పోయిన వారం ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ, మా బంధువు ఒకతను మా అమ్మాయితో మాట్లాడుతూ నీకు ఆస్ట్రేలియా నచ్చిందా లేక ఇండియానా అని అడిగితే
ఆస్ట్రేలియా అంది ఠక్కున ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా
ఎందుకు? అని అడిగాడు అతను
డర్టీ ఇండియా అంది
అలా అనకూడదమ్మా అని నేను అంటే
లేదు నాన్నా, ఎక్కడ చూసినా రబ్బిష్ ఉంది రోడ్డు మీద, రోడ్ సైడ్స్ లో అంది.
అలా కాదమ్మా ఇక్కడ పాపులేషన్ ఎక్కువ, ఫెసిలిటీస్ తక్కువ అని సర్ది చెప్పాను.
ఇక్కడ ఆస్ట్రేలియా లో T.V చానెల్స్ లో యాడ్ వస్తూ ఉంటుంది 'డోంట్ బి ఎ టాస్సర్' అని. సిగరెట్ తాగి పక్కనే వాటి కోసం స్పెషల్ బిన్ ఉన్నా అందులో వేయకుండా రోడ్ మీద పారేసి వెళ్లే వాళ్ళు ఇక్కడా ఉన్నారు.
స్వచ్ఛ భారత్ అనేది రెండు మూడేళ్ళ క్రితం చీపుర్లు అవీ పట్టుకొని సెలబ్రిటీస్ పోజులు ఇవ్వడంతోనే ముగిసి పోయిందేమో అనిపిస్తోంది. లేదంటే పూర్తిగా సక్సెస్ అవ్వడానికి టైం పట్టచ్చేమో అనిపిస్తోంది.
కోరమంగళ ఏరియా బెంగళూరు లో నేను తాగేసిన జ్యూస్ బాటిల్ పారేయడానికి చుట్టుపక్కల వెదికితే ఒక్కటంటే ఒక్క dustbin కనపడలేదు . బాటిల్ కాబట్టి సరిపోయింది, ఏ అరటి తొక్క అయితే అలా అరగంట సేపు పట్టుకొని తిరగడానికి వీలవుతుందా ?
ఇంకోసారి పోస్ట్ ఆఫీస్ పని మీద పోస్ట్ ఆఫీస్ లో గంటన్నర వెయిట్ చేయాల్సి వచ్చింది. తిరిగి వచ్చేప్పుడు పాస్ పోయడానికి పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడా లేవని తెలిసింది.
కాస్తో కూస్తో awareness ఉండబట్టి ఏదో ఒక గోడ దగ్గరికి చేరకుండా, పనిలేకపోయినా కాస్త దూరం లో ఉండే షాపింగ్ మాల్ లోకి వెళ్ళవలసి వచ్చింది.
madiwaala ఏరియా లో మాత్రం కొబ్బరి బొండాం బండి దగ్గర ఒక పాడుబడ్డ గోడ మీద, ఇంకొంచెం దూరం పోయాక కట్టె మీద నిలపెట్టిన అట్టపెట్టె మీద 'పబ్లిక్ టాయిలెట్ 500 మీటర్స్' అని ఒక arrow మార్క్ వేసి స్పెల్లింగ్ మిస్టేక్స్ తో రాసి ఉండటం చూసాను.
వెరీ గుడ్, గవర్నమెంట్ మంచి పని చేసింది, పబ్లిక్ టాయిలెట్ కట్టించడమే కాక ఇలాంటి ఇండికేషన్స్ కూడా పెట్టడం బాగుంది అన్నా ఆ కొబ్బరి బోండాం బండి వాడితో.
అది గవర్నమెంట్ పని కాదు సర్, ప్రతీ ఒక్కడూ అదిగో అక్కడ పని కానిస్తున్నారు అన్నాడు అక్కడ దూరంగా కనిపిస్తున్న ముళ్ల కంప వైపు చూపిస్తూ . కనీసం ఈ బోర్డు చూసి అయినా ఆ పని అక్కడ చేయరని నేనే రాయించా అన్నాడు.
స్వచ్ఛ భారత్ ఇండియా లో సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఇవి అని రాసిన ఆర్టికల్ ఎక్కడో చదివినట్లు గుర్తు. అందులో నమ్మకాలు/మూఢ నమ్మకాలు ఒక కారణం అని ఒక (జరిగిన) కథ ఇచ్చారు.
