"నీకేం రెండు చేతులా సంపాదిస్తున్నావ్?" అన్నాడు మిత్రుడొకడు మా అమ్మాయి బర్త్ డే పార్టీ కోసం మొన్న ఆదివారం మాల్ లో షాపింగ్ చేస్తుంటే.
"నేనేమన్నా ఇండియా లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానా ఏమిటి? రెండు చేతులా సంపాదించడానికి" అన్నాను నేను.
అదే..బ్లాగ్ రాస్తున్నావ్ కదా.
అయితే?
బోలెడు యాడ్స్, బోలెడు సంపాదన.
ఓహో ఆ సంపాదనా ! అవును ఆ డబ్బుతో కార్ కొందామనుకుంటున్నాను.
"అవునా అంత వస్తుందా?" అతని కళ్ళలో ఆశ.
ఉండు, అంత ఆత్రుత ఎందుకు, ఇంకా నేను మాట పూర్తి చేయందే. ఆ డబ్బుతో కార్ కొందామనుకుంటున్నాను ఇంకో రెండు వందల ఏళ్ళ తర్వాత.
అదేంటి?
అవును మరి, నేను ఒక పోస్ట్ రాస్తే 5 సెంట్స్ రావడమే ఎక్కువ, ఆ పోస్ట్ రాసే బదులు అలా రోడ్డు మీద తిరిగొచ్చినా ఒక 5 సెంట్స్ కాయిన్ దొరకచ్చు , ఇక్కడ జనాలకు ఐదు సెంట్స్ కు పెద్ద వేల్యూ ఇవ్వరు, రోడ్డు మీద పారేస్తారు. (ఇది నిజంగా నిజం, నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో రోడ్డు మీద ఈ ఐదు సెంట్స్ కాయిన్స్ బాగా కనపడేవి, ఈ మధ్య నా లాంటి ఇండియన్స్, చైనీస్ ఎక్కువయ్యారేమో అంత ఎక్కువగా కనపడట్లేదు 😊)
అవునా? బ్లాగ్స్ రాసి బాగా సంపాదించచ్చు అనుకున్నానే? కనీసం ఒక పూట లంచ్ చేయడానికి సరిపోయేంత డబ్బులైనా వస్తాయా నెలకు?
కనీసం ఒక కాఫీ తాగడానికి కూడా సరిపోయేంత రావు సంవత్సరానికి.
అవునా?
అవును మరి, ఇంతవరకు మొత్తం కలిపి 4 డాలర్స్ వచ్చాయి.
మరింకేం ఒక కాఫీ తాగొచ్చన్నమాట.
గొచ్చు గొచ్చు, ఇంకో 96 డాలర్స్ వస్తే
మళ్ళీ ఇదేంటి?
అదంతే. టోటల్ అమౌంట్ వంద డాలర్స్ వస్తేనే నువ్వు గూగుల్ నుంచి ఆ డబ్బు పొందొచ్చు. కాబట్టి ఇంకో రెండు సంవత్సరాలు ఆగు అప్పుడు 100 డాలర్స్ వస్తే మన ఇద్దరం వెళ్లి లంచ్ చేద్దాం అని అన్నాను అతనితో.
నేనేదో బ్లాగ్ లో రాస్తూ తెగ సంపాదిస్తున్నానని మొన్నొక అమ్మాయి వాట్సాప్ లో తెగ questions అడిగింది, నేను కూడా ఇలా ఒక బ్లాగ్ ఓపెన్ చేసి పోస్ట్స్ రాస్తే వచ్చే డబ్బులతో నా పాకెట్ మనీ లాంటివి సంపాదించుకోవచ్చా? blogspot అయితే బెటరా లేక wordpress అయితే బెటరా అని? (నిజ్జంగా నిజం ఆ అమ్మాయి అలాగే అడిగింది). మరికొందరేమో బ్లాగ్స్ లో పోస్ట్స్ రాసి నేనేదో తెగ సంపాదిస్తున్నానని అనుకుంటున్నారు. కేవలం డబ్బు సంపాదించడమే అయితే, ఇక్కడ ఆస్ట్రేలియా లో స్టోర్ కీపర్ గానో, రెస్టారెంట్ లో సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చేసినా గంటకు 20 డాలర్స్ సంపాదించచ్చు. డబ్బు కోసం కాదు, ఏదో రాయాలన్న దురద, సరదా అంతే. అందరూ Adsense కు అప్లై చేశారు కాబట్టి నేను చేశా అంతే . తెలుగు బ్లాగ్స్ కు ఈ Adsense approval ఒక 9 నెలల కింద వచ్చినట్లుంది, కానీ నేను బ్లాగ్ రాయడం మొదలెట్టి మూడేళ్లు అయింది.
ఉజ్జోగం పోయినా బ్లాగుమీద బతికెయ్యొచ్చంటగా
రిప్లయితొలగించండిఇదిగో ఇట్టాగే మాట్లాడుతారు శానా మంది. 😊
తొలగించండినాలుగు డాలర్లతో (AUD) కారు కాదు సరికాదు కదా ఒక్క లీటర్ పెట్రోల్ అయినా వస్తుందాండీ?
రిప్లయితొలగించండిఇక్కడ పెట్రోల్ చీప్ కాబట్టి నాలుగు దాలర్లతో నాలుగు లీటర్లు వస్తుంది. అదే 4 డాలర్లకు ఒక స్మాల్ కాఫీ, 4 డాలర్లకు 2 లీటర్ల water bottle వస్తుంది జై గారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిReposting after correcting typo:
తొలగించండిమీ దేశంలో పెట్రోల్ రేట్లు శానా చౌక, మీరు అదృష్టవంతులు. మేము ఇక్కడ లీటరుకు ~ INR 80 (AUD 1.50) తగిలిస్తున్నాం.
