ఒరేయ్ అబ్బీ, పాత చొక్కా వేసుకొని వెళ్ళాలని తెలీదా చిరంజీవి కొత్త సినిమాకి వెళ్ళేప్పుడు అని తిట్టేవాళ్ళు అప్పట్లో. ఆ పాత రోజుల్ని తలచుకొని సంబరపడటమే.
ఇప్పుడు చిరంజీవి సినిమా మొదటి రోజు చూడాలి అనే ఇంటరెస్ట్ కలగడం లేదు. గాడ్ ఫాదర్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చారట , ఒక నాలుగైదు వారాల్లో చూడచ్చులే అని లైట్ తీసుకున్నా.
చిరంజీవి కి స్టోరీ ఎంచుకునే సామర్థ్యము తగ్గిపోయింది అని నా ఉద్దేశ్యం. 150 సినిమాలు చేసిన ఆయనకి తెలియకపోవడం ఏమిటి అనుకోవచ్చు కానీ ఎవరికైనా డౌన్ ఫేజ్ అనేది ఉంటుంది కదా ఎప్పుడో అప్పుడు. అసలు సినిమాల్లోకి రీ ఎంట్రీ అన్నప్పుడు "ఆటో జానీ" అనే టైటిల్ తో సినిమా అని వినిపించింది. ఈ మధ్య దేవర కొండ నెత్తిన మరో బండ పడేసిన పూరి డైరెక్షన్ లో ఆ సినిమా అన్నారు. అసలు ఆ టైటిల్ పూరి చెప్పినప్పుడే కథ కూడా వినకుండా రిజెక్ట్ చెయ్యాల్సింది. నా లాంటి ఓల్డ్ జెనెరేషన్ పీపుల్ తప్ప ఎవరైనా ఈ కాలంలో రిలేట్ అవగలుతారా ఆటో డ్రైవర్ క్యారెక్టర్ తో. ఇదేమైనా రౌడీ అల్లుడు కాలమా? అసలు చిరంజీవి ఏజ్ కి రేంజ్ కి ఆటో డ్రైవర్ అంటే మ్యాచ్ అవుతుందా? టాక్సీ డ్రైవర్ అంటే కాస్తో కూస్తో ఓకే. కాకపోతే నా అభిప్రాయం ఏమిటంటే ఆ 'ఆటో జానీ' స్టోరీ నే అటూ ఇటూ మార్చేసి బాలయ్య తో "పైసా వసూల్" అని తీసేశాడని నా ఫీలింగ్.
సరే, అప్పటి విషయం వదిలేస్తే ఇప్పుడు మొహంలో గ్రాండ్ ఫాదర్ కళ కొట్టొచ్చినట్లు కనపడుతుంటే గాడ్ ఫాదర్ అని పెట్టుకుని వస్తే జనాలు చూస్తారా? లేదా? అనేది ఈ రోజుతో తేలిపోనుంది.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ అని వరసబెట్టి పక్క రాష్టాల సరుకును మన మీదికి తోలుతున్న మెగా బ్రదర్స్ ఇకనైనా రూట్ మార్చకపోతే వారి ఫేట్ మార్చడానికి తెలుగు ప్రజలు రెడీ గా ఉన్నారన్నది కాదనలేని సత్యం. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం, ఈ OTT కాలంలో కూడా అందరూ చూసేసిన పరభాషా సినిమాలను కూడా హిట్ సినిమాలుగా మలచగలుగుతున్నారంటే మాత్రం ఆ మార్పులు చేసిన వారిని అభినందించి తీరాల్సిందే.
