20, సెప్టెంబర్ 2016, మంగళవారం

ఇండియా వెళ్లే ముందటి విశేషాలు

హాయ్ ఫ్రెండ్స్! అయామ్ బ్యాక్ టు బ్లాగింగ్. లీవ్ లో ఇండియా కు వెళ్లి వచ్చాను. అర్రే మేమంతా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫ్లైట్ లో వెళ్లి వస్తామే అని అనుకుంటున్నారా?  హి హి హి

మరీ బాడ్ జోక్ తో మొదలు పెట్టానా... అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్.

ఇండియా లో మూడు వారాలు ఉంటాను కదా బోలెడు టైం ఉంటుంది అనుకున్నాను కానీ పిల్లలిద్దరూ సిక్ అవ్వడంతో చాలా పనులు పెండింగ్ లోనే ఉండిపోయాయి అలాగే చాలా మంది బంధు మిత్రులను కూడా కలుసుకోలేక పోయాను. కాకపోతే ఆ మూడు వారాలు ఆఫీస్ పని, ఫోన్, లాప్ టాప్ లాంటి వాటికి దూరంగా ఉండి  ఎంత ఉల్లాసంగా ఉన్నానో ఎంత ఉత్సాహంగా ఉన్నానో రాతల్లో రాయలేను.

ఇక ఆ 3 వారాల్లో జరిగిన విశేషాలన్నీ కొన్ని రోజుల పాటు రాయబోతున్నాను. "కట్టే, కొట్టే, తెచ్చే" అన్నంత సింపుల్ గా కాకుండా అలాగే మరీ బోర్ కొట్టించకుండా కాస్త క్లుప్తంగా రాయడానికి ప్రయత్నిస్తాను. రామాయణం లో పిడకలవేట లాగా మధ్య మధ్యలో సంబంధం లేని విషయాలు వస్తుండచ్చు దానికి మన్నించగలరు.

గత నెలలో ఇండియా కు వెళ్తున్నాను అని ఇక్కడ చెప్పానో లేదో ప్లీజ్ నా కోసం ఇండియా నుంచి అది తీసుకొస్తావా ఇది తీసుకొస్తావా అనే రిక్వెస్ట్ లు వినపడ్డాయి.

నా ఫ్రెండ్ ఒకతను అయితే వీలయితే సీమ నీళ్లు తీసుకురా అన్నా..ఇక్కడి నీళ్లు తాగి పౌరుషం చచ్చిపోయింది అని అడిగాడు.  

ఒక కొలీగ్ అయితే పానీ పూరి తీసుకు రమ్మంది. ఎందుకో తెలీదు కానీ అమ్మాయిలకు పానీ పూరి అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఇంకో కొలీగ్ ను కూడా ఇండియా వెళ్లినప్పుడు నువ్వు అక్కడ చేసిన బెస్ట్ థింగ్ ఏమిటి అని అడిగితే  ప్రతి రోజూ పానీ పూరి తిని వచ్చా అంది. మేము 2 వారాల క్రితం బెంగుళూరు లో Mavenpick అనే ఫైవ్ స్టార్ట్ హోటల్ కి డిన్నర్ కి వెళ్తే, అక్కడ సవాలక్ష నోరూరించే ఐటమ్స్ ఉన్నా పండగ నాడు కూడా పాత చీరే కావాలన్నట్లు మా ఆవిడ మొదట వెళ్ళింది పానీ పూరి స్టాండ్ దగ్గరకే. నాకు తెలిసినంత వరకు చాలా మంది అమ్మాయిలకు పానీ పూరి తినందే రోజు గడవదు.  

కొంత మంది ఫ్రెండ్స్ అయితే కుక్కర్లు, మిక్సీ ల్లాంటివి కూడా తెమ్మని అడిగారు. అవన్నీ తీసుకు రావంటే కనీసం ఓ 200 కిలోల వెయిట్ దాకా అవుతుంది. ఆల్రెడీ సిడ్నీ ఎయిర్పోర్ట్ లో ఈ ఇండియా వాళ్ళను వదిలేస్తే మొత్తం ఇండియా ను వాళ్ళ సూట్ కేసుల్లో చుట్టబెట్టుకు వచ్చేస్తారు అనే బాడ్ టాక్ ఉంది. కాబట్టి అంత వెయిట్ మోసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని మరింత బలపరచడం కన్నా నొప్పించక తానొవ్వక అన్న చందంగా ఎదో ఒక లాగ సర్ది చెప్పాను అంత వెయిట్ అయితే కష్టమని. ఏవో మాత్రలు, cooker gasket లాంటివి అయితే తెస్తామని చెప్పాను. 

ఒక ఫ్రెండ్ అయితే సిగరెట్స్ కూడా తీసుకు రమ్మన్నాడు. లగేజ్ పాకింగ్ సమయంలో వాటిని మా నాన్న చూసాడంటే వీడే తాగడానికి తీసుకెళ్తున్నాడేమో అని అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అతనికి నో చెప్పాను.  పైగా ఈ రిక్వెస్ట్ నేను ఓకే చేసినట్లు వాళ్ళ వైఫ్ కి తెలిసిందంటే వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా నాకు ఇష్టం లేని గ్రీన్ టీ ఇచ్చి పగ తీర్చుకునే అవకాశం కూడా ఉంది. 

