క్షమించాలి .. మిమ్మల్ని నిద్ర లేపటం కాస్త ఆలస్యమైంది. ఎక్కడున్నాను అని దిక్కులు చూస్తున్నారేమిటి? మీ ఖర్మ కాలి టైం మెషిన్ ఎక్కి ప్లాట్ నెంబర్ 62 కి వచ్చారు.
ఓహో గుర్తుందా మంచింది. ఏమిటి నిద్ర లేచాక కాస్త టీ తాగాలనిపిస్తోందంటారా?
చక్కటి ఆలోచన.. పదండి అలా బయటికి వెళ్లి చిక్కటి టీ తాగొద్దాం. అదిగో టీ అనగానే రివ్వున గువ్వలా దూసుకువస్తున్నాడు చూడండి అతనే మా చిన్ని భయ్యా (అసలు పేరు గురు లక్ష్మీకర్, మేము పెట్టుకున్న కొసరు పేరు చిన్ని).
అర్థరాత్రి అయినా సరే లేపి టీ తాగుదాం వస్తావా అంటే సై అని ఎవడంటాడో వాడే మా చిన్న భయ్యా. తనతో వెళదాం పదండి టీ తాగి రావడానికి.
ఏంటి? అక్కడ కనపడే హోటల్ కి వెళదాం అంటారా?
మీ ఇంట్లో చెప్పే వచ్చారా? ఆ హోటల్ గురించి తెలుసే మాట్లాడుతున్నారా? అసలు ఏ హోటల్ పేరు చెబితే జనాలు ఆ హోటల్ లో తినడం మానేసి మూడు పూటలా పస్తు అయినా ఉండటం బెస్టు అనుకుంటారో , ఏ హోటల్ పేరు చెబితే తొక్కలో ఉండే అరటి పండైనా తిని ఆ పూటకు కడుపు నింపుకుంటారో, ఏ హోటల్ పేరు చెబితే బస్ స్టాండ్ లో బఠాణీలు తిని అటే రిటర్న్ బస్సు ఎక్కి వెళ్ళిపోతారో ఆ హోటలేనండి ఈ పులిరాజు హోటల్.
ఆ T.V add లో వచ్చే పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందో రాదో తెలీదు కానీ ఈ పులిరాజు హోటల్లో తింటే మాత్రం వెంటనే నరకానికి రైడ్ గ్యారెంటీ. (ఆత్మహత్య కు నరకమే ప్రాప్తి అని ఎక్కడో చదివినట్లు గుర్తు) తమిళనాడు కు చెందిన అతడి వంటలకు తమిలోళ్ళే తట్టుకోలేకపోయారు ఇక మనమెంత జుజుబీ. అసలు తమిళ్ వాళ్ళు సాంబార్ యెంత కమ్మగా పెడతారండీ, ఇతనెందుకో మరి అంత చెండాలంగా చేస్తాడు. తమిళోళ్ళ పరువు తీసేసాడు. ఇతనితో పాకిస్తాన్ లో ఆ ఉగ్రవాదులుండే చోట ఒక హోటల్ పెట్టిస్తే బాగుండు. ఇతని జన్మకి ఒక సార్థకత లభిస్తుంది, అలాగే ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక పరమ శూర ఘోర వీర చక్ర కూడా. తధాస్తు..ఆమెన్. (క్షమించాలి నా ఈ అతి వీరావేశానికి)
ఒకసారి గ్రహపాటునో పొరపాటునో చపాతీ తిందామని వెళ్తే చపాతీ లోకి సాంబార్ ఇచ్చాడు మహానుభావుడు. అయినా అదేం కాంబినేషన్ ఛండాలంగా? లంగా వోణి తో అందంగా ఉన్న అమ్మాయి పక్కన లుంగీ కట్టుకున్న అబ్బాయిని జోడి గా నిలబెట్టినంత ఛండాలంగా ఉంది. ఏ పప్పో, ఆలూ కర్రీ నో అయితే పంచె కట్టుకున్న అబ్బాయి లాగానో లేక ప్యాంటు వేసుకున్న అబ్బాయి లాగానో ముచ్చటగా ఉండేది జోడి. (ఏంటి? నా పోలిక చపాతీ,సాంబార్ కాంబినేషన్ కన్నా దరిద్రంగా ఉందంటారా? ఏదో ఫ్లో లో అలా వచ్చేసింది..మన్నించాలి. రోజూ చూస్తున్న దిక్కుమాలిన తెలుగు సినిమాల ప్రయాసల ప్రాసల ప్రభావం)
ఆ రోజు అలా సాంబార్ తో చపాతీ తినలేక వచ్చేసాను కాబట్టే ఈ రోజు ఇలా మీ బుర్ర తినడానికి తయారయ్యాను. అప్పుడు ఏ నక్క తోకో తొక్కి వెళ్లి ఉంటాను గానీ లేకపోతే కుక్క చావు చావాల్సి వచ్చేది. అదే జరిగుంటే నాతో పాటు మరో ఇద్దరి పేర్లు నరకం లో రిజిస్టర్ అయ్యేవి ఆ రోజో మరుసటి రోజో.
