4, ఏప్రిల్ 2019, గురువారం

మంచి కథ ఒకటి ఉంది, సినిమా తీద్దామా?

"నేను ప్రతి కారం తురుచుకుంటాను" హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్న అమ్మాయి ఆవేశంగా డైలాగ్ చెప్తోంది.

వెరీ గుడ్, షాట్ ఓకే, పాకప్ అన్నాడు డైరెక్టర్.

అదేంటి సార్, అదేం డైలాగ్ అన్నాడు నిర్మాతతో పక్కనుండే  వ్యక్తి .

'నేను ప్రతీకారం తీర్చుకుంటాను' అనేది డైలాగ్. ఈ హిందీ వాళ్ళను తెస్తే ఇలాగే ఉంటుంది. డబ్బింగ్ లో కవర్ చేయాలి, తెల్ల తోలు పిల్ల అయితేనే చేస్తాను అని హీరో డిమాండ్. అందుకే తప్పలేదు.  సరే కథ ఏదో ఉందన్నావ్ గా చెప్పు.

నా కథలో హీరోకి ఒక కన్ను ఉండదు…హీరోయిన్ కు ఒక చెయ్యి ఉండదు…విలన్ కు ఒక కాలు ఉండదు….

దీన్ని సినిమా గా తీస్తే ఆ పైన నేను ఉండను. ఇంకో కథ చెప్పు.

లాస్ట్ వీక్ రాసిన కథ చెప్తాను. ఇందులో విలన్ ఒక ఊరిలో అడుక్కు తింటూ ఉంటాడు. అతడు అదే స్ట్రీట్ లో అడుక్కు తింటున్న హీరోయిన్ ను ప్రేమిస్తూ ఉంటాడు. హీరో ఇంకొక ఊరి నుంచి ఈ ఊరికి అడుక్కోవడానికి వచ్చి, అదే స్ట్రీట్ లో అడుక్కుతింటూ ఉంటాడు. 

దీన్ని సినిమాగా తీశానాంటే నేను కూడా అడుక్కుతినాలి. ఇలాంటి ఆర్ట్ సినిమాలు, అవార్డులొచ్చే సినిమాలు కాకుండా మాంఛి మాస్ మసాలా స్టోరీ చెప్పవయ్యా. 

నిన్న రాత్రి రాసిన ఒక మాంఛి మాస్ మసాలా స్టోరీ రాశాను వినండి.

అడగడం మర్చిపోయాను, ఇంతకీ నువ్వు ఏం చేస్తుంటావ్.

రివ్యూ రాస్తుంటాను.

ఏ సైట్లో నేమిటి?

ఇంకొకడి సైట్ లో నేనెందుకు రాస్తాను, నాకే ఒక ఓన్ సైట్ ఉంది, అందులో రాస్తుంటాను.

ఏమిటా సైట్?

రివ్యూరాజా.కాం

ఓహో ఆడివి నువ్వేనన్నమాట, బుద్ది ఉందటయ్యా,  అదేదో   సినిమాలో  సస్పెన్స్ పాయింట్ ను రివ్యూ పేరు చెప్పి మొత్తం రాసేస్తే యెట్లయ్యా? సరే గానీ సినిమా టైటిల్ ఏమనుకుంటున్నావ్?బొబ్బట్టు.  

అదేం పేరు, అయినా ఇలాంటి సినిమా పేరు ఎక్కడో విన్నట్లు ఉందే?

అది పెసరట్టు సర్. 

అవును గుర్తొచ్చింది, రివ్యూలు రాస్తూ అతను కూడా నీలాగే పెద్ద బిల్డప్ ఇచ్చి కత్తి లాంటి సినిమా తీస్తానని చెప్పి ఒక సుత్తి సినిమా తీశాడు. పెన్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు రివ్యూ రాయడం కాదు, తీస్తే తెలుస్తుంది సినిమా కష్టాలు. ఏమన్నా అంటే బిర్యాని తిని రుచి గురించి మాట్లాడే వాడికి బిర్యాని ఎలా చెయ్యాలో తెలియాల్సిన అవసరం లేదని వెధవ లాజిక్ ఒకటి లాగుతారు. సరే కథ మొదలెట్టు. 

సంక్రాంతి సందర్బంగా ఒక ఊరిలో బొబ్బట్లు తినే పోటీ ఉంటుంది.  ఆ ఊరిలో ఇది తరతరాలుగా వచ్చే ఆచారం. విలన్ వాళ్ళ వంశమే తరతరాలుగా ఆ పోటీలో గెలుస్తూ ఉంటుంది. 

హీరో ఆ ఊరికి చుట్టపు చూపుగా వచ్చి ఆ పోటీలో పాల్గొని విలన్ ని ఓడిస్తాడు.  దాంతో  విలన్ మరదలు అయిన హీరోయిన్ హీరో మీద మనసు పారేసుకుంటుంది. దాంతో విలన్ పగతో రగిలి పోతాడు.

అవును, ఇందాకటి ముష్టివాళ్ళ కథ కూడా  ఆల్మోస్ట్ ఇదే కదా.

మీకు తెలియనిదేముంది లోకంలో ఉండేది పట్టుమని పది కథలే, అవే అటూ ఇటూ మారుతూ ఉంటాయి.  కథతో పాటు పాటలు కూడా నేనే రాసుకున్నాను. సంక్రాంతి కాబట్టి ఒక మంచి ఐటెం సాంగ్ పెట్టొచ్చు ఆ పోటీల తర్వాత

సంకురాతిరి సంకురాతిరి 

ఇయ్యాలే వచ్చింది సంకురాతిరి 

నిన్న రాతిరి నిన్న రాతిరి  

పండనియ్యలేదు నన్ను పిల్లగాడు పూరా రాతిరి 

శివరాతిరి  శివరాతిరి చేసేయ్  ప్రతీ రాత్రినీ శివరాతిరి 


అంతే కాదు సార్, ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ సంక్రాంతి కి కంప్లీట్ చేసి రిలీజ్ చెయ్యొచ్చు. సినిమాలో సంక్రాంతి  సాంగ్ ని పబ్లిసిటీ కి కూడా పెట్టుకోవచ్చు. ఇక సంక్రాంతి, శివరాత్రి ఉత్సవాలు జరిగిన ప్రతి చోట ఈ సాంగ్ మోగిపోతూ ఉంటుంది ఉత్సవాల్లో. సంక్రాంతి రోజున రిలీజ్ చేస్తే పిచ్చి జనాలు పండగ పూట సినిమా ఎలా ఉన్నా చూసి హిట్ చేసేస్తారు. ..మరీ హిట్ కాకపోయినా ఓపెనింగ్స్ తో మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. సినిమాలో  

"నీ నెత్తి మీద పిడుగు పడితే నువ్వు బతకచ్చు, కానీ నా అడుగు పడిందో నీకు పిండాకూడు పెట్టాల్సిందే"

"నా ప్రేమకు అడ్డొస్తే అడ్డ దిడ్డంగా నరికేస్తా

"సింహం ఆడితే వేట, అదే నేనాడితే కుమ్ములాట, మీలో ఒక్కరు కూడా మిగలరు ఈ పూట"

లాంటి భారీ డైలాగులు పెట్టేద్దాం.

ఇదిగో రైటరూ, స్టోరీ సూపర్ గా ఉంది…దీన్ని సినిమా గా తీద్దాం. 

హీరోగా ఎవర్ని తీసుకుందామనుకుంటున్నారు?

ఎవరో ఎందుకయ్యా, నా కొడుకు పదో తరగతి పది సార్లు తప్పి ఊరి మీద బలాదూర్లు తిరుగుతున్నాడు. వాడు దేనికి పనికి రాడని మాకు అర్థమై పోయింది. వాడినే హీరోగా పెట్టి సినిమా తీద్దాం.

అది…మరి…

అర్థం అయ్యిందయ్యా…నువ్వు ఎందుకలా నసుగుతున్నావో అర్థం అయ్యింది. నల్లటి నలుపు, లావూ, పెద్ద అందం లేదు…హీరో గా  సూట్ అవ్వడనేగా నీ డౌట్…అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు…పంచాయితీ ఎలక్షన్స్ లో కూడా గెలవని లోకేష్ బాబు ను పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ని చేస్తే జనం ఒప్పుకోలా ఇదీ అంతే.

అది కాదు సార్

నువ్వు అంతలా అంటున్నావ్ కాబట్టి మేకోవర్ కోసం మా వాడిని ఒక నెల అమెరికా పంపించి మహేష్ బాబు లా తయారు చేయిస్తా. సరే, ఇంకో పాట ఏం రాసావో చెప్పు

లకు చికి రాణి … లకు చికి రాణి

ఏమైనా కానీ…చేస్తానే బోణీ

మీ నాన్న రానీ…మా నాన్న రానీ 

ఎవరైన రానీ…ఆగదీ ప్రేమ కహానీ 


గడి బిడ గండు…గడి బిడ గండు

జిలేబి దిండు….. పుట్ట చెండు

దానిమ్మ పండు…నీకిస్తా రెండు

ఇలా ఒక సాంగ్ స్విట్జర్లాండ్ లో పిక్చరైజ్ చేద్దాం. 