కాకపోతే సాలరీ లో సగం డబ్బులు రెంట్ కి పోతాయి. Rents జాస్తి, వారానికి 500 డాలర్లు 2BHK. అమెరికా లో లాగా ఇక్కడ పెద్దగా కూడబెట్టలేము.
తొలగించండిఅమెరికాలో రుణభారం (college debt, mortgage etc.) చాలా ఎక్కువ. Social security, ఇంషూరెన్స్ & పన్నులు కూడా కలిపితే మోపెడవుతుంది.స్థానిక అమెరికన్లు 15వ తారీఖు వరకు నెల జీతం మొత్తం తగిలేసి payday loans మీద పడతారు.
తొలగించండిమనవాళ్లకు స్వతహాగానే కాస్త పొదుపు అలవాటు, పైగా చదువు అప్పు భారం ఉండదు కనుక ఆదా చేస్తారు.
ఆస్ట్రేలియాలో సబర్బన్ కల్చర్ లేదాండీ? అద్దె/భూమి రేటు తక్కువున్న చోట ఉండి కారులలో తిరగడం అమెరికాలో ఒక ఎడ్వాంటేజీ. అఫ్కోర్స్ అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీఅంత బాగుండదు కనుక కారు తప్పనిసరి కాకపొతే పెట్రోల్ చౌక.
మేము ఉండేది subarb లోనే జై గారు. అందుకే 500 డాలర్లు, అదే సిటీ లో అయితే 600 డాలర్లు.
తొలగించండిIT companies అన్నీ సిటీ side ఉండటమే ఇక్కడ problem
@అమెరికా లోలాగా ఇక్కడ పెద్దగా కూడబెట్టలేము
తొలగించండిఆన్ సైట్లో కూడబెట్టి ఇండియాకి తీసుకొస్తే కూడబెట్టినట్లు కనిపిస్తుంది.
అక్కడ కూడబెట్టి అక్కడే ఖర్చు పెట్టాలంటే జీవితాంతం కష్టపడాల్సిందే.
ఇప్పుడు నా విషయం లో జరుగుతున్నది ఇదే సూర్య గారు, ఇక్కడే సంపాదించి ఇక్కడే ఖర్చు పెట్టడం.
తొలగించండిరిటయిరయిన నాబోంట్లకు
రిప్లయితొలగించండిపటు కాలక్షేప వనరు బ్లాగు , మెదడులో
అటమటము కలిగె నేనిన్
నిటలాక్షుని గూడ దిట్టు నెలవిది పీకే !
మొదటి రెండు లైన్లు అర్థం అయింది, చివరి రెండు లైన్లు అర్థం కాలేదు రాజారావు గారు.
తొలగించండిమీ బ్లాగు ఎవరూ చదవకపోవచ్చు గాని అమ్మాయి బ్లాగు అయితే ఎగబడి చదివే ఛాన్స్ ఉందేమో?!
రిప్లయితొలగించండిఅందుకే కాబోలు కొందరు రచయితలు ఆడ లేడీస్ పేరు పెట్టుకొని నవలలు రాసేవారట.
తొలగించండిఉండచ్చేమో సూర్య గారు.
తొలగించండిఆడ లేడీస్ అయితే బాగా రాస్తారు అని జనాలు ఫిక్స్ అయ్యారేమో మరి జై గారు.
ఇప్పటికి తత్వం బోధపడిందన్నమాట !
రిప్లయితొలగించండిపైసల్ రానపుడు నాబోటివాళ్ళను ఇబ్బంది పెట్టడం దేనికటా ? ప్రతి పేరాలో ఒక యాడ్ పెడితే చిరాకు కాదా ?
స్క్రోలింగ్ చేస్తున్నపుడు వాటికి వేళ్ళు తగిలి ఆ సైట్లోకి వెళ్ళిపోవడం మళ్ళీ వెనక్కు రావడం.. బ్లాగులు వ్రాసేది చదివేది కాలక్షేపానికై ఉండాలి. వాట్స్ ఆప్ లో కూడా యాడ్స్ మొదలెడతారట కదా ? రిటైరయినోళ్ళు కూడా డబ్బు సంపాదించేసేయాలనే ?
తత్వం బోధపడ్డానికి ఇన్ని నెలలు అవసరం లేదు నీహారిక గారూ, మొదటి రెండు మూడు నెలలు చాలు.
తొలగించండిఇక యాడ్స్ అంటారా అంతా Google వాడి ఇష్టం, auto set ఏదో సెట్టింగ్స్ చేసినట్లు గుర్తు. వాట్స్ app lo కూడా మొదలెడితే బాగు, ఆ దెబ్బకు జనాలు దానికి దూరంగా ఉంటారు
ఉరుమురిమి మంగలం మీద పడిందన్న సామెత లాగా మధ్యలో రిటైరయిన వాళ్ళమీద మీ విసురేమిటి? ఏం, వాళ్ళు సంపాదించుకోకూడదా?
రిప్లయితొలగించండిహమ్...రిటైరయిన "తొట్టి గ్యాంగ్" అంతా కలిసిపోయారన్న మాట ! పైన రిటైరోనోళ్ళ మీద పద్యం కట్టింది ఎవరో చూసుకుని మాట్లాడండి.
తొలగించండిరిటైరైనోళ్ళు "అజీమ్ ప్రేమ్‌జీ" లాగా దాతృత్వం మాత్రమే చేయాలి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅలాగే, తప్పకుండా దాతృత్వం చూపిద్దాం, వదాన్యులు అనే ప్రశంసలు పొందుదాం. మరి దాని కోసమైనా ముందు సంపాదించాలిగా ... అజీమ్ ప్రేమ్ జీ అంత కాకపోయినా కొద్దిపాటైనా 🙄?
