్ని కూడా ఎవరి అభిప్రాయాలు వారివి అనుకుంటే సరి.
ఉ. ఎన్. రెడ్డి, రఘుపతి రాఘవ రాజారాం ఇద్దరూ స్వాతంత్య్రం కోసం ఘాట్టిగా పోరాడారు కానీ ఉ. ఎన్. రెడ్డికి వచ్చినంత పేరు రాజారామ్ కి రాలేదు. అందుకే అతను ఒక్కమగాడిగా మిగిలిపోయాడు☺️☺️
రిప్లయితొలగించండిఒకప్పుడు అభిమానులు ఏంతో కష్టపడి రాత్రివేళలో రోడ్డెమ్మట తిరిగి ఎగస్పార్టీ పోస్టర్ల మీద పెండ కొట్టి తమ "ఔన్నత్యాన్ని" చాటుకునే వారు. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అంటూ అదే పని హాపీగా ఇంట్లో కూచొని సాంఘిక మీడియాలలో చేయగలుగుతున్నారు. పనిలో పనిగా ఎగస్పార్టీ హీరోతో పాటు అతగాడి అభిమానులను, కుటుంబీకులను, కులస్తులను, వ్యాపారాలను కూడా దుమ్మెత్తిపోసే "సదుపాయం" లభించడం అదృష్టం.
రిప్లయితొలగించండిఅవతలి హీరో పోస్టర్ల మీద పేడ కొట్టడమే అభిమానం వెర్రితలలు వెయ్యడానికి ప్రారంభం. ఆ తరువాత అంతా ఇక జారుడుబండే.
తొలగించండిఅదేంటండీ అలా అంటారు? వాల్ పోస్టర్ల మీద పెండ కొట్టే స్థాయి నుండి పేస్బుక్ వాలు మీద పెంట చిమ్మే అత్యున్నత స్థాయికి ఎదగడం ప్రగతి కాదా.
తొలగించండిఇటువంటి "అభిమానుల" చల్లటి చలువ లేకుంటే మొఖానికి రంగులు పూసుకొనే పగటి వేషగాళ్ళు ఇంతటి ఉన్నత శిఖరాలకు ఎదిగే వారే కాదు.
అలాగా? నాకు తెలియదు - నేను ముఖపుస్తకం, పక్షికూతలు లాంటి సమూహాల్లో జేరలేదు - అయామ్ టూ ఊ ఊ .. ఇంటెలిజెంట్, యూ సీ 😎.
తొలగించండిపైన మీ రెండో పేరా నూటికి నూరు పాళ్ళూ నిజం. వాళ్ళని pedestal మీదకు ఎక్కించి ప్రత్యక్షదైవాలుగా ఆరాధించడం వల్ల జరుగుతున్న అనర్థమే ... మనం ఈనాడు చూస్తున్నది.
"అయామ్ టూ ఊ ఊ .. ఇంటెలిజెంట్"
తొలగించండిమీరు ఇంటెలిజెంట్ కనుక సినిమాలు చూడరు. ఒకవేళ చూసినా ఒక్కసారి, అదీ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే.
బొమ్మ సూపర్ హిట్ కావాలంటే ముఖ్యమయిన పనులన్నీ ఎగ్గొట్టి టికెట్ కోసం రాత్రిబగళ్లు పడిగాపులు కాసి మరీ ఎగబడే అభిమానులు కావాలి, ఒక్కొక్కరూ అధమపక్షం వారంలో అయిదారు సార్లు చూడాలి.
"మాసే బాసూ, మనల్ని ఇవాళ ఈ లెవెల్లో నిలబెట్టింది" ... కదా మరి 👍?
తొలగించండిమాస్ అనేది నాగార్జున సినిమా అనుకుంటా సార్.
తొలగించండిఏమాటకామాటే చెప్పాలి. నాగార్జున అభిమానులు (నిజంగా ఆయనకు కూడా ఎవరయినా అభిమానులు ఉండుంటే) ఎప్పుడూ ఎక్కడా "అతి" చేసినట్టు గుర్తు లేదు.
కానీ ఆ డైలాగ్ చెప్పింది బిగ్ బాస్, అందుకే నరసింహా రావు గారు అలా అని ఉంటారు.
తొలగించండినాగార్జున ఫ్యాన్స్ ?? వాళ్ళు క్లాస్ ఏమో ఉంటే గింటే కాబట్టి అతి తక్కువ
సదరు డైలాగ్ ఏ బొమ్మలో ఎవరు చెప్పారో నాకు తెలీదు. విన్నకోట వారికి ఈ విషయం తెలిసిందంటే ఆయన చిరు అభిమానే అయుంటారు!
