8, జులై 2019, సోమవారం

మూడున్నర్రేళ్ల మా బుడ్డోడు చెప్పిన కథ

నిన్న సాయంత్రం పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు మా మూడున్నర్రేళ్ల బుడ్డోడు చెప్పిన కథ ఇది. వాడు ఇంగ్లీష్ లో చెప్పాడు దాన్నే నేను తెలుగులో రాస్తున్నాను.

పక్క నున్న అడవి నుంచి ఒక ఊర్లోకి  సింహం వచ్చింది.  అందరినీ తినటానికి వెంట పడుతుంటే భయంతో  'రక్షించండి రక్షించండి' అని అందరూ అరుస్తూ పారిపోతున్నారు.

ఇదంతా చెట్టు మీద కూర్చున్న కోతి చూసి, వెంటనే అందరికి అరటి పండ్లు విసిరేసింది.

అప్పుడు వారంతా ఆ పండు తినేసి భలే ఉంది టేస్ట్ అన్నారట సింహంతో.

అప్పుడు సింహం 'నేను బనానా తినను' అందట.

అప్పుడు 'గాడిదకేం తెలుసు గంధం వాసన' అని హేళనగా మాట్లాడారట.

అప్పుడు సింహం సరే అని ఒక అరటి పండు తిన్నదట, దానికి ఆ రుచి ఎంతగానో నచ్చి ఇంకో పది పళ్ళు తిన్నదట.

అప్పుడు దానికి ఆకలి పోయి మనుషులను తినటానికి వెంటపడలేదట.  కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే జూ వాళ్ళు వచ్చి పట్టుకొని జూ కి తీసుకెళ్ళారట.

జూ వాళ్లకు ఫోన్ చేసి పిలిపించినందుకు, అలాగే జనాలను కాపాడినందుకు అక్కడి వారంతా కోతికి థాంక్స్ చెప్పారట. 

గత నెల రోజులుగా ఉద్యోగంలో కాస్త అలజడి. ఉన్నట్లుండి క్లయింట్ ప్రాజెక్ట్ ఆపేస్తున్నట్లు చెప్పారు. దాంతో ఇప్పటికిప్పటికి ప్రాజెక్ట్ దొరక్క ఇబ్బంది పడాల్సి వచ్చింది, మా కంపెనీ వాళ్లేమో ఇండియా వెళ్లమన్నారు. ఇప్పటికిప్పుడు ఇండియా వెళ్లాలంటేమా అమ్మాయి చదువు అనవసరంగా బ్రేక్ చెయ్యాలి, మళ్ళీ అక్కడికి వెళ్లి సెటిల్ అవ్వాలి అంటే కాస్త టైం పడుతుంది అని కాస్త దిగులుపడాల్సి వచ్చింది. 

ఏమైతేనేం ఆపేసిన ప్రాజెక్ట్ మళ్ళీ మొదలైంది నిన్నటి నుంచి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కష్టాలు ఇలాగే ఉంటాయి 'ప్రాజెక్ట్ డెడ్ లైన్స్, ప్రెజర్స్, కంపెనీ లో కాస్ట్ కటింగ్స్' అంటూ.  బయటి వాళ్ళకేమో ఇవన్నీ కనపడవు, లక్షలు లక్షలు సంపాదిస్తున్నారని వాళ్ళింట్లో పిల్లల్ని కూడా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి బలవంతంగా నెట్టేస్తుంటారు.

చాలా రోజులైంది బ్లాగ్ వైపుకు రాక, అందుకే ఏదో ఒకటి రాద్దామనుకుంటే నిన్న మా బుడ్డోడు చెప్పిన కథ గుర్తొచ్చి రాద్దామని మొదలుపెట్టా. అసలు విషయం ఏమిటంటే మా బుడ్డోడికి అరటి పండు అంటే అస్సలు నచ్చదు, కానీ అరటి పండు గురించి కథలో ఎందుకు చెప్పాడో మరి.

