పోయిన వారం కాస్త టైం దొరికింది కదా అని టీవీ పెడితే 'నీ గుండెల్లో చోటు' అనే సీరియల్ వస్తోంది.
"నీ రాకతో ఈ ఇంట్లో చీకటి చిన్నబోయింది, దిగులు దూరంగా పారిపోయింది" లాంటి పాత చింతకాయ పచ్చడి డైలాగులు విన్నాక 'నీ గుండెల్లో చోటు' సీరియల్ దెబ్బకు తలపోటు తెచ్చుకోవడం ఎందుకని ఛానల్ మార్చా
అందులో మాస్ పాటలేవో వస్తున్నాయ్.
నువ్వో కొండ ముచ్చు
నీదో పిచ్చి బొచ్చు
నీ ప్రేమే ఒక ఉచ్చు
నీ చూపులే నా గుండెల్లో గుచ్చు
నీదో పిచ్చి బొచ్చు
నీ ప్రేమే ఒక ఉచ్చు
నీ చూపులే నా గుండెల్లో గుచ్చు
ఏంటో ఆ దిక్కుమాలిన లిరిక్స్ వినలేక ఛానల్ మారిస్తే చిన్న పిల్లల డాన్స్ ప్రోగ్రాం వస్తోంది, కనీసం ఇది చూడచ్చు అనుకునే లోగా
నీకు ఆకలుంది
నాకు మెస్ ఉంది
మంత్లీ కార్డు తీసుకో
రోజూ పంచ్ వేసిపో
నా దగ్గర ఫ్యూజ్ ఉంది
నీ దగ్గర బల్బు ఉంది
మొత్తం రాత్రంతా
లైట్ వెలిగిద్దాం
అనే దిక్కుమాలిన బూతు పాటకు ఇద్దరు చిన్న పిల్లలతో డాన్స్ చేయించడం మొదలెట్టారు.
చూడలేక ఛానల్ మార్చా.
చూడలేక ఛానల్ మార్చా.
'అడిగా అడిగా' అని ఏదో కొత్త సినిమాలోని పాపులర్ మెలోడీ సాంగ్ వస్తోంది. నాకెందుకో ఆ పాట పాడిన పాపులర్ గాయకుడి గొంతు కంటే రైళ్లలో పాడేవాళ్ళ గొంతే నయమనిపించి మళ్ళీ ఛానల్ మార్చా.
అదేదో ఇంగ్లీష్ ఛానల్ వస్తోంది, మన తెలుగు చానెల్స్ కన్నా ఇంగ్లీష్ చానెల్స్ బెటర్ అని అనుకున్నానో లేదో...
షేమ్ షేమ్ అని అరిచాడు మా మూడేళ్ళ బుడ్డోడు T.V వైపు చూసి
అదేదో Bigboss లాంటి ఒక దిక్కుమాలిన ప్రోగ్రాం, ఒక 5 జంటలు బట్టలు లేకుండా బీచ్ లో తిరుగుతున్నారు, వాళ్ళకేవో టాస్క్ లు ఇస్తున్నారు.
ద్యావుడా! మన తెలుగు చానెల్స్ వంద రెట్లు బెటర్ అని మళ్ళీ ఛానల్ మార్చా
వంటల ప్రోగ్రాం వస్తోంది, కాకరకాయ ఎలా వండాలో చెప్తోంది యాంకరమ్మ. సరే అదే చూద్దామని డిసైడ్ అయ్యా.
అదేదో ఇంగ్లీష్ ఛానల్ వస్తోంది, మన తెలుగు చానెల్స్ కన్నా ఇంగ్లీష్ చానెల్స్ బెటర్ అని అనుకున్నానో లేదో...
షేమ్ షేమ్ అని అరిచాడు మా మూడేళ్ళ బుడ్డోడు T.V వైపు చూసి
అదేదో Bigboss లాంటి ఒక దిక్కుమాలిన ప్రోగ్రాం, ఒక 5 జంటలు బట్టలు లేకుండా బీచ్ లో తిరుగుతున్నారు, వాళ్ళకేవో టాస్క్ లు ఇస్తున్నారు.
ద్యావుడా! మన తెలుగు చానెల్స్ వంద రెట్లు బెటర్ అని మళ్ళీ ఛానల్ మార్చా
వంటల ప్రోగ్రాం వస్తోంది, కాకరకాయ ఎలా వండాలో చెప్తోంది యాంకరమ్మ. సరే అదే చూద్దామని డిసైడ్ అయ్యా.
"ఎవర్ని సపోర్ట్ చేస్తున్నావ్"? అన్నాడు మిత్రుడు ఫోన్ చేసి
అర్థం కాలేదు? అన్నాను నేను.
అదే ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నావు అని.
పార్టీ విషయమా, ఈ వీకెండ్ సుందర్ గాడేమో వాళ్ళ అబ్బాయి బర్త్ డే పార్టీ అంటున్నాడు, కుమార్ గాడేమో త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాడుగా అందుకని బ్యాచులర్ పార్టీ అంటున్నాడు. బర్త్ డే పార్టీ బోర్, అందుకే బ్యాచులర్ పార్టీనే సపోర్ట్ చేద్దామనుకున్నా.
నేను మాట్లాడేది ఆ పార్టీల గురించి కాదు. ఇవాళ కౌంటింగ్ కదా, ఈ ఎలెక్షన్స్ లో ఏ పార్టీ ని సపోర్ట్ చేస్తున్నావు అని.
ఓహో అదా, నువ్వు చెప్పే వరకు తెలీదు ఇవాళ కౌంటింగ్ అని.
మరి నీకు ఇంట్రస్ట్ లేదా ఎవరు గెలుస్తారో అని?
ఏముంది ఎవరో ఒకరు గెలుస్తారు. కోర్టు లో కేస్ ఓడిపోయినవాడు కోర్టు మెట్ల మీదే ఏడిస్తే గెలిచినవాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడట అలా ఇద్దరూ ఏడ్చినట్లే, ఎలెక్షన్స్ లో గెలిచినోడు ఓడినోడు ఇద్దరు డబ్బు లెక్కలు వేసుకుంటుంటారు. గెలిచినోడు అసెంబ్లీ లో వెళ్ళి కూర్చుని ఖర్చు పెట్టిన డబ్బు మళ్ళీ ఎన్ని నెలల్లో సంపాదించగలను అని లెక్కలు వేసుకుంటుంటే ఓడినోడు ఇంట్లో కూర్చొని పదవిలో ఉన్నప్పుడు సంపాదించిన దాంతో పోలిస్తే ఇదెంత అనుకొని నెక్స్ట్ ఎలెక్షన్స్ లో గెలవడానికి ప్రయత్నిస్తా అప్పుడు ఇంతకు ఇంత రాబట్టుకుంటా అని లెక్కలేసుకుంటాడు. అయినా ఎవరు గెల్చినా పెద్ద తేడా ఉండదు, ఏ రాయయినా ఒకటే తల పగలగొట్టుకోవడానికి.
ఛ! నీకసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు, నీతో మాట్లాడటం వేస్ట్ అన్నాడు.
ఏమోలే గానీ, ఇందాకా దిక్కు మాలిన ఛానలన్నీ చూసి తలపోటు తెచ్చుకున్నా, నీతో మాట్లాడాక అదెటో ఎగిరిపోయింది అన్నాను.
అది ఎగిరొచ్చి నా తల మీద వాలింది, నీ సోది అంతా విన్నాక అని ఫోన్ పెట్టేశాడు.
ఓహో, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ లాగా, ఆన్లైన్ తలనొప్పి ట్రాన్స్ఫర్ కూడా చెయ్యొచ్చన్న మాట అని అనుకుంటుండగా "ఇప్పుడు కాకరకాయ కుక్క అయింది" అంది T.V లో యాంకరమ్మ.
ఏమోలే గానీ, ఇందాకా దిక్కు మాలిన ఛానలన్నీ చూసి తలపోటు తెచ్చుకున్నా, నీతో మాట్లాడాక అదెటో ఎగిరిపోయింది అన్నాను.
అది ఎగిరొచ్చి నా తల మీద వాలింది, నీ సోది అంతా విన్నాక అని ఫోన్ పెట్టేశాడు.
ఓహో, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ లాగా, ఆన్లైన్ తలనొప్పి ట్రాన్స్ఫర్ కూడా చెయ్యొచ్చన్న మాట అని అనుకుంటుండగా "ఇప్పుడు కాకరకాయ కుక్క అయింది" అంది T.V లో యాంకరమ్మ.
కాకరకాయ కుక్క కావడమేమిటి చెప్మా, ఇదేదో వంటల ప్రోగ్రాం అనుకున్నానే, మేజిక్ ప్రోగ్రాం అని తెలీదే, ఛ అనవసరంగా మిస్ అయ్యాను అన్నాను.
అది కుక్క కాదు నక్క కాదు, కాకరకాయ 'కుక్' అయింది అనే దానికి యాంకరమ్మ పాట్లు , ఆవిడ తెలుగు అట్లా ఏడ్చింది అంది మా ఆవిడ.
P.S : ఏదో అర గంట టైం దొరికింది, ఖాళీగా ఉండటం ఎందుకని ఈ కిచిడి వండేశా, ఇది చదివాక మీకైమైనా తలపోటో, వాంతులో, కడుపులో దేవినట్లో, మురికి కాలువలో ఈదినట్లో అనిపిస్తే నాకు సంబంధం లేదు.
పవన్ గారూ, అదేంటీ వికార విధ్వంసధామ, మహారొచ్చు, గదానాయకుడు లాంటి సినిమాలు వదిలేసి టీవీల మీద పడ్డారు!
రిప్లయితొలగించండిపోనీ నాయిస్ (పేరుకు న్యూస్) చానెళ్లు చూడొచ్చు కదా.
ఆంధ్రకోతిలో ఓపెన్ బార్క్ విత్ కేకే కార్యక్రమంలో వెకిలి బాధాకృష్ణ "మొదటిసారి చిలక్కొట్టుడు కొట్టినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు" తరహా కొచినీలకు "సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్" చెలోపాటి "ఆముదం తాగినంత భేషుగ్గా ఉంది" జవాబు ఇచ్చాడు.
ఈ షో (రమ్మీలో షో కాదు) డోకనిపిస్తే టీవీ520 ఛానెల్లో కహానీలమూర్తి "స్మాల్ వేస్ట్"
కృయాలిటీ ప్రోగ్రాములో కష్టాల్ ఆర్మీ మోసాల గురించి స్టింగ్ చేసి బోరునేని రుబాబు గారితో విశ్లేషణాత్మక రచ్చ (చర్చ) చేస్తాడు.
ఇవేవీ కాకపొతే ఫోర్జరీ999999 టీవీలో గజనీకాంత్ "ఘాతకం ప్రకారం ఏకే పాల్ పీఎం అవుతాడా" అంటూ ప్రసిద్ధ ఘాతకరత్న తలతిక్క పంతులు & ఇంకా సుప్రసిద్ధ అహేతువాది చిల్లరకొట్టు చిట్టయ్యల మధ్య టీఆర్ఫీ అరుపుల వేలం పెడతాడు.
Full entertainment, paisa vasool!