ఇక అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన లిస్ట్ లో మా అమ్మ పంపే అరిసెల పాకం, కజ్జి కాయలు, ఊరగాయలు, పొడులు (చెనక్కాయల పొడి, నూగులు చింతాకు వేసి చేసే చింతాకు పొడి , కరివేపాకు పొడి లాంటివి ) ఉండనే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో చెనక్కాయల పొడి ని గన్ పౌడర్ అంటారు. దీని మీద ఎవరో చెప్పగా విన్న జోక్ .. కస్టమ్స్ వాళ్ళు బ్యాగేజ్ చెక్ చేస్తూ చెనక్కాయల పొడిని చూసి ఇదేమిటి అని అడిగితే గన్ పౌడర్ అని చెప్పి వాళ్ళను హడలగొట్టాడట. 

నాకు  తెలిసిన ఒక ఫామిలీ ఫ్రెండ్ అమెరికాకు 2 కేజీల పిండి తో చేసిన మురుకులు, నాలుగు కేజీల అరిసెల పాకం, కజ్జికాయలు, నూగుల పిండి ముద్దలు తీసుకెళ్ళాడట. పల్లెటూరి వాళ్ళు కదా నూగుల పిండి ముద్దలు బాగా పెద్ద సైజు లో చేశారట. వాటిని చూసి  బాంబులేమో అని భయపడ్డారట ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ వాళ్ళు.  ఇవి కాకుండా పుల్లా రెడ్డి స్వీట్ షాప్ లో 5 కేజీల స్వీట్స్ కూడా కొనుక్కొని తీసుకెళ్లాడట. మొత్తంగా బాగ్ నిండా ఈ స్వీట్స్ ఉన్నాయట. అందుకని స్వీట్ షాప్ ఏమైనా పెడుతున్నారా అని అడిగాడట నవ్వుతూ ఆ కస్టమ్స్ వాడు. 

వచ్చేప్పుడు కాజు బర్ఫీ తీసుకురమ్మని అడిగారు ఆఫీస్ లో ఫ్రెండ్స్. ఈ కాజు బర్ఫీ ని నార్త్ ఇండియన్స్ అయితే కాజు కట్ లీ అంటారట ఎందుకంటే అవి బ్రూస్ లీ లాగా సన్నగా ఉంటాయని. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు కూడా ఇవే తెచ్చాను. ఇప్పుడూ ఇవే తెచ్చాను ఎందుకంటే అందరికీ ఇవే ఇష్టం. కస్టమ్స్ చెకింగ్ లో వీటిని చూడగానే ఇవేంటో నాకు బాగా తెలుసు రోజుకు 10 మంది ఇండియన్స్ అన్నా ఇండియా నుంచి ఈ స్వీట్స్ తీసుకొస్తుంటారు అన్నాడు ఒక ఆఫీసర్. 

వచ్చేప్పుడు తీసుకురావాల్సినవన్నీ లిస్ట్ రాసుకున్నాను కానీ కొన్ని తెచ్చుకోలేక పోయాను వెయిట్ ఎక్కువడం వలన. ముఖ్యంగా ఆ లిస్ట్ లో ఉన్న కొన్ని పుస్తకాలు తెచ్చుకోలేక పోయాను. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్లు అక్కడికి కూడా నీ బుక్స్ అవసరమా అని మా ఆవిడ గోల పెట్టింది. తన గోల కు ఒక కారణం ఉంది ఎందుకంటే గత 2 సంవత్సరాలలో ఇండియాకు వెళ్ళలేదు కాబట్టి ఈ రెండేళ్ల షాపింగ్ అంతా రెండు వారాల్లో చేసేసింది. మరి ఆ బట్టల కొట్టు అంతా ఇక్కడికి తెచ్చుకోవాలి కాబట్టి నా బుక్స్ కు మోక్షం లభించలేదు.

ఏమి తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా మరచి పోకుండా తీసుకురావాల్సినవి మాత్రం తెచ్చుకున్నాను అవే మా అమ్మా నాన్నల దీవెనలు offcourse అవెప్పుడూ మన వెంటే ఉంటాయనుకోండి కాకపొతే ముగింపు కు ఒక మంచి మాట తోడైతే బాగుంటుందని జత చేసాను. 


9 కామెంట్‌లు:

  1. ' నూగులు ' అంటే ఏమిటండి?
    (నాది సీమ కాదు, అందువల్ల అడుగుతున్నాను)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా సీమ లో కూడా నువ్వులు అని వాడతాము కానీ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళము కాబట్టి నూగులు అనే మాటే ఎక్కువగా వాడతాము.

      తొలగించండి
    2. వివరణకి థాంక్స్ పవన్ గారు. పల్లెటూళ్ళ పదజాలం వినసొంపుగా ఉంటుంది.

      తొలగించండి


  2. మా సీమలోని నువ్వుల
    కూసింతగ నూగులంచు కొండంతవలెన్
    తా సైజగు ముద్దల బా
    యే! సిరి సరకు కొని తాను యెలబారెనుగా :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ అండీ జిలేబీ గారు పద్యం రాసినందుకు..కానీ నా బోటి వాళ్లకు అర్థం అయి చావదు అదే సమస్య.

      తొలగించండి
  3. ఈసారి ఇండియా వెళ్లినప్పుడు పుస్తకాలు తెచ్చుకునే అవకాశం మీకు కలగాలని కోరుకుంటున్నాను :)

    రిప్లయితొలగించండి