నాకు తమిళ చిత్రాలతో అనుబంధం డబ్బింగ్ సినిమాల ద్వారా చిన్నప్పటి నుంచే మొదలైంది, కాకపోతే డైరక్ట్ తమిళ సినిమాల వాసన తగిలింది మాత్రం తిరుపతి లోనే.
సరే మనకున్న సినిమాల passion కు (దీన్నే పిచ్చి అని అంటారు కొందరు) లాంగ్వేజ్ barrier అనే అడ్డెందుకు అని డిసైడ్ అయి, తమిళ్ సినిమా చూద్దాం అని "పళని" కి బయలుదేరా. పళని అంటే తమిళనాడు లో ఉండే ఊరు అని పొరపడకండి. అది మా ప్లాట్ నెంబర్ 62 దగ్గర్లో ఉన్న థియేటర్. అక్కడి నుంచే ఈ తమిళ సినిమాల వాసన తగిలేది.
అక్కడ నేను చూసిన మొదటి సినిమా 'పార్థేన్ రసితెన్' అనే తమిళ హిట్ చిత్రం (తెలుగులో శ్రీకాంత్ హీరోగా 'నా మనసిస్తా రా' అని రీమేక్ చేస్తే అట్టర్ ప్లాప్ అయింది, అది వేరే విషయం). అప్పట్లో టీ బంకుల దగ్గర తమిళ హోటల్స్ లో ఈ సినిమా పాటలు మార్మోగిపోయేవి. ఇప్పటికీ వినడానికి బాగుంటాయి, తమిళ్ నచ్చకపోతే తెలుగు సినిమా పాటలు వినండి, మంచి మ్యూజికల్ ఎంటర్టైనర్.
ఆ సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు ఒక తమిళ్ వ్యక్తి అక్కడ ఉన్నాడు, నేను నిల్చొని ఉంటే 'ఉక్కారుంగా' అన్నాడు ఖాళీ సీట్ చూపిస్తూ, ఆ 'ఉక్కారుంగా' కి అర్థం తెలియకపోయినా కూర్చోమంటున్నాడు కదా అని అర్థమై కూర్చున్నా అక్కడ ఖాళి సీట్ లో.
కాసేపటికి 'నేరం ఎన్న?' అనేదో అన్నాడు.
ఇదేమైనా పోలీస్ స్టేషనా 'నేరం ఏం చేసావ్?' అని అడగటానికి అని కన్ఫ్యూజ్ అయ్యా,
'నేరం ఎన్న?' అన్నాడు ఈ సారి మళ్ళీ నా చేతి కున్న వాచ్ వైపు చూపిస్తూ.
2:30 అన్నాను.
తర్వాత మళ్ళీ తమిళ్ లో ఏదో అన్నాడు, ఆ ముక్క అర్థం కాలేదు, ఇప్పుడు గుర్తు కూడా లేదు.
"ఎనక్కు తమిళ్ తెరియాదు" అన్నాను వచ్చీ రాని తమిళ్ మాటలు కూడబలుక్కొని.
మరి తమిళ్ సినిమాకి ఎందుకు వచ్చావ్? అన్నట్లు పేస్ పెట్టాడు అతను.

సో అలా మొదలైన ఆ తమిళ సినిమాల వాసన ఇప్పటికీ నన్ను తాకుతూనే ఉంటుంది. పొరుగింటి పుల్లగూర రుచి అన్నట్లు, నా మటుకు నాకు చాలా వరకు తమిళ్ సినిమాలు బాగా నచ్చుతాయి. అందులో భాగంగానే ఈ మధ్య చూసిన నాకు నచ్చని/నచ్చిన ఓ నాలుగు సినిమాల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిగా 'ఒరు నాళ్ ఇరవిల్' అనే తమిళ సినిమా తో మొదలెడతాను.
సత్యరాజ్ తప్ప సినిమాలో చాలా వరకు నాకు తెలియని నటీనటులే. ఇది 'షట్టర్' అనే మళయాళ సినిమా రీమేక్. ఆ మళయాళ మాతృక గురించి పెద్దగా తెలియదు గానీ ఈ తమిళ సినిమా మాత్రం నాకు బాగా నచ్చింది. ఇదే సినిమాని తెలుగులో ప్రకాష్ రాజ్, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా 'మన ఊరి రామాయణం' అని తీశారు.
వీలయితే ఈ తమిళ సినిమాని మీరూ చూడండి, నచ్చుతుందనే అనుకుంటున్నాను. యు ట్యూబ్ లో ఫ్రీ గానే దొరుకుతుంది.