ఒకానొక మారుమూల గ్రామం లోకి సేవ చేయడానికి ఒక కుర్ర డాక్టర్ వెళ్ళాడట. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం గమనించి అలా చేస్తే రోగాలు స్ప్రెడ్ అవుతాయి, వంద రూపాయిలు పెట్టి dustbins లాంటివి కొనండి అని చెప్పాడట.
ఆ పల్లె జనాలకు వంద రూపాయలు అనేది చాలా పెద్ద మొత్తం కాబట్టి వాళ్ళు కొనలేదట. ఈ డాక్టర్ గారే ఆ dustbins కొని ఒక్కో కుటుంబానికి ఒకటి ఇద్దామని అనుకున్నారట కానీ అతని ఆదాయమే అంతంత మాత్రం ఉండటంతో ఆ ఆలోచన డ్రాప్ అయి ఒక వండర్ఫుల్ ఐడియా ఇ చ్చారట.
పాతకుండని dustbin గా వాడమని, అలా కుండలో పోగయిన చెత్తని ఏం చెయ్యాలి లాంటి సలహాలు ఇచ్చి ఆ గ్రామాన్ని క్లీన్ గా ఉంచారట.
అలా ఒక రెండు నెలలు గడిచాక ఒక అత్యవసర పని పడి పది రోజులు వేరే ఊరికి వెళ్లి వచ్చేసరికి మళ్ళీ గ్రామం మొత్తం ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయిందట.
ఎందుకిలా జరిగింది అని ఒకరిద్దరిని విచారిస్తే......
ఏదో ఒక బాబాజీ ఆ గ్రామానికి వచ్చాడని అలా మట్టి కుండలో చెత్త వేయడం అపవిత్రం అని అలా చేస్తే ఊరు మొత్తం నాశనం అవుతుందని హెచ్చరించాడట.
దాంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ తర్వాత ఇంకేదో అలోచించి మళ్ళీ ఊరిని క్లీన్ గా ఉంచేట్లు చర్యలు తీసుకున్నాడట.
ప్రతీ చోటా ఇలా ఒక డాక్టరో, కొబ్బరి బొండాం బండి వ్యక్తో ఉండకపోవచ్చు, కానీ మొదటి అడుగు మన నుంచే పడితే, అది చూసి ఇంకొకరు మరొక అడుగు వేస్తారేమో.
గాంధీ గారన్నట్లు “We must be the change we want to witness in the world”.
మాల్స్ ఉంటాయి. మంచి రహదారులు ఉంటాయి. లక్షలు పెట్టి నగలు కొనుక్కునే కొట్లు ఉంటాయి. వాటిల్లో పై అంతస్తులోకి వెళ్లేందుకు ఎలివేటర్ లు ఉంటాయి. ఎక్కడో ఒకటో రెండు చోట్ల తప్ప టాయిలెట్ కి, చెత్త వేసుకునేందుకు ప్రాధాన్యత ఉండదు. అంత least ప్రయారిటీ మనవాళ్ళకి!! అదేంటో అర్ధం కాదు.
రిప్లయితొలగించండిఅంతా రాజకీయ నాయకుల మాయ. కామెంట్స్ కి ధన్యవాదాలు చంద్రిక గారు.
తొలగించండిప్రవాసం వెళ్ళి మీరంతా పాడైపోయారండి 😭😭
రిప్లయితొలగించండి(just kidding😀). అదే మమ్మల్ని చూడండి - ఎంత వేదాంత ధోరణితో బతికేస్తుంటామో 😩. Shotgun Murugan అన్నట్లు We are like this only 😣.
నా బాధ అంతా మా అమ్మాయికి ఇండియా గురించి ఏర్పడ్డ ఇంప్రెషన్ గురించి నరసింహారావ్ గారు.
తొలగించండిమంచి వ్యాసం. అన్ని హంగులు ఉంటాయి, కానీ ప్రజల కనీస అవసరాలకి సరిపడా చెత్త బుట్టలు, బాత్రూములు ఎందుకుండవో అర్థం కాదు. ముఖ్యంగా ఖరీదైన పరిసరాలలో కూడా.
రిప్లయితొలగించండికామెంట్స్ కి ధన్యవాదాలు అన్యగామి గారు
తొలగించండిఔను మొదటి అడుగు మన నుంచే ఉండాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చూడకూడదు.
రిప్లయితొలగించండి100 % కరెక్ట్ శరత్ గారు
తొలగించండి