చెర్రీ, వర్రీ, వెర్రి, ధర్రీ, కర్రీ, బర్రి, గొర్రి అని ఇప్పటికే అరడజను వారసులను హీరోలను మోస్తున్నాము. చరణ్ ని చెర్రీ అన్నట్టు వరుణ్ ని వర్రీ అని సాయి ధరమ్ ని ధర్రీ అని పిలవచ్చేమో? రేప్పొద్దున జెర్రి అని ఇంకో హీరో రావచ్చు. మరి వారి ఫామిలీ నుంచి ఇంత మంది హీరోలు ఉండగా ఇప్పటికైనా ఈయన హీరోగా చెయ్యడం ఆపచ్చు కదా అనిపిస్తుంది. ఇంకా నయం ఈ సినిమాలో హీరోయిన్ అంటూ లేదు కాబట్టి డ్యూయెట్స్ ఉండకపోవచ్చు. కమల్ లాగా విక్రమ్ లాంటి సినిమా చేస్తే బాగుండేది ఏజ్ కి తగ్గట్టు.
దెబ్బలు తిన్న సింహాన్ని కాకులు కూడా లోకువగా పొడుచుకుతింటాయంటారు కదా ఇప్పటికే సైరా, ఆచార్య లాంటి దెబ్బలు తిన్న మా బాస్ కి అలాంటి పరిస్థితి రానీయకుండా ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను.
బాపు గారి కార్టూనొకటి ఉంది.
రిప్లయితొలగించండిచూడండి అప్పారావు గారూ, మీరు రోజూ రంగు రంగుల చొక్కాలు, రకరకాల పువ్వుల ప్రింట్లున్న చొక్కాలు వేసుకుని ఆఫీసుకి వస్తున్నా కూడా వచ్చే నెలాఖరుకి మీకు రిటైర్-మెంటు వయసు నిండుతుంది, మీరు రిటైర్ అవ్వాల్సిందే ….. అంటాడు బాసు.
ఆ దశ వచ్చేసిందని గ్రహించి మీ బాసుడు కూడా రిటైరవుతున్నానని హుందాగా ప్రకటించేసి, హాయిగా ఏ ఫిల్మ్ డెవలప్-మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవో సంపాదించి ఆ పని చేసుకోవడమో, లేదా స్వంత వ్యాపారాలేవైనా ఉంటే ఆ వ్యవహారాలు చూసుకోవడమో …. చేస్తే గౌరవప్రదంగా ఉంటుంది. మీలాంటి అరివీర భయంకర అభిమానులందరూ ఎలాగైనా ఈ మాట వారి చెవిన వేయరాదూ?
మా చిన్నతనంలో రమాకాంత్ దేశాయ్ అని ఓ ఫాస్ట్ బౌలర్ ఉండేవాడు. 1960 దశకంలో భారత్ టెస్ట్ టీమ్ మ్యాచ్ లకు ఆయనే ఓపెనింగ్ బౌలర్ చాలా కాలం. బాగా ఆడుతున్న రోజుల్లోనే, 30 యేళ్ళ వయసు కూడా రాకముందే తన రిటైర్-మెంట్ ప్రకటించాడు. అప్పుడే రిటైర్ అవడం ఎందుకు అని ప్రజలు అడగగలిగే సమయంలో రిటైర్ అవ్వాలి గానీ ఎప్పుడు రిటైర్ అవుతావు బాబూ అని అడిగేటంత వరకు ఆగకూడదు … అన్నాడు రమాకాంత్ దేశాయ్ తన రిటైర్-మెంటప్పుడు. ఆ మాట ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో ప్రముఖంగా వచ్చిందని గుర్తు. ఈ కథ కూడా మీరంతా మీ బాసుడుకి చెబితే బాగుంటుందేమో ఆలోచించండి 🙂.
మా బాస్ యాక్ట్ చెయ్యాలనే కోరుకుంటాను గానీ హీరో గానే అవసరం లేదు అని నా ఫీలింగ్ మేష్టారు.
తొలగించండిఈ రమాకాంత్ దేశాయ్ గురించి నేనూ ఒకటి రెండు సార్లు విన్నాను అప్పట్లో. సచిన్ హైట్ గురించిన డిస్కషన్ వచ్చినప్పుడు సీనియర్ గ్యాంగ్ ఈయన విషయం కూడా ఎత్తేవారు.