అమ్మో! ఆమ్మో ! ఇంత ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నానా నేను, నా కళ్ళు తెరిపించారు జై గారు. నిజం చెప్పొద్దూ, నేను టీవీ ప్రోగ్రామ్స్ చూడక ఏడేళ్లు అయింది, ఆస్ట్రేలియా వచ్చాక ఆ వాసన తగలనే లేదు.
తొలగించండి"చేలోపాటి" ఎవరబ్బా ఈ కాండిడేట్, యెంత ఆలోచించినా తట్టడం లేదు.
ఇక నాయిస్ ఛానెల్స్ చూసే అలవాటు నా రక్తం లోనే లేదు.
ఏ లోకాన ఉన్నాడో మగానుభావుడు ఈటీవీ సుమన్ చనిపోయాక సీరియల్సులో కామెడీ తగ్గింది కనుక అవి నేను మానేసాను. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడను. ఇక కామెడీకి నాయిస్ చానెళ్లు మాత్రమే ఒక్కటే శరణ్యం. ఒక్కోరోజు మరీ అదృష్టం బాగుండి కాం గోపాల్ బర్మ స్థూడియోకి వచ్చాడంటే ఇక పండగే పండగ.
తొలగించండిచలపతి రావు అనే అతను వందలాది సినిమాలలో కామెడీ, విలన్ & కామెడీ విలన్ పాత్రలు (చిన్నచినవే లెండి) వేసాడు(ట). ఇతగాడు వెకిలి వెర్రిమొర్రి రాధాకృష్ణకు ఇచ్చిన "ఇంటర్వ్యూ" ఆడలేడీస్ లేనప్పుడు మాత్రమే చూసేంత ఛండాలంగా ఉంది.
ఏదేమయినా ఆస్ట్రేలియాకు వెళ్లి మీరు బతికిపోయారు పవన్ గారూ. మేము వెధవ ఇండియాలో (అదేదో సినిమాలో నూతన్ ప్రసాద్ ఊతపదం లెండి, నాకు దేశమంటే అభిమానం ఎక్కువ) ఉండబట్టి ఈ చెత్తంతా చూసి చస్తున్నాం.
సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ చేలోపాటి ఎవరో అర్థం చేసుకున్నా ఇప్పుడు మీరిచ్చిన వివరణతో. ఆయన బూతు మాటల జాబితా పెద్దదే అయి ఉంటుంది లెండి.
తొలగించండిఒకప్పుడు నేనూ ఈ టీవీ సుమన్ గారి బాధితుడినే, అన్న గారు వేసిన వేషాల్లో ఇంకెవరిని జీర్ణించుకోలేము అలాంటిది సుమనుడు ఎన్ని వేషాలు వేసి చంపెయ్యలేదు అప్పట్లో.
ఎలక్షన్లలో గెలిచినోడు గుడికెళ్లి గుండు కొట్టించుకుంటే ఓడినవాడు గుండు కొట్టించుకుని ఇంటికెళ్తాడు!!
రిప్లయితొలగించండిఓడిపోయిన పార్టీకి జనమే నున్నగా గుండు కొట్టి తలంటుతారు!
తొలగించండిసూర్య గారు, మీ స్టేట్మెంట్ నాకు బాగా నచ్చింది.
తొలగించండిజై గారు అన్నట్లు ఓడిపోయిన వాళ్ళు కొట్టించుకోకపోయినా, జనమే కొట్టిచ్చి పంపిస్తున్నారు.
కోర్టులో కేసు ఓడిపోయినవాడు..
రిప్లయితొలగించండిఆ పేరాగ్రాఫ్ సూపర్ అసలు...ఎంతో సెన్సిబుల్ గా నిజాయితీగా వ్రాసారండీ....ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గరనుండీ పనికిమాలిన సోంబేరుల కుప్పిగంతులు చూడలేకపోతున్నాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ అస్సలు లేని వెధవలని చూస్తే వెల్లుల్లి బాగా దట్టించి కాకరకాయ వేపుడులా ఫ్రై చేసిపారేయాలనిపిస్తోంది.
నన్ను తిట్టారో పొగిడారో అర్థం కాలేదు నీహారిక గారు, ఇక్కడ సోషియల్ రెస్పాన్సిబిలిటీ లేని వాడిని నేనే.
తొలగించండిపొగిడారో తిట్టారో తెలియకుండా మాట్లాడడం "జిలేబి" గారి సావాసం వల్ల వస్తుంది 😀😀😀.
తొలగించండిప్రశాంత్ కిషోర్ దగ్గర 100 మంది పనిచేసారు. ఎంత ముష్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా 20 వేలకి తక్కువ పనిచేయడు. మోదీని గెలిపించాడని పేరున్న ప్రశాంత్, కోటి రూపాయలు తక్కువ తీసుకోడు. 3600 కి మీ తిరిగాడని అంటున్నారు. రోజుకి లక్షల్లో జనం వచ్చారు. ఊరికే బుగ్గలు నిమిరేసి, ముద్దులు పెట్టేసి వెళ్ళిపోడు కదా తిండికి,వసతికి ఖర్చు పెట్టే ఉంటాడు కదా ? ఇవికాక ఓటర్ స్లిప్ చూపించిన ప్రతి ఒక్కరికీ 1000 రూ పట్టపగలే ఇచ్చారని చెప్పారు. సినిమా యాక్టర్లకీ ప్రచారానికీ, పార్టీ ఆఫీసులకీ, అమరావతిలో ఇల్లు కట్టుకోడానికీ వీటన్నిటికీ ఖర్చు ఎంత అయిఉంటుంది ?
తొలగించండిఓవర్ డ్రాఫ్ట్ ప్రభుత్వానికి ఉంది అని చెపుతున్నాడు కానీ తనకే ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. ఇద్దరికీ ఓవర్ డ్రాఫ్ట్ ఉన్నపుడు ఒకరు గొప్పవాడు ఒకడు చెడ్డవాడు అని ఎలా డిసైడ్ చేస్తారు ?
మీరు చెప్పిందే సరి అయినది, మీకే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందని నేనన్నాను. మీరు చెప్పినట్లు ఖర్చు పెట్టింది తిరిగి రాబట్టుకుంటారనే చెపుతున్నాను.
ఇప్పుడు అర్థమైంది మీ మాటలో అంతరార్థం ఏంటో నీహారిక గారు. వివరించినందుకు థాంక్స్.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమరొక్క విషయం చెప్పి ముగిస్తాను. మీరు, విన్నకోటవారు బ్లాగుల్లోకి రాకముందు "తన్‌హాయి" అని ఒక బ్లాగ్ సీరియల్ "కల్పనా రెంటాల" గారు వ్రాసారు. వేణూశ్రీకాంత్ గారులాంటివాళ్ళు కూడా ఎగబడి చదివేవారు.మగవాళ్ళ ఆదరణ చూరగొన్న ప్రత్యేక సీరియల్ అదే ! ప్రతిరోజూ వ్యాఖ్యలూ వ్యాఖ్యానాలూ అదరగొట్టేసేవారు.
తొలగించండిఇపుడు లలితగారి "త్వామనురజామి" సీరియల్ కూడా బాగా వ్రాస్తున్నారు. మీరు ఒక్కరే రెగ్యులర్ గా చదువుతున్నారు.
రెండు సీరియళ్ళూ వాస్తవ జీవిత గాధలే ! తన్‌హాయి స్థాయి ఆదరణ "త్వామనురజామి"కి లేదు.
ఆవిడకి దిష్టి తగులుతుందేమో అని నేను బాధపడిపోతున్నానన్నది ప్రక్కన పెడ్తే చంద్రబాబుగారి పాలన త్వామనురజామి లాంటిది.కొంచెం స్వోత్కర్షలాగా అనిపిస్తుంది.
జగన్ పాలన "తన్‌హాయి" లాంటిది. దీర్ఘకాలికంగా ఏది మంచిదో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా !
నీహారిక గారు, ఈ తన్హాయి సీరియల్ గురించి తెలీదు. ఇక లలిత గారి సీరియల్ నాకు నచ్చుతుంది. తన సీరియల్ కూడా తిరుపతి ప్రాంతం లోనే ఎక్కువగా ఉండటం అలాగే నా MCA కూడా తిరుపతి లో చదవడం, అక్కడే నా ప్రేమ కు బీజం పడటం, మూడేళ్లకు ఆ ప్రేమ ఫలించి మూడు ముళ్ళు వేయడం లాంటి కారణాలు కావచ్చు నాకు నచ్చడానికి. దీనికి తన్హాయి సీరియల్ ఆదరణ దక్కకపోవడానికి కారణం మునుపటి లాగా చదివే వాళ్ళ సంఖ్య తగ్గడం ఒక కారణం అనుకుంటున్నాను.
తొలగించండినేను బ్లాగ్స్ లోకి ఎంటర్ అయినా కొత్తలో ఒక 3-4 సంవత్సరాల క్రితం చాలా మంది రాసేవారు. కొంత మంది చాలా బాగా రాసేవారు. ఇంకొంత మంది బ్లాగుల్లో మేటర్ పెద్దగా లేకపోయినా మినిమం 60-70 కామెంట్స్ ఉండేవి ప్రతీ పోస్ట్ కి. అప్పట్లో చాలా మందికి చదవాలి అనే ఇంట్రస్ర్ ఉండటం అవ్వచ్చు. అది కాలక్రమేణా తగ్గింది అని నేను అనుకుంటున్నాను.
చంద్ర బాబు అయినా జగన్ ముఖ్యమంత్రి అయినా రాష్టానికి పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు అని నా అభిప్రాయం. అది తప్పై ఉండచ్చు, ఎందుకంటె నాకు ఈ పాలిటిక్స్ మీద పెద్దగా అవగాహన లేదు.
బాచిలర్ పార్టీయే బెటర్☝️ ఎనీ డౌట్ 😬?
రిప్లయితొలగించండిపైన ఉన్న ఛండాలపు మాస్ పాట నిజంగా ఏదన్నా సినిమాలోనిదా, లేక మీ స్వంతమా? సినిమా పాటే అయ్యుంటుంది లెండి, మాస్ కోసం కావాలిగా (మాసే బాసూ, మనల్ని ఈ రోజు ఈ లెవెల్లో నిలబెట్టింది ... అని ఓ సినిమాలో డైలాగ్ కూడా చెప్పుకున్నాడుగా ఈ ట్రెండ్ ని పెంచి పోషించిన మీ అభిమాన 'ఘన నక్షత్రం'. ఆ డైలాగ్ కూడా మాస్ కోసమే అయ్యుంటుంది, విజిల్స్ మోగాలిగా).
టీవీ ప్రోగ్రామ్స్ చూడడం మానేసి ఏడేళ్ళయిందంటున్నారుగా, అదే కంటిన్యూ చేసెయ్యరాదూ, ప్రాణానికి హాయిగా ఉంటుంది? లేదూ చూడాలనే ఉంటే జై గొట్టిముక్కల గారి ఫార్ములా ఫాలో అయిపోండి. మేమంటే .. ఫూల్స్ ఆఫ్ ఇండియా .. కాబట్టి (నూతన్ ప్రసాద్ 🙂) జై గారన్నట్లు మాకు తప్పదు 😥. .
