15, ఆగస్టు 2019, గురువారం

తలా తోక లేని కథే కావచ్చు

పెన్సిల్ తన మానాన తాను ఏదో రాస్తోంది. 

అప్పుడప్పుడూ రబ్బర్ కొంచెం కొంచెంగా కొట్టేస్తూ ఉంది . 

ఎందుకు కొట్టేస్తున్నావ్? 

నువ్వు తప్పు రాశావు, అందుకే 

కాసేపటికి మళ్ళీ రబ్బర్ కొట్టేసింది.  

మళ్ళీ ఎందుకు?

నువ్వు మళ్ళీ తప్పు రాశావు, అందుకే. 

"నువ్వు ఇలా ప్రతి సారి అడ్డుతగిలితే నేను పూర్తి చెయ్యలేను" విసుక్కుంది పెన్సిల్ 

అయినా రబ్బర్ తన పని తాను చేస్తూనే ఉంది. 

నిన్ను తిట్టినా నీకు బుద్ధి రాదు, అయినా ఎందుకు ఎప్పుడూ నా వెన్నంటే ఉంటావు, నీకు అస్సలు సిగ్గు లేదు. 

ఇవేమీ పట్టనట్లుగా రబ్బర్ తన పని తాను చేస్తూనే ఉంది. 

ఇలా పెన్సిల్ రాస్తూనే ఉంది, రబ్బర్ సరిచేస్తూనే ఉంది. 

కొంతకాలానికి రాయడం పూర్తయ్యింది, చాలా బాగా రాశావని అందరూ పెన్సిల్ని మెచ్చుకున్నారు. 

పెన్సిల్ ఇంటికి వస్తూనే 'చూశావా, ఎప్పుడూ నేను రాస్తుంటే తప్పులు, తడకలు అంటూ నాకు అడ్డు తగులుతూ నన్ను అరగదీస్తుండేదానివి.   ఇప్పుడు చూడు చాలా బాగా రాశానని అందరూ మెచ్చుకుంటున్నారు, నువ్వు అడ్డు రాకపోయి ఉంటే ఇంకా తొందరగా పని పూర్తి చేసేదాన్ని' అని రబ్బర్ తో అందామనుకుంది. 

రబ్బర్ మాత్రం ఎక్కడా  కనిపించలేదు, రబ్బర్ అరిగిపోయి చాలా చిన్న ముక్క మిగిలి ఉండటం వల్ల నేమో పనికి రాదని చెత్త బుట్ట లోకి తోసేసినట్లు గుర్తొచ్చింది. 

ఒకప్పుడు బలంగా, పెద్దగా ఉండే రబ్బర్ ఇలా పీలగా, చిన్నగా అయిపోయిందనే విషయం అప్పుడే అర్థం అయింది. 

నేను తప్పు చేసిన ప్రతీ సారి నన్ను సరిచేస్తూ నువ్వు అరిగిపోతున్నావని నేను గుర్తించలేకపోయాను, క్షమించు అంది పెన్సిల్. 

ఇంతే కథ. ఇది అర్థం పర్థం లేని, తలా తోక లేని కథే కావచ్చు, కానీ రబ్బర్ స్థానం లో మన తల్లిదండ్రులు, పెన్సిల్ స్థానం లో మనము ఉన్నామని గుర్తిస్తే ఈ కథకు తల, తోకే కాదు ప్రాణం కూడా ఉందని అనిపిస్తుంది.  

26 కామెంట్‌లు:

 1. బతికించారు, తలా తోకా లేని కథ అంటే ఏదన్నా చిరంజీవి సినిమా కథ చెబుతారేమోనని ... భయపడ్డాను.

  పెన్సిల్, ఎరేజర్ (కొన్ని దేశాల్లో రబ్బర్ అంటే వేరే అర్థంట 😉) గురించిన మీ ఈ కథ బాగుంది. చివర్లో తల్లిదండ్రులకు, సంతానానికి అన్వయించడం సమంజసంగానే ఉంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. Popcorn khai mast hojao అనే హిందీ సినిమా చూడండి. తల తోకే కాదు అసలు ఏమీ లేని సినిమా ఎలా ఉంటుందో తెలుస్తుంది!

   తొలగించండి
  2. చిరంజీవి అభిమానులం హర్ట్ అయ్యాము ఇక్కడ మేష్టారు 😊. కథ నచ్చినందుకు ధన్యవాదాలు. రబ్బర్ దాకా ఎందుకు లబ్బర్ అని కొన్ని ప్రాంతాల్లో అంటారు కదా ఆ పదానికి కొన్ని ప్రాంతాల్లో వేరే అర్థం ఉంది.

   తొలగించండి
  3. సూర్య గారు, అందుకే ఆ సినిమా పేరు అలా పెట్టారేమో? ఈ సినిమా పేరు వినడం ఇదే మొదలు.