ఇదేమిటయ్యా, ఇలా మనం పల్లెటూరి స్టోరీ తీస్తూ ఇలా ఫారిన్ లొకేషన్ లో సాంగ్ పెడితే సాంగ్ కు, వెనుక సీన్స్ కు సంభంధం లేదనుకుంటారేమో?

సార్ మీరింకా ఈ ఫీల్డ్ కి కొత్త, అవన్నీ ఎవరు అబ్సర్వ్ చేస్తారు.

కనీసం ఆ పాటకి అర్థం పర్థం కూడా లేదు కదయ్యా. 

అర్థముండే పాటలు ఎవరికి కావాలి సార్, యెంత గోలగా ఉంటే అంత హిట్టు, ఎలాగూ బొంబాయ్ నుంచి పిలిపించిన హిందీ సింగర్స్ తోనే  పాడిస్తాం కాబట్టి  ఆ పాట ఎవడికి అర్థం కాదు.

నేను కన్విన్స్ అయ్యా, మనం ఈ సినిమా తీస్తున్నాం.    నాకొక సాంగ్ తట్టిందయ్యా ఇప్పుడే

చెప్పండి సార్

బొబ్బట్టు తీసుకో మామా
నేతి బొబ్బట్టు తీసుకో మామా

నీ చేతి బొబ్బట్టు బాగుందే పిల్లా
అబ్బబ్బ కావాలే ఇంకోటి మళ్ళా

అబ్బబ్బబ్బ అదిరింది సార్, టైటిల్ సాంగ్ గా వాడచ్చు. ఒక ఊపు ఊపేస్తుంది యూత్ ని.

సరే, నెక్స్ట్ మంత్ మన 'బొబ్బట్టు' షూటింగ్  స్టార్ట్ చేద్దాం.

24 కామెంట్‌లు:

 1. మీరసలు రాయలసీమలో ఎందుకు పుట్టారండీ ? కేసీఆర్ కొడుకు లావుగా లేడా కేసీఆర్ మనుమడు లావుగా పిప్పళ్ళ బస్తాలాగా లేడా ? మరీ ఇంత భయమయితే ఎలా ?

  "లకు చికి రాణీ" పాట బొంబాయి సింగర్స్ తోనే పాడిస్తారా ? మలైకా అరోరా ఖాన్ తో డాన్స్ కూడా చేయిస్తారా లేక మీ జిల్లాయే కదా అని వై ఎస్ షర్మిలతో చేయిస్తారా ...ఆవిడ గొంతూ ఆవిడ చూపూ అమోఘం !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీమ నీళ్ళు తాగక చానా రోజులైనాది, ఈ సారి వెళ్లి తాగొచ్చి భయం పోగొట్టుకుంటా నీహారిక గారు.

   షర్మిల గారిని ఎందుకు లాగడం లేండి, వదిలేద్దాం.

   తొలగించండి
  2. మళ్ళీ భయపడుతున్నారు. షర్మిలని ఎందుకు వదిలేయాలి ? ఆవిడేమన్నా తోపా ?

   తొలగించండి
  3. బ్లడ్ లోనే భయం ఉందనుకోండి నీహారిక గారు. మలైకా గారి తో డాన్స్ అన్నారు, ఆవిడ ఎలాగూ dancer కాబట్టి తప్పులేదు. షర్మిల గారు dancer కాదు కదా మరి అలాంటప్పుడు ఆవిడతో డాన్స్ అనటం బాగోదు.

   తొలగించండి
  4. తోపా అంటే తోపే మరి ... సీమ"బాణం" కదా 🙂.

   తొలగించండి
  5. షర్మిలకి డాన్స్ రాదంటారా ? కనీసం పనిమనిషి వేషానికైనా పనికివస్తుంది కదా ? ఎలాగైనా రెడ్డమ్మ తల్లి మీ సినిమాలో ఉండాల్సిందే !

   తొలగించండి
  6. షర్మిల కోడికత్తి కడుగుతూ ఉంటే రెడ్డమ్న తల్లి పాట నేను పాడతానండీ...నాకు పాడడానికి ఒక్క చాన్స్ ఇస్తారా ?

   తొలగించండి
  7. మీరు ఇంతగా అంటున్నారు కాబట్టి షర్మిల గారిని ఒప్పించగలరేమో try చేయండి.