ఆ ఛండాలపు పాట నా కపిత్వపు పైత్యమే మేష్టారు, ఏ సినిమాలో లేదు. ఎవరికైనా నచ్చితే సినిమాలో పెట్టుకోవచ్చు.
తొలగించండి'ఘన నక్షత్రం' ...translation బాగుంది అలాగే మీరంటించిన చురకలు కూడా 😊
T.V ప్రోగ్రామ్స్ జోలికి నేనెన్నడూ వెళ్ళలేదు మేష్టారు నాకు గుర్తున్నంతవరకు. ఇండియా లో ఉన్నప్పుడు కూడా సినిమాలు టివి లో చూసేవాడిని గానీ ప్రోగ్రామ్స్ కాదు. ఇక్కడ ఇప్పుడు ఏ ఛానల్స్ రావు. ఏదో నెలకు ఇంత డబ్బుకట్టి subscribe చేసుకుంటే వస్తాయి గాని అంత ఇంటరెస్ట్ లేక డబ్బులు, టైం మిగుల్చుకుంటున్నాను.
ఏదో ఆస్ట్రేలియా లో ఉంటున్నాను గానీ, నేను కూడా మీరంటున్న ఆ తాను లోని ముక్కనే.
శభాష్ పవనప్పా, ఈ పాటలు చూస్తే వెగటురి సుందరకామస్ఫూర్తి లేదా బూత్రేయ లెవెల్లో ఉన్నాయి. మీరు బేగనే కృష్ణానగరులో మకాము పెడితే బోలెడన్ని సినిమా "పాటలు" "రాసు"కొని బిరీన కోటీశ్వరుడు కావడం ఖాయం. ఈ పాటలకు అభిమానులు ఆరేసుకోబోయి కాసుల రాసులు పారేసుకుంటారు. ఇంకొందరికి తిక్క రేగి తిమ్మిరెక్కి చిలక్కొట్టుడుతో పలక మార్చుకుంటారు. బంగారు బాతుగుడ్డులు & ఘెవ్వు కేకలు మీ పాటల ముందు బలాదూర్.
తొలగించండిఅఫ్కోర్స్ అవి చూసిన అమాయక ప్రేక్షక మహాశయులు కొందరు ఎర్రగడ్డ (వెల్లుల్లి కాదు) పయనం కడతారేమో కానీ థియేటర్ వాకిలి ముట్టని విన్నకోట & గొట్టిముక్కల పదిలంగానే ఉంటారు.
సిరివెన్నెల గారిలా మంచి పాటలంటే కష్టం కానీ ఇలాంటివి ఆశువుగా వచ్చేస్తాయి జై గారు
తొలగించండిఎర్రగడ్డ ( వెల్లుల్లి కాదు) - nice sense of humour
బిరీన - ఈ పదం చాలా రోజుల తరువాత వింటున్నా, మా రాయలసీమ లో వాడుతారు ఎక్కువగా
తొలగించండిజై గొట్టిముక్కల గారు "రాయల-తెలంగాణా" మూలాలున్న వ్యక్తేమో, పవన్ గారూ 🤔? మొన్న జై గారు కొన్ని సీమవంటకాల గురించి వ్రాశారు కదా, అప్పుడు నాకొచ్చిన అనుమానం ఇది. ఏం సంగతీ జై గారే చెప్పాలి.
తొలగించండివిన్నకోట వారూ, నేను రాయలసీమ అల్లుడినండీ. మా పెళ్లప్పుడు మా అమ్మ తెలంగాణ భాషలో, అత్తమ్మ (ఇప్పుడు లేరు) సీమ భాషలో మాట్లాడుకొని ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్ధం కాక ఎవరి జుట్టు వారు పీక్కున్నారు. నెమ్మదిగా ఆ భాష నాకూ కొంత అబ్బింది (మా అమ్మకు ఇప్పటికీ ఒక్క ముక్క అర్ధం కాదు).
తొలగించండికోసంబరి, వంగీబాత్ వగైరా జాబితా: ఆ వంటకాలన్నీ మా అత్తమ్మ గుర్తులు. వీటిలో కొన్ని మినహా మిగిలిన వాటిని ఎర్రగడ్డలు లేకుండా వండవచ్చు కనుక మీకూ ఒకే అనుకుంటా.
🦁 دشمن کی حرکات و سکنات پر نظر رکھنا
తొలగించండిجاسوسی 👌
మీకు ఉర్దూ?? ప్రావీణ్యం కూడా ఉందా నీహారిక గారు?
తొలగించండివాంగిబాత్ ఎరుకే, ఈ కోసంబరే కొత్త జై గారు.
తొలగించండిపవన్ గారూ, కోసంబరి అనంతపురం/బళ్ళారి వైపు చేస్తారు. రామనవమికి చేసే వడపప్పుకు కాస్త దగ్గర. ఎంగిలిపీసులో సలాడ్ అనవచ్చు.
తొలగించండిhttps://recipes.timesofindia.com/recipes/moong-dal-kosambari/rs58128266.cms
ఈవీఎం చోరీ ఫేమ్ వేమూరి హరికృష్ణ ప్రసాద్ దగ్గర ఎంత మంది ఇంజనీర్లు పని చేసారు? ఐటీ గ్రిడ్స్ అశోక్, లగడపాటి, భయపెట్టే సీను, చాకిరేవు & "ఛీ"బీఎన్ ఆర్మీ వగైరా వందిమాగధులు ఎవరూ పుక్కిటికే పని చేయలేదు కదా.
రిప్లయితొలగించండిఇదే ప్రశాంత్ కిషోర్ దగ్గర ఇద్దరు యూపీ కే చోక్రేలు కన్సల్టెన్సీ తీసుకున్నప్పుడు ఫలితాలు రాలేదు. మందిసొమ్ముతో "కొంగ దీక్షలు", బరాక్ ఒబామా క్యాంపైన్ రబ్బర్ చికెన్ డిన్నర్లు, స్విస్ వి"చా"రయాత్రలు చేసినోళ్లు & అసమదీయులకు ఫైబర్ గ్రిడ్డులు, రెయిన్ గన్నులు & "ఉరుము సూచనలు" కట్టబెట్టినోళ్లు ఇప్పుడు వేదాలు వల్లించడం విడ్డూరం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండినీహారిక గారూ, అన్ని ప్రాంతాలలో, కులాలలో & మతాలలో గొప్పవారు ఉంటారు. నేనెప్పుడూ ఏ కులాన్ని నిందించను.
తొలగించండిమీకు చంద్రబాబు నచ్చితే అది మీ ఇష్టం. పార్టీ ఘోర పరాజయానికి (పరాభవానికి) అతనే కారణం అన్న విషయాన్ని విస్మరిస్తే ఎలా? రాహుల్ గాంధీ (ఉత్తిత్తిగానే కావొచ్చు) ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానన్నాడు: చంద్రబాబుకు ఆ సోయి కూడా లేకపోవడం వాళ్ళకే నష్టం.
కెసిఆర్ *ఒక్కడే* తెలంగాణా తెచ్చాడనడం అసంగతం, అసంబద్ధం, అవాస్తవం. కెసిఆర్ పెద్దబాలశిక్ష చదువుతున్నప్పుడే (మా కుటుంబపెద్దలతో సహా) పలువురు మహనీయులు తెలంగాణా కోసం కొట్లాడారు. కాళోజీ అన్నట్టు "ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతరేస్తాం": అది కెసిఆర్ అయినా ఇంకెవడయినా.
https://www.youtube.com/watch?v=wqRumpHE5eQ
తొలగించండిhttps://www.youtube.com/watch?v=E08jlRA4_rk
తొలగించండిసింహాలు వెల్లుల్లి తి..న..వు..గా 🦁
రిప్లయితొలగించండిసింహాలు తినవు నరసింహాలు తింటాయి. నేను తినిపిస్తా...
రిప్లయితొలగించండిఛాలెంజ్ 👍
తొలగించండి🦁
నా బెట్ 10 వెల్లుల్లి పాయలు 😊. భలే బాగుంటాయి మీ ఇద్దరి వాఖ్యలు సరదాగా.
తొలగించండిThanks పవన్ గారూ.
తొలగించండినేను గెలిస్తే (గెలుస్తాను😎) ఆ పది వెల్లుల్లిపాయలకు మరో పది కలిపి కాంప్లిమెంటరీగా మీకే ఇస్తాను. Wish me good luck anyway 👍.
ఇంతకూ మీ బెట్ నీహారిక గారి మీదా, నా మీదా 🤔?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి@ పవన్ గారూ,
తొలగించండిఆ క్రెడిట్ అంతా వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకోని నరసింహారావుగారిదే !
ఎవరైనా ఇంటికి పిలిస్తే హాల్ లోనో గెస్ట్ రూమ్ లోనో లేదా వరండాలోనో కూర్చోవాలిగాని "బెడ్ రూమ్ లోకి పోతా, వంటింట్లోకి పోతా" అంటే ఎలా ఒప్పుకుంటారు.
తొలగించండిసూర్య గారూ, ఘోరహింసారెడ్డి సినిమాలో కాబోలు "మీ ఇంటికి వస్తా, మీ బాత్రూములో స్నానం చేస్తా, మీ వంటింట్లో ప్లేట్లు కడుగుతా" అనే డయలాగు ఉన్నట్టుంది కదండీ :)
తొలగించండికాకరకాయ బెడ్ రూం లో వండుతారా ?
తొలగించండిబెడ్ రూం దాకా రానిచ్చినవారికి వంటగదిలోకి రానివ్వడానికి ఏం మాయరోగం ?
కాకరకాయ వెల్లుల్లికారం మీక్కూడా కావాలా ?
చవుడప్పలు తయారయ్యేరే ఇక్కడ ?
ఎవడి బుధ్ది వక్ర , మెవడి తెలివిడి వి
వేక శూన్యమై స్రవించు చుండు ,
వాడి మెదడు నిండ చౌడు పోగు పడును ,
అతని విబుధులు "చవుడప్ప" యండ్రు .
ఇంటికి పిలిచిందెవరిక్కడ ? జిలేబీ గారిని ఎన్నిసార్లు అడిగినా సమాధానమే లేదు.
తొలగించండిఇంటి బయటి గేటు దగ్గరే నిల్చుంటాంలెండి దళితులం కదా ?
ఇంటికి పిలిచినా సరాసరి లోనికి వెలిపోరుగా. గేటు బయట నిలబడి కాలింగ్ బెల్ కొట్టాల్సిందే. ఈ లెక్కన లోకం లో అందరూ దళితులేనా. ఏమిటో ఈ మాయ.
తొలగించండి"పిలువుటయే ఎరగని మహా మాతాశ్రీ జిలేబీయే పిలిచిననాడు" చూద్దాం లెండి. అసలే ఆవిడ సింగపూరులో ఉంటారో ఏమో, అక్కడికి పోవడానికి విమానం ఖర్చులు ప్లస్ రానుపోను దారెమ్మట చిరుతిండ్లు తినడానికి దుడ్డులు లేవు కనుక నేను భరించలేను మన్నించాలి!
తొలగించండిరావణుడు కాలింగ్ బెల్ కొట్టితే వాకిలి తెరిచినందుకు సీతమ్మ తల్లి పడ్డ కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ అన్నీ ఇన్నీ కావు (నారదా).