   తొలగించండి
  4. // ... అభిమానులం హర్ట్ అయ్యాము ఇక్కడ " //

   అయ్యో కాదుటండీ మరి, పవన్ గారూ. అభిమాన "దేవుళ్ళే" కదా వారికి బలం. అభిమానులే "బాసూ మనల్ని ఇవాళ ఈ లెవెల్లో నిలబెట్టింది" అంటూ ఒక సినిమాలో డైలాగ్ రూపంలో ఐభిమానులందరినీ స్మరించుకున్నాడు కూడా.

   ఆయనొకడే కాదులెండి, పైన Anonymous గారు (15 Aug) అన్నట్లు చాలా మంది అలాగే ఉన్నారు లెండి. కాకపోతే George Orwell గారు చెప్పినట్లు All are equal, but some are more equal (equal బదులు Anonymous గారు వాడిన పదం పెట్టుకుంటే సరి). ఏ సినిమా కథ చూసినా ఏమున్నది గర్వకారణం?

   అవునూ కుతూహలం కొద్దీ అడుగుతున్నాను ... మూడు నాలుగు రోజులు క్రితం మీ ఘనతార సినిమా ఒకదాని గురించి బ్లాగ్ లో వచ్చిన రివ్యూ చదివితే దెబ్బతినని మనోభావాలు నేను వ్రాసిన ఒక్క వాక్యం వలన దెబ్బతిన్నాయా, విడ్డూరం?

   ఇక మరోసారి అ‌సలు కథ విషయానికొస్తే ... జై గారన్నట్లు మీ కథను కార్పొరేట్ చదువులకు అన్వయిస్తే సమకాలీనంగా కూడా ఉంటుంది.

   తొలగించండి
  5. Yes you're exactly truthful. All politicians are equal yet some are more equal.

   తొలగించండి
  6. అలాంటి అనేక గొప్ప ఖలాఖండాలు మా big boss ఖాతా లో ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకండి బాబోయ్.

   తొలగించండి
 2. As if only Chiranjeevi 's movies are hopeless! It's very unfair to pin point a single actor, when all actors' movies are hopeless. Or are you differing, dear sir?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అనానిమస్ గారు, ఏదో సరదాకి అన్నారు లేండి నరసింహారావు గారు.

   తొలగించండి
 3. కథ బాగుంది కానీ ఇంకో కోణం మరిచారు. పొద్దు కూకులా చెరపా & తిరగ రాస్తా ఉంటే పెన్సిల్ చిన్నబడిపోవడమే కాక కాగితం గబ్బవుతోంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరన్నదీ నిజమే, ఈ జెనరేషన్ పిల్లల పరిస్థితి అదే అనుకుంటా, ర్యాంక్స్ పేరుతో వాళ్ళను అరగదీస్తున్నారు. మన జెనరేషన్ లో ఇంత రుద్దుడు లేదనుకుంటా.

   తొలగించండి
  2. పుస్తకాల బరువులు, అర్ధం కాకపోయినా బట్టీ వేసే ఫార్ములాలు, డ్రైవర్ల కంటే తక్కువ జీతం సంపాదించే పంతుళ్లు టన్నుల కొద్దీ ఇచ్చే నోట్స్ కాగితాలు, ట్యూషన్ల మీద ట్యూషన్లు, చిత్రహింసకు మారుపేరయిన హోమువర్కులు, వీధివీధికీ చైనా కర్మాగారాలు: అన్నీ పెరిగాయి, పాపం ఈనాటి పిల్లలు.

   ఇవన్నీ ఒక ఎత్తైతే తల్లితండ్రుల (మాట వరసకే లెండి, మన పుణ్యభూమిలో తల్లులకు నోరు వాయీ లేదు) ఒత్తిడి ఇంకో టార్చర్. జావా అంటే ఏమిటో తెలీదు, అమెరికా కాదు సరికదా ఆగ్రా చూడలేదు, తన పిల్లలు మాత్రం పేద్ద సాఫ్త్వేర్ ఇంజనీరై న్యూజెర్సీలో ఉండాలని ఒకటే ఆదుర్దా. వాడికి తలరాత ఉంటే వెళ్తాడు అని ఊరుకోకుండా "పక్కింటి కుర్రాడికి ట్రిగ్నామెట్రీలో 100% మార్కులు వస్తే నీకెందుకు 98% వచ్చాయిరా వెధవా, ఇట్లాగుంటే అమెరికా వాడు నిన్ను రానిస్తాడా" అంటూ ఒకటే నసుగుడు.