తొలగించండిసంపూర్ణేష్ బాబుకు అభిమానులు ఉన్నార(ట), నాగార్జునకు ఉండరా?
జై గారు, అయితే ఉండే ఉంటారు నాగార్జున కి ఫ్యాన్స్ అలాగే విన్న కోట వారు Chiranjeevi ఫ్యాన్ కూడా 😀
తొలగించండిఅభిమానా, "తోటకూర కట్టా" (వాక్యంలో రెండో భాగం కూడా ఘన నక్షత్రం గారిదే ఏదో సినిమాలోనిది)? పనికిమాలిన విషయాలు ఎక్కువ గుర్తుండిపోతాయి, ఏవిటో చిన్నప్పటి నుండీ అంతేనండీ 🙁.
తొలగించండిహ్హ హ్హ జై, "మాస్" అనే మాట పట్టుకుని "ఎక్కడికో వెళ్ళిపోయారు" (మళ్ళీ "ఘన" చిత్రమే🙂). కానీ నాగార్జున అభిమానులు అతి చేసిన దాఖలాలు వినలేదు అని మీరన్నది నిజం.
"పనికిమాలిన విషయాలు ఎక్కువ గుర్తుండిపోతాయి"
తొలగించండిఎంతమాట ఎంతమాట! అన్నయ్య, అందరివాడు, మాస్ మహారాజు, మెగాస్టార్, సినీ వినీలాకాశంలో ఏకైక లెజెండ్, యమహానగరి టాగోర్ వగైరా బిరుదాంకితుడి డయలాగు రాజములను పట్టుకొని "పనికిమాలిన" అనుటకు మీకు నోరెలా వచ్చింది?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅయినప్పటికీ మీకు నాలాంటి అభిమానులు ఉన్నారు గానీ, రైల్ ఎక్కేసి ఉంటే బాగుండేది, మీకూ ఈపాటికి మూర్ఖాభిమానుల సంఘాలు ఉండేవి, ఏవ్ వారసత్వ సంపదగా మీ పిల్లలకు ఇచ్చి ఉండచ్చు.
తొలగించండిఅలనాడు మద్రాసు రైలెక్కబోయి పరధ్యానంలో హైదరాబాద్ రైలెక్కాను, మద్రాసు వెళ్ళుంటే తరువాత జనాలు నా డైలాగులు చెప్పుకునేవారు అన్నాను కదా పైన (ఇప్పుడే నేనే తీసేసిన కామెంటులో) (చిరంజీవి వగైరాలు బాధపడతారేమోనని నా కామెంట్ తీసేశాను 😏. అదేం కాదు, తెలుగు జనాలకు పెద్ద హింస తప్పిపోయింది అని హీరోలు, బ్లాగ్ పాఠకులు హమ్మయ్య అనుకుంటారంటారా 🤨? అలాక్కానివ్వండి). మూర్ఖాభిమానుల సంఘాలయితే తప్పక తయారయ్యేవి లెండి 🤨🙂.
తొలగించండిఎనీవే, మీ అభిమానానికి థాంక్స్ పవన్. ఒక రచయిత అన్నట్లు నేను "ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు". కాబట్టి ఈసారికిలా పోనివ్వండి.
గురువు గారూ, పోనీలెండి మీరు రైలెక్కకపోవడం మూలాన "ప్రచార" బ్రదర్స్ లాంటి బాదుడురాయుళ్లకు అవకాశాలు దొరికాయి.
తొలగించండిహ్హ హ్హ, పరోపకారం చేసినట్టు అన్నమాట 😀.
తొలగించండి
రిప్లయితొలగించండిసైరా! రాణువ వీర! మొండి ఘటమా! సంఘర్షణా జ్వాలవౌ
రౌరా రాక్షసుడా సిపాయి! మగధీరా!అగ్ని సంస్కారమే
చీరెన్ ఫ్యానుల కొత్త పేట రవుడీ చీర్సంట ట్విట్టర్లలో
రారా శంకరు దాద! యెంబి బియెసై ప్రాణాలు కాపాడు రా!
చనిపోయిన వాళ్ల కాత్మ శాంతి కలుగు గాక !
వచ్చే జన్మలో రుణమాఫీ జరుగు గాక !
జిలేబి
ఆయన దొంగ, గూండా, రౌడీ, ఖైదీ తరహా పేర్లున్న సినిమాలు ఎన్నెన్నో చేసాడు. అవన్నిటినీ ఒక తవికలో వాడండి: మీకిదే నా "ఛాలెంజ్"!