ఈ పోస్ట్ లో బనానా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఒక చిన్న క్వశ్చన్, కాస్త ఫన్నీ గా ఆన్సర్ చెయ్యగలరేమో ట్రై చెయ్యండి. 

బనానా డాక్టర్ దగ్గరకు ఎందుకు వెళ్ళింది?

46 కామెంట్‌లు:

  1. పవన్ గారూ, అమ్మయ్య ఆగిన ప్రాజెక్ట్ మళ్ళీ మొదలయింది సంతోషం.

    ఈ ఫీల్డులో ఇవన్నీ సహజం, ముఖ్యంగా మేనేజరు చవటాయిలు కస్టమర్లను సరిగ్గా మానేజీ చేయకపోతే. మీరేం "పీలింగ్" చెడగ్గొట్టుకొని అనారోగ్యం పాలు కాకండి: మళ్ళీ డాక్టర్ల ఖర్చు దండగవుద్ది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దెబ్బకు రెండు పిట్టలు టైపులో కామెంట్ అండ్ ఆన్సర్, భలే ఇచ్చారు జై గారు.

      తొలగించండి
    2. సంక్షోభాల్లో అవకాశాలు వెతుక్కోవాలని మన మాజీ ముఖ్యమంత్రి ఉవాచ. ఆరకంగా ముందుకు పోవచ్చేమో?
      అయినా ఇలా జన్మభూమికి తిరిగి రావడానికి మనసొప్పదు కనుకే కదా మనల్ని నాన్ రిటర్ని0గ్ ఇండియన్స్ అనేది!
      కావాలంటే అక్కడే ఉండి భూమి భారతిని ఎంతైనా పొగుడుతాం కానీ తిరిగిరాం@

      తొలగించండి
    3. ఏడేళ్ళు పట్టింది సూర్య గారు ఈ హార్డ్ డెసిషన్ తీసుకోవడానికి. నాకైతే మేరా భారత్ మహాన్, కాకపొతే ఇంట్లో వాళ్లకు ఇక్కడ ఉండిపోవడమే ఇష్టం.


      2012 లో ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడ సిటిజన్స్ అయ్యారు. నేను మాత్రం మేరా భారత్ మహాన్ అనుకుంటూ మిగిలిపోయాను.

      తొలగించండి
    4. ..... అనుకోవడమే 🙁.

      ఆ మధ్యెప్పుడో PR కోసం కూడా అప్లై చెయ్యలేదన్నట్లు గుర్తు. ఇప్పటికైనా చేశారా?

      తొలగించండి
    5. ఆ పనుల్లోనే ఉన్నాను మేష్టారు.

      తొలగించండి
    6. ఇంకా పనుల్లో ఉండటమేమిటి. మీ స్థానం లో మీ మేనేజర్ ఉంటే ఈపాటికి పీ ఆర్ తెచ్చుకునే ఉండేవాడు.

      తొలగించండి
    7. మేరా భారత్ మహాన్ నుంచి ఇంకా I love Australia అనలేక పోతున్నా సూర్య గారు. అదే ప్రాబ్లెమ్

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. మా అమ్మాయి తన స్కూల్లో విన్న ప్రశ్నలను నాకు సంధిస్తూ ఉంటుంది అందులో ఇదొకటి మేష్టారు.

      తొలగించండి
  3. మీ బుడ్డోడికి నచ్చడం లేదని బెంగెట్టేసుకున్నట్లుంది బనానా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👏 మీ ఆన్సర్ భలే సూటయ్యింది ఈ పోస్టుకి నీహారిక గారు. అసలు ఊహించలేదు ఈ ఆన్సర్.

      తొలగించండి
  4. Yes నీహారిక గారి జవాబు సూపర్ జవాబు 👌🙂.