ఇంకో ఇద్దరెవరంటారా? వద్దులెండి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని అన్ని రహస్యాలు మీకు చెప్పడం బాగోదు.
అయినా ఆ పులిరాజు హోటల్ లో తినాలంటే పులి మీద రైడ్ చేసేంత దైర్యం కావాలి, నాకంత లేదు వేరే హోటల్ వెతుక్కుందాం పదండి.
ఏంటి అక్కడేదో ఇంకో హోటల్ ఉంది వెళదాం అంటారా వద్దండి.
రుచి గురించి కాదండీ బాబోయ్, 'బాబాయ్ హోటల్' అని రుచి,శుచి బ్రహ్మాండంగా ఉంటుంది ఎంతైనా గుంటూరు వ్యక్తి కదా వంటలు అద్భుతంగా చేస్తాడు. కాకపొతే రుచి, శుచి కోసం పొతే మన మెదడు వాచి పోతుంది ఆయన గొప్పలు వినలేక.
అబ్బో ఆ రోజుల్లో అయితే అని మొదలెట్టి "సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేశానని, ఎన్టీవోడు అయినా అక్కినేని అయినా నేను యెంత చెబితే అంతే అని" పప్పు వేసినప్పుడల్లా డప్పుతో, రసం వేసినప్పుడు సన్నాయితో, మజ్జిగ వేసినప్పుడు మద్దెలతో మన పొట్ట చించి ఫిడేలు, డొక్క చించి డోలు వాయించేస్తాడు, పీకల దాకా మెక్కి ఉంటామా ఆ వాయింపుకు ఎటూ పారిపోలేక మెక్కడానికి వెళ్లిన మనం మన చొక్కా మనమే చించేసుకొని ఆయన గోచినే లాక్కొని వెంకన్నకు మొక్కు తీర్చడానికి పెట్టుకున్న తలను కుర్చీ పైకెక్కి అక్కడున్న ఫ్యాన్ రెక్కకి అర్పించేయాలి, దానికంటే ముక్కు మూసుకొని తపస్సు చేసినా వెంకన్న దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లొచ్చు. అందుకే అటు వైపు వద్దులెండి అసలే నన్ను నమ్ముకొని ఇద్దరున్నారు.
నీ ఇద్దరి గొడవేమిటయ్యా .. అసలు ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు నిన్ను నమ్ముకొని ఉన్నారో తెలిసీ చెప్పకపోయావో నీ తల ఆ పులిరాజు బారిన, ఈ బాబాయ్ బారిన పడ్డ బాధితుల సంఖ్య అంత ముక్కలవుతుంది అంటారా? కాస్త ఓపిక పట్టండి చెప్తాను.

Super Pavan.. reminded both the hotels..