తొలగించండిజిలేబి గారూ, లాస్ట్ రెండు లైన్స్ బాగున్నాయ్.
తొలగించండివిన్నకోట నరసింహారావు గారి challenge స్వీకరించండి
ఛాలెంజ్ విసిరింది నేను కాదు మహానుభావా.
తొలగించండిపొరపాటు పడ్డాను క్షమించండి, జిలేబి గారూ జై గారి ఛాలెంజ్ మాటేమిటి?
తొలగించండి
తొలగించండిమీ ఆశ యెందుకు కాదనాలి నారదా!
ఫస్ట్ షో పేరిట యెంత డబ్బులు జేబు దొంగ కొట్టేసేడో జైగారిది :)
అడవి దొంగని టింగురంగడిని మోస
గాడి నరరె చిరంజీవి గా వెలిగితి!
దొంగ మొగుడిని గూండాని తోడు దొంగ
మనసు! గ్యాంగులీడరునిగ మంచి దొంగ
గాను జైగొట్టి జేబు దొంగని మరువకు :)
జిలేబి
బాగుంది జిలేబి గారు, మధ్యలో జై గారిని కలిపేశారు.
తొలగించండి// "సదరు డైలాగ్ ఏ బొమ్మలో ఎవరు చెప్పారో నాకు తెలీదు." //
రిప్లయితొలగించండిఏంవుంటుంది జై ... ఏ .. ఆవిడకు యముడు, ఈవిడకు మొగుడు, రిక్షావోడు / జట్కావోడు / ఆటోవోడు .. లాంటి ఏదో ఒక gross movie బొమ్మ.
మీ వాక్యలు చూస్తే బాలయ్య అభిమాని లాగా అనిపిస్తుంది. అంతర్లీనంగా మెగా ద్వేషం కనిపిస్తుంది.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
తొలగించండిమీకు అలా అనిపించిందా?
శివ శివా, అమంగళం ప్రతిహతమవు గాక 😱.
నేను అందరు హీరోలను సమానంగా ... తిడతానండీ 😀.
ద్వేషిస్తా మెగా హీరోలన్
తొలగించండిపోషిస్తా నందమూరి నట బాలు ర నౌరా
దోషులు మెగా హీరో లెల్లరు
భాషయు భావము తెలియని అగ్నానంగాళ్ళోయ్ !
నేనన్లే :)
ఎవరో ఆరాటపడిపోయి అన్నారని "గ్రూపు వైను" పల్కు :)
నేనందరు హీరోలనూ అసమానంగా తిడతానండీ.
అయ్యయ్యో నాకిలా అనిపించిందేమిటండీ !
నా అగ్నానం అప్రతిహతమౌ గాత !
సర్లెండి ఏదో సరదాకి :) :) :)
రా దారిని బోయెడు
తొలగించండివారల్ జైగొట్టకున్న ----------
ఇంతకీ ఆ దానయ్యెవరు త్రిబుల్శ్రీ జిలేబీ గారూ !!
జిలేబి గారిలా కవితలో, పద్యాలో వదులుతున్నారు వీరు జిలేబి 2.0 నా ఏమిటి?
తొలగించండివారే వీరు, వీరే వారు .. తెలుసుకోండి పవన్ కుమారా 🤘.
తొలగించండి// "ద్వేషిస్తా మెగా హీరోలన్
తొలగించండిపోషిస్తా నందమూరి నట బాలు ర" //
పూర్తిగా పొరబడ్డారు Anonymous గా కామెంటిన "జిలేబి" గారూ. నేనలా అననూలేదు. నాకు అందరూ సమానమే.
--------
// ".... అసమానంగా తిడతానండీ" //
అలా కనిపించాయా అక్షరాలు? ఈ మధ్యనే cataract ఆపరేషన్ కూడా చేయించుకున్నారుగా, అయినా అంతేనా? ఇలా అయితే మీ "అగ్నానం అప్రతిహతమే" అవుతుంది.
తొలగించండిఈ మధ్య ఎవరు పద్యం గిద్యం కట్టినా పేరడీ కట్టినా అది జిలేబి యే అని నిర్ధారణకొచ్చేంతగా పాప్యులర్ అయిపోయామన్న మాట :) ఆ మధ్య ఎవరో బుచికి కవుల సభలో పద్యం కడితే దాన్నిన్ను జిలేబి కే అంట గట్టేసేరు !
ఏం చేద్దాం :)
జిలేబి
పద్యం కాస్తా గిద్యం ఐపోతే అది జిలేబీయమే కాకతప్పదు కదా. జిలేబీ కన్న ఘోరంగా ఎవరు రాస్తారు కపిత్వం?