Yes sir. One should retire when people ask ' why ' and not 'when '. It is generally observed that Indian politicians, cricketers and actors don't retire gracefully.
తొలగించండిఅమరావతి కథలు లో ఒక పులి వేషం వేసే కళాకారుడి కథ గుర్తుకు వస్తుంది.
Chiru , bala, nag, Venky should play their age or gracefully retire.
చిరంజీవి సంభాషణలు చెప్పే తీరు కూడా సన్నగిల్లింది.
Yes, true. Thanks
తొలగించండిమీకు, మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు మేష్టారు.
తొలగించండిసినేమా చూడకుండానే ఇంత బిల్డప్పా !!! :)
రిప్లయితొలగించండిఆల్రెడీ మళయాళ నటులు యాక్ట్ చేసిన సినిమా చూసేసాక మళ్ళీ చూడమంటే ఎలా అజ్ఞాత గారు. ఇంకో నాలుగైదు వారాల్లో నెట్ ఫ్లిక్స్ లో వస్తుందట, అప్పుడు చూస్తాను లెండి
తొలగించండికాకులు కూడా-మెగా పేరెత్తగానే గబా గబా వాలే ఓ ఇద్దరినుద్దేశించి అజ్ఞాతంగా రెండెద్దుల వారీ రెండు పదాలు వాకృచ్ఛారా అని మీ గ్లాబుని అప్పుడప్పుడు సందర్శించే ఈ అజ్ఞాతకి ఓ ప్రఘాఢ అనుమానం. కానీ దేనికదే చెప్పాలిమాస్టారూ, నెగటివ్ గా రాసినట్లు రాసి భలే టెస్ట్ చేసారు.
రిప్లయితొలగించండిడీకోడింగ్ ఎలా చెయ్యాలబ్బా?
తొలగించండినేను కూడా భుజాలు తడుముకోవాలంటారా 🤔?
తొలగించండిడీకోడ్ చెయ్యగలిగితే ఇక్కడే ఇవ్వండి ఆ సొల్యూషన్ ని.
తడుముకోవాలేమో అనిపిస్తోంది మేష్టారు.
తొలగించండిఅయితే మాబోంట్లు ఇక నుంచీ మీ బాసుడి గురించి వ్యాఖ్యానించడం మానెయ్యడం ఉత్తమం ... మరీ "కాకులు" అనిపించుకోవడం అనవసరం కదా.
తొలగించండితెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీ విద్యాబోధనా పద్ధతులను మార్చెయ్యడంలో ఆద్యులై జూనియర్ కాలేజీలను కాలేజీలా ఫాక్టరీలా అనిపింపజేస్తున్న ఓ సంస్ధనీ …….. తెలుగు సినిమా పోకడను ఓ మలుపు తిప్పాడు కరక్టే గానీ తరువాత తరువాత కొన్ని వెర్రితలలు వేయడానికి పరోక్షంగా ట్రెండ్ సెట్టరయ్యాడా అనే అనుమానం కలిగించేలా మీ బాసుడునీ ……. ఏమనీ ఉపయోగం లేదు. పైగా ఫాన్స్ తే తంటా. ఠాఠ్, అన్నకు క్షమార్పణ చెబుతావా లేదా అంటూ మీదమీదకొచ్చే ప్రమాదం కూడా ఉండచ్చు - గరికిపాటి అంతటి వారికే తప్పేటట్లు లేదు, మనమెంత.
కాబట్టి ఈసారికిలా పోనిద్దాం.
లోకులు కాకులు అంటారు కదా మనం ఈ లోకంలోనే కదా ఉన్నాం, కాబట్టి ఒక్కోసారి అన్నా సర్దుకుపోవాలి తప్పదు మేష్టారు. కాకపోతే పెద్ద తమ్ముడు కాకి అందరి మీద పడి రక్కుతున్నాడు, కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి.