మీ బాధేంటి సూర్యా ? శుక్రవారం మీ ఇంటికి లచ్చిందేవి వస్తానన్నా లచ్చిందేవికి తిక్క ఉంది దానికో లెక్క ఉంది అని బయటే నిల్చోబెడతారా ?
తొలగించండిసీతమ్మ కాలింగ్ బెల్ కొట్టి మరీ రావణాసురుడిని కిడ్నాప్ చేసుకుని తీసుకుపోతుందిలే, దుడ్డుల్లేనివాడికి దుడ్డుకర్రే గతి !
తొలగించండిపాత సామాన్లు కొంటా..... మ్ అనేవారు తప్ప లచ్చిందేవి ఎప్పుడూ రాలేదు లెండి మా ఇంటికి.
తొలగించండిమీరందరూ ఒకరికొకరు పర్సనల్ గా తెలుసా ఏమిటి? పుట్టు పూర్వోత్తరాలు అన్నీ మాట్లాడుకుంటున్నారు.
రిప్లయితొలగించండికొన్ని సార్లు మోర్స్ కోడ్ లాంటి language మాట్లాడుకున్నట్లు అనిపిస్తుంది మీరంతా, అర్థం కాదు నాకు 😀
@Pavan Kumar Reddy Rendeddula
తొలగించండిసుందోపసుందులు మీకు తెలుసా ? వారేవీరు !
అచ్చు తప్పు. మోర్స్ కోడ్ లాంటి language కాదు "సోర్స్ కోడ్"లాంటి language అనాలి. అది అర్థం కాకే కదా ఇన్ని ఐటీ ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి☺️
తొలగించండివిన్నాను వారి కథ నీహారిక గారు. థాంక్స్ మంచి పోలిక 😀
తొలగించండిOk Surya గారు, source code language మాట్లాడుకున్నట్లు ఉంటుంది మీరంతా.
తొలగించండిమిత్రులు సూర్య & పవన్ గార్లకు: ఈ సోర్సు కోడు బాధ మీ డెవలపర్లకు మాత్రమే సుమండీ.
తొలగించండినాలాగా బ్లాక్ బాక్స్ టెస్టింగ్ & ISO/CMM ఆడిట్ల దారి పడితే ఎవరూ ఆపలేరు. ఎక్కువ మాట్లాడితే regression testing, NCR, KRA అంటూ మా జార్గన్ మాకుంది. ఇందుకే మమ్మల్ని మేనేజర్ల ఖుర్చీలోకి పైకి లాగి తన్నితే (kicking upstairs) మీలాంటి కోడింగ్ కూలీలు (cubicle slaves) BRS/SRS/PMP వగైరాలతో జుట్టు పీక్కుంటారు.
PS: in continuation of an old engineer vs. manager discussion with Pavan garu
మానేజర్స్ మాట ఎత్తకండి, మంటెత్తి పోతుంది మా లాంటి కోడింగ్ కూలీల దగ్గర 👿, మిమ్మల్ని కూడా కలిపే 😀
తొలగించండి:)
తొలగించండిhttps://www.vox.com/2014/4/7/17959960/super-super-super-secret-easter-eggs
తొలగించండిమానేజర్ల మీద మరీ మంటెక్కువైతే కోడులో ఈస్టర్ గుడ్డులు పెట్టండి.
ఉ. మీ అ"భాసు"డు ఘంటల కొద్దీ రివ్యూ మీటింగులు పెట్టి (అందునా శుక్రవారం మధ్యాహ్నం మొదలెట్టి) చావబాదే రకం అనుకుందాం. కస్టమర్ పేరు మీకు తెలుసు (say David Beckham). టెస్టర్లు చెక్ చేసినప్పుడు ఏదో స్టాండర్డ్ పేర్లను (say Joe Brown) పెట్టి కోడు ఒకే చేస్తారు.
గో-లైవ్ టైములో first name= David, last time= Beckham అని దావీదుడు కొట్టినప్పుడు "ప్రియమైన కస్టమర్ మహాశయా, మా కంపెనీ మంచిదే కానీ ఈ తిక్క శంకరయ్య బాధలు పడలేకున్నాం. మీరు దయచేసి ఈ పెంట వెధవ మీద మా సీఈవో గారికి ఫిర్యాదు చేస్తే మీ పేరు చెప్పుకొని బతుకుతాము" అంటూ ఎర్రర్ మెసేజీ వచ్చేటట్టు పెట్టండి.
కీచకుడి పేరు & డిజిగ్నేషన్ సరిగ్గా రాయాలి లేకపోతే ఇంకెవరికో తగిలి మనకే ఉసురు పట్టుకుంటుంది. పొరబాటున "మా కంపెనీ చెత్తది" అని మాత్రం అనకండి, ఉద్యోగం ఊడుతుంది. మీ పేరు రాసేంత అమాయకత్వం లేదని నా ఆశ.
కొత్త మానేజర్ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవడమే కాక మీ టీమ్ అందరికీ ఇంక్రెమెంటు ఇస్తాడు. ఈ సలహా ఇచ్చినందుకు నా ఫీజు ఎంత & ఎక్కడికి పంపాలో ఇమెయిల్ ద్వారా చెప్తాను.
PS (small fonts): no guarantee, please take this advice under your own risk.
September go live ఉంది, అప్పుడు మీరు చెప్పినట్లే చేస్తాను
తొలగించండిపవన్ గారూ, ఆల్ ద బెస్ట్. చిన్న అక్షరాలలో రాసిన disclaimer ప్రకారం సర్వ బాధ్యతలు మీవే, నన్నేమీ అనొద్దు.
తొలగించండిఅన్నట్టు కామెంట్ ఫాంటు తగ్గించడం ఎలా తెలిస్తే చెప్పండి.
పవన్ జీ, మీకు మానేజర్ల మీద బాగా మంటగా ఉన్నట్లుంది.
తొలగించండిఒకసారి అతని బూట్లు తొడుక్కుని చూడరాదూ మీ అభిప్రాయం మారొచ్చు.
జై గారు, ఈ కామెంట్ ఫాంట్ తగ్గించడం నాకు తెలీదు ☹️
తొలగించండిఆ బూట్లు తొడుక్కుని చూస్తే నా అభిప్రాయం మారొచ్చు, కానీ ఆ రొచ్చు లోకి ఇప్పట్లో మారే సూచనలు లేవు.
తొలగించండిఅడ్డెడ్డెడ్డె, ఓం శాంతిః. నేనొక సోషల్ విజిట్ పై బయటకు వెళ్ళి ఇందాకే తిరిగి వచ్చాను, అందువల్ల ఇక్కడి కామెంట్లు ఇప్పుడే చూడగలుగుతున్నాను. చాలా విసుర్లే జరిగినట్లున్నాయే?
రిప్లయితొలగించండి———————-
గేటు దగ్గరే నిలబడి వెళ్ళిపోవలసిన అవసరం మీకేమిటి నీహారిక గారూ? సాదరంగా ఇంట్లోకే తీసుకొస్తాం. కాకరకాయ వేపుడు చెయ్యకపోయినా కూడా మీరు నిరభ్యంతరంగా వంటింట్లోకి రావచ్చు 👍. మడికి underlying reason అయిన శుభ్రత ఉంటుంది, ముట్టుకోకూడదనే మడి ఉండదు ☝️.
ఇక ఇంట్లో “అయ్యరువారి చేతి కాఫీ” అంటారా, అది “జిలేబి” గారి అదృష్టం. అఫ్కోర్స్ ఒకప్పుడు మేమూ అయ్యరు కాఫీ తాగేవాళ్ళం .... అయ్యరు హోటల్లో 😀 (ఇప్పుడు ఆ హోటళ్ళే కనబడడం లేదు)
మిమ్మల్ని మా ఇంటికి పిలవకపోవడమేమిటి? గుర్తు తెచ్చుకోండి, ఇదివరకే ఆహ్వానించాను కదా. సరే మీ ఫోన్ నెంబరు నాకు మెయిల్ చెయ్యండి ... మరోసారి పిలుస్తాను ... బ్లాగ్ ముఖంగానే కాక పర్సనల్ గా కూడా ఆహ్వానిస్తాను ... అలాగే మా ఇంటికి ఎలా రావాలో వివరిస్తాను.
Thank You ! Some othertime !
తొలగించండి# నీహారిక గారూ (30 May 2019 at 21:22)
రిప్లయితొలగించండి// “మీరు జిలేబీగారిలాగా "బ్రాహ్మాణికల్ ఆటిట్యూడ్" చూపిస్తే ఎలా గెలుస్తానండీ ? “ //
———————
“నాన్న” బ్లాగ్ లో ఓనర్ భాస్కర రామరాజు గారి 30-05-2019 నాటి “కీర్తి” అనే టపాలో // “మాటల మధ్యలో బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ అంటూ పదజాలాన్ని వాడగలగాలి“ // అన్నారు. మీరూ ఆ పంథాలోనే నడుస్తున్నట్లున్నారు.
ఇదంతా కాదు గానీ అసలు ఓ పని చేద్దాం ... మిమ్మల్ని వచ్చే జన్మలో “అగ్రహారం”లో (మీ ఫేవరైట్ పదం) పుట్టించమని నేను వెళ్ళినప్పుడు రికమెండ్ చేస్తాను, ఓకేనా 👍? సాధకబాధకాలు స్వయంగా తెలుసుకుందురు గాని 🙂.
జిలేబీగారు పిలిచేదాకా ఎక్కడికీ వచ్చేదిలేదు. నాకు మరో జన్మలేదు. అగ్రహారంలో పుట్టేదీ లేదు.
రిప్లయితొలగించండినేను మా ఇంటికి ఆహ్వానిస్తుంటే మధ్యలో "జిలేబి" గారి ప్రస్తావన / ఆహ్వానం / క్లియరెన్స్ ఏమిటి?
తొలగించండిమీ ఇష్టం, కానీ జరగని పనుల గురించి ఆలోచించడం అనవసరం కదా.
వెల్లుల్లికారం తినిపించే బాధ్యత నాది, ఎక్కడ తినిపిస్తే ఏమిటి ? పందెం గెలిచాక వస్తానండీ !
తొలగించండి"లేని పిలుపులు" సినిమాలోని పాట మీకోసం!
తొలగించండిమరు జన్మ ఉన్నదో లేదో.. ఈ పిలుపులప్పుడేమౌతాయో...తెలిసీ పిలిచీ కలహించుటలో...కిక్కుదనం ఎవరికి తెలుసూ ఊ..
కుక్కు గతి ఇంతే..(టిం టిం టిం)
.కుక్క బతుకంతే..(టిం టిం టిం)
కుక్కున్న ఇంటికీ.. పోకూడదంతే..!
పోతే పోనీ పోరా
తొలగించండిఈ పాపపు జగతిని
శాస్వతమెవడురా ?
శాస్వతము కాదు, శా..శ్వ..త..ము అని వ్రాయాలి 😎.
తొలగించండి🦁
ఏ తామరాకు పంతులు నేర్పాడు మీకు 🤗 ?