    రిప్లయితొలగించండి
  5. నచ్చిందా ? Thank You PKR garu & 🦁 garu.
    మీ అబ్బాయి సింహానికి అరటిపళ్ళు అలవాటు చేసాడు కదా మనం కష్టపడి బుడ్డోడికి అలవాటు చేయాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలవాటు చెయ్యాలండి, వాడితో కాస్త ఇబ్బంది గా ఉంది, ఎందుకో అదంటేనే ఆమడ దూరం పరిగెడతాడు.

      తొలగించండి
    2. చవగ్గా వస్తోందని రోజూ అరటిపండే కొనిపెడితే మొహం మొత్తదూ?
      అమెరికావాడి స్ట్రాబెర్రీలు, థాయ్ మామిడి పళ్లు, ఇజ్రాయిలు వాడి కజ్రాయిలు పళ్ళూ ట్రై చెయ్యండి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు తినకపోతే నంజుకోడానికి వీపుమీద ఒక పెసరట్టు కూడా వేస్తారట!!☺️
      (జస్ట్ కిడ్డింగ్)

      తొలగించండి
    3. ఇక్కడ పిల్లల వీపు వాయగొట్టడమా? ఆ విషయం పొరపాటున పోలీసులకు తెలిసిందా అదో పెద్ద కేసు అవుద్ది.

      స్కూల్లో పిల్లలకు నేర్పే మొదటి విషయమే ఇది, ఇంట్లో వాళ్ళు కొడితే 000 కి ఫోన్ చేయండి లేదా స్కూల్ లో టీచర్స్ కి చెప్పండి అని.

      ఒక అమ్మాయి ఇలాగే స్కూల్ లో రిపోర్ట్ చేస్తే, వెంటనే పోలీస్ వాళ్ళు వచ్చి పేరెంట్స్ ని ఒక వారం పాటు కౌన్సిలింగ్ క్లాసెస్ కు అటెండ్ అవమన్నారు.

      వాడు చిన్నప్పటి నుంచి ఇష్టపడలేదు బనానా అంటే. బనానా రేట్స్ ఎక్కువే ఇక్కడ కిలో 3-4 డాలర్స్ ఉంటాయి, అదే యాపిల్స్ అయితే తక్కువ, 1-3 డాలర్స్ మధ్యలో ఉంటాయి. ఇక సీజన్లో అయితే స్ట్రాబెర్రీస్ డెడ్ చీప్.

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    5. కౌన్సెలింగ్ తో వదిలిపెడితే అక్కడికి మీ దేశంలో నయమే. నార్వేలో తల్లిదండ్రులను జైల్లో కూర్చోబెడతారట. కొన్నేళ్ళ క్రితం 2012 లో నార్వేలో ఒక తెలుగు కుటుంబంలోని తల్లిదండ్రులను అలాగే జైలుకు తరలించారని, సంవత్సరం జైలు శిక్ష విధించారనీ మన పేపర్లలోను, టీవీలోనూ హోరెత్తించారుగా. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. (ఈ కామెంట్ మీ పిల్లలకు చదివి వినిపించకండేం☝️😀).

      పిల్లల్ని కొట్టినందుకు నార్వేలో తల్లిదండ్రులకు జైలు


      గ్రౌచో మార్క్స్ (Groucho Marx) అని హాలివుడ్ తొలితరం కమెడియన్ (20వ శతాబ్దం మొదట్లో). అతని జీవితకథలో (Life with Groucho ; author his son Alex Marx) "నేను పిల్లల్ని కొట్టను. ఎందుకంటే గుర్తు పెట్టుకుని వాళ్ళు పెద్దయ్యాక మనల్ని తిరిగి కొడతారేమోనని భయం" అంటాడు Groucho 😃😃).

      తొలగించండి
    6. ఆ నార్వే వార్త ఇక్కడి పేపర్స్ లో కూడా మారుమోగింది మేష్టారు అప్పట్లో.