తొలగించండిఈ కాకుల లెక్క ok గానీ ఈ కాలేజీల లెక్క అర్థం కావట్లేదు మేష్టారు
తొలగించండిఆ కాలేజీల లెక్క అర్థం కావట్లేదా? హాశ్చర్యం. మీ వయసెంతో ఖచ్చితంగా తెలియదు కానీ 40 ల్లో గనక అయితే, చదువు ఏపీ లోనే జరిగుంటే - మీరు కూడా మీ ఇంటర్మీడియెట్ అటువంటి ఒకటి … ఒకటి … ఒకటి / రెండు … రెండు … రెండు వగైరా “ఫాక్టరీల్లో “ ఏదో ఒక దాంట్లోనే చదువుంటారని నా అంచనా.
తొలగించండిNetflix లో “Kota Factory” అని ఓ TV Series ఉంటుంది. చూడండి వీలయితే.
ఇంతకు ముందటి నా వ్యాఖ్య కవిహృదయం ఏమిటంటే ఇటువంటి కాలేజీలు బాగా పాతుకుపోయాయి, ఇదివరకటి బోధనా విధానాన్ని ఏదో పుంతలు తొక్కించాయి - పోటీ పేరిటేమో బహుశః. దాదాపు మొనోపలీ స్ధాయికి చేరుకున్నాయి. వెనక్కు తిప్పలేని పరిస్ధితి. అలాగే కొత్త పుంతలు తొక్కించిన సినిమా హీరోలు. ఈ రెండింటిలోనూ దేన్నీ మార్చలేదు సమాజం. దేన్నీ అనుకునీ ప్రయోజనం లేదు. ఆ స్టేజ్ దాటిపోయింది.
తొలగించండి40ల్లోనే ఉన్నాను మేష్టారు. చదువంతా సర్కారు బడులు, కాలేజుల్లోనే అయింది , ఏ ప్రైవేట్ బందిఖానా లోనూ చిక్కుకోలేదు లక్కీ గా.
ఇప్పుడు అర్థమైంది మీరు అన్నది.
ఈ కోట ఫ్యాక్టరీ గురించి మునుపెన్నడూ వినలేదు మేష్టారు. ఈ వెబ్ సిరీస్ లాంటివి ఒకటి రెండు చూశాను గానీ నేను ఎందుకో వాటికి కనెక్ట్ కాలేకపోతున్నాను మేష్టారు చివరి వరకు. నాలుగైదు ఎపిసోడ్స్ చూసి ఆపేస్తున్నాను. రెండు గంటలలో అయిపోయే సినిమా లే బాగుంటున్నాయి.
First of all, మీ బ్లాగ్ టైటిల్ apt గా వుంది [మీ బ్లాగ్ కి కాదు, సినిమా కి]. ఇక పోతే, మీలాంటివాళ్ళు, మీ బాసుని, "మా బాసు" అని అనుకున్నంతకాలం, మీ బాసు ఇలాంటి సినిమాలు తీస్తునే ఉంటాడని నా అభిప్రాయం. ఒక్కసారి "మా ఎక్స్-బాసు" అని అనడం మొదలుపెట్టండి. తర్వాత జరిగేది చూడండి :-)
రిప్లయితొలగించండిథాంక్స్ కాంత్ గారు. ఎక్స్-బాస్ అనాలంటే ప్రస్తుత బాస్ ఉండాలిగా అని తటపటాయిస్తున్నా. అసలే సినిమా పిచ్చోడిని, ఆ పిచ్చి వదలదు గా. చిరంజీవి ని చూసిన కళ్ళతో మరో ఏ హీరో ఆ స్థాయికి అర్హుడు కాదనిపిస్తోంది
తొలగించండి[చిరంజీవి మాట్లాడుతున్నట్టు ఊహించుకొండి] అదుగో, ఆ మాటలే నన్ను హీరోగా పెట్టి గ్రాండ్‌ఫాదర్...క్షమించాలి గాడ్‌ఫాదర్ 2, 3, 4, తియ్యమని చెపుతున్నాయి
తొలగించండి:)
తొలగించండి