రిప్లయితొలగించండిThx for the comment Sharath
తొలగించండిబావుందండి మీ ప్లాట్ నెంబర్ 62. చపాతీ, సాంబారు కలిపి తినము. కానీ అమెరికా వచ్చాక అన్నీ అలవాటు అయ్యాయి. చపాతీ PBJ శాండ్విచ్ కూడా చేసుకుంటాం మేము. మీ స్నేహితుడి జీవితం మీకే కాదండీ ఎవరికైనా ఇన్స్పిరేషన్
రిప్లయితొలగించండిమీరు చదివి మెచ్చినందుకు ధన్యవాదాలు చంద్రిక గారు. చపాతీ pb&j శాండ్విచ్ ఇక్కడ కూడా కామన్ అయిపోయిందండీ.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి"లుంగీ కట్టుకున్న అబ్బాయి" అంటారా? తమిళ హోటల్ కదా, లుంగీలే కనిపిస్తాయి మరి పవన్ గారు 😀. హోటళ్ళ మీద ఆధారపడే బ్రహ్మచారుల బాధల గురించి బాగా చెప్పారు. అన్నట్లు మీ ఫ్రెండ్ చిన్ని లాగా నేను కూడా ATT నే - Anytime Tea అన్నమాట 😀.
రిప్లయితొలగించండి---------------
చంద్రిక గారు, "PBJ శాండ్విచ్" అనబడే ఆ వంటకం ఏమిటండి? ఏదైనా అమెరికన్ విశేషమా? శాకాహారమేనా? శాకాహారమయితే, మా దగ్గర టీవీ వంటల కార్యక్రమాల ఏంకరిణులు అన్నట్లు - కావలసిన "పదార్దాలు" ఏమిటి, తయారుచేసే "process" ఏమిటి? 🙂. Thanks.
ATT, మంచి షార్ట్ కట్ పరిచయం చేశారు. బాగుంది :)
తొలగించండిచదివి మెచ్చినందుకు ధన్యవాదాలు నరసింహా రావు గారు. పీనట్ బట్టర్ లేదా జాం పూసుకొని తినడమే Peanut Butter and Jelly Sandwich అండి. అమెరికా లో ఇది పాపులర్.
మొన్నోరోజు టీవీలో ఏంకరిణి "మాంగో యోగర్ట్ ప్యూరీ" తయారుచేస్తానంది. మనసులో కొంచెం అనుమానంగానే ఉన్నా సరే ఏం చెబుతుందో అనుకున్నాను (వంటల ప్రోగ్రాములు నువ్వెందుకు చూస్తున్నావు అంటారా? టీవీ ఉన్నది హాల్లోనే, కాబట్టి చెవిన పడుతూనే ఉంటుంది. అదీగాక ఎండవేళ బయటకి పోలేక). ఏమీ లేదు, పెరుగులో మామిడిపండు రసం కలుపుకుని మిక్సీలో కొట్టి తినడంట 🙁.
తొలగించండిPBJ కూడా మీరు చెప్పాక ఇప్పుడు నామటుకు అలాగే అనిపించింది. ఇంతకూ నే చెప్పొచ్చేదేమిటంటే ఏదైనా అదేవిటో తెలిసిపోయిన తరవాత ఇంతేనా అనిపిస్తుంది కదా 🙂.
మొదట (మీ బ్లాగ్ లో) PBJ పదం విన్నప్పుడు LBJ అనే పేరు గుర్తొచ్చింది. LBJ = Lyndon B Johnson అని కెనెడీ తరవాత అమెరికా అధ్యక్షుడు.
PBJ విడమర్చినందుకు థన్యవాదాలు, పవన్.
సరదా పోస్ట్! ఇంతకీ జుజుబీ అంటే ఏంటండి, పవన్‌గారు?
రిప్లయితొలగించండిధన్యవాదాలు లలిత గారు. తమిళ్ లో జుజుబీ అంటే 'అదెంత' అనే వస్తుందండి. రజని కాంత్ అదేదో సినిమాలో వాడుతాడండీ ఈ డైలాగు.
తొలగించండిరజని కాంత్ తో పోలిస్తే మిగతా హీరోలు జుజుబీ
లలిత గారి బ్లాగ్ తో పోలిస్తే పవన్ బ్లాగ్ జుజుబీ ఇలా చెప్పుకోవచ్చండి examples :)