తొలగించండి
తొలగించండిఓరోరీ దురానానిమసుడా పేరు చెప్పి శరణు కోరురా భడవా :)
కొందరు హీరోలు అభిమానులను తన్నులతో ఒళ్ళు హూనం చేస్తారు, ఇంకా ప్రేమ ఎక్కువయితే షూట్ చేసి పారేస్తారు! అటువంటి మొరటు ప్రేమికులకు దూరంగా ఉంటేనే దేహశుద్ది నుండి విముక్తి.
తొలగించండిఆ బ్లడ్, బ్రీడ్ పూర్తిగా వేరు జై గారు.
తొలగించండిఅవునండీ అందుకే అభిమానులు అడిగి మరీ తన్నించుకుంటారు!
తొలగించండిఅదన్నమాట అసలు విషయం
తొలగించండిఇవాళ ఆజ్ పత్రికలో జూనియరుడి ఫోటో వేసి "స్టన్నింగ్ లుక్స్" అని కేప్షన్ పెట్టడం చూసా. నాకేం అంత స్టన్నింగ్గా అనిపించలేదు, మరి ఆ రాసినవాడికేం నచ్చిందో!
తొలగించండి@జిలేబి: ఏంటమ్మా జిలేబమ్మా?శరణు కోరాలా?అదేమన్నా కొబ్బరికోరా ఏమిటి కోరడానికి? బావుంది మీవరస!
బై ది వే పైన జిలేబమ్మని విమర్శించింది నేను కాదని మనవి!
తొలగించండి@సూర్య:
తొలగించండిఆజ్ అనే పత్రిక ఉందాండీ, కొంపతీసి "ఈరోజు" వాళ్లదేనా ఏమిటి?
తొలగించండిఓ యబ్బో భాస్కర ! ఎక్కడో కొడితే ఎక్కడో తగిలిందే అనుకుంటి సినబ్బా :)
జిలేబి
ధన్యోస్మి జిలేబి మాతా ధన్యోస్మి!
తొలగించండినాకు "పనికిమాలినవి" అని నా కవిహృదయం జై గారూ.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి/ "ద్వేషిస్తా హీరోలన్" //
రిప్లయితొలగించండి// "ఎవరో నరస రాయలు గారట ఆరాటపడిపోయి అన్నారని "గ్రూపు వైను" పల్కు :)" //
------------
"జిలేబి" గారూ, పైన చూపించిన మీ కామెంట్ మీ "వరూధిని" బ్లాగ్ లో నిన్న కనిపించింది. దానికి జవాబుగా "ద్వేషించడం వేరు, తిట్టడం వేరు. తేడా ఉంది కదా?" అని నా వ్యాఖ్య పెట్టాను. ఉన్నట్లుండి మీరు కామెంట్ మోడరేషన్ విధించినట్లున్నారు - నా వ్యాఖ్య ఇంత వరకు వెలుగు చూడలేదు, ప్చ్.
వాన రాకడ, ప్రాణం పోకడ, "జిలేబి" గారి బ్లాగ్ మోడరేషను ... ఎవరూ ముందుగా చెప్పలేరు కదా 😕.
హ్హ హ్హ హ్హ సూర్య గారు, "పేరు చెప్పి శరణు కోరరా" అన్నది పాత "మాయాబజార్" చిత్రంలో అక్కినేనితో (అభిమన్యుడి పాత్ర) ఎస్.వీ.రంగారావు (ఘటోత్కచుడి పాత్ర) అనే డైలాగ్. చాలా పాప్యులర్ డైలాగ్. కాబట్టి light, light :)
రిప్లయితొలగించండిJai,
రిప్లయితొలగించండి// "సూర్య, ఆజ్ అనే పత్రిక ఉందాండీ? " //
మీరడిగింది సూర్యానే. So we will wait for his reply.
నాకు తెలిసినది ఈలోగా చెప్పాలనే దురద మూలంగా చెబుతున్నాను. ఆజ్ అనే హిందీ దినపత్రిక ఉంది. చాలా యేళ్ళుగా ఉంది. వారణాసి నుండి వెలువడుతుంది. పలు హిందీ ప్రాంతాల్లో ఆదరణ కలిగిన పత్రికే. నేను కాశీవాసం చేసిన రోజుల్లో చూసేవాడిని.
అయితే నా సందేహం ఏమిటంటే - ఆ హిందీ పత్రికకు మన దక్షిణ భారతపు / తెలుగు జూనియరుడి గురించి ఏం తెలుసు అని ("జూనియరుడు" అంటే Jr.NTR గురించే అనుకుంటున్నాను). ఉత్తర భారత దేశం వారికి సౌత్ గురించిన అవగాహన / ఆసక్తి చాలా చాలా తక్కువ కదా. మరి నేను చెబుతున్న పత్రిక, సూర్య చెబుతున్న పత్రిక ఒకటేనా?