అలాగే Monster అని మరో తమిళ్ సినిమా చూశాను, డైరెక్టర్ కం యాక్టర్ అయిన S.J. సూర్య హీరో గా నటించిన సినిమా, చాలా బాగుంటుంది కామెడీగా. 'ఏ ప్రాణినీ చంపడానికి ఇష్టపడని ఒక వ్యక్తి' అనే చిన్న కాన్సెప్ట్ ని స్టోరీ గా మలచి తీసిన సినిమా. సినిమాలో మెజారిటీ భాగం హీరో, ఎలుక మధ్య నడిచే సన్నివేశాలతోనే ఉంటుంది. కాకపొతే ఎలుకంటే చాలా మందికి చూడటానికే అలర్జీగా అనిపిస్తుంది కాబట్టి అలాంటి వారి గురించి చెప్పలేను కానీ లేదంటే చూడ్డానికి సినిమా చాలా బాగుంటుంది.
ఎక్కడో ఫారిన్ లో పాటలు, ఒక పద్ధతీ పాడూ అంటూ లేని హీరోయిన్ వ్యక్తిత్వం, ఒసేయ్, పోవే అంటూ హీరోయిన్ లను వెకిలిగా పిలిచే హీరో క్యారెక్టర్, ఐటెం సాంగ్స్, ఇవే కాకుండా అమ్మ, అన్న, వదిన అని తేడా లేకుండా అందరినీ వంగోబెట్టి తంతూ ఉంటే అదే కామెడీ అని ఇష్టపడేవాళ్ళు మాత్రం ఈ సినిమాలకు దూరంగా ఉండటం మంచిది. అలాంటి వారికి నచ్చే మరో సినిమా కూడా చూశాను అదే కాంచన-3.
ఇక మీరెంత టార్చెర్ భరించగలరో టెస్ట్ చేసుకోవాలి అనిపిస్తే 'Anbanavan Asaradhavan Adangadhavan' సింపుల్ గా AAA అనబడే శింబు సినిమా చూడండి.

In Telugu Cinemas, the so called hero insults, body-shames and humiliates comedians, heroines, villains and every co actor. The comedian is slapped , beaten and insulted. This passes off as comedy. Disgusting indeed. The Heros and Directors both are responsible for this disgusting trend.
రిప్లయితొలగించండిNTR started this obnoxious practice. We can observe his dominating and insulting behaviour in Gundamma katha. He ill treats Ramana Reddy. We can see him ill treating comedians and other caste actors in many films. Same trend continues till today.
Even Trivikrim also does the same. The way Mahesh babu ill treats and insults Anuskha in Khaleja movie and Brahmanandam and sunil in some other movie is disgusting. The director and actor both have to hang their heads in shame.
Well said Anonymous గారూ, మీరు చెప్పింది 100 పర్సెంట్ కరెక్ట్. ముఖ్యంగా పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోయిన్ ని ఒక వస్తువు లాగా ట్రీట్ చేస్తారు.అవి మన ఖర్మ కాలి సూపర్ హిట్స్ అవుతాయి, ఇక అందరూ అదే కరెక్ట్ రూట్ అని follow అవుతారు.
తొలగించండిజూనియరుడు కూడా ఏం తీసిపోలేదు. తాత పోలికలు. కాకపోతే ఇతను మరీ దారుణం .. చీటికీ మాటికీ చెయ్యి చేసుకుంటూ.
తొలగించండిజూనియరుడు అలా ఏ సినిమాలో చేశాడబ్బా? నాకు తట్టడం లేదు మేష్టారు.
తొలగించండిఈ అభిప్రాయాలతో ఏకీభవించలేను. సినిమాల్లో హింసా, శృంగారమూ, హింసాశృంగారమూ ఎక్కువ అవ్వడానికి హీరోనో, డైరక్టర్ నో లేక సీన్ డిమాండ్ కి తగ్గినట్లుగా నటించే నటీమణినో నిందించడం కరెక్ట్ కాదు.
తొలగించండినిజానికి ఇదంతా శుక్ర ప్రభావం. కావాలంటే ట్రెండ్ గమనించండి. శుక్రవారం నాడు శుక్రుడి ప్రభావం బలంగా ఉంటుంది. ఆకారణంగా శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాల్లో దరిద్రం డాన్సాడుతుంది. పాత సినిమాల్లో హీరోయిన్ని బలవంతంగా లొంగదీసుకోవాలని ప్రయత్నించినా.. శుక్రవారం నాడు గుడికెల్లిన హీరో చెల్లెలు రేపుకు గురైనా, ఆవేశాలతో ఒకరినొకరు కత్తులు దూసుకుంటూ నరికేసుకున్నా అదంతా శుక్రుడి తరంగాల ప్రభావం.