      "పెద్దయ్యాక వాళ్ళు మళ్ళీ తిరిగికొట్టడం" ఇదేదో బానే చెప్పారు ఆయన. కాస్త ఆలోచించవలసిందే.

      తొలగించండి
    7. @ సూర్య గారు,
      // "ఇజ్రాయిలు వాడి కజ్రాయిలు" //

      ఇది ప్రాస కోసమా, లేక నిజంగా అటువంటి పండు / పదార్థం ఉందా?

      తొలగించండి
    8. ఖర్జూరాలేమే మేష్టారు, సూర్య గారే చెప్పాలి.

      తొలగించండి
    9. అయ్యుడచ్చండోయ్.
      సూర్య గారేమంటారో?

      తొలగించండి
    10. పవన సింహా మీరు కరెక్ట్. ప్రాసకోసం రాసిపడేసా.
      అయినా అరటి పళ్ళు కిలోల్లెక్క అమ్మడమేమిటి, వింతగా ఉందే.

      ఆమధ్య ఇంగ్లండ్ లో ఒక పంజాబీ అబ్బాయి తండ్రి తనని కొట్టాడని కంప్లైంట్ చేశాడట. తండ్రికి చిర్రెత్తి ఇండియాకి తీసుకొచ్చి ఎయిర్ పోర్ట్ లొనే నాలుగు పీకాడట☺️

      తొలగించండి
    11. ఇందులో వింత ఏముంది సూర్య గారు, Bangalore లో కూడా ఇలాగే అరటిపళ్ళు కిలోల లెక్కనే అమ్ముతారు. మీరు ఉండేది హైదరాబాద్ అయితే నాకు తెలీదు. ఆంధ్ర లో అయితే డజన్ లెక్కన అమ్ముతారు.

      ఆ పంజాబీ daad భలే చేశాడు. 😀😀😀

      తొలగించండి
    12. అయినా ఈ టైంలో క్రికెట్ మ్యాచ్ ఉండాలే, అది చూడకుండా మీరు కామెంట్స్ రాస్తున్నారని తెలిస్తే దేశ ద్రోహుల కింద మిమ్మల్ని లెక్క కట్టేస్తారు సూర్య గారు.

      తొలగించండి
    13. పోతున్న మాచ్ అని గ్రహించుండాలి 🙁.

      తొలగించండి
    14. పోయిన మాచ్ అని పొద్దున్న ఈనాడు చూసి తెలుసుకున్నా. నేను క్రికెట్ చూడను, వార్తల్లో తెలుసుకుంటా.
      అన్నట్లు పోయిన మ్యాచ్ కి "కథ... సశేషం" అని టైటిల్ తో వార్త రాశారు. "సశేషం" అంటే ఇంకా ఉంది అని కదా అర్థం. మాచ్ పోయాక ఇంకేం మిగిలివుంది? తెలుగు బాగా తెలిసినవారు ఏమంటారు ఈ విషయంలో?

      తొలగించండి
    15. "కథ ... సశేషం" అనే టైటిలా? నిన్నటి పేపరేమో ?

      తొలగించండి
    16. Homepage లో సశేషం అని రాసి ఉన్న బ్యానర్, దానికింద "ఆశల్ని చిదిమింది ఎవరు"అని వారని బట్టి ఇవాల్టి వార్తే అనుకోవాలి.
      క్లిక్ చేస్తే ఈ లింక్ తెరుస్తోంది.

      https://www.eenadu.net/worldcup-2019/fullstory.php?date=2019/07/10&newsid=124402&engtitle=Reason-behind-the-Team-India-loss&secid=4203&type=n

      తొలగించండి
    17. 🦁, నార్వేలో పిల్లలకి జయ జానకి నాయక, వినయవిధేయ రామ లాంటి సినిమాలు చూపించవచ్చా ? మరీ సున్నితంగా పెంచితే హింస గురించి తెలుసుకున్నపుడు పిల్లల పరిస్థితి ఏమవుతుందంటారు విన్నకోటవారూ?