తొలగించండిశాస్వతమే సరి అయినది. శ్యామలీయం గారిని అడగండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండితామరాకు పంతులు - ఈ పద ప్రయోగం వినడం మొదటి సారి. ఏదైనా ఫ్లో లో వచ్చిన పదమా లేక దీని వెనుక అర్థం ఏమైనా ఉందా?
తొలగించండిఅయితే నేను కూడా తామరాకు పంతులు దగ్గరే నేర్చుకున్నాను నీహారిక గారు ☹️
https://anaganagaokurradu.blogspot.com/2019/05/teepantulu.html?m=1
తొలగించండిమాధవ్ “కుర్రాడు” తేయాకు పంతులు అన్నాడుగా. ఇప్పుడు ఈవిడ తామరాకు పంతులు అని వెటకారం అన్నమాట. పంతుళ్ళ మీద విసుర్లు విసరమంటే ఈవిడకు మహా సరదాగా ఉంది.
తొలగించండిశాస్వతం సంగతి తేల్చండి 🦁 పంతులుగారూ !
తొలగించండిమున్ముందు తమలపాకు & తంబాకు (అనగా జర్దా) కథలు కూడా వస్తాయంటారా పంతులు గారూ? అసలే అజయ్ దేవగన్ కమలా పసంద్ యాడులు క్రికెట్ మాచీల మధ్య ఊదరగొట్టేస్తున్నాయి!
తొలగించండిశాశ్వతం సంగతి తేల్చండి 😀
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి@గొట్టిముక్కల గారూ,
తొలగించండితంబాకు అంటే పొగాకు అని అర్ధం అట...పూడూరి రాజిరెడ్డిగారు ఒక కధలో వ్రాసారు. మిమ్మల్ని నమ్ముకుంటే కొల్లేరే ..
నీహారిక గారూ, తంబాకు అర్ధం నాకు తెలుసు. రాజిరెడ్డి గారెవరో తెలీదు.
తొలగించండిజర్దా కూడా పొగాకేనండీ, అందుకే మింగకుండా ఊంచుతారు. FYI Baba zarda is # 1 brand. ఒకప్పుడు జర్దా పాన్లు కట్టించుకోవడమే పాపులర్, ఆ తరువాత పాన్ మసాలాలు వచ్చాయి (అఫ్కోర్స్ నస్యం ఇంకా పాత ఫాషన్ కానీ నా చిన్నప్పుడే కనుమరుగయింది).
ఆవిడ నిష్టూరమాడడం, మీరు వివరణనిచ్చుకోవడం ... హ్హ హ్హ 😀.
తొలగించండిఆవిడ "చింపుల్" గా నిఘంటువు చూసుంటే నాలుగురోజుల క్రితమే ..మీ వ్యాఖ్య నాడే.. తెలిసిపోయేదిగా 😀.
తంబాకు
ఆవిడ నిష్టూరం ఆడినట్టి నాకయితే అనిపించలేదు గురువు గారూ.
తొలగించండిఏదో కథ చదివినప్పుడు "ఈ పదం ఎక్కడో వినట్టుంది" అనిపించడం, తీరా చెక్ చేసాక deja vu మల్లె "ఔరా ఇదా దీని అర్ధం" అనుకోవడం అందరికీ జరుగుతుంది.
ఇకపోతే పాన్ కట్టడం ఒక కళ. ఇరానీ హోటళ్లలాగే పాన్ డబ్బాలకు కూడా నా హాట్సాఫ్.
@ జై గారు - పూడూరి రాజి రెడ్డి అనే వ్యక్తి ఈ జనరేషన్ కవి, కథలు అవీ రాస్తుంటారు అనుకుంటా.
తొలగించండి@ విన్నకోట వారు - తెలుగుకు ఆన్లైన్ నిఘంటువు ఉందని ఇవాళే మీ వల్ల తెలిసింది. ఇకపైన ఎవర్నీ అర్థం అడిగే అవసరం లేకుండా అందులో సెర్చ్ చేసుకోవచ్చు. థాంక్స్.
# జై గారు
తొలగించండి"మిమ్మల్ని నమ్ముకుంటే కొల్లేరే.." ==> tending to నిష్టూరం ... అని నాకనిపించింది. మీకలా అనిపించలేదా? అదృష్టవంతులు సుమండీ 🤚..🙂...😊....😃😃.
(jk🙂)
@ Jai gaaru,
తొలగించండిజర్దా అంటే పాన్(కిళ్ళీ)అనుకున్నానే 🤔
@ విన్నకోట నరసింహా రావు గారు,
Very Bad 🐯
Welcome పవన్ గారు.
తొలగించండిandhrabharati.com
-----------
అవునండి, పూడూరి రాజిరెడ్డి గారు మంచి
కథకుడు. వారి కథలు తరచుగా "ఈమాట" వెబ్ మాసపత్రికలో వస్తుంటాయి.
eemaata.com
# నీహారిక గారు
తొలగించండిఆహా(, నరసింహారావు వెరీ బేడా? మీరేమో జర్దా అంటే ఉత్తి కిళ్ళీ అనుకున్నారా? ఇంకా నయం, ఒకటి నమిలి చూడలేదు, ROFL 😀😀😀.
అంతే, మీ "తామరాకు" పంతుళ్ళ దగ్గర నేర్చుకుంటే "కొల్లేరే" మరి ... 😀😀.
తామరాకు పంతుళ్ళు అంటే బీజేపీ వాళ్ళండీ! వాళ్ళకే తెలిసిచావదు నాకేమి నేర్పుతారు ? గొట్టిముక్కల గారు గులాం పంతులు. సర్వజ్ఞులు.
తొలగించండి"తామరాకు" పంతుళ్ళు అంటే ఇంకా ఎవరో అనుకున్నాను. నిర్వచనం చెప్పి బతికించారు.
తొలగించండిగొట్టిముక్కల వారు సర్వజ్ఞులే లెండి, అయితే వారిని "గులాబీ పంతులు" చేశారన్నమాట 👌.
గులాబీ పంతులు....అంత సీన్ లేదు.
తొలగించండిబాబీ నానీ, పద్మార్పిత గులాబీ గ్యాంగ్.
జిలేబి గారు మీరు వంటి పెద్దలు పూనుకుని ఇంకా పెళ్ళయి ఉండకపోతే ఆ పద్మార్పిత గారి పెళ్ళి చేసెయ్యరాదూ? దాంతో ఆవిడ విరహ కవితలు రాయడం ఆగుతుంది కదా? పాఠకులు క్షేమం కోరి ఆ పని చెయ్యండి ప్లీజ్.
తొలగించండివిన్నకోట వారు & నీహారిక గారు:
తొలగించండినేను పండితుడని కాదు, సర్వజ్ఞుడను అంతకన్నా కాదు. పండితుల సమక్షంలో కూచేనేటంత అర్హత కూడా లేని అల్పుడను.
చిన్నప్పుడు నాకు బుద్ధి నేర్పుదామని పాపం గురువులు ఎంతో ప్రయత్నించారు. అదేదీ పని చేయకపోగా తెలుగు క్లాసులో పైథాగరస్ గురించి, ట్రిగ్నామెట్రీ తరగతిలో గురులఘువుల గురించి డౌట్లు అడిగే ఈ తిక్క వెధవ సోపతిలో మిగిలిన పిల్లలు చెడిపోతారని "అటెండెన్స్ వేస్తా ఇంకోసారి నా క్లాసులో కనిపించకురా" అని గెంటేయడం మొదలెట్టారు. ఛాన్స్ దొరికిందని పనికిమాలిన ఇరానీ హోటళ్లు, అడ్డమయిన క్రికెట్ మాచీలు & ఎందుకూ కొరగాని క్విజ్/డిబేట్ల చుట్టూ తిరిగేవాడిని. ఈ తిరుగుళ్లలో ఎవరయినా ఏదయినా (ఉ. పాన్ ఎన్ని రకాలుగా కట్టొచ్చు? బౌన్సర్ వేస్తే హుక్ చేయాలా డక్ చేయాలా?) చెప్తే అది (చటాకు మందమే) నేర్చుకున్నాను కానీ అవేవీ బాగుపడాల్సిన వాళ్లకు అక్కర వచ్చేవి కావు.
PS: నీహారిక గారూ, కుదిరితే ఒకసారి గుజరాత్ వెళ్ళిరండి. అక్కడ బడిపిల్లలు సైతం కన్నులపండువలా ఘుట్కా (pan masala satchets, not Zarda pan) నములుతూ కనిపిస్తారు.
అధ్గదీ విషయం, అందుకే మీరు సర్వజ్ఞులు అయ్యారు జై గారూ, క్లాస్ రూమ్ లో కూర్చొని నేనేమీ నేర్చుకోకుండా ఇలా మిగిలి పోయాను.
తొలగించండి"నేను పండితుడని కాదు, సర్వజ్ఞుడను అంతకన్నా కాదు" అని అంత స్పష్టంగా చెప్పినా మళ్ళీ అంటారేంటండీ పవన్ గారూ.
తొలగించండిపది మందితో కలిసి జ్ఞానం బాగా పెంచుకున్నారు అని నా అభిప్రాయం జై గారు.
తొలగించండిమా బాబాయ్ ఇలాగే అసలు ఏమి చదవకపోయినా పడి మందితో కలిసి తిరిగి బాగా జ్ఞానం సంపాదించుకున్నాడు.
:)
తొలగించండి
తొలగించండి"పనికిమాలిన ఇరానీ హోటళ్ళు" అనకండి జై గారూ. ఇరానీ హోటళ్ళు knowledge exchanges. ఒకప్పుడు నేనూ రెగ్యులర్ గానే దర్శించే వాడిని. Those were the days 😎. Nostalgia.
బాగుపడాల్సినవాళ్ళకు అక్కరకు వచ్చేవి కావు అంటారేమిటి, ఇప్పుడు మీరేం చెడిపోయారని? పవన్ చెప్పింది కరెక్ట్ ... 'పదిమందితో కలిసి" తిరిగి బోలెడంత బహుముఖ knowledge సంపాదించుకున్నారు. "చదువులలో మర్మమెల్ల చదివితి దండ్రీ" అన్ళటువంటీ ప్లహ్లాదుడి అంశ మీది అనాలి అసలు 😀.
"ఇరానీ హోటళ్ళు knowledge exchanges"
తొలగించండిగురువు గారూ నిజమేనండోయ్. మా నాన్న "ఊరికే చెత్త తిరుగుళ్ళు తిరిగే బదులు పొస్తకాలు చదువురా" అనేవాడు. ఇరానీ హోటళ్లే నిజజీవిత గ్రంధాలయాలని వాదిస్తే తొడపాశం పెట్టేవాడు.
ఆయన మాటల మాయలో అలా రాసాను మన్నించండి!
PS: ఏ మాటకామాటే చెప్పాలి. మా నాన్నకు మాలాగే క్రికెట్ పిచ్చి, టీవీలో మ్యాచ్ ఉన్నంతసేపు చదవమని పోరడం మానేసి పిల్లలతోబాటే చూస్తూ ఎంజాయ్ చేసేవాడు. క్రికెట్ విషయంలో మట్టుకు ఆయనే మాకు గురువు (ఆయన పిచ్చే మాకూ పట్టిందనడం కరెక్టేమో).