   తొలగించండి
  3. మా అమ్మాయి వాళ్ళ క్లాస్ లో మూడేళ్లు గా ఒక అబ్బాయి అన్ని సబ్జెక్ట్స్ లో టాప్ వస్తున్నాడు, అతని విజయ రహస్యం ఇదే మరి, రోజుకు కనీసం నాలుగు గంటల తోముడు. నేను కనీసం మా అమ్మాయిని ఒక గంట సేపు కూడా తోమట్లేదు అని మా ఆవిడ కంప్లైంట్.

   తొలగించండి
  4. తెగ కష్టపడిపోయి టాపర్ అయ్యే అమ్మాయికంటే టాప్ వచ్చినవాడిని తను గీసిన వృత్తం లో నిల్చునేలా చేసే అమ్మాయే తెలివైనదని చరిత్ర చెబుతోంది!!

   తొలగించండి
 4. Of course☝️🙂.

  WhatsApp లో ఆ మధ్య చదివిన ఒక జోక్ 👇:-

  Teacher :- Venkat, what do you want to be when you grow up?

  Venkat :- I want to get an engineering degree from IIT, get MBA from Harvard in USA, start own business, become a millionaire, get a big house and buy luxury cars.

  Teacher :- Good. Now Lakshmi, what do you want to be when you grow up?

  Lakshmi :- I would like to be Venkat's wife.
  ------------
  Smart girl, right 🙂?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఏమిటో ఇంకా ఈ పాత చింతకాయలు!

   తొలగించండి
  2. అవును జై గారు నా ఫీలింగ్ అదే. జోక్ వరకు బాగుంది మనోభావాలు దెబ్బ తిననంత వరకు.

   తొలగించండి
  3. మనోభావాలు గురించి ఫర్లేదండీ, మనస్తత్వాల సమస్య కాకపొతే సంతోషం.

   "శో"షల్ మీడియాలో వచ్చే వాటిలో 99.99999% సమాజంలో లోతుగా పెనువేసికొని పోయిన కాలం చెల్లిన చాదస్తాలను & stereotypes పునరుద్ఘాటించేవే. (కుదిరితే ఓసారి నవ్వేసుకొని) డిలీట్ చేయడం బెస్టనుకుంటా.

   తొలగించండి
 5. పవన్ కుమార్ రెడ్డి గారు,
  సూర్య గారొక సరదా వ్యాఖ్య పెట్టారు (18 August 2019 at 05:02). వారు అన్న దానికి దగ్గరగా ఉందనిపించిన ఒక జోక్ నేనూ సరదాగానే పోస్ట్ చేశాను (18 August 2019 at 08:30) . జోక్ లోని ఆ అమ్మాయి సమయస్ఫూర్తిని సరదాగా ఆస్వాదిస్తారు అనుకున్నానే‌ గానీ దీంట్లో ఎవరి మనోభావాలైనా దెబ్బ తినేందుకు ఆస్కారం ఏమన్నా ఉందా అన్నది నాకు తెలియడం లేదు. మీరేమన్నా క్లారిఫికేషన్ ఇస్తే చూసి తెలుసుకుంటాను, థాంక్యూ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మేష్టారు, నేను దాన్ని జోక్ లాగే తీసుకున్నాను కానీ ఆయ్, మేము మగాళ్ళ మీద ఆధారపడి ఉన్నామా? అని అనుకునే నేటి ఆధునిక ఫెమినిజం భావాలు ఉన్న ఆడాళ్ళు మరోలా భావించారు నిన్న మా ఆఫీసులో ఈ జోక్ చదివి ఒక అమ్మాయి ఇలానే అంది. తను దాన్ని జోక్ లా తీసుకోలేక పోయింది.అందుకే మనోభావాల ప్రస్తావన వచ్చింది. Otherwise మిమ్మల్ని hurt చెయ్యాలనే ఉద్దేశం లేదు.

   తొలగించండి
  2. "పెన్సిల్ ఎదో రాస్తుంది, ఎరేజర్ దాన్ని తుడిపేస్తుంది" అన్న సూత్రాన్ని పాటించి చెరిపేస్తే పోలా.

   తరతరాల బూజు సమిసి పోవడానికి సమయం పడుతుంది అందాకా ఓపిక పట్టండి!

   తొలగించండి
  3. జోకుని జోకులాగా.. నిజాన్ని నిప్పులాగా అంగీకరించలేకపోవడానికి కారణం జెలసీ. తనకు దక్కనిది పక్కవారికి దక్కితే అభ్యుదయ భావాలతో కాస్త కవర్ చేసుకుంటారన్నమాట!

   తొలగించండి
  4. అందరూ ఒకలా ఉండలేరు కదా సూర్య గారు, అందుకే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. ఎవ్వరినీ తప్పు పట్టలేము.

   తొలగించండి
 6. సింపుల్ విషయాలతో మీరు కథలు బాగా చెప్తారండి, పవన్ గారు!

  రిప్లయితొలగించండి