   తొలగించండి
 2. వై ఎస్ షర్మిలతో చేయిస్తారా
  మీకు నచ్చనంత మాత్రాన ఇదా పద్దతి?

  రిప్లయితొలగించండి
 3. నిన్న మీరు వై ఎస్ షర్మిల రోడ్ షో చూడలేదా ?
  కోడి కత్తిలాంటి షో !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మొన్న మీరు బాలయ్య గారి షో చోశారా, ప్రక్కన భార్యారత్నం సమేత- ఓ ప్రక్కన అభిమానులను బండ బూతులు తిడుతూ వుంటుంటే మరో ప్రక్క జై జై బాలయ్య అంటూ మన్ని కాదులే అనుకునే వాళ్ళ సంబరం. ఆంధ్రా అభిమానధనుల షో. భలే బుల్ బుల్ షో కదా?

   తొలగించండి
  2. బాలయ్య గారి రచ్చ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, పాల్ గారికి పోటీ వస్తున్నాడు కామెడీ చేయడంలో

   తొలగించండి
 4. సార్ ఈ సినిమాలో లోకేష్ బాబు చేత హీరోకు డబ్బింగ్ చెప్పించండి. బుల్ బుల్ బాలయ్య చేత పాటలు పాడించండి అప్పుడు సినిమా సూపర్ హిట్టు.

  ఈ ఇద్దరు కలిస్తే సినిమా జోదెద్దుల బందె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సార్ అనకండి please. మంచి ఐడియా మేష్టారు, మంచి పబ్లిసిటీ కూడా వస్తుంది.

   తొలగించండి
 5. ఇంత టాలెంట్ పెట్టుకుని ఎక్కడో ఆస్ట్రేలియాలో ఎందుకుంటున్నారండీ? ఎప్పుడూ అదే కోడింగులతో మీరు s/w లో టైము వృధా చేసుకుంటున్నారు. తిరిగి వచ్చేసి మీ టాలెంటును సినిమా పరిశ్రమకు అంకితం చెయ్యండి. ఎన్.టి.అర్. గారి ఇష్ట పదజాలంలో చెప్పాలంటే ... మీలాంటి వారు పరిశ్రమకు అవసరం "బ్రదర్". (అప్పటికి గాని మీ ఆవిడ గారు నన్ను తిట్టుకోరు 😳 )
  (నిజంగా వచ్చేరు గనక 😳. ఇది jk only 😀)

  రిప్లయితొలగించండి
 6. Thanks మేష్టారు మీ కామెంట్స్ కి. వారసులకు దూరడానికే సందులేదు. మనకు అంత ధైర్యమే

  రిప్లయితొలగించండి
 7. "బొబ్బట్టు"😀
  సినిమాకి ఈ టైటిల్ చదవగానే కాసేపు పగలబడి నవ్వుకున్నాను. ఇంతకీ ఆ కలర్ థీమ్ కూడా మీరే డిజైన్ చేశారా? ఎం లేదు బెడ్ లైట్ వెలుగులో కాసేపు దానివంక చూస్తే కళ్ళు మిరుమిట్లుగొలిపాయి. అందుకే కాస్త క్రియేటివిటీ జోడించారని అనిపించింది.
  అన్నట్టు సినిమాలో కమెడియన్ కి ఉండాల్సిన డైలాగ్:"నువ్వు వదిలితే శబ్దం, నేను వదిలితే నిశ్శబ్దం" (బొబ్బట్లు ఎక్కువగా తింటే ఎం వదులుతారో చెప్పక్కర్లేదనుకుంటా)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ డైలాగ్ బాగుంది సూర్య గారు. అవును సూర్య గారు, ఏదో కాస్త స్పెషల్ డిజైన్ ట్రై చేశా టైటిల్ కు .

   తొలగించండి
 8. ఇంకెందుకాలస్యం...సినిమా తీసేయండి. చూసెయ్యడానికి మేం రెడీ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అయితే తప్పకుండా సినిమా మొదలెడతాం లలిత గారు.

   తొలగించండి
  2. ఇదిగో ముందే చెప్తున్నా. పైరేటెడ్ కాపీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు మాత్రం నావి😎

   తొలగించండి
 9. మీరు మంచి పాటల రచయిత అన్న విషయం ఈరోజే తెలిసింది. వ్యంగ్యం చక్కగా వ్రాసే అతికొద్ది మందిలో మీరొకరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అంతా మీ అభిమానం. చదివి మెచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు అన్య గామి గారు.

   తొలగించండి