తొలగించండిఆజ్ అనే పత్రిక టెల్గులో "ఇయ్యాల”అన్న పేరుతో విరాజిల్లు " తూంది" :)
లింకు :
https://varudhini.blogspot.com/2018/09/blog-post_18.html
జిలేబి
ఇదా మీరిచ్చే సమాచారం 😠? సూర్యా, వెంటనే రావాలి.
తొలగించండిజిలేబి జీ చెప్పింది కరెక్టు.
తొలగించండినిజం చెప్పొద్దూ, జూనియరుడి ఫోజులో మా కజిన్ బ్రదరుని పెడితే ఇంకా స్టన్నింగ్ గా కనిపిస్తాడు!!
ఔను నేనూ నిన్న ఆ జూనియర్ ఎన్టీఆర్ ఫోటో చూసా, అంత స్టన్నింగ్ ఏమిటో నాకు అర్థం కాలేదు, సన్నబడ్డాడు అని అర్థం ఏమో?
తొలగించండిలింకుడీ.
తొలగించండిTry చేశా కానీ ఎక్కడ చూశానో గుర్తు రావడం లేదు.
తొలగించండిఇదిగో లింకు
తొలగించండిhttps://www.eenadu.net/cinema/morenews/10/2019/10/04/119021280/ntr-stunning-looks-an-advertisement
బండ హీరోలు బరువు తగ్గడం మొదటి సారి కాదు కనుక అదేమీ విశేషం కాకపోవొచ్చును. సహజ సిద్ధంగా (అనగా వైద్యుల/శస్త్రచికిత్సకుల ప్రమేయం లేకుండానే) తగ్గాడో ఏమో? అనుకుల మీడియాకి అదే వింతగా తోచుండి ఉంటుంది.
తొలగించండిఅఫ్కోర్స్ ఆవిడెవరో శస్త్రం వికటించి గుటుక్కుమన్నాక జాగ్రత్త పడడం మంచిదే లెండి.
థాంక్స్ సూర్య.
తొలగించండిబొమ్మలోనున్నతని "అందచందాలు" ... చూసేవారు / కేప్షన్ అండ్ రైటప్ వ్రాసేవారు ... పెట్టుకున్న కళ్ళజోడు రంగు బట్టి గోచరిస్తాయి కదా. అదన్నమాట సంగతి.
లింక్ ఇచ్చినందుకు థాంక్స్ సూర్య.
తొలగించండిహ్హ హ్హ హ్హ, "ఈనాడు" పేరుని హిందీకరించి आज అన్నారా మీ మొదటి కామెంట్ లో? మీ చతురతతో చాలా తికమక పెట్టారుగా పాఠకులను ☝️. నేనేమో హిందీ పత్రికలకు మన జూనియరుడి గురించి ఎలా తెలుసునబ్బా (వీళ్ళంతా స్వగృహమాత్ర వీరులు కదా) అని మరింత తికమక పడ్డాను గదా.
ఒక సంఘటన గుర్తొచ్చింది. ఒక తడవ అమెరికా పర్యటనలో ఒఠ రోజు ఊళ్ళోని ఇండియన్ స్టోర్స్ కు వెళ్ళడం జరిగింది. లోపల కస్టమర్స్ మధ్య నుండి తెలుగు మాట వినిపిస్తే ఆ ఆసామీని పట్టుకుని మీదే వూరని అడిగాను (మనకు దూల ఎక్కువ కదా). అమలాపురం అన్నాడు. అలాగా, ఆ ఊళ్ళో మీ ఇల్లు ఎక్కడ అని అడిగాను. "బ్లాక్ బ్రిడ్జ్" దగ్గర అన్నాడు. నేను కాస్త తికమక పడి అయ్యా నేను అమలాపురంలో చాలా యేళ్ళే ఉన్నాను, ఇదేమన్నా కొత్తగా కట్టిన వంతెనా అని తిరిగి అడిగాను.అప్పుడు అతగాడు అదేనండీ నల్ల వంతెన అన్నాడు. నీ స్టైల్ తో చావగొట్టావు కదయ్యా అనుకున్నాను మనసులో.