      తొలగించండి
    18. సూర్య గారు,

      నేను "ఈనాడు" పేపర్ తెప్పించను. లింక్ కి థాంక్స్. ఇక్కడ మీరిచ్చిన లింక్ లోనికి వెళ్ళి చూశాను. పరిశీలించగా ... గా ... గా ... నాకు అర్థం అయినది ఏమిటంటే :-

      హోమ్ పేజ్ లో పెట్టిన అనేక బానర్లలో "కథ .. సశేషం" బానర్ కూడా ఒకటి. భారత టీం ఆడిన మాచ్ లలో కొన్నటి ఫొటోలు కూడా బానర్లుగా పెట్టాడు (ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లతో ఆడిన ఆటలవి ఉన్నాయి చూడండి). చివరికి "ఫైనల్లో న్యూజిలాండ్" అని బానర్ పెట్టాడు. ఆ క్రమంలో మొన్నటి అసంపూర్తి సెమిఫైనల్ ఫొటోను "కథ .. సశేషం" అని పెట్టాడనిపిస్తోంది (బహుశః అది నిన్నటి పేపర్ లో వచ్చినది అయ్యుండచ్చు). కానీ ప్రతి బానర్ క్రిందా వ్రాసిన వాక్యం మాత్రం మన సెమీస్ ఓటమికి సంబంధించినదే. అందువల్ల భారత్ టీం కథ వరకు సమాప్తమే గానీ సశేషం ఏమీ లేదు.

      ఈ కవరేజ్ కు ఇంతకన్నా విశ్లేషణ అనవసరం.

      తొలగించండి
    19. @నీహారిక
      హింసగురించి మనం చెప్పక్కర్లేదు. వాళ్లే తెలుసుకుంటారు. నిజానికి అహింసకంటే ముందు హింసగురించే తెలుసుకుంటారు.
      ఉదాహరణకి నోట్లో దంతాలు రాగానే కరవడం నేర్చుకుంటారు. గోళ్లు పెరగ్గానే రక్కడం నేర్చుకుంటారు. బుడిబుడి నడకల్లోనే వస్తువుల్ని నాశనం చెయ్యడం విరగ్గొట్టడం నేర్చుకుంటారు.

      తొలగించండి
    20. నీహారిక గారు,

      నార్వేలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలలోని పిల్లలు ఇప్పుడైనా అటువంటి చిత్రరాజాలను చూస్తూనే ఉంటారేమో? అటువంటి సినిమాలు చూపించకూడదని నార్వే ప్రభుత్వ రూలేమీ ఉండకపోవచ్చు కదా. లేదా రెండేళ్ళకో మూడేళ్ళకో భారతదేశం వచ్చినప్పుడైనా ఇక్కడ వాళ్ళ బంధువుల పిల్లలు తీసుకువెళ్ళి చూపించేసే అవకాశాలు ఉంటాయి. ప్రతి నాలుగైదు సీన్లకొక హీరో గారి భీభత్స ఫైట్లే కాబట్టి హింస గురించి తెలుసుకోవడానికి అడ్డంకులేమీ ఉండకపోవచ్చు. ఆ మాటకొస్తే హాలివుడ్ చిత్రాలు మాత్రం హింసకేమన్నా తీసిపోతాయా (మన నిర్మాతలు కొంతమందికి ఆ చిత్రాలు స్ఫూర్తి కూడానూ)? అలాగే, పిల్లల కోసం తీసామనే విడియోల లోనూ, గేమ్ లలోనూ హింస అధిక మోతాదులోనే ఉంటోంది కదా.