మా నాన్న చూడనిచ్చేవారు కాదు, కడప లో ఉన్నప్పుడు బస్టాండ్ ఇంటికి దగ్గరగా ఉండేది, అక్కడ ఉండే t.v లలో చూసేవాడిని.
తొలగించండిఇరానీ హోటళ్ళలాంటి వాటి మీద అభిప్రాయామూ అభిమానమూ తోటివాళ్ళతో పంచుకోవాలి గానీ ఇంట్లో పెద్దవాళ్ళకు చెబుతారటండీ ఎవరైనా? You asked for that తొడపాశం 😀😀.
తొలగించండిమీతో బాటు క్రికెట్ పిచ్చి ఉన్న తండ్రి - ఎంతదృష్టం 👌. మా తండ్రి గారైతే ... టీవీ ఆఫ్ చెయ్యమనే వారు కాదు గానీ ... మనవాళ్ళు (అంటే ఇండియా) ఆడుతున్నారా అని అడిగేవారు. ఎవరెవరితో ఆడుతున్నా చూసేసే రకాలం మనం. లేదండీ అని జవాబిస్తే .. మరెందుకురా చూడడం అని ఆశ్చర్యపోయేవారు 😀. అది ఆయన దేశభక్తి (సగం జీవితం బ్రిటిష్ ఇండియాలో గడిపిన మనిషి కదా) 🙏.
@విన్నకోట నరసింహా రావు:
తొలగించండి"You asked for that తొడపాశం": yes sir!
"క్రికెట్ పిచ్చి ఉన్న తండ్రి - ఎంతదృష్టం"
మా నాయనకు క్రికెట్ పిచ్చి ఎంతంటే ఆస్ట్రేలియాలో యాషెస్ మాచీలు ఉంటే తెల్లారే లేచి కామెంటరీ వినేవాడు. మా అమ్మకు టైం జోన్ల గొడవ అర్ధం కాక "ఈ తెల్లోళ్ళకు పోయేకాలం వచ్చింది, మబ్బునే లేచి ఈ ఆటలేంది" అని గొణిగేది.
🙂
తొలగించండి// “వెల్లుల్లికారం తినిపించే బాధ్యత నాది, .....” //
రిప్లయితొలగించండిపైన చెప్పాగా ... జరిగే అవకాశం లేని పనుల గురించి ఆలోచించడం వృధా అని. అయిననూ ... ఆల్ ది బెస్ట్ 👍.
# జై గారూ,
రిప్లయితొలగించండి// “నేను రాయలసీమ అల్లుడినండీ.” //
———————
ఆహా, అయితే మన “కాంగరూ” పవన్ లాగా మీరు కూడా సుమో వ్యాన్ల బేచ్ అన్నమాట, మీ యిద్దరితో జాగ్రత్తగా ఉండాలి 😳.
—————-
మీరు టి.డి.పి. కు ఎందుకు వ్యతిరేకమో ఇప్పుడర్థమైంది. అప్పటి ప్రతిపక్ష నాయకుడు సీమవాసి కాబట్టి కదా? ఆ నిగూఢ అభిమానం వలనా ? 😀😀😀😀😀 jk.
——————
// “నెమ్మదిగా ఆ భాష నాకూ కొంత అబ్బింది” //
అబ్బకేం చేస్తుంది, ఇంట్లోనే “ట్యూటర్” ఉన్నప్పుడు 😀😀.
——————
btw, ఎర్రగడ్డలు అంటే వెల్లుల్లి కాదు (garlic), నీరుల్లి (onion) అనుకుంటానే?
గురువు గారూ, గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారే కాదు ఇందాకటి దాకా ఉన్న పెద్దమనిషి కూడా రాయలసీమ వ్యక్తే (పేరుకే?) కదండీ. అంతేకాక ఆయన వియ్యకుండు-కం-బామ్మర్ది (గతంలో మామ & ఇంకో బామ్మర్ది కూడా) సీమ ఎమ్యెల్యే గిరియే వెలగబెట్టారు.
తొలగించండి(పేరు చెప్పకుండా వెటకారం చేయడం చెంద్రాలు సార్ స్టైల్, నేనూ ఇక్కడ ఆ రకంగా ముందుకు పోయాను తప్ప వేరే పరిస్థితి కాదని మీకు తెలియజేసుకుంటున్నాను)
ఈ సీమ సూమోలు అంతా టాలీవుడ్ పుట్టించిన గబ్బు. హీరో గారికి వయసు & బరువు పెరిగి జుట్టు రాలేసరికి ఏదో ఒక కొత్త ఫార్ములా కావాల్సి వచ్చింది. వీళ్ళ బాబుకు మల్లె గుండీలు విప్పి కుర్రపిల్లలతో డబుల్ మీనింగ్ పాటలు & వెకిలి చేష్టలు వేస్తే జనం ఈలలు వేసే రోజులు పోయాయి. పోనీ ఘననక్షత్రంలా డాన్సులు చేద్దామంటే వళ్ళు తిరగదు. సెలెక్షన్ సింగ్ తరహాలో డయలాగులు పేలడమంటే నోరు పెగలదు. కుటుంబంలోనే పోటీకి జూనియరులు మొదలయ్యారు. పీరియడ్ ఫిల్ములు లేదా పౌరాణికాలు చేద్దామంటే దర్శక చంద్రుడు ముక్కు వెంట్రుకల కోజప్పులతో పరువు తీసాడు.
కిం కర్తవ్యం? క్యా కర్నా? సూమోల పుణ్యమా అంటూ "షూటింగ్ స్టార్" ఇంకొన్ని రోజులు వెలిగాడు.
తెల్లగడ్డలు అంటే onions, ఎర్రగడ్డలు అనగా garlic.
Australia కంగారు అనేనా మీ ఉద్దేశ్యం నరసింహా రావు గారు?
తొలగించండిఇంట్లోనే tutor ఉండటం 😀
జై గారు, మీ వెటకారానికి నవ్వలేక చచ్చాను, కెవ్వు కేకే
తొలగించండిఇంట్లో ఉన్నది tutor కాదు, manager!
తొలగించండిPS: దయచేసి మేనేజర్ల గురించి ఇతర వ్యాఖ్యలను ఇందులోకి గుంజొద్దు ప్లీస్
Of course "Australia కంగారు" అనే నా ఉద్దేశ్యం పవన్ గారూ. ఈ జంతువు పేరుని ఆస్ట్రేలియన్లు "కంగారు" అని పలుకుతారా లేక "కేంగరు" అని పలుకుతారా?
రిప్లయితొలగించండిఇక్కడి వాళ్ళు కెంగరు అనే పిలుస్తారు.
తొలగించండిఇక్కడికి వచ్చిన కొత్తలో కంగారు అని పిలిస్తే లోకల్ వాళ్ళు వింతగా చూసేవాళ్ళు.
// "కెంగరు" //
తొలగించండిThanks Pavan. That is what I thought too.
"I came today" కొన్ని (Perth?) యాసలలో "I came to die" అన్నట్టు వినిపిస్తుంది. ఈ కెంగరు (తిండానికి చాలా బాగుంటుందంటారు మీకే తెలియాలి) ఆ బాపతే కాబోలు.
తొలగించండికోళ్లు,మేకల taste వరకే పరిచయం నాకు, ఈ కేంగరు taste జోలికి వెళ్లలేదు కానీ వారానికి రెండుసార్లు తినే మా కలీగ్ మాత్రం బాగుంటుంది అంటూ ఉంటాడు
తొలగించండినెమలిని తింటే జైలులో వేస్తారు కదా కేంగరూలను తింటే శిక్షలు లేవా ?
తొలగించండిGood question నీహారిక గారూ.
తొలగించండిపవన్ గారూ, అమెరికా/ఐరోపాలో లాంబ్ (మటన్) సాధారణంగా గొర్రె మాంసం. మేకయితే స్పెసిఫిక్కుగా goat అని రాస్తారు. ఆస్ట్రేలియాలో కూడా అంతే అయిఉంటుందేమోనని అనుమానం. Australia (NZ also) has more sheep than humans అంటారు కనుక అడుగుతున్నా.
తొలగించండినీహారిక గారూ, కంగారూలకు herd instinct లేదు కనుక వాటిని వేటాడాలి. వేటమాంసాన్ని (game, venison etc.) తినడం యూరోపియన్ సంస్కృతిలో నిషిద్ధం కాదు, కనుమరుగు అవుతున్న వన్యజీవుల (endangered species) వేట మాత్రమే నిషిద్ధం.
ఆస్ట్రేలియాలో కంగారూ మాంసం గురించి cultural taboo లేదు.
Just for info. Hunting or slaughter of specified animals may be forbidden but eating per se is not a crime.
తొలగించండికెంగరూ ల సంఖ్య బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా అలాంటి శిక్ష లు విధించలేదు అనుకుంటా
తొలగించండిExcerpts from the book Collapse by Jared Diamond (Chapter 13: "Mining" Australia):
తొలగించండి"Kangaroo meat is lean, healthy, and (in my opinion)
absolutely delicious. In addition to their meat, kangaroos yield valuable hides"
"Unlike sheep, kangaroos are not herd animals that will docilely obey one shepherd and a dog, or that can be rounded up and marched obediently up ramps into trucks for shipment to the slaughterhouse. Instead, would-be kangaroo ranchers have to hire hunters to chase down and shoot their kangaroos one by one. Further strikes against kangaroos are their mobility and fence-jumping prowess: if you invest in promoting growth of a kangaroo population on your property, and if your kangaroos perceive some inducement to move (such as rain falling somewhere else), your valuable crop of kangaroos may end up 30 miles away on somebody else's property"
"While kangaroo meat is accepted in Germany and some is exported there, sales of kangaroo meat face cultural obstacles elsewhere"
ఇక్కడ lamb బాగా తింటారు జై గారు goat కన్నా
తొలగించండిఒకే సార్. మీరు కామెంటులో "కోళ్లు *మేకల* taste వరకే" అన్నారు కనుక డౌట్ వచ్చి అడిగాను.
తొలగించండి// "ఇక్కడ lamb బాగా తింటారు" //
తొలగించండి---------------
Naturally. పాపం, గొర్రె రెండు రకాలుగా ఉపయోగపడుతుంది కదా - ఉన్నీ ఇస్తుంది, తినడానికీ పనికొస్తుంది 😀. poor lamb ధన్యజీవి అందామా 🙄?
మేక గొర్రె రెంటి మధ్య taste పెద్ద తేడా ఉండదు నాకు అందుకే మేక అని చెప్పేశా జై గారు
తొలగించండిఅవును మేష్టారు, గొర్రె రెండు రకాలుగా ఉపయోగడుతుంది పాపం.
తొలగించండి# జై గారు,
రిప్లయితొలగించండిఆనవాయితీగా రాయలసీమలో భాగం అన్నా కూడా నాకెందుకో చిత్తూరు జిల్లా మాత్రం సీమ అనే అభిప్రాయం కలగదు. ఇతమిద్ధంగా ఇదీ కారణం అని చెప్పలేను గానీ ఎందుకనో ఆ ఫీలింగ్ రాదు .. నాకు.