(నల్ల వంతెన, ఎర్ర వంతెన అని అమలాపురంలో ఏకాలం నుండో ఉన్న రెండు వంతెనలు)
Black bridge ... బాగుంది మేష్టారు
తొలగించండిJai,
తొలగించండి// "బండ హీరోలు బరువు తగ్గడం మొదటి సారి కాదు కనుక అదేమీ విశేషం కాకపోవొచ్చును. సహజ సిద్ధంగా విశేషం కాకపోవొచ్చును. సహజ సిద్ధంగా (అనగా వైద్యుల/శస్త్రచికిత్సకుల ప్రమేయం లేకుండానే) తగ్గాడో ఏమో? అనుకుల మీడియాకి అదే వింతగా తోచుండి ఉంటుంది."//
---------
ఇతగాడు ఏ పద్ధతిలో బరువు తగ్గాడో తెలియదు గానీ తగ్గడం మాత్రం తాజా విశేషమేమీ కాదే? పది పన్నెండేళ్ళ క్రితమే వచ్చిన "యమదొంగ" చిత్రంలో (చాలా)సన్నబడ్డ వాడిగా మొదటిసారి కనిపించాడు. మరిప్పుడు ఉన్నట్లుండి
ఈ పత్రిక వారికి ఏమిటి అబ్బురంగా తోస్తోందో తెలియడం లేదు.
తొలగించండిసన్న బడటంలో విన్నకోటవారికి కాంపిటీషనొస్తున్నాడేమో జూనియరు మరీ వదలటంలే ఆ ఫోటో కత :)
నారాయణ
జిలేబి
అసలే వైరి పక్షం హీరో సినిమా బాక్స్ ఆఫీసు బద్దలు కొడుతోంది(ట). మనోళ్లు కూడా ఎందుకో ఒకందుకు "వార్త"లలో పడకపోతే జనం ముందు చులకన అవుతామని కాబోలు రామోజీ తాత ఆదుర్దా.
తొలగించండినేను లావు కేటగిరీలోకి రాను "జిలేబి" గారూ. అందువల్ల ఎవరో కుర్రకుంకలతో నాకు పోటీ యేమిటి?
తొలగించండిఆ "stunning" ఫొటో యేమిటో నేనూ చూసి తరిద్దామని ఆరా తీశానన్నమాట. అసలు దీనంతటికీ సూర్య కారణం 🙂. పైగా నన్ను వారణాసిక దాకానూ, అమలాపురం "బ్లాక్ బ్రిడ్జ్" దాకానూ కూడా తీసుకువెళ్ళాడు.
ఇదేముంది. ఆమధ్య జూనియరుడి బాబాయ్ గడ్డం గీసినపుడు కొంత వదిలేసిన ఫోటో పెట్టి "ఇదే న్యూ లుక్. అభిమానులు ఆశ్చర్యపోయి పండగ చేసేసుకుంటున్నారు" అని రాశారు.
తొలగించండిపిచ్చ ఫామిలీ విగ్గులు మార్చి అదే న్యూలుక్ అనుకుంటున్నారు.
తొలగించండిఆ ఒక్క ఫ్యామిలీ అని ఏముంది, మన తెలుగు హీరోల్లో సగానికి పైన చేసేది ఆ పనే.
తొలగించండిగిగా ఫామిలీలో క్రిష్ చరణ్ కి తప్ప, అంత పిచ్చి ఎవరికీ లేదని నా అబిప్రాయం.
తొలగించండిఇక దండగమూరి ఫామిలీలోనైతే అభిమానులతోసహా ప్రతొక్కడికీ టన్నుల లెక్క పిచ్చుంది.
డిఫరెంట్, స్టైలిష్ లుక్ అంటే ఇలా ఉండాలి:
https://www.ntnews.com/updates/latestnews/2019/2-vijay-look.jpg
"క్షవరం చేయించుకోవయ్యా"అంటే బద్ధకం. పైగా న్యూ లుక్ అని కవరింగ్!☺️
తొలగించండిఇది కూడా కర్రక్టే....
తొలగించండి// "డిఫరెంట్, స్టైలిష్ లుక్ ..." //
తొలగించండిఅసలు ఎవరీ జీవి?
నైజాం మెగా స్టార్ అని కొందరు అంటున్నారు ఇతన్ని ఈ మధ్య
తొలగించండిక్షవరకళ్యాణం చేయించుకుంటే మొహం గుర్తుపట్టచ్చు.
తొలగించండిమామూలుగా బాగానే ఉంటాడుగా, ఇదేం పిచ్చో?
బాకయ్యబాబుని ఏమైనా అంటే, మాలికలోనించి వ్యాఖ్య తీసేస్తారా? ఇదేదో పచ్చమాలోకంలాగుందే....
