23, మార్చి 2022, బుధవారం

ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్

125 సంవత్సరాల స్వామి శివానంద గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం నిజంగా సంతోషించదగ్గ విషయం. నిన్న మాత్రమే ఈయన గురించి మొదటి సారి విన్నాను, నాకు పెద్దగా లోక జ్ఞానం లేకపోవడం ఒక కారణం కావచ్చు.

కాకపోతే ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్ గా నైనా ఇతని గురించి విని ఉండాలి కదా, అది కూడా జరగలేదే అని గూగుల్ చేస్తే రిజల్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. 

ఈ స్వామి శివానంద వారి బర్త్ డేట్ ని ధ్రువపరిచే సర్టిఫికెట్స్ లేకపోవడం లాంటి వాటి వలన ఇతన్ని 'ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్' గా రికార్డ్స్ లో ఉంచలేదా అని నా అనుమానం. 

గిన్నీస్ రికార్డ్స్ ప్రకారం ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్ ఒక జపనీస్ వ్యక్తి అని చూపుతోంది. ఓల్డెస్ట్ లివింగ్ పర్సన్ ఇన్ ఇండియా అని చూస్తే స్వామి శివానంద గారిని చూపెడుతోంది. అంటే ఇండియా 'వరల్డ్' లో లేదా ఏమిటి??రామాయణం లో పిడకల వేటలా ఏమిటీ చచ్చు ప్రశ్నలు అంటారా? ఊరికే, సమాధానం ఎవరికైనా తెలిసి ఉండచ్చేమో అని ఇలా పోస్ట్ చేయడం అంతే. 
8 కామెంట్‌లు:

 1. // “ నాకు పెద్దగా లోక జ్ఞానం లేకపోవడం ……….” //
  హ్హ హ్హ, “అన్నమయ్య” సినిమాలో అన్నమయ్య తల్లి పాత్ర చెప్పే డైలాగులాగా ఉంది.

  అయినా మీ బ్లాగ్ పేజీలో అంత అందమైన అడ్వర్టైజ్మెంట్లు పడుతుంటే మీరేమిటో “కలా”పోషణ లేకుండా వృద్ధుల గురించి ప్రశ్నలు వేస్తారేమిటి 🙂? అసలింతకీ చివరికి మీ ప్రశ్న ఏమిటి?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మేష్టారు, అలాంటి డైలాగ్ ఒకటి అన్నమయ్య సినిమాలో ఉందనే విషయం నాకు గుర్తు లేదు, మీరు గుర్తు పెట్టుకున్నారు అంటే మన తెలుగు సినిమా మీద మంచి పట్టు ఉన్న వారిలా ఉన్నారు.
   ఆ యాడ్స్ సంగతి నాకు తెలీదు మరి రాండమ్ గా వస్తూంటాయేమో మరి.
   చివరికి నా ప్రశ్న ఏమిటంటే 'మన స్వామి గారి పేరు ఎందుకు ఆ గిన్నిస్ బుక్ లోకి ఎక్కించలేదు?' అని.

   తొలగించండి
  2. ఎవరైనా గినెస్ బుక్ లోకి ఎక్కడానికి కొంత తతంగం ఉంటుంది. డాక్యుమెంట్లు కూడా అవసరం కూడా పడచ్చు. కాబట్టి స్వామి గారి దగ్గర వారెవరన్నా అవన్నీ సేకరించి ఆ పనికి పూనుకోవాలి. మరి స్వామి గారి డాక్యుమెంట్లు ఉన్నాయో లేవో?

   ఆయన యోగా గురువు అని చెబుతున్నారుగా. వారి దీర్ఘాయుస్సు కారణం అదీ, సరైన జీవనవిధానం అయ్యుండవచ్చు.

   https://www.quora.com/What-is-the-procedure-for-applying-for-Guinness-World-Records

   అవునూ, మీ ఈ బ్లాగులో వచ్చే కామెంట్లు “మాలిక”లో కనిపించడం మానేశాయే? మీ సెట్టింగులనేమన్నా సరి చెయ్యాలేమో? లేదా “మాలిక” వారికి మెయిల్ ఇచ్చి చూడాలేమో?

   తొలగించండి
  3. ఇన్ని రోజులు మాలిక లో 'వ్యాఖ్యలు' అన్న టాబ్ ఉందని మీరు చెప్తేనే ఇవాళ గమనించాను మేష్టారు. Thanks వారికి మెయిల్ పెట్టి చూస్తాను.

   తొలగించండి
 2. నేను అవార్డు వీడియో చూసాను. ఆయనకి 125 ఏళ్ళంటే, నమ్మశక్యంగా లేదు.

  రిప్లయితొలగించండి
 3. మా పిల్లలు కూడా అస్సలు నమ్మట్లేదు బోనగిరి గారు ఆ వీడియో చూపిస్తే. ఇప్పటికీ ఆయన చురుకుగా ఉండగలుగుతున్నారు అంటే అది ఆయన పాటించిన కఠిన నియమాలు అయి ఉండచ్చు. హాట్స్ ఆఫ్.

  రిప్లయితొలగించండి
 4. వయస్సు 25 అయ్యుంటుందండి. 1 అచ్చుతప్పయ్యుండొచ్చు

  రిప్లయితొలగించండి