ఒక్కోసారి "రాముడి కొడుకు మంచి బాలుడు" అని చెప్పుకోబడే హీరో కూడా శుక్రుడి ప్రభావం తో హీరోయిన్ మీద చెయ్యి చేసుకోవటం, కాలెత్తటం చేస్తుంటాడు.
కావాలంటే ఈ బ్లాగ్ లో చూడండి.
https://telugutambi.blogspot.com/2013/09/blog-post_13.html
శుక్రుడి ప్రభావం సినిమాలపై ఉంటుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?!
సూర్యగారు చెప్పింది అక్షరాలా నిజ్జం. ఎన్నో సంవత్సరాల తన పరిశోధనలో తన జీవితం ధారబోసి "సత్యనారాయణ శర్మ" కనుగొన్న అపూర్వ విణ్ణాణ సత్యం ఇది.
తొలగించండిhttp://www.teluguyogi.net/2019/09/blog-post_25.html
ఎవరెన్ని తప్పులు చేసినా "శుక్రుడ్ని" అర్రెష్టు చెయ్యాలి. పాపం ఆ నిందుతులైన అమాయకుల మీద గ్రహాలు చేసిన కుట్రను గుర్తించి, ప్రభుత్వ పథకాలన్నీ వారికి వెంటనే వర్తింప చెయ్యాలి.
అవును నిజమే అనిపిస్తోంది, వెంటనే ఆ శుక్రుడి మీద అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి.
తొలగించండిభారతీయ సినిమాలలో మితిమీరిన హింస, చౌకబారు డబుల్ మీనింగ్ బూతు డయలాగులు/పాటలు, హీరో అనబడే నూటపాతిక కిలోల బండ మనిషి డాన్సుల పేరుతో చేసే వెకిలి విన్యాసాలు, తాతల కాలం నుండీ పునరావృత్తం అవుతున్న "తప్పిపోయిన కుటుంబం చిన్నప్పుడు పాడుకున్న తిక్క పాట" తరహా డొక్కు ఫార్ములాలు గట్రా అవగుణాలు పోవాలంటే ఒకే పరిష్కారం.
తొలగించండిఇకపై ఏ సినిమా కూడా శుక్రవారం రిలీస్ కాకూడదు. మాహూరత్ షాట్, ఆడియో ఫంక్షన్, ప్రీ-రిలీస్ ఈవెంట్ వగైరాలు ఏవీ శుక్రవారం పెట్టకూడదు. అసలు శుక్రవారం నాడు థియేటర్ & స్థూడియోలు సెలవిచ్చేస్తే ఉత్తమం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి"ఒరు నాళ్ ఇరవిల్"పూర్తి 'పడం' యూట్యూబ్ లో లేదే. ముక్కలు ముక్కలుగా ఉంది. మీరు చూసిన పూర్తి నిడివి బొమ్మ లింక్ ఇవ్వగలరా ప్లీజ్?
రిప్లయితొలగించండిhttps://youtu.be/vBS-gICIZ1Q
తొలగించండిఇది ట్రై చేయండి మేష్టారు
Thanks. కానీ "This video is not available" అని సణుగుతోంది. యూట్యూబ్ వారికి country preference ఏమన్నా ఉందేమో? సర్లెండి, వారు అనుమతించినప్పుడే చూడచ్చు.
తొలగించండి
తొలగించండిటెల్గు వాళ్లంటే యూ ట్యూబ్ కీ నచ్చదూ భాయీ అందుకే పరేషాన్ చేస్తది :)
గట్లనా 🙄?
తొలగించండి
తొలగించండిగట్లే :)
జై గొట్టి వారినడగి చూడుడీ :)
జిలేబి
మీరు చెబుతున్నారుగా, మళ్ళీ వారి సాక్ష్యం ఎందుకు లెండి🙂.
తొలగించండి
తొలగించండిశంఖంలో నుంచి వస్తే గాని తీర్థం కాదు కదండీ :)
జిలేబి
అంతేగా అంతేగా
తొలగించండిశంఖం లోంచి వచ్చినా తీర్థం కాదు. శంఖం లోలీకేజీ ఉందని అర్థం!
తొలగించండిI like Surya's lateral thinking 👌😃.
తొలగించండినరసింహా రావు గారు, మొత్తానికి తెలుగు వెర్షన్ చూసినట్లు ఉన్నారే. వేణు శ్రీకాంత్ గారి బ్లాగ్ చదువుతుంటే తెలిసింది.