తొలగించండిఅది పిచ్చి కాదు మేష్టారు లేటెస్ట్ style, ఇప్పుడు మనం బాలేదంటే పల్లెటూరి బైతుల కింద జమ కట్టేస్తారు. కాబట్టి అలా అనకూడదు అనుకొని అందరూ సైలెంట్ అవుతారు అదే ఫ్యాషన్ అవుద్ది
తొలగించండిఅంతేగా అంతేగా🙄.
తొలగించండిA rich man's joke is always funny అని ఒక ఆంగ్ల నానుడి. అలాగ ఈ రోజుల్లో A cine hero's crazy style soon becomes the fashion అనుకోవడమే ... వారం రోజులు గీకని గడ్డం లాగానో 🙀 / ఈ మధ్య మరీ కనిపిస్తున్న బవిరి గడ్డం లాగానో 🧔.
@విన్నకోట నరసింహా రావు:
తొలగించండిఈ విజయ్ రాక్షసకొండ అనే అతని కబీర్ రెడ్డి బొమ్మ సూపర్ డూపర్ హిట్టవడమే కాక దాన్నే హిందీలో అర్జున్ సింగ్ అనే పేరుతో తీస్తే అదీ యమ బంపర్ లాభాలు గడించింది. అంతా బ్లేడు & బీడీ మహిమ కాబోలు!
@Chiru Dreams:
దాల్ మే కుచ్ పీలా హై :)
అర్జున్ సింగ్ బొమ్మ నచ్చలేదు అన్నానని నన్ను పాత చింతకాయ పచ్చడి కింద జమ కట్టారు చాలా మంది నన్ను ☹️
తొలగించండిHa ha, you must be getting old, Pavan 😀.
తొలగించండిపవన్ జీ అలాంటివారికి "popcorn khao mast hojao" అనే హిందీ సినిమా చూపించండి. దెబ్బకి మత్తు వదులుతుంది!☺️
తొలగించండి@ నరసింహా రావు గారు, అది నాకు ఈ మధ్య కొత్త తెలుగు సినిమా పాటలు వినలేక పోతునప్పుడే అర్థమైంది 😀
తొలగించండిసూర్య గారూ, ఇది అర్జున్ సింగ్ కు బాప్ లాంటి సినిమానా ఏమిటి? అసలే చాలా వరకు హిందీ సినిమాలు నచ్చవు కాబట్టి కాస్త అటు వైపు తక్కువ చూస్తుంటాను
తొలగించండిJai,
రిప్లయితొలగించండి// "... ఆదుర్దా." //
😀
పొట్టి బుడంకాయ ఇప్పుడు కురచ ములక్కాయ అయ్యింది. మెగా పొట్లకాయ గద్దలగూడు గిజిగాడు అయ్యింది.
తొలగించండిపవన్,
రిప్లయితొలగించండిఈ హీరో గారికొక తమ్ముడు కూడా ఉన్నాడా ... ఏదో సామెత చెప్పినట్టు 😲? అనతి కాలంలోనే "నైజాం మెగా తమ్ముడు" అనే బిరుదాంకితుడవుతాడా?
బ్లాగర్లకు, పాఠకులకు అందరికీ దసరా శుభాకాంక్షలు 🏹.
ప్రతిఒక్కడి తమ్ముడూ పవన్ కళ్యాణ్ లా ఫీలైపోవటమే ఈమధ్య!
తొలగించండితప్పదు, తమ్ముళ్లకు, కొన్నేళ్లకు కొడుకులకు స్వాగతం చెప్పాల్సిందే ఇది అనాదిగా మన తెలుగు సినిమా పరిశ్రమ లో వస్తున్న ఆచారం
తొలగించండిఅందరికీ దసరా శుభాకాంక్షలు☺️
రిప్లయితొలగించండి"దా సరదా తీరుస్తా" అనే సినిమాలకి మాత్రం పోమాకండి ఈరోజు.
ఇప్పుడు తెలుగులో వస్తున్న అన్ని సినిమాలు అలాంటివే? మరి ఏ సినిమాలు చూడాలి? 😀
తొలగించండివి వి వినాయక్ సినిమాలో కార్లు ఎందుకు ఎగురుతాయో సీనయ్య అనే పోస్టర్ చూసాక అర్థమైంది.
రిప్లయితొలగించండిచేతిలో రెంచి ఉంది కదా అని బోల్టులు విప్పేస్తూ పోతే ఆక్సిడెంట్లు అవ్వవూ?!