మీ వెటకారం నిజంగా వెటకారం టు ది పవరాఫ్ వెటకారం 😀. అసలు మీరు సినిమాలకు రివ్యూ ఎందుకు వ్రాయకూడదు పత్రికల్లో ... డెక్కన్ క్రానికల్ లో సురేష్ కవిరాయణి లాగా?
ఉల్లిపాయలలో తెల్లవే కాక ఎరుపు ఉల్లిపాయలు (onions) కూడా ఉంటాయి. నాకు తెలిసి వాటిని ఎర్రగడ్డలు అంటారు. అఫ్కోర్స్ ప్రాంతీయ భేదాలు ఉండచ్చు లెండి.
కోలారు, తమకూరు & కృష్ణగిరి నాడే పోయాయి. ఆ తరువాత బళ్ళారి కూడా పోయింది. ప్రకాశం జిల్లా ఏర్పరిస్తే ఇంకొంచం భూభాగం తోలుకెళ్లారు. నెల్లూరు & పల్నాడు ఇప్పటికే "ఆంధ్రీకరణ" జరిగింది. ఇప్పుడు చిత్తూరు కూడానా!
తొలగించండిఇక తిరుమల వెంకన్న నామాల రక్షణ కోసం రమణ దీక్షితులే రంగంలో దిగాలి, లేకపోతే ఆయనెవరో సైడు హీరో గారు తోకలు పెట్టి విజయభేరి మోగిస్తాడు!
ఈ ఎర్రగడ్డ-తెల్లగడ్డ వివాదం తేల్చాలంటే ట్యూషన్ తీసుకోవాలి, ఫీజు కింది నాతోటి వాటిని కోయిస్తుందేమో అని భయం గురువు గారూ.
నిన్న ఆదివారం ఎవరో "జైన్ నాన్ వెజిటేరియన్" కలిసారు. చికెన్ తింటారట కానీ ఉల్లిగడ్డ & వెల్లుల్లి మాత్రం పక్కన పెట్టేసారు ఈ మహానుభావులు!
కాకరకాయ కాస్తా వెల్లు(ఉ)ల్లిపాయ అయిపోయింది.
తొలగించండిజైన్ నాన్-వెజిటేరియన్ 🙄 ?????? ఇదేదో paradox / self-contradictory లాగా ఉందే 🤔 ? ఆ పెద్దమనిషి తన వ్యక్తిగత రుచుల ప్రకారం నాన్-వెజిటేరియన్ తింటున్నాడేమో? పెంపకం మర్చిపోలేక ఉల్లిపాయ, వెల్లుల్లి పక్కన పెట్టేసాడేమో 😀😀?
తొలగించండిగురువు గారూ, జెట్ ఎయిర్లైన్స్ పుణ్యమా అంటూ JVML తెలుసు కానీ ఈ JNML చూడడం ఇదే మొదటిసారి. నిన్నే పరిచయం అయిన వాళ్ళను నేరుగా ఈ వింత "ఫుడ్ కామెడీ" కారణం అడిగితే బాగుండదని అడగలేదు. వచ్చే సారి కలిసినప్పుడు అడుగుతాను.
తొలగించండినేర్చుకోవాలంటే "ఫీజు" ఇచ్చుకోక తప్పదుగా జై గారూ 🙂. తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కోయించడం లాంటి ఫీజు గనక అయితే ఆ మేర అదృష్టవంతులే కదా; అలా కాక ఏ నగో నట్రో అంటే .... టీవీ పరిభాషలో చెప్పినట్లు .... మీరు అడ్డంగా దొరికిపోయినట్లేగా 😀😀.
తొలగించండివద్దులెండి, మీరు ఎర్రగడ్డలు అనుకోండి, నేను వెల్లుల్లిపాయలు అనుకుంటాను 👍 😀.
(కళ్లెమ్మట కారుతున్న నీళ్లు తుడుచుకుంటూ): సార్ నగానట్రా అంత సీను నాకెక్కడదీ? ఏటీఎం కార్డులు అప్పచెప్పేసి నా జేబు ఖర్చుల కోసం చేయి చాచి అడిగే రోజులు ఇప్పుడే వచ్చేసాయి!
తొలగించండిఅంతవరకు జరిగిందా? అవున్లెండి, సీమనీళ్ళా మజాకానా?
తొలగించండిమీకు ఖర్చెందుకనేగా నేను - మీరు మీ భాషలో అనుకోండి, నేను నా భాషలో అనుకుంటాను - అని "కాంప్రమైజేషన్" చెప్పింది. ఎప్పుడైనా మనం కలిస్తే వెల్లుల్లి గురించి communication gap వచ్చే ప్రమాదం. We will cross that bridge when we come to it.
నేలటికెట్టు బాస వేరే గోస వేరే ...అర్ధం చేసుకోరూ !
తొలగించండివిన్నకోట వారూ, నేను మామూలుగా ఉల్లిగడ్డ & వెల్లుల్లి అనే పాదాలను వాడతాను కనుక మనమధ్య communications gap రాదని ఆశిద్దాం.
తొలగించండిఇప్పట్లో నాకు (పొరపాటున చంపేస్తా నరికేస్తా, విలయ విధ్వంసధామ, అభిమన్యురెడ్డి లాంటి సినిమాలు చూసేస్తే తప్ప) ఆగ్రా/ఎర్రగడ్డ/నింహాన్స్ వగైరా వెళ్లాల్సిన అవసరం లేదు లెండి :)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి"పదాలను" అనాల్సి టైపో వచ్చింది. Sorry for the mistake.
తొలగించండి# జై గారు,
తొలగించండిJNML.
బహుశః అటువంటి పనులు చెయ్యడం వల్లనేనేమో జెట్ ఎయిర్వేస్ ఇబ్బందుల్లో పడింది? హ్హ హ్హ 😀😀
ఏమిటా జెట్ ఎయిర్వేస్ కథ మేష్టారు?
తొలగించండి# Pavan Kumar
తొలగించండిJet Airways crisis
Thanks Mestaaru.
తొలగించండి// "ఇంట్లో ఉన్నది tutor కాదు, manager!" //
రిప్లయితొలగించండిThat goes without saying జై గారూ 🙁.
జై గారు, sorry for that from my side as well.
తొలగించండి// "శాస్వతం సంగతి తేల్చండి 🦁 పంతులుగారూ !" //
రిప్లయితొలగించండిపంతులు చెప్పవలసినది చెప్పడం అయిపోయింది నీహారిక గారూ. పంతుళ్ళ మాట కొందరు వింటారు, కొందరు వినరు. అంతే ☝️.
పవన్ గారు, మీరు కాకరకాయని కుక్క చేయడం కాదు :D వేడి వేడి మిరపకాయ బజ్జీలు వేయిస్తున్నారల్లే ఉంది. బ్లాగు చదవగలిగాను. బ్లాగు కంటే కామెంట్లు ఎక్కువగా ఉన్నాయి. బావుంది ఈ హడావిడి
రిప్లయితొలగించండిచదివినందుకు థాంక్స్ చంద్రిక గారు.
తొలగించండిఇక కామెంట్స్ విషయానికి వస్తే అందరూ ఉత్సాహంగా రాస్తున్నారు.
పవన్ గారూ,
తొలగించండికమెంట్స్ విషయంలో ప్రాంతీయతత్వానికి వీలులేకుండా ప్రజాస్వామ్య బద్ధంగా స్వేచ్చనిచ్చారు కాబట్టి వ్రాయగలుగుతున్నాం.
కొంతమంది బ్లాగర్లు వాళ్ళు మాత్రమే బ్లాగులో విషం "కక్కు" కు చావాలి అన్నరీతిలో వ్రాస్తుంటారు.
ఫలానా వాడిని హిట్లర్ అనే స్వేచ్చ వాడికి మాత్రమే ఉందని వ్రాస్తాడు.
మనం తిరిగి వాడిని గాడ్సేతో పోలిస్తే మాత్రం ఊరుకోడు.
ఏప్రిల్ 20 న పుట్టినవాళ్ళందరూ హిట్లర్ లేనా ?
వాడి వ్రాతలను మెచ్చుకుంటూ మరికొందరు తిక్కలోళ్ళు.
ముఖేష్ అంబానీ కూడా ఏప్రిల్ 20 న పుట్టారు. పట్టినపట్టు వీడకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూపోయారు. హిట్లర్ తో పోల్చడం కానీ ఆయనతో పోటీ పడడానికి కానీ ఎవరూ సాహసించలేదు. పనికిమాలిన చెత్త ఎంతవ్రాస్తే ఏమిటీ ?
తొలగించండి100 వ కమెంట్ నాదే !
As far as I can check, Mukesh Ambani birthday is April 19
తొలగించండిఏప్రిల్ 20 న పుట్టినోళ్ళంతా హిట్లర్ లేనంటారా ?
తొలగించండిI understand Carmen Electra is also a 4/20 baby
తొలగించండిఇదే మరి వెటకారం అంటే...ఏప్రిల్ 20 న ఎంతో మంది పుడతారు. అందరూ హిట్లర్ లా ఉంటారా ? తామరాకు పంతుల్ని అని చెప్పుకుంటున్న ఓ నెలతక్కువ వెధవ రాస్తే నేలటిక్కెట్టు వెధవలు తోకాడించడం ఉంది చూసారూ...వెల్లుల్లి కారం పెడితే వ్యాఖ్యలు మూసుకున్నాడు.
తొలగించండివామ్మో వామ్మో 4/20లను అంటారా ఈ తిరుమల రాయుళ్లు. వికీపీడియాలో ముకేశ్ అంబానీ పేజీలో చిన్న మార్పు చేస్తే సరి.
తొలగించండివికీపీడియాలో చిన్న మార్పులేం ఖర్మ! పెనుమార్పులే చేయాలి. నిన్న కొడాలి నాని గురించి ఇచ్చిన వీడియో జూ. ఎన్ టీ ఆర్ తనకు 28 సం లు అని చెప్పారు. వికీ లో 36 సం లు అని చూపిస్తుంది. పాపం !
తొలగించండిఅసలు ఈ ఏప్రిల్ 20 విషయం అర్థం కావట్లేదు, ఎవరు రాశారు ఆ రోజున పుట్టిన వారంతా హిట్లర్ లేనని. ఎవరైనా చెప్పండి కాస్త
తొలగించండి100 వ comment రాసిన నీహారిక గారికి కంగ్రాట్స్. కామెంట్స్ లో సెంచరీ కొట్టిన మీ అందరికీ thanks
తొలగించండినేల టిక్కెట్టు వెధవ, ఇలాంటి జంధ్యాల మూవీ తిట్లు విని చాలా కాలమైంది.
తొలగించండిhttps://www.youtube.com/watch?v=KXZk8HXsN8U
తొలగించండినిహారిక, మొదట మీరు అవతలవాళ్ళకి మర్యాద ఇవ్వండి తర్వాత అడగండి. అంతే గాని తగుదునమ్మా అని అందరిమీద నోరేసుకొని పడిపోయి, వాళ్ళు మీ కామెంట్స్ పబ్లిష్ చేయట్లేదని అడగటం నీచం. కామెంట్ రాసే మీకే ఇంత పొగరుంటే, కంటెంట్ రాసే వాడికి అంత కంటే ఎక్కువ ఉండదా? మీ పద్దతి మార్చుకోకుండా ఇంకా నెగటివ్ పబ్లిసిటీ కావాలంటే మిమ్మల్ని అడ్డుకొనే వారెవరు లేరు.
తొలగించండినీ నోటికి వచ్చింది వ్రాసే స్వేచ్చ పవన్ గారు ఇచ్చారు కాబట్టే నువ్వు వ్రాయగలిగావు. నేను అదే చెప్పా..నీ స్వేచ్చ నీ ఇష్టం. కమెంట్ వ్రాసేవాడికి పొగరు ఉంటే దాన్ని ప్రచురించి పట్టనట్టు ఊరుకుంటే బ్లాగర్ దీ పొగరే !
తొలగించండిబ్లాగ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తానంటే కుదరదు. చంద్రబాబు గారిని హిట్లర్ తో పోల్చి పైశాచికానందం పొందితే పర్వాలేదు వాడి పుట్టినరోజున ఎవడో ఒక వెధవ పుట్టే ఉంటాడుగా ? వాడి పుట్టిన రోజు మాత్రం అడిగాను.పుట్టినరోజు కూడా చెప్పుకోలేని అనామక వెధవని వెనకేసుకువస్తున్నావా ? చంద్రబాబు గారిని విమర్శించడానికి
వాడెంత ? వాడి బ్రతుకెంత ?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిశాంతి, శాంతి. ఏదో సరదాకి రాసుకుంటున్న కామెంట్స్ అంతే. ఉత్సాహంగా కామెంట్స్ పెడుతున్న మీకు ధన్యవాదాలు.
తొలగించండిమీరు ప్రతివారం ఓ అరగంట టీవీ చూడండి, పవన్‌గారు! బోల్డన్ని నవ్వులు పంచిన పుణ్యం మీదే అవుతుంది మరి.
రిప్లయితొలగించండిఅలాగే లలిత గారు 😊 చదివినందుకు థాంక్స్ .
తొలగించండికొసాకి కాకరకాయి ఎర్రగడ్డ కుక్కవ్వింది
రిప్లయితొలగించండికెంగారు కూడా కలిసింది మధ్యలో 😀
తొలగించండిఈమధ్య భారతదేశంలో 50-crore club సినిమాలని,
రిప్లయితొలగించండి100-crore club సినిమాలని అంటున్నారు. కొన్ని 500-crore club కు కూడా జేరుకున్నాయంటున్నారు ... అవి రూపాయలా, చిల్లపెంకులా అని నాకెప్పుడూ అనుమానం 🤔.
మన పవన కుమారుడి బ్లాగ్ పోస్టులు కొన్ని ఆల్రెడీ 50-comments club లో ఉన్నాయి. ఇప్పుడీ పోస్ట్ 100-comments club కు చేరుకుంది. అభినందనలు పవన్ 👋. Keep it up.
100+ క్లబ్ లోకి చేర్చిన మీ అందరికీ ధన్యవాదాలు
తొలగించండిJai Sree Ram
రిప్లయితొలగించండిజై సీతారామ్ - ఇదే మమతా బెనర్జీ గారి గోల. బీజేపీ వాళ్ళు జై సీతారామ్ సీతను తొలగించి జై శ్రీ రామ్ అంటున్నారు, ఒరిజినల్ నినాదాన్ని బీజేపీ వాళ్ళు వక్రీకరించారని గొడవ పెడుతోంది.
తొలగించండిఈ గోల నేను వినలేదు. సీతను రాముడే వదిలేసారు....బీజేపీ రాముడిని వదిలేసారు. లెక్క సరిపోయింది.
తొలగించండినిన్ననే మమతా బెనర్జీ గారు అన్నారు అలా.
తొలగించండిబీజేపీ సీతను వదిలేసిందని రాయబోయి బీజేపీ రాముడిని వదిలేసింది అని రాశారా ? నీహారిక గారు.
BPD dee di
తొలగించండిJai Sree Ram
బీజేపీ రాముడిని వాడుకుని వదిలేసారండీ ! మోడీ నోటివెంట రాముని మాట గద్దెనెక్కాక విన్నారా ?
రిప్లయితొలగించండిఅంతరార్థం అర్ధమైంది నీహారిక గారు.
తొలగించండిపుట్టింటోళ్ళు తరిమేసారు కట్టుకున్నోడూ వదిలేశాడు
రిప్లయితొలగించండిరామదూత అతులిత బలధామ
రిప్లయితొలగించండిఅంజని పుత్ర పవనసుత నామా
జయ్ బోలో హనుమాన్ కీ
జై శ్రీరామ్
Ok మేష్టారు జై సతీసమేత శ్రీరామ్
తొలగించండిఅవునండీ బాబూ...దిక్కుమాలిన సంకర భాష వినలేక చస్తున్నాం ఈ మధ్య...ఇదేమి ఖర్మో ఎంటో గానీ!!
రిప్లయితొలగించండితెలుగు ను అలా మాట్లాడటమే ఫ్యాషన్ అనుకుంటున్నారు చాలా మంది మోహన గారు.
తొలగించండిఈ మేటర్ లో నేను కూడా చాలా సాడ్ గా ఫీలవుతున్నాను.
తొలగించండిటీవీ ఏంకరిణుల భాష మీద పేరడీనా, సూర్య గారూ, మీరు పైన వ్రాసిన వాక్యం 😀😀? వాళ్ళు
తొలగించండిసరిగ్గా ఇలాగే మాట్లాడతారు.
@విన్నకోట నరసింహా రావు:
తొలగించండిగురువు గారూ, ఈ కింది వ్యాఖ్య మీద మీ అమూల్యమయిన అభిప్రాయం (టిప్పణీ) తెలుప ప్రార్థన. ఇట్లు మీ శిష్యపరమాణువు (atom student?) "ఆంగ్లేష్".
ఈ సబ్జెక్ట్ మీద ఎంత డిస్కస్ చేసినా కంక్లూషన్ రాదు పైగా కన్ఫ్యూషన్ పెరుగుతుంది కనుక ఈ మాటర్ ఇక్కడితో క్లోస్ చేస్తే బెస్టని నా ఒపీనియన్. నా కామెంటులో ఏమయినా మిస్టేక్స్ ఉంటే ఫ్రెండ్స్ అందరికీ సారీ, నెక్స్ట్ టైం బాగా రాయడానికి ట్రై చేస్తాను.
# జైగారు,
రిప్లయితొలగించండిహ్హ హ్హ హ్హ, "atom student" ...
ఈతరం వారి పరిభాషలో "కేక" 😀.
పైన మీరిచ్చిన వాక్యాలు ఇంతకు ముందు ఎక్కడో చూశానే 🤔? అప్పుడే జుట్టు పీక్కున్నాను కూడా. ఇప్పుడు మళ్ళీనా? అదే పతకమైతే దాన్నమ్ముకుని బతకనా అని ఒక లోకోక్తి ... అల్లాగే, పై పేరాకు భాష్యం చెప్పగలిగే పాండిత్యమే ఉంటే హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ లో తెలుగు అనువాదకుడుగా ఉద్యోగం సంపాదించుకునుండే వాడిని కదా 😢.
క్షమించాలి గురువుగారూ.
తొలగించండిమెరుగయిన సమాజం కోసం అనునిత్యం కష్టపడే ఆంకరోత్తములు & ఆంకరీమణులు వాడే భాష అనుకోకుండా వచ్చేసింది. ఇకపై రిమోటాస్త్రము వాడెదను.
సదరు రాయబార కార్యాలయంలో అనువాద ఉద్యోగం పగవాడికి కూడా వద్దు. వీసార్తుల తలతిక్క జవాబులను తర్జుమా చేయాలంటే తలప్రాణం తోకకు దిగివస్తుంది. (ఉ. తెల్లమ్మ "మీరెందుకు మా దేశానికి వెళ్తున్నారు?" అడిగితే మనోళ్లు కుటుంబచరిత్ర మొత్తం చెప్పడం నా చెవులారా విన్నాను).
అదంతా అనువదించి చెప్పాలా 😳? వద్దులెండి.
తొలగించండికాన్సులేట్ లో అనువాదకుడు అంటే ఏదో back-office డాక్యుమెంట్ల పని అయ్యుంటుంది లేదా వాళ్ళ నాన్-తెలుగు ఉద్యోగులకు తెలుగు (functional) నేర్పడం అనుకున్నాను కానీ వీసా ఆఫీసర్ కౌంటర్ దగ్గర అనువాదాలు చేస్తూ నిలబడడం అనుకోలేదు, వామ్మో. కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదాలు జై గారూ. .
తొలగించండి🦁 కాకరకాయ వెల్లుల్లికారం కుక్కడం కష్టమా ?
రిప్లయితొలగించండి🐯 కాకరకాయ వెల్లుల్లికారం తినడం కష్టమా ?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండినేను వెల్లుల్లి తిననని తెలుసుగా, నన్నడుగుతారేమిటి, హన్నా 😠?
తొలగించండిమళ్ళీ ఈ వెల్లుల్లి గొడవ ఎలా మొదలైంది 😀
తొలగించండి# పవన్ గారు
తొలగించండినా చేత వెల్లుల్లి తినిపిస్తానని శపధం చేశారుగా మన బ్లాగులోక "మణికర్ణిక" గారు. అదన్నమాట ప్రయత్నం 😀.
తొలగించండిమణికర్ణిక!నీహారిక!
అణుమాత్రమువలదు సందియమికన్ వెల్లు
ల్లిని తిననుగాక తిననోయ్
మనుజుడ మాట జవదాట మాకు తెలియదోయ్ :)
ఈ వెల్లుల్లి అనగా నేమి ? గార్ లిక్కా సిగార్ లిక్కా :)
రెండూ ఘాటేనండీ "జిలేబి" గారూ 😰.
తొలగించండి"గార్ లిక్కా సిగార్ లిక్కా"
తొలగించండిఘంటచుట్టల అంచును కొరికి పారేయడం లేదా దొరల హబానాలను కత్తెరతో snip చేయడం తెలుసును. ఈ చుట్టాలను నాకడం ఏమిటి జిలేబీ మాతా కొత్త ఫాషనా?
చుట్టలను ... చుట్టలను
తొలగించండి(మీరు వ్రాసిన స్పెల్లింగ్ ప్రకారం అయితే కొత్త ఫాషనే అవుతుంది 😀😀; jk)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండివిన్నకోట వారూ, నా టైపో పడుతూ మీరు పెట్టిన వ్యాఖ్యకు జవాబిస్తే మళ్ళీ టైపో పడింది. హతవిధీ అనుకొని repost చేస్తున్నాను :)
తొలగించండిTypo భలే పట్టారు సార్. చుట్టలనే కాదు చుట్టాలను నాకడం కూడా కొత్త ఫాషనే
చుట్టాలని నాకడం 😛😛😛
తొలగించండిథాంక్యూ థాంక్యూ.
తొలగించండిమీరేదో typo అని పేరు పెట్టారు గానీ ... ఎదుటి వాళ్ళల్లో తప్పులు వెదకటమే నీ పని అంటూ నన్ను తప్పుపడుతూ మా యావిడ అంటుండే మాటలు వినీ వినీ .... సరే అలాక్కానియ్యి అని అలవాటైపోయిందండీ 🙂.