తొలగించండిసహోద్యోగులకు నేనెప్పుడూ చెబుతుండేవాడిని ... ప్రమోషన్లు, కావలసిన చోటుకు బదిలీలు గ్యారంటీ ఉండదు గానీ వేరే రెండు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి .... ఒకటి రిటైర్మెంట్. మీరు గానీ, మీ ఇంట్లో ఎవరన్నా గానీ ఉద్యోగం చేస్తున్నట్లయితే గుర్తు పెట్టుకోండి, ఏదో ఒకనాడు రిటైరయిన వాళ్ళ "తొట్టి గాంగ్" లోకి రాక తప్పదు తప్పదు ☝️ .
తొలగించండిఇక పై పద్యం వ్రాసింది రాజారావు మాస్టారు. ఆ పద్యంలో కాలక్షేపం గురించి తిట్ల గురించే గానీ సంపాదన గురించేమీ ప్రస్తావించ లేదే? పోనీ వారి బ్లాగ్ లో కూడా యాడ్లు ఉండవే? ఈ బ్లాగ్ పోస్ట్ సందర్భంగా ఇంకేం పరిశీలించాలి వారి పద్యంలో ?
రిటైరయిన వాళ్ళతో పెట్టుకోకండి 😎. మేం ఉద్యోగం చేసినన్నేళ్ల పాటి వయసు లేని వాళ్ళు కూడా చెప్పడమే, ఆఁయ్ ? 😀😀
🦁 ఇక్కడ
దాతృత్వం అంటే ఆర్ధికసాయం మాత్రమే కాదండీ...మాట సాయం🦁,ఆట సాయం(గులాంగ్యాంగ్),పాట సాయం(లలిత), పద్యసాయం(శంకరయ్యగారు)....ఇలా సమయాన్ని సాయం చేయడం కూడా సాయమే !
తొలగించండిఇంటరెస్టింగ్. నేను కామెంట్లసాయం చేస్తున్నాగా 😎.
తొలగించండిపద్యసాయానికి "జిలేబి" గారిని మర్చిపోయారే?(నారదా 😉)
వదాన్యులు అనే పదం మొదటి సారి వింటున్నా నరసింహారావు గారు. ఇక మొన్న మీరిచ్చిన ఆన్లైన్ తెలుగు నిఘంటువు ఓపెన్ చెయ్యాలి.
తొలగించండిసందేహం వస్తే నిఘంటువు చూడడమే 👍.
తొలగించండి🦁లు స్నానాలే కాదు పనికూడా చెయ్యవట!!
తొలగించండిఇటువంటి అపోహలొస్తాయనే నేను బ్లాగ్ మొదలెట్టలేదు, హ్హ హ్హ హ్హ హ్హ 😀😀. smart కదా 😎?
రిప్లయితొలగించండిమంచి పని చేశారు మేష్టారు, అందరూ బ్లాగ్ రాసే వాళ్లే ఉంటే చదివే వాళ్ళు, కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉండరు.
తొలగించండికరక్టండీ 👌.
తొలగించండిపల్లకీ సామెత 🙂.
నాది కూడా కొంచెం ఇలాంటి అనుభవమే అండి...బాగుందండి టపా
రిప్లయితొలగించండిథాంక్స్ మోహన గారు, నా అభిప్రాయం తో ఏకీభవించినందుకు.
తొలగించండిబ్లాగుల్లోకి వచ్చిన కొత్తలో ఒక మిత్రుడు అడిగాడు, "బ్లాగుల్లో ఎంత సంపాదిస్తున్నావు" అని. ఆయనకీ బ్లాగుల గురించి చెప్పాను. "కొంచం బాగా వ్రాయడం నేర్చుకుంటే పత్రికలకి పంపవచ్చును గదా పదో పరకో వారు ఇస్తారు" అని కూడా సలహా ఇచ్చాడు. అప్పటినుంచి బాగా వ్రాద్దామనే ప్రయత్నిస్తున్నాను,కుదరటం లేదు. ..... మహా
రిప్లయితొలగించండిమీ పోస్ట్స్ సరదాగా చదవడానికి బాగుంటాయి బులుసు గారు. మనలో మన మాట, పదో పరకో సంపాదించారా మరి 😀
తొలగించండిఈనాడులో ఒక ఆవు వ్యాసం వ్రాస్తే నాకు Rs.250 రూ ఇచ్చారండీ. డబ్బుకన్నా ఈనాడులో అచ్చేయించుకోవడం బాగుంటుంది కదా ?
తొలగించండిన్యూస్ పేపర్ లలో కాస్త కంటెంట్ మైంటైన్ చేసేది ఈనాడే కాబట్టి, అందులో అచ్చు అయిందంటే గొప్పే మరి నీహారిక గారు
తొలగించండిమీరు బాగా వ్రాయకపోవడం ఏమిటండి బులుసు వారూ? మీ గురించి మీరు చెప్పుకోవలసొచ్చినప్పుడు మీకు వినయం ఓ పాలు ఎక్కువే సుమండీ 😀😀.
రిప్లయితొలగించండిభలేవారే మీరు. నాకు లేనిదే అది. ధన్యవాదాలు. ........ మహా
తొలగించండిమీకేమి అభ్యంతరం లేకపోతే ఈ విషయం చెప్పండి, ప్రతీ కామెంట్ చివర ఉన్న మహా meaning ఏమిటి?
తొలగించండి
తొలగించండిఏమండి! మహా యనగా
నేమండీ! బులుసు గారి నెత్తావి మహా
యే మందహాసము దహా
యే మరి దరహాసమై మెయికొనె ప్రవీణూ :)
మ హా 🙂
తొలగించండిఅర్థమైంది జిలేబీ గారు& విన్నకోట వారు ... చి ద హా
తొలగించండిబాబూ పవనూ, ఈ టపా క్రింద కామెంట్లు 200 కు కూతవేటు దూరంలో ఉన్నాయి (ప్రస్తుతం 189). 200 దాటితే లోడ్ చెయ్యడానికి గూగుల్ వాండు "దమ్ లగాకే హైసా" అంటూ ఆయాసపడాల్సి ఉంటుందని "జిలేబి" గారి ఉవాచ. కాబట్టి ఇకనుండీ వచ్చిన కామెంట్లను దీని తరువాత టపాకు రీడైరెక్ట్ చేస్తే నయమేమో చూడండి 👈🏃.
రిప్లయితొలగించండి
తొలగించండివిన్నకోట వారు కూడా భమిడిపాటి వారిలా నల్ల కళ్ళద్దాల పరీక్షకు వెళ్ళాలేమో :)
మీరు ఆల్రెడీ ఈ టపాకి డైవర్ట్ చేసేశారు నరసింహారావు గారు.
తొలగించండి@జిలేబీ గారు, తెలిసే విన్నకోట వారు ఈ టపాకి ఆ కామెంట్ మళ్ళించినట్లు నాకు అనిపిస్తోంది జిలేబీ గారు, నల్ల కళ్ళద్దాలు అవసరం లేదని నా అభిప్రాయం.
200 కమెంట్ నాది కానందుకు చింతిస్తున్నాను.
తొలగించండిTough luck Niharika garu 😀😀.
తొలగించండిBetter luck next time 👍. పవనుడి బ్లాగ్ లోను, "జిలేబి" గారి బ్లాగ్ లోనూ ఇకపై కూడా భారీ సంఖ్యలో కామెంట్లు వస్తూనే ఉంటాయిగా 🙂.
ఈ సారి ఎప్పుడైనా మీరే డబుల్ సెంచరీ కొట్టండి నీహారిక గారు.
తొలగించండినరసింహా రావు గారు క్రికెట్ చూసే బిజీ లో ఉంటారనుకున్నాను, కామెంట్స్ పెడుతూ ఉన్నారే?
తొలగించండి🙂.
తొలగించండిపై కామెంట్ పెట్టేటప్పటికి ఇంకా ఆట మొదలవలేదు, పవన్. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభం.
'తొడకొట్టుడు' ధావనుడు ఇప్పుడే సెంచరీ పూర్తి చేశాడు.
క్రికెట్ లో కూడా ఒక బాలకృష్ణ ఉన్నాడా ఏమిటి మేష్టారు, తొడ కొట్టడం అంటున్నారు. క్షమించాలి, 🏏 తో touch పోయి ఏడెళ్ళయింది
తొలగించండిపవన్ గారూ, శిఖర్ ధావన్ మీసం మెలేసి మరీ తొడ కొడతాడు. FYI ఆయన మీ ఆస్ట్రేలియా ఇంటల్లుడు.
తొలగించండిపవన్ గారి,
తొలగించండి// “క్రికెట్ లో కూడా ఒక బాలకృష్ణ ఉన్నాడా ఏమిటి మేష్టారు, తొడ కొట్టడం అంటున్నారు. “ //
హ్హ హ్హ హ్హ హ్హ, ఆ పోలిక నాకు తట్టనే లేదు సుమండీ 😀😀
జెంటిల్మెన్ ఆటగా వంద సంవత్సరాల పైగా వెలిగిన క్రికెట్ ఈ మధ్య కాలంలో స్పాన్సర్-షిప్పులు, కార్పోరటైజేషన్, అడ్వర్టైజ్మెంట్ల (endorsements అనాలి కాబోలు ఆధునిక jargon లో?) వల్ల విపరీతంగా డబ్బొచ్చి పడిపోతుండటంతోనూ (too much money at too young an age), జనాల వెర్రి వల్ల వీళ్ళకు గ్లామర్ పెరిగి పోవడంతోనూ (ఇండియాలో సినిమా హీరోలు, క్రికెటర్లే దేవుళ్ళు కదా) వీళ్ళకు బాగా తలకెక్కింది ... ముఖ్యంగా భారతీయ ఆటగాళ్ళకు. క్రికెట్ ఆటను ఒక క్రీడగా కాక ఆటవిక తెగల మధ్య యుద్ధంలా చూడడం మొదలెట్టారు. ఆ సో కాల్డ్ సెలెబ్రిటీ అహంకారం, ఆ ఆటవిక చేష్టలు క్రికెట్ మైదానంలో వీళ్ళ సంస్కారరహిత ప్రవర్తనలో తెలుస్తుంటాయి. స్టేడియంలోని వేలమంది, టీవీలో లక్షలమంది చూస్తున్నారన్న స్పృహ కూడా ఉండదనుకుంటాను, ఉన్నా .. వియ్ డోన్ట్ కేర్ అన్న నిర్లక్ష్యం అయ్యుండాలి.
నాకు కొట్టొచ్చినట్లు కనబడే ఒక ఉదాహరణ :- బాట్స్-మన్ 50 పరుగులో, వంద పరుగులో (సెంచరి) చేసినప్పుడు ప్రేక్షకులు లేచి చప్పట్లు కొడతారు కదా. ప్రతిగా .. నిలబడిన చోటే నాలుగు వైపులా తిరుగుతూ ప్రేక్షకులకు బాట్ తో అభివాదం చేయడం సంస్కారం. ఇదివరకటి ఆటగాళ్ళు ఈ సంప్రదాయాన్ని తప్పక పాటించేవారు. ఇప్పటి ఆటగాళ్ళలో అధికశాతం దీనికి నీళ్ళొదిలేశారు ... ముఖ్యంగా భారతీయ ఆటగాళ్ళు. మొహం మీద ఒక ఆటవిక ఎక్స్ప్రెషన్ పెట్టుకుని, తన టీంమేట్స్ కూర్చునుండే డ్రెస్సింగ్ రూమ్ (పెవిలియన్) వైపు ప్రత్యేకించి బాట్ తో గాల్లో పొడుస్తున్నట్లు విన్యాసం చెయ్యడం, అది మాత్రమే చెయ్యడం. తరువాత పిచ్ మధ్యకు వెళ్ళి తన బాటింగ్ పార్టనర్ కు పిడికిలి తాకించడం. అంత వరకే. అదే టీంస్పిరిట్ అని బహుశః కోచ్ లో, మేనేజర్లో నూరి పోస్తారేమో మరి? డబ్బు పోసి టిక్కెట్ కొనుక్కుని స్టేడియంలోకి వచ్చిన ప్రేక్షకులు (paying public) మొహాలకు రంగులు పూసుకుని జండాలు ఊపుతూ వెర్రిగా చప్పట్లు కొడుతుంటే ఈ ఆటగాళ్ళకు ఖాతరు లేదు. ప్రేక్షకుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు (pointedly ignoring the cheering spectators). తమకు డబ్బు, పేరు రావడానికి ప్రేక్షకులే కారణం అన్న ఇంగితం కూడా ఉండడం లేదు. సీనియర్లను చూసి అదే గొప్పనుకుని జూనియర్లు కూడా అలాగే తయారవుతున్నారు. నిజంగా క్రికెట్ ప్రేక్షకులు వెర్రి మొహాలే 🙁. మన ‘ఘన నక్షత్ర’మే నయం ... ఫాన్సే దేవుళ్ళు అంటుంటాడు తరచూ.
ఇక పైన చెప్పిన “బాలకృష్ణ” టైప్ వ్యక్తి ... శిఖర్ ధావన్ అనే పేరుతో పిలవబడే ఈ ఆటగాడు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తను క్యాచ్ పట్టుకుంటే ప్రేక్షకుల వైపు తిరిగి జై కారు చెప్పినట్లు మీసం మెలేసి తొడ కొడతాడు 😡 అదేదో తన ప్రత్యేకతని చూపిస్తుందని అతగాడి భ్రమ అయ్యుంటుంది ... సినిమా పరిభాషలో “డిఫరెంట్” గానూ, “వెరైటీ” గానూ కనబడడం అన్నమాట.
మీరేదో చిన్న ప్రశ్న అడిగితే నేను బోలెడంత చెప్పినట్లున్నాను కదా? వీళ్ళకన్నా సంస్కారవంతమైన ప్రవర్తన (on field) చూసిన తరం వాళ్ళం కాబట్టి ఇప్పటి వారి ఈ uncouth తీరు చూసి విచారం కలగడం వల్ల వెళ్ళబోసుకున్న గోడు. సినిమా వాళ్ళు చెప్పినట్లు కాస్త “లెంగ్త్” ఎక్కువయింది కదా 😉?
అవునూ, మీరేమిటి ఆస్ట్రేలియాలో ఉంటూ క్రికెట్ తో టచ్ లేదంటారు? అందులోనూ క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్మన్ గారి (Sir Donald Bradman) సొంత రాష్ట్రంలో (New South Wales) ఉంటూ 🤔?
జై గారు, డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాడంటారుగా, అలా యాక్టర్
తొలగించండికాబోయి క్రికెటర్ అయ్యాడేమో, అందుకే గ్రౌండ్ లో అలా చేసి కోరిక తీర్చుకుంటున్నాడు అనుకుంటా.
ఆస్ట్రేలియా అమ్మాయినే చేసుకున్నాడా, తెలీదు జై గారు.
నరసింహారావు గారు, మీరు కామెంట్ బదులు ఒక పోస్ట్ పెట్టారు.😀
తొలగించండిచదవడానికి నేను రెడీ మేష్టారు. మీరు ఒక guest post కూడా రాయండి నా బ్లాగ్ లో, పావనం అవుతుంది నా బ్లాగ్.
Bowral (Bradman birth place) వెళ్లి కూడా Bradman museum వెళ్ళకుండా తిరిగి వచ్చేసా. పూర్తిగా ఇంటరెస్ట్ పోయింది మేష్టారు క్రికెట్ మీద.
"Bowral (Bradman birth place) వెళ్లి కూడా Bradman museum వెళ్ళకుండా తిరిగి వచ్చేసా"
తొలగించండిShocking. ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు. ఏడాది పాటు మీ టీవీలో క్రికెట్ తప్ప ఇంకేవీ (ముఖ్యంగా సినిమాలు) రాకుండా ఉండాలని మీ కేబుల్/సాటిలైట్/వైఫై వారికి అర్జీ పంపించేసా!
బాబ్బాబు, అర్జీ వెనక్కి తెప్పిచేందుకు ప్రయత్నించండి. ప్రతీ నవంబర్ లో 🌷 ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది అక్కడ. ఈ సారి వెళ్ళినప్పుడు Bradman museum కూడా వెళ్ళి తీరుతా.
తొలగించండిమీరు ఘోరం అంటారా? నేను అపచారం అంటాను. అపరాధం అంటాను.
తొలగించండి😡
పవన్ గారూ, అర్జీ ప్రస్తుతానికి వెనక్కు తీసేసుకున్నా. నవంబర్ వరకు బ్రాడ్మాన్ మ్యూజియం ఫోటోలు పోస్ట్ చేస్తే సరి, ఆపై మీ ఇష్టం.
తొలగించండివిన్నకోట వారూ, అవునండీ కానీ ఆ బాధలో నా బుర్ర పని చేయలేదు.
November లోగా ఫొటోషాప్ నేర్చుకోవాలి.
తొలగించండి
తొలగించండిపవన్ గారూ, నో ఫొటోషాప్. బౌరాల్ వెళ్ళి, మ్యూజియం చూసి ఫొటోలు తీసుకుని రావాలి.
-------------------
జై గారూ, నవంబర్ డెడ్-లైన్ కు జరగకపోతే అప్పుడు మీ అర్జీ తిరిగి దాఖలు చేస్తారు కదా. దాంట్లో చిన్న మార్పు చేయండి. పవన్ గారి టీవీలో క్రికెట్ తోబాటు సీరియళ్ళు కూడా రావాలని వ్రాయండి. దాంతో ... చూస్తే క్రికెట్ చూడాలి, లేదా ఛానెల్ మారిస్తే సీరియళ్ళు చూడాలి 😀😀.
డియర్ పవన్.. వీళ్లందరూ మిమ్మల్ని టెంప్ట్ చేసి మిగిలిన ఆ కొద్దిపాటి సేవింగ్స్ ని కూడా హారతి కర్పూరం లా కరిగించెయ్యాలని కుట్ర చేస్తున్నారు.
తొలగించండితస్మాత్ జాగ్రత్త!
అవును సూర్య గారు, నేను జాగ్రత్త పడాలి, కాకపొతే సీరియల్స్ అని భయపెడుతున్నారు.
తొలగించండినరసింహారావు గారు, క్రికెట్ అంటే చూడగలను, గానీ మరీ సీరియల్స్ అంటే కష్టమే, కాస్త కనికరించగలరని మనవి. అసలే లోటు బడ్జెట్ లో కొట్టుమిట్టాడుతున్నాను, మ్యూజియం టికెట్ రేట్ 20$ అట.
తొలగించండి20$*4=80$+transport=???
తొలగించండిOh, లోటు బడ్జెట్టా? సో సారీ. కానివ్వండి, దేశాల బడ్జెట్ లకే తప్పడం లేదు.
తొలగించండిసరే, అయితే డెడ్-లైన్ 2019 నవంబర్ బదులు 2020 నవంబర్ కు మార్చమని జై గారిని అడుగుదాం. హాపీనా? జై గారూ మీరేమంటారు?
వామ్మో మ్యూజియం రేట్లు ఇంత వాయింపా! బయటి నుండి ఫోటోలు తీసుకొని "క్రికెట్ అభిమానికి నిరాశ కలిగించిన మ్యూజియం చార్జీలు" అంటూ ఓ టపా వేయండి పవన్ గారూ.
తొలగించండిఎంట్రీ = 20*2+11*1+బుడ్డోడికి ఫ్రీ = 51
తొలగించండిట్రాస్పోర్ట్ = 2. 70*3+బుడ్డోడికి ఫ్రీ = 8 (సండే అయితేనే,వేరే రోజైతే 50$ దాకా సమర్పించుకోవాలి)
మొత్తం 60$ నీహారిక గారు
ఆస్ట్రేలియా లో అంతే! ఆస్ట్రేలియా లో అంతే! రేట్లు ఎక్కువ. (అల్లు రామలింగయ్య గారు రౌడీ అల్లుడు లో అన్నట్లు). మీరన్నట్లు ఒక పోస్ట్ రాయొచ్చు జై గారు.
తొలగించండివిజన్ 2020 స్టార్ట్ ఫర్ 60$ సేవింగ్స్ నరసింహారావు గారు.
తొలగించండి🙂👍
తొలగించండిపదో పరకో సంపాదించడం వదిలెయ్యండి, వేలు ఖర్చు పెట్టి పుస్తకం వేస్తే, కొనేవాడి సంగతి వదిలెయ్యండి, అమ్మే వాడు కూడా లేక ఇప్పుడు చిత్తుకాగితాల వాడికి అమ్మేద్దామనే ఆలోచనలో ఉన్నాను. ......... మహా
రిప్లయితొలగించండిపుస్తకాలు అమ్మటం,కొనటము..ఇవన్నీ హిస్టరీ లో కలిసిపోయాయి సుబ్రమణ్యం గారు, ఫ్రీ గా పంచినా చదివే వాడు దొరకడం కరువై పోయాడు. అంతా YouTube వీడియో లు చూసే జనరేషన్.
రిప్లయితొలగించండి"జిలేబి" గారూ మీ ఈ కామెంట్ 👇 నిజమైంది, అనుకున్నంతా అయింది.
రిప్లయితొలగించండిపవనుడి "కాకరకాయ కుక్క అయింది" పోస్ట్ (దీని ముందు పోస్ట్) క్రింద కామెంట్లు 200కు జేరుకున్న సందర్భంలో నేను పెట్టిన వ్యాఖ్య 👇👇, దాని మీద మీరు పెట్టిన ఈ వ్యాఖ్య 👇 ... రెండూ కూడా "శోధిని" లోనూ, "మాలిక" లోనూ కనిపిస్తున్నాయి గానీ బ్లాగ్ పోస్ట్ క్రింద కనబడడం లేదే 🙁?
బ్లాగర్ వాడేమన్నా చేసుంటాడంటారా "జిలేబి" గారూ 🤔?
సాంకేతికంగా ఏమైనా కారణం ఉండుంటుందా పవన్?
------------------------------------------------
వ్యాఖ్య వ్రాసిన సమయం: 8 June 2019 | 1:33 pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : కాదేదీ బ్లాగ్ కు అనర్హం
హై హై నాయకా ! వెతుక్కోండి మీ కామింట్ల నికన్:)
జిలేబి
----------------------------------------------
వ్యాఖ్య వ్రాసిన సమయం: 8 June 2019 | 1:26 pm వ్యాఖ్యాత : విన్నకోట నరసింహా రావు | బ్లాగు : కాదేదీ బ్లాగ్ కు అనర్హం
201 వ కామెంట్:-
పవనుడి డబల్ సెంచరీ 👏. ఎంతైనా ఆస్ట్రేలియా ఆటగాడు కదా 🙂.
గూగుల్ వాడు "దమ్ లగాకే హైసా" అని బాధపడక ముందే Now let us shift to his next post for publishing our comments.
----------------------------------------------
Shadow banning?
తొలగించండిజై గారూ, "shadow banning" కాదు black box కాదు. "జిలేబి" గారి బ్లాగ్ లో మనకి అలవాటైన Load more ఇక్కడ కూడా ప్రత్యక్షమైంది ఇప్పుడు. దాని మీద నొక్కితే all is well 😀👍.
తొలగించండిఅవునండి గురువుగారూ. దీనికి load more syndrome అనే కొత్త నామకరణం చేసేద్దాం.
తొలగించండిమొత్తానికి డబుల్ సెంచరీ కొట్టేసాం, థాంక్స్ అందరికీ
తొలగించండివెతుక్కొండి మీ కామెంట్స్ అని జిలేబీ గారు ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది. అవును లోడ్ more ప్రత్యక్షమైంది ఆ పోస్ట్ లో.
తొలగించండిఏడ్లు ఏడ్లు అంటున్నారు. నేను సెల్ ఫోన్ లో చూసేప్పుడు ఒక్క యాడూ కనబడట్లేదు. ఈలెక్క నా యాడ్ బ్లాకర్ సమర్థవంతంగా పని చేస్తోందేమో!!
రిప్లయితొలగించండికదా, నాకు ఎప్పుడు యాడ్లు రాలేదు, డిస్టర్బ్ చేయలేదు. అదంతా Google వాడి ఇష్టం అనుకుంటా సూర్య గారు
తొలగించండిగూగుల్ నా ఫోన్ కాల్స్ కూడా వింటుంది తెలుసా ? నేను దేని గురించి మాట్లాడితే దానికి సంబంధించిన యాడ్స్ ప్రత్యక్షమవుతున్నాయి.
తొలగించండిఅసలు privacy అనేదే లేదయితే నీహారిక గారు ఈ కాలంలో.
తొలగించండిఈసారి మీరు గూగుల్ గురించి మాట్లాడండి. అప్పుడు తనగురించి తానే యాడ్స్ ఇవ్వడం, వాటికి పేమెంట్ చెయ్యడం ఈరకంగా infinity loop లో కొట్టుకుపోతుంది!!
తొలగించండిload more syndrome 😀 ... సరైన పేరు, జై గారూ 👌😀.
రిప్లయితొలగించండిమీరు రెండు చేతులా బ్లాగ్ రాయడం మాత్రం మానకండి, పవన్‌గారు!
రిప్లయితొలగించండితప్పకుండా లలిత గారు, రెండు చేతులా టైప్ చేస్తూనే ఉంటాను.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిInjured Shikhar Dhawan ruled out of World Cup 2019 for 3 weeks
రిప్లయితొలగించండిhttps://www.indiatoday.in/sports/cricket-world-cup-2019/story/icc-world-cup-2019-shikhar-dhawan-likely-to-be-ruled-out-of-world-cup-2019-for-3-weeks-1546511-2019-06-11
పాపం తొడకొట్టడంతో బాటు బొటనవేలు ఇరగ్గొట్టుకున్నాడు.
వేలు విరిగిందా? దుర్యోధనుడికి తొడలే విరిగాయి. అందుకే అతిగా తొడగొట్టినవాడు బాగు పడిన దాఖలాలు లేవు చరిత్రలో.
తొలగించండిjk 🙂
నందమూరి అభిమానుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది మేష్టారు మీ స్టేట్మెంట్ వల్ల
తొలగించండిసై 🙂
తొలగించండిఅవునా? అయితే కథానాయకుడు మహానాయకుడు కలిపి చూపించేయండి వాళ్ళకి!
తొలగించండిశిఖర్ పరిస్థితి కాస్త ఆశాజనకంగానే ఉన్నట్టుంది. పాకిస్తాన్ మాచీ వరకయినా అతని గాయం మానాలని ఆశిద్దాం.
తొలగించండిDhawan to stay under observation; no replacements called in
https://www.cricbuzz.com/cricket-news/108437/dhawan-to-stay-under-observation-no-replacements-called-in
మహానాయకుడు ఒక్కటి చాలు వద్దు బాబోయ్ అనడానికి సూర్య గారు
తొలగించండిమంచిదే. కాని పాక్ తో మ్యాచ్ ఇంక నాలుగురోజుల్లోనేగా. మరి నయమవడానికి మూడు వారాలు పడుతుందన్నట్లున్నారే మొదట్లో?
రిప్లయితొలగించండిLet us hope for the best sir
తొలగించండిమంచి తురుపు ముక్కా ఏమిటి ఈ ధావనుడు ప్రస్తుత టీంలో? ఇంతగా దిగులు పడుతున్నారు ఇతగాడి గురించి.
తొలగించండిపవన్ గారూ, ప్రస్తుత భారత్ మూలస్థంభాలు: ముగ్గురు బ్యాట్స్మెన్ (రోహిత్, శిఖర్ & కోహ్లీ) మరియు ధోనీ (బ్యాటింగ్ + కీపింగ్). పైగా టాప్ ఆర్ధరులో శిఖర్ ఒక్కడే లెఫ్ట్ హాండర్.
తొలగించండిధన్యవాదాలు జై గారు. నేను 🏏 చూసే టైమ్ లో సచిన్, సెహ్వాగ్, ద్రావిడ్, గంగూలీ. మీరే ఊహించుకోండి నేను క్రికెట్ చూడ్డం ఎప్పుడు మానేశానో
తొలగించండి"మీరే ఊహించుకోండి నేను క్రికెట్ చూడ్డం ఎప్పుడు మానేశానో"
తొలగించండిపవన్ గారూ, అర్ధం అయిందండీ. 2011 ప్రపంచ కప్ గెలిచినా చూడలేదంటే ఇక మిమ్మల్ని ధోనీ కూడా బాగు చేయలేడు!
హ హ జై గారూ. ఇటువంటి పవనుడు ఇంక బౌరాల్ మ్యూజియమ్ కు ఏం వెడతాడు? 😀
తొలగించండికొంపదీసి క్రికెట్ చూడ్డం లేదని, దేశ ద్రోహిగా ముద్ర వెయ్యరు కదా, అప్పుడెప్పుడో బాహుబలి చూడనోడు తెలుగోడు కాదని ఎవరో అన్నారు.
తొలగించండిఇలా అందరూ క్రికెట్ మీద పడబట్టే కబడ్డీ ఆట కనిపించకుండా పోయింది. కొకకోలా కొంపలు తీస్తోంది.
తొలగించండిక్రికెట్ కి, కబడ్డికి లింక్ అర్థమైంది కానీ ఈ కోకాకోలా ఏమిటి సూర్య గారు?
తొలగించండిక్రికెట్టు స్టార్లు ఫిలిం స్టార్లు తాగరా తమ్ముడూ అంటూ పట్టుకుని చూపించే డ్రింక్
తొలగించండిఓహో, క్రికెట్ స్టార్స్ కోట్లు తీసుకొని ప్రమోట్ చేస్తున్నారని మీ ఉద్దేశ్యం..అర్థమైంది
తొలగించండి"వడ్డించే వాళ్ళుంటేనే" (ఆటల గురించి ఫణిబాబు గారి బ్లాగ్ పోస్ట్)
తొలగించండిTimely post by Phanibaabu gaaru. Thanks for sharing Mestaaru.
తొలగించండిఆస్ట్రేలియాలో ఒక కాఫీ ఎంతండీ ?
రిప్లయితొలగించండిమంచి కాఫీ షాప్ లో కాదు రోడ్ సైడ్ కాఫీ ఎంత ?
హైదరాబాద్ లో 10 రూ.
రోడ్డు సైడ్ కాఫీ అంటూ ఉండదు, కానీ మిషన్ కాఫీ అయితే 1డాలర్, పాల బదులు పాల పొడి వాడతారు అందుకే రుచి ఏడ్చినట్లు ఉంటుంది.
తొలగించండిమామూలు స్మాల్ కాఫీ అయితే 3-4 డాలర్లు ఉంటుంది, మీడియం 4-5, large 5 -6 range.
100 comment is mine..😎
రిప్లయితొలగించండిCongratulations and thanks నీహారిక గారు.
తొలగించండిఅభినందనలు నీహారిక గారు 👏
రిప్లయితొలగించండిYour contribution is more than me...you deserve one large 🍦or⛾
తొలగించండి"or" what 🤔?
తొలగించండిఏదయినప్పటికీ ... ఐస్క్రీమ్ అన్నారు 😛, డాలర్ (మిషన్) కాఫీ అనలేదు 😳, థాంక్స్ అసలే కాఫీప్రియుడను కూడా☝️.
సింహాలు కాఫీ తాగుతాయా? ఇంట్రెస్టింగ్.
తొలగించండి🦁,
తొలగించండిhttp://kothavakaya.blogspot.com/2010/12/blog-post_12.html?m=0
థాంక్స్ నీహారిక గారూ. మంచి "ఉత్ప్రేరకమైన" పోస్ట్. నా దగ్గర లేవు గానీ ... అక్షరలక్షలు ఇవ్వదగిన పోస్ట్. మరో కాఫీప్రియుడైన "అంతరంగాల" YVR కూడా దీన్ని తప్పక చదవాలి.
తొలగించండిసింహాలు కాఫీ తాగుతాయా అని ఇక్కడొకరికి సందేహం వచ్చినట్లుంది. కళకు భాషాభేదాలు లేవు అని మన SPB స్టేజి మీద మాటిమాటికీ చెబుతుంటారు చూశారా, అలాగే కాఫీకి ప్రాణిభేదాలు ఉండవు. అదీగాక ఇక్కడే ఒక థియరీ కూడా కనబడింది ... "🦁లు స్నానాలే కాదు పనికూడా చెయ్యవట!" అని ఒక కామెంట్. అందుకే పని చెయ్యడానికి, స్నానం చెయ్యడానికి కావలసిన ఉత్తేజం, ఉత్సాహం కలుగుతాయనే ఉద్దేశంతో సింహాలు కూడా కాఫీ తాగుతాయి☝️🙂.
🦁
Thanks Neeharika gaaru, for sharing a nice post.
తొలగించండిCongratulations Pavan. మీ బ్లాగ్ లో 100+ కామెంట్లు regular feature అయిపోయింది, గుడ్ 👈.
రిప్లయితొలగించండిఅంతా నీహారిక, జై, సూర్య అలాగే మీ ఉత్సాహమే కారణం మేష్టారు.
తొలగించండికట్టపడి నూరు కమెంట్లు వేసామయ్యా..ఓ డాలర్ తో మంచి "మిషన్" కాఫీ ఇప్పించండయ్యా !
తొలగించండితప్పకుండా నీహారిక గారు.😀
తొలగించండిహ హ, నీహారిక గారూ, డాలర్ (మిషన్) కాఫీ వేరు .. "మంచి" కాఫీ వేరు .. అని పైన పవనుడు ఆల్రెడీ చెప్పారుగా😀. మరేదన్నా కోరుకోంటే నయం కదా ☝️? 🙂
తొలగించండిమేమంటే "వెల్లుల్లికారం" బ్యాచ్ ఏదైనా సర్దుకుపోతాం...మీకు మాత్రం 🦁 large 🍨 చెప్పాను కదా ?
తొలగించండిదానికే థాంక్స్ చెప్పాను కదా పైన. మరోసారి థాంక్స్.
తొలగించండి(సింహాలు హిమక్రీములు తింటాయా అని ఇప్పుడో ప్రశ్న రావచ్చు)