వినాయక్ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారా? చూడనేలేదు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
తొలగించండి"సీనయ్య" మూవీ పోస్టర్
అదన్నమాట సంగతి☝️🙁
(సూర్య గారూ,
నువ్వు చదివేది ఈ పేపరా, "ఆ పేపర్" అనుకున్నానే అని మరోసారి ఆశ్చర్యపడిపోకండి నా గురించి☝️. నేను రోజూ చదివేది ఈ పేపర్ కాదు. పైన మీ వ్యాఖ్య చూసిన తర్వాత గూగులిస్తే దొరికిన సమాచారం అన్నమాట ఇప్పుడు నేనిచ్చిన లింక్ 🙂)
విన్నకోటవారూ, ఆమధ్య ఒక బ్లాగులో మీరు "నేను చదివే రెండు పత్రికలు" అనగానే అప్పట్లో ఓ మహానేత "ఆరెండు పత్రికలు" అని టార్గెట్ చేసే మాట గుర్తొచ్చింది. కానీ మీరు "ఒకటి తెలుగు ఒకటి ఆంగ్లం " అనేసరికి ఆయన చెప్పిన రెండు వేరు, మీరు చెప్పిన రెండు వేరు అని అర్థమైంది. అందుకే కూసింత హాస్యం కోసం "మీరు చదివేవి ఆ రెండు పత్రికలు అనుకున్నా కానీ ఈ రెండు పత్రికలా" అన్నా. చివరికి కామెంట్ల గోల తప్ప కామెడీ పండలేదని ఇప్పుడు అర్థమైంది.
తొలగించండినో ప్రోబ్లం సూర్య గారూ. నేనూ కామెడీ గానే తీసుకున్నాను లెండి. "ఆ రెండు పేపర్లు" ఏమిటీ అనే కుతూహలం కొద్దీ అన్నాను. ఆ మాటకొక రాజకీయ నేపధ్యం ఉందని ఇప్పుడు తెలిసింది. "మహానేత" కాలంలో నేనా మాట మిస్సయినట్లున్నాను. ఎనీవే నో ప్రోబ్లం 👍.
తొలగించండినా వరకు నాకు పేపర్ చదివే అలవాటు లేదు గానీ తుపాకీ, గ్రేట్ ఆంధ్ర అనే రెండు చెత్త సైట్స్ చదువుతూ ఉంటాను. అందులోనూ సినిమాలకి సంబంధించిన విషయాలు మాత్రమే. నాకుండే పరిజ్ఞానానికి ఏవ్ అర్థం అవుతాయి, రాజకీయాలు అర్థం కావు.
తొలగించండి"పేపర్ చదివే అలవాటు లేదు"
తొలగించండిపవన్ గారూ, మీరు చాలా వినోదం మిస్ అవుతున్నారు. 36 పత్రికలు, 116 టీవీ చానెళ్లు & లెక్కలేనన్ని వెబ్ నాయిస్ సైట్లు/యూట్యూబ్ గొట్టాలు/సాంఘిక మాధ్యమాలలో దురాభిమానుల రచ్చరచ్చ. బోలెడంత కామెడీ, సినిమాలు ఎందుకూ కొరగావు. ఒక్కసారి అర్నాబ్ గోస్వామి అరుపులు & ఘావు కేకలు ఆస్వాదించండి, జన్మ ధన్యం కాకపొతే మీ మేనేజర్ మీద ఒట్టు.
"అర్థం కావు"
సదరు రచ్చలలో ఘాట్టిగా అరుస్తున్న వారికే (ఒక్కోసారి మన అదృష్టం బాగుంటే పాకిస్తానీ పైడ్ ఆర్టిస్టులు కూడా వేంచేస్తారు) తాము ఏమి మాట్లాడుతున్నామో అర్ధం కాదు, మనమెంత. అర్ధాలూ అపార్ధాలూ జాన్తా నై, డెసిబెల్ లెవెల్ అదిరితే చాలు.
జై గారూ, అయితే వినోదం బాగా మిస్ అవుతున్నట్లున్నాను. కాకపోతే ఒక సినిమా పూర్తిగా చూడటానికే ఒక వారం పడుతోంది, రోజూ అరా గంట కంటే టైం దొరకట్లేదు. మీరు టైం మానేజ్మెంట్ లో మాస్టర్స్ చేసినట్లు ఉన్నారే ఇవన్నీ చూడటానికి టైం దొరుకుతోంది అంటే.
తొలగించండిపవన్,
రిప్లయితొలగించండిరోహిత్ శర్మ లాగా వరుస సెంచరీలు కొట్టేస్తున్నారే .... కామెంట్ల విషయంలో :). Good show. అభినందనలు.
అదంతా మీ అందరి చలవే మేష్టారు. సెంచురీ కొట్టిస్తున్నందుకు ధన్యవాదాలు.
తొలగించండి