      // "మరీ సున్నితంగా పెంచితే హింస గురించి తెలుసుకున్నపుడు పిల్లల పరిస్థితి ఏమవుతుందంటారు? " // అన్న మీ మాటతో నేను I totally agree with you. డబ్బాలో వేసి మూతపెట్టి / కోడి రెక్కల క్రింద పెంచినట్లు పెంచితే ఆ పిల్లలకు ఇబ్బందే అవుతుంది. అందుకే బయటకెళ్ళినప్పుడు ధైర్యంగా తట్టుకోగలిగేటట్లు పిల్లల్ని ... హింసాయుతంగా కాదు కానీ .... కాస్తైనా street smart గా పెంచాలని అంటుంటాను నేను.

      తొలగించండి
    21. గురువు గారూ, హింసతో కూడిన (యూ సర్టిఫికెట్) సినిమా పిల్లలకు చూపిస్తే ఇబ్బందేమీ లేదేమో. కాకపొతే సదరు సినిమాలు పిల్లల్ని టార్చర్ చేయడం అవుతుందేమోనని అనుమానం: అలా అయితే పోలీసు బాబాయిలు ఊరుకుంటారా?

      తొలగించండి
    22. జై గారు,

      ఏ భాష సినిమా చూచినా
      ఏమున్నది గర్వకారణం?
      రక్తసిక్త హింసే హీరోయిజం
      ఈ ఫార్ములాతోనే చిత్రనిర్మాణం

      (శ్రీశ్రీ గారికి క్షమార్పణలతో ☝️)

      అవునండీ, హింసాభరిత సినిమాలు చూడడానికి పిల్లలేమీ ఇబ్బంది పడడం లేదు. ఫైటింగ్ సీన్లను కళ్ళార్పకుండా చూస్తున్నారు. సీన్ లో వయొలెన్స్ ఎక్కువగా ఉంది కదా అని రిమోట్ కు పని చెబితే, ఆ ఛానెలే కావాలి అంటూ పిల్లల మంకుతనం. అవి చూడడం తమకు టార్చర్ అని పిల్లలేమీ ఫీలవుతున్నట్లు లేదు. తెలుగే కాదు, ఇంగ్లీష్ సినిమాలూ అలాగే అఘోరిస్తున్నాయి, పిల్లలను వెర్రివెధవలను చేస్తున్నాయి - "Avengers" , "Transformers" లాంటి సినిమాలు పిల్లలకు మహా ఇష్టం. ఇంక "పోలీసుబాబాయిలను" కేకేసేదెవరు - at least మన దేశంలో ? లాభాల వేటలో విలువలను వదిలేస్తున్నారు చాలా మంది వ్యాపారులు - అందులో మొదటి వరసలో సినిమా వారు. వారి బారిన పడుతున్న ఈ తరం వారిని చూసి నిట్టూర్చడమే మనం చెయ్యగలిగినది అనిపిస్తోంది.

      తొలగించండి
    23. మా అమ్మాయి చిన్న చిన్న fightings కే భయపడిపోయి ఏడ్వడం వల్ల సినిమా థియేటర్ కి వెళ్లడమే మానేసాం. ఇంట్లో తను పడుకుని నిద్రపోయిన తర్వాతే సినిమా చూడ్డం మొదలెడతాము

      తొలగించండి
    24. అదృష్టవంతురాలు. అయితే మీ అమ్మాయి లాంటి ఈ కాలపు పిల్లలు అరుదు. చాలా మందికి వయొలెన్స్ సీన్లు ఇష్టమే.

      తొలగించండి
  6. బనానా డాక్టర్ దగ్గరకు ఎందుకు వెళ్ళింది? తొక్కమీద కాలేసి జారి పడినందుకు.

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. అయినప్పటికీ మేరా భారత్ మహాన్, లేదంటే దేశ ద్రోహుల కింద జమ కట్టేస్తారు మేష్టారు.

      తొలగించండి
  8. మీ బాబు చెప్పిన కథ భలే వుంది, పవన్‌గారు! ఇంకా చెప్పించుకుని రాయండి.

    రిప్లయితొలగించండి