తొలగించండిఅవును పవన్ గారు, మొత్తానికి తెలుగులోనే చూసేసాను. ఎస్, సినిమా బాగుంది. కాకపోతే వేణూశ్రీకాంత్ గారి బ్లాగులో ( "మన ఊరి రామాయణం" movie ) నా కామెంట్లో చెప్పడం మరచాను, తెలుగు వెర్షన్ పేరు ("మన ఊరి రామాయణం") కంటే తమిళ వెర్షన్ పేరు ("ఒరు నాళ్ ఇరవిల్" = ఒక రోజు రాత్రి) సరైనదని నా అభిప్రాయం. కథలోని కీలకభాగం తమిళ్ టైటిల్లో ఎక్కువగా ప్రతిబింబిస్తుందని అనిపిస్తుంది.
తొలగించండిచాలా కాలం తరువాత మీ దర్శనం. అంతా కుశలమే కదా?
అంతా కుశలమే మేష్టారు. ధన్యవాదాలు.
తొలగించండిఇక్కడ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి, పిల్లల జాయినింగ్స్, ఇంకా లేట్ ఈవెనింగ్ ఆఫీస్ వర్క్ తో ఇంట్లో తీరిక దొరకట్లేదు బ్లాగ్స్ వైపు రావడానికి. నిన్న అలా బ్లాగ్ లోకంలో విహరిస్తుంటే మా ఊరి రామాయణం తగిలింది.
అవును మీరన్నట్లు తమిళ్ సినిమా పేరే ఆ కథ కు బాగుంటుంది.
అవును మేష్టారు అయ్యి ఉండచ్చు, ఇక్కడ శుభ్రంగా రన్ అవుతోంది మూవీ.
రిప్లయితొలగించండి96 అని ఏదో సినిమా ఉందటగా, చూ"షా"రా మరి?
రిప్లయితొలగించండిషూడలేదు కానీ ఈ షా అంతరార్థం ఏమిటి సూర్య గారు?
తొలగించండిబాగుందని అందరూ అన్నారు
ఈ షా గురించి తెలుసుకోవాలంటే అమిత్ షా చిన్నప్పటి రోజుల్లోకెళ్లాలి. అప్పట్లో"తెనాలి రామలింగడు"అనే తెలుగు చిత్రం ఒకటి ఉంది. అందులో అక్కినేని సిద్ధాంతి వేషంలో వచ్చి రాయలవారికి ద్రోహం చేసే ఆస్థాన సిద్ధాంతిని పట్టించే సీన్ ఒకటుంది. ఆ సీన్ లో "చూశారామరి" అనడానికి మన నాగేస్సర్రావు "చూషారా మరి" అని ఉచ్ఛరిస్తాడు. ఈ మధ్య మన తెలుగు బ్లాగుల్లోనే ఎవరో తమాషా కోసం ఆ పదం "చూషారా" అనే వాడారు. అద్గదీ సంగతి☺️
తొలగించండిఅర్థమైంది, "భాసా హాష్యం" అన్న మాట
తొలగించండిబావుంది పవన్ గారు.. తమిళ్ వాళ్ళకి భాషాభిమానం కాస్త జాస్తేనండీ. (తెలుగు వాళ్ళకు తక్కువ అనుకోవాలేమో.) ఓ ఏడాదిన్నర పాటు చెన్నైలో పని చేసిన అనుభవంతో ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగిందిలెండి నాకు.
రిప్లయితొలగించండిఒరు నాళ్ ఇరవిల్ సత్యరాజ్ గారంటే బాగా చేసుంటారు చూస్తాను. మాన్స్టర్ సినిమా ఎలుక గురించి అంటే ఆ మధ్య బ్రహ్మానందం గారితో ఎలుకామజాకా అని తెలుగులో ఓ సినిమా వచ్చింది అది ఈ సినిమా రీమేక్ కాదు కదా.
మీరన్నది నిజమే, మన కంటే వారికి కాస్త భాషాభిమానం ఎక్కువే.
తొలగించండిసత్య రాజ్ కి పోటా పోటీగా, ఆ వేశ్య పాత్ర వేసిన నటి కూడా చాలా బాగా నటించింది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అనుకోండి.
ఏదో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ కదా అని ఆ 'ఎలుకామజాకా' చూశాను గానీ వేరొకరైతే పూర్తిగా చూడలేరు వేణూశ్రీకాంత్ గారు. మాన్స్టర్ పూర్తిగా వేరొక కథ, నాకు నచ్చింది అందరికి నచ్చక పోవచ్చు.
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండి