11, జులై 2019, గురువారం

కమాన్ ఆస్ట్రేలియా కమాన్ కప్పు గెలిచేయ్

ఏమిటి సంగతి?

పిల్లాడు ఏడుస్తున్నాడు

ఎందుకనో?

మ్యాచ్ పోయిందట, అందుకని.

అందుకా, రెండ్రోజుల్లో అంతా మర్చిపోతాడు. మా కాలంలో మేమూ అలాగే ఏడ్చేవాళ్ళము ఇండియా ఓడిపోతే, అదంతా కామన్ పట్టించుకోకు 

                                            ********************

ధోని రన్ అవుట్ ఇల్లీగల్ అట 

అవునా?

అవును, ఐదుగురు ఫీల్డర్స్ బదులు ఆరుగురు ఉన్నారట బౌండరీ లైన్ దగ్గర 

ధోని ఉంటే కొట్టేవాడేమో 

రోహిత్, కోహ్లీ కనీసం పది పరుగులైనా తీసి ఉండాల్సింది, గెలిచే వాళ్ళం 

ఇదీ ఉదయాన్నే ఆఫీసులో చుట్టుపక్కల వారి విశ్లేషణ, గత నెల రోజులుగా ప్రతీ రోజు ఉదయం ఒక అరగంట డిస్కషన్ జరుగుతోంది.

                                                ********************

జీవితం లో ఒక కోరిక తీరింది భయ్యా? అన్నాడో కొలీగ్ మొన్నా మధ్య 

ఏమిటది?

పాకిస్తాన్ ఇండియా తో ఆడి ఓడిపోయాక, ఒక్క పాకిస్తానీ మొహం అన్నా చూడాలి అన్నది నా కోరిక, అది నెరవేరింది, మన ఆఫీస్ లో ఒక పాకిస్తానీ ఉన్నాడు, ఉదయాన్నే అతని దిగులు మొహం చూసి శాడిస్టిక్ ఆనందం అనుభవించాను అన్నాడు. 

మరి ఇవాళ ఆ పాకిస్తానీ కూడా మన ఇండియన్స్ మొహాలు చూసి అదే రకమైన శాడిస్టిక్ ఆనందం పొందాడో లేదో తెలీదు మరి. 

                                               **********************

ఇండియా ఎలాగూ ఓడిపోయింది కాబట్టి, మనం ఎలాగూ ఆస్టేలియా లో ఉన్నాం కాబట్టి ఆస్టేలియా ని సపోర్ట్ చేద్దాం అంటున్నారు ఇక్కడి వాళ్ళు. 

కాబట్టి కమాన్ ఆస్ట్రేలియా కమాన్ కప్పు గెలిచేయ్. కంగారూలూ


మన తెలుగు న్యూస్ పేపర్స్ లో కంగారూలూ అని రాసేవాళ్ళు. Australia వచ్చిన కొత్తలో ఒకసారి కంగారు ఐలాండ్ కి ఎలా వెళ్లాలి అని అడిగా రైల్వే స్టేషన్లో.

అరె, పేరు మార్చేసిన విషయం నాకు తెలీదే. ఇంతకు మునుపు దాన్ని కేంగరూ ఐలాండ్ అనేవాళ్ళం అన్నాడు ఎలా వెళ్ళాలో చెప్తూ.

మరి కంగారూలు కంగారు పడిపోయి ఓడిపోతే???

88 కామెంట్‌లు:

 1. అహఁ, చివరికి "I love Australia" అన్నమాట🙂.
  గెలవాలి అని కాస్త గట్టిగా అనుకోండి, క్లిష్ట పరిస్ధితులలో ఉంది ప్రస్తుతానికి.

  రిప్లయితొలగించండి
 2. రింగ్ ఆవల ఫీల్డర్లు field restrictions పరిమితి దాటి ఉంటే (ఒకవేళ నిజమయినా) ఆ బంతి నోబాల్ మాత్రమే అవుతుంది & నోబాల్ బంతికి రనౌట్ చెల్లుతుంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 30 గజాల సర్కిల్ పరిథికి ఆవలనూ లోపలనూ కూడా ఎక్కడన్నా సరే అక్కడ నడుస్తున్న పవర్ ప్లే నిర్దేశించిన సంఖ్య కన్నా ఎక్కువమంది ఫీల్డర్లు ఉంటే నోబాల్ ఇస్తారు. నోబాల్ పడినప్పుడు రనౌట్ మరియు స్టంపింగ్ ద్వారా మాత్రమే ఆటగాడిని అవుట్ చేయవచ్చును. మరి యే యితర విధానంగానూ, చివరికి హిట్ వికెట్ ఐనా కూడా అవుట్ ఇవ్వరు.

   తొలగించండి
  2. ఈ రూల్స్ అర్థం చేసుకునే క్రికెట్ పరిజ్ఞానం లేదు నాకు. ఇల్లీగల్ రన్ అవుట్ అన్నది ఆఫీస్ లో నా పక్కన కూర్చునే వ్యక్తి

   తొలగించండి
  3. ఇల్లీగల్ రన్అవుట్ అని ఏమీ లేదండీ.

   తొలగించండి
 3. Australia is losing badly and I am loving it.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇప్పుడు బాగా ఆనందించడండి 😊 ఆస్ట్రేలియా ఓడిపోయిందిగా

   తొలగించండి
 4. No ball కు బాట్స్-మన్ ను అవుట్ చెయ్యగలిగినది రన్-అవుట్ ద్వారా మాత్రమే కదా. స్టంపింగ్ కూడా చెల్లుతుందని నేనింతకు ముందెన్నడూ వినలేదే 🤔.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. A batsman may not be given out bowled, leg before wicket, caught, stumped or hit wicket off a no-ball. A batsman may be given out run out, hit the ball twice, or obstructing the field. Thus the call of no-ball protects the batsman against losing his wicket in ways that are attributed to the bowler, but not in ways that are attributed to the batsman's running or conduct.

   తొలగించండి
 5. వరల్డ్ కప్ కి కొత్త చాంపియన్ రాబోతున్నట్లే మనకి కొత్త సీఎం కొత్త ప్రతిపక్ష నాయకుడు వస్తే ఎంత బావున్నో!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మన రాష్ట్రానికే. పక్కవాడి గురించి తిక్కగా ఆలోచించే జోకరుముక్కల వాణ్ణి కాను నేను!

   తొలగించండి
  2. మొన్ననేగా ఎన్నికలు జరిగింది, నిన్ననేగా విజేతలు "అధికారంలోకి వచ్చి"నది. అప్పుడే మొహం మొత్తేసిందా?

   తొలగించండి

 6. // "మరి కంగారూలు కంగారు పడిపోయి ఓడిపోతే???" //

  చివరకు అదే జరిగింది కదా, పవన్.

  "కమాన్ ఆస్ట్రేలియా కమాన్" అని అక్కినేని స్టైల్లో మీరెంతగా ఉత్సాహపరిచినా కూడా ఉపయోగం లేక పోయింది, పాపం.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కమాన్ ఆస్ట్రేలియా కమాన్ అంటే తప్పుగా అర్థం చేసుకొని ఆస్ట్రేలియా పిలుస్తున్నామని తొందరగా బయలుదేరదాం అని ఒడి పోయినట్లున్నారు పాపం మేష్టారు 😊

   తొలగించండి
  2. హ్హ హ్హ హ్హ 😃. ఇంటి మీద బెంగ కూడా అయ్యుంటుంది 🙂.

   తొలగించండి
  3. ఇప్పుడు మా పక్క దేశం న్యూజిలాండ్ ను సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నా మేష్టారు 😀

   తొలగించండి
  4. తప్పకుండా సపోర్ట్ చెయ్యండి .... ఇంగ్లండ్ మీకు థాంక్స్ చెబుతుంది, ఇంగ్లండ్ లో మీకు PR ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది 😀😀😀😀😀.
   ( jk 🙂)

   తొలగించండి
  5. @ PKR garu,
   బనానా తొక్కనేల "కంగారు" పడనేలా ?

   తొలగించండి
  6. @విన్నకోట వారు, నవ్విన నాపచేనే పండింది అని ఏదో సామెత ఉన్నట్లు గుర్తు. రోజాను కూడా iron leg అన్నారు, కానీ ఇప్పుడేమైంది 😀

   ఈ సారి నేను సపోర్ట్ చేసే team గెలుస్తుంది, లేదంటే, ఏం చెయ్యాలి?

   తొలగించండి
  7. @నీహారిక గారు, బాగా లింక్ చేశారు, చప్పట్లు.

   తొలగించండి
  8. విన్నకోట వారూ, న్యూజీలాండ్ దేశానికి రెండు జాతీయ గీతాలు ఉన్నాయట. మొదటిది God defend New Zealand కాగా రెండోది God save the "unemployable woman leading a luxury life on public money" కనుక ఈ ఫైనల్ ద్వైతంలో అద్వైతం వంటిది!

   తొలగించండి
  9. జై,

   యే ఘర్ కీ బాత్ హై ... అంటారా?

   రెండో జాతీయగీతంలోని ఆ చివరి మాటను మీరు పై విధంగా విడమర్చడం .... అన్యాయమైన పని కదా. ఎంతైనా ఒకప్పుడు మన దేశాన్ని పరిపాలించిన చక్రవర్తి గారి కూతురు కదా, అంత మాటనేస్తారా, ఆడకూతురు అని కూడా చూడకుండా? అనండి, అనండి, మీకు కూడా పెద్ద ఎస్టేట్ ఉండి, కాలు మీద కాలు వేసుకుని కూర్చునుంటే ఆవిడను ఇలా అనేవారా? కలికాలం అండీ, కలికాలం.

   తొలగించండి
  10. పవన్, ఆల్ ది బెస్ట్ ... పట్టు వదలని విక్రమార్కుడు లాంటి NZ కు, మీకూ 👍 .

   "గెలుస్తుంది, లేదంటే, ఏం చెయ్యాలి?" అంటారా? పాత "కులగోత్రాలు" సినిమాలోని పాట పాడుకోవచ్చు. ఏమనీ -- "గెలుపూ ఓటమి దైవాధీనం, ..... మళ్ళీ ఆడి గెల్వవచ్చు; పోతే ... అనుభవమ్ము వచ్చు" 😀😀

   తొలగించండి
  11. "ఆ చివరి మాటను మీరు పై విధంగా విడమర్చడం"

   గురువు గారూ, అది ఆవిడ గురించి మా మిత్రులు కొందరి వర్ణన. వాళ్ళ దేశంలో మన దగ్గర ఉన్నంత "దేవీ పూజ" లేదంట: మచ్చుకు ఇది చూడండి.

   https://www.youtube.com/watch?v=r0TuXLrvyE4

   PS: "యే అందర్ కీ బాత్ హై" అనగా inside trading కాకపొతే చాలు (ఈ వాక్యంతో మీకు అక్షయ్ కుమార్ గుర్తుకు వస్తే క్షమించండి బాస్)

   తొలగించండి
  12. 🙂
   Insider trading can never be ruled out in modern-day tournaments.

   ఇక్కడ రెండు టీములకూ మొదటి సారి కప్ గెలిచే అవకాశం కాబట్టి పోటాపోటీగానే ఉండచ్చు. No quarter given, none asked అన్నట్లుగా ఆట జరగచ్చు. సరే, వేచి చూద్దాం.

   తొలగించండి
  13. హేమిటి! ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవనే లేదా? ఇది ఘోరాతి ఘోరమైన అవమానం వాళ్లకు.

   తొలగించండి
  14. 1975 లో ప్రపంచ కప్ ఆరంభమయిందే ఇంగ్లాండ్ లో. కానీ వాళ్ళు ఇంతవరకూ ఒక్కసారీ గెలవనే లేదు, పాపం. కాబట్టి ఎల్లుండి NZ మీద మహా కసిగా ఆడతారు. All the best.

   తొలగించండి
  15. Thanks for the information మేష్టారు, అయినా సరే నా సపోర్ట్ న్యూజిలాండ్ కే.

   తొలగించండి
  16. అలాగే కానివ్వండి 🙂. న్యూజిలాండ్ కూడా ఇప్పటి వరకు గెలవలేదుగా, పైగా మీ "కజిన్" కూడానూ, తప్పక సపోర్ట్ చెయ్యండి. All the best 👍.

   తొలగించండి
  17. ఇంతకుముందు తమిళనాడుకు చెందిన ఒక జ్యోతిష్యుడు (జనవరిలో అనుకుంటా) సెమీ ఫైనల్ లో ఏ జట్లు తలపడతాయని అంచనా వేశాడో అవే తలపడ్డాయట. అలాగే ఈసారి కొత్త టీమ్ కప్పు కొట్టే అవకాశం ఎక్కువన్నాడట. అలాగే జరుగుతోంది. NZ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పినట్లు సమాచారం. మరి రేపు ఎం జరుగుతుందో చూడాలి.

   తొలగించండి
  18. ఆ వీడియో నిన్న మా తమిళ మిత్రుడు నువ్వు గొట్టం లో చూపించాడు కూడా.

   తొలగించండి
  19. 'నువ్వు గొట్టం' ... :)

   "నువ్వో గొట్టం" ... "నువ్వే గొట్టం" ... "నువ్వా గొట్టం" ... :)

   తొలగించండి
  20. విన్నకోట వారూ, ఎవరి క్వార్ట్రర్ & పల్లీలు వాళ్ళే తెచ్చుకుంటారు అనగా డచ్ పద్దతి. అన్నట్టు ఈ టోర్నమెంటులో క్వార్ట్రర్ ఫైనల్ జరిగినట్టు లేదు.

   (జిలేబీ మాత శైలిలో) చీర్స్!

   PS: nmraobandi గారి గీతాలే ఈ వ్యాఖ్యకు స్ఫూర్తి అనుకుంటే నేను బాధ్యుడను కాను

   PPS: jk :)

   తొలగించండి
  21. నేనన్న quarter ను ఇలా తిప్పారా జై గారూ? ఇప్పుడంతా సామెతలు చెప్పే రోజులు కదా అని ఆ ఆంగ్ల సామెత చెప్పాను 😎. మీరు దాన్ని ఎక్కడికో తీసుకు వెళ్ళిపోయారు 🙂.
   ఇక ఈ టోర్నమెంట్ సంగతంటారా .... ఆఁ, "క్వార్టర్" ఏం సరిపోతుందిలే అనుకున్నారో ఏమో డైరెక్ట్ గా "హాఫ్" కు వెళ్ళిపోయినట్లున్నారు 😀.
   nmraobandi వారి గీతాలు స్ఫూర్తిదాయకమే, సందేహమేముంది.

   తొలగించండి
  22. @సూర్య గారు, ఇంకో జ్యోతిష్కుడు న్యూజిలాండ్ విన్నర్ అని, ఆ జట్టు కెప్టెన్ మాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పాడు.

   తొలగించండి
  23. విన్నకోట వారి sportive spirit అదుర్స్!

   తొలగించండి
  24. పవన్,
   // "..... ఇంకో జ్యోతిష్కుడు న్యూజిలాండ్ విన్నర్ అని, ఆ జట్టు కెప్టెన్ మాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పాడు." //

   మంచిదే, మీ "కజిన్స్" కు ఆల్ ది బెస్ట్ వగైరా 👍. కానీ తొందరపడి పండగ చేసుకోకండి, కాస్త రేపటి దాకా ఆగండి 🙂.
   (jk)

   తొలగించండి
 7. ఈ మార్కెట్టింగ్ మహానుభావుడు ఎవురబ్బా? ఇక్కడికొచ్చి మార్కెట్టింగ్ చేస్తున్నాడు?? ఈ ఐడియా బాగుందే 😊

  రిప్లయితొలగించండి
 8. మన వాళ్ళ సెమీస్ కి నేను రెండు రోజులూ వెళ్ళాను స్టేడియం కి. చాలా మంది పాకిస్తానీలు తమ దేశం సెమీస్ కి వెళుతుందనే ఆశ తో టికెట్లు కొన్నారట . వాళ్ళంతా న్యూజిలాండ్ కి సపోర్ట్ చేశారు. చివరలో మన వాళ్ళంతా మొహం వేలాడేసినప్పుడు వాళ్ళు చాలా క్రీడా స్ఫూర్తి చూపించారు. వారిలో ఎంతోమంది మన వారిని వాళ్ళు హగ్ చేసుకుని ఓదార్చారు కూడా. ఎక్కడా గేలి చేసినట్లు గా కూడా కనపడలేదు నాకు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నా క్లాస్మేట్ ఒకతను కూడా స్టేడియం లో చూసాడు match, కానీ అతను అన్న ప్రకారం పాకిస్తాన్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారట ఇండియా ఓడిపోతుంటే.
   మే బి, అతను అలా ఫీల్ అయి ఉండవచ్చు అనుకుంటా మాధవ్ గారు

   తొలగించండి
 9. మన వాళ్ళు సెమీస్ ఓడిపోయిన తరువాత వాట్సప్ లో వచ్చిన ఒక మెసేజ్ 👇. అందరికీ వచ్చే ఉంటుంది లెండి. 😀
  ---------------
  "India is the best team in One Day Internationals. It's just that we're bad in Two Day Internationals 😬"
  ---------------

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇది నేను చదివిన WhatsApp message.

   ఒక‌టి.. ఒక‌టి.. ఒక‌టి
   వీళ్లు మ‌న నారాయ‌ణ విద్యార్థులే
   రాహుల్ (1)... రోహిత్ శ‌ర్మ (1)... కోహ్లి (1) 🏏😜

   తొలగించండి
 10. సెమీస్ లో ఇండియా టీం ఓడిపోయిన తరువాత వచ్చిన ఒక వాట్సప్ సందేశం 👇😀
  --------------------
  "........అనే నేను ICC2019 ట్రోఫీలో మిగిలిన 2 మాచ్ లనీ రాగద్వేషాలు కానీ పక్షపాతంగానీ లేకుండా చూస్తానని అంతఃకరణ శుద్ధి తో ప్రమాణం చేస్తున్నాను."
  ---------------------
  ఇవాళ్టికిక ఒక మాచే ఉంది - ఫైనల్ మాచ్. జనులందరూ పై ప్రమాణం చేసి ఆ మ్యాచ్ ను చూడండి (ఆస్ట్రేలియన్ లు, ఇండియన్ లు, ఆస్ట్రేలియాలోనూ న్యూజిలాండ్ లోనూ నివసిస్తున్న ఇండియన్లు సహా) 😀😀 👍.

  రిప్లయితొలగించండి
 11. ☝️"అంతఃకరణ శుద్ధి" .. స్పష్టంగానూ, తడుముకోకుండానూ పలకాలని మాత్రం గుర్తు పెట్టుకోండి 😀.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కొరటాల శివ గారి సినిమాలన్నీ బాగా ఫాలో అవుతున్నట్లున్నారు ?!

   తొలగించండి
  2. ఇక్కడ నారా లోకేష్ గారి పంఖాలము, మా పరిస్థితి ఏమిటి మేష్టారు, అంత స్పష్టంగా పలకాలి అంటే తెలుగు ట్యూటర్ ని పెట్టుకునే స్థోమత కూడా మాకు లేకపోయే.

   తొలగించండి
  3. 🙂. ఇంట్లో కూర్చుని టీవీలో చూడడమేగా.

   అలా street fights చేసే ము.మం.లు వస్తే ఏమన్నా బాగుపడుతుందేమో కదా? 🤔

   తొలగించండి
 12. అటువంటి వారికి కూడా మీరు పంఖాలా 😲? భారతదేశానికి తిరిగొచ్చేసే ఆలోచన ఇంకా బలంగానే ఉన్నట్లుందే?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవును, ఆయన వైపు ఉండి ఆయన నెక్స్ట్ ఆంధ్ర ముఖ్యమంత్రి అయ్యేదాకా నిద్రపోను.

   మా న్యూజిలాండ్ గెలుస్తుందని ఆశిస్తూ నిద్రకు ఉపక్రమించే పనిలో ఉన్నాను.

   తొలగించండి
 13. // "మా న్యూజిలాండ్ గెలుస్తుందని ఆశిస్తూ ......." //

  చేతికి అందేటంత దూరంలో ఆగిపోయింది పవన్ గారూ. కానీ విజేతలుగా ప్రకటించబడదగిన అర్హత కలిగినది ఈ NZ టీమేనని నా వ్యక్తిగత అభిప్రాయం. స్కోర్లు సమానం కాబట్టి కనీసం జాయింటి విన్నర్స్ అని అయినా ప్రకటించవలసింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హతవిధీ! న్యూజీలాండ్ ఓడిందా?

   నా సపోర్ట్ ఇంత స్ట్రాంగ్ 😊 అని తెలిసుంటే, జగన్ కు, కెసిఆర్ కు అలాగే మోడీ కి సపోర్ట్ ఇచ్చేవాణ్నే ఎన్నికల్లో, యెంత పొరపాటు.

   తొలగించండి
  2. అంత తేలికగా చేతులెత్తేయలేదు లెండి. చివరిదాకా పోరాడి ఓడారు.

   అవును, మీ సపోర్ట్ మహిమ "కాస్త ముందు తెలిసెనా" ... చరిత్ర వేరే మలుపు తిరిగుండేదేమో కదా 🙁?

   తొలగించండి
  3. ICC World Rain Cup 2019 భలే ముగిసింది. ఫైనల్ ఆట మేచ్ మొత్తం వానవచ్చి తుడుచుకుపోయి ఉంటే అది ఇంకా రంజుగా ఉండేది. జాయింట్ విన్నర్స్ అని ఇవ్వటం కుదరలేదండీ, ముందే ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ కూడా విజేతను తేల్చలేకపోతే లీగ్ దశముగిసేనాటికి ఆ రెండు జట్లలోనూ పైస్థానంలో నిలిచిన జట్టే విజేతగా నిలుస్తుంది కాబట్టి. పోనివ్వండి ఎవరు గెలిస్తే మనకేం. మనకు సంబంధించి నంత వరకూ వరుణదేవుడిదే కప్పు. ఇంగ్లండులో ఆడితే వరల్డుకప్పు - అప్పటికైనా తప్పదీ ముప్పు. అక్కడ టోర్నమెంటు ఆడటమే అసలైన తప్పు.

   తొలగించండి
  4. 2019 ఎన్నికల్లో జగన్ మరియు చంద్రబాబు గార్ల మధ్య ఇటువంటి ఆహ్లాదకరమైన పోటీ ఉంటుందని నేను ఆశించాను. ప్చ్...
   ఆటంటే ఆటకదరా శివా...ఇండియా పాకిస్థాన్ మధ్య ఇటువంటి ఆటను ఆడించరా ! జన్మ ధన్యమైపోదూ !

   తొలగించండి
  5. అనానిమస్ గారు, నా మిత్రుడు లంచ్ టైం లో ఇదే విషయం గురించి మాట్లాడుతూ సూపర్ ఓవర్ లో ఇద్దరూ ఒకే స్కోర్ చేసినా, కొట్టిన బౌండరీస్ లెక్క ఇంగ్లాండ్ వాళ్లదే ఎక్కువ కాబట్టి వారినే విజేత గా ప్రకటించారు అన్నాడే మరి? ఇంతకీ ఏ లెక్కన విజేతను డిసైడ్ చేశారు?

   తొలగించండి
  6. 2024 లో అలాంటి పోటీ ఆశిద్దాం నీహారిక గారు.

   తొలగించండి
  7. ఆశిద్దాం గానీ .... రాబోయే ప్రపంచ కప్ పోటీలు 2023 లో జరుగుతాయి పవన్, 2024 లో కాదు (ఏమనుకోకండి). ICC క్రికెట్ ప్రపంచ కప్ నాలుగేళ్ళకొకసారి జరుగుతుంది. వచ్చేసారి మా దేశంలో జరుగుతుంది. అప్పటికి మీరు ఆస్ట్రేలియా పౌరుడు అయిపోయుంటారు, కాబట్టి ఆ పోటీలో ఆస్ట్రేలియానే "సపోర్ట్" చెయ్యండి ప్లీజ్ 😀😀.

   తొలగించండి
  8. క్షమించాలి మేష్టారు 😊 మీరు పూర్తి క్రికెట్ మూడ్ లో ఉన్నట్లున్నారు. 2024 లో అలాంటి పోటీ బాబుకు, జగన్ కు మధ్య. (నేనన్నది నీహారిక గారు లేవదీసిన కామెంట్ గురించి.) నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడే అనుకుంటాను.

   మరో విషయం ఏమిటంటే వరల్డ్ కప్ కూడా ఐదేళ్ళకోసారి జరుగుద్ది అనుకున్నానే? ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్స్.

   తొలగించండి
  9. // "(నేనన్నది నీహారిక గారు లేవదీసిన కామెంట్ గురించి)" //
   --------------
   mea culpa

   తొలగించండి
  10. గూగుల్ ని ఆశ్రయించి అర్థం తెలుసుకున్నా 😊. థాంక్స్ మేష్టారు కొత్త పదాన్ని నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు

   తొలగించండి
  11. విన్నకోట వారూ, 2013లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని *అ*విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఇదే జరిగితే "అన్ని ముచ్చట్లు" ఒకేసారి తీర్చుకోవొచ్చు.

   పవన్ గారూ, అప్పటి వరకయినా బ్రాడ్మన్ మ్యూజియం చూసేయండి ప్లీస్.

   తొలగించండి
  12. జై గారు, తప్పకుండా 2023 లోపు Bradman museum వెళ్లి తీరతా ఇదే నా శపథం.

   తొలగించండి
  13. అంతఃకరణ శుద్ధితో చెయ్యాలి శపధం 😀.

   తొలగించండి
  14. అదిగో మళ్ళీ అక్కడికే వచ్చారు, మాకు నోరు తిరగని పదాలు అవి 😊.

   తొలగించండి
  15. వాకిలి శుద్ధి చెయ్యాలంటే పేడ నీళ్లు కొట్టాలి. మరి అంతఃకరణ శుద్ధి అంటే?ఎవరినో ఒకరిని తిట్టకుండా పని జరిగేలా లేదే!

   తొలగించండి
  16. అంతఃకరణ శుద్ధి అంటే స్నానం చేస్తే సరిపోద్దేమో?😊

   తొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 15. గ్రీన్ టీ తాగమని చెప్పే టీవీ అడ్వర్టైజ్మెంట్ (మా దగ్గర) చివర్లో ఆ మోడల్ పిల్ల "అలవాటు చేసుకోండి" అంటుంది. మీరు కూడా ఆ సలహా పాటించరాదూ పవన కుమారా (పదాలు పలకడం, గ్రీన్ టీ తాగడం కాదు 😀 )?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గ్రీన్ టీ అయితే ప్రస్తుతానికి మన వల్ల కాదు, ఫ్యూచర్ లో ఆరోగ్య సమస్యలు వచ్చి అదే తాగాలి అని డాక్టర్స్ సజెస్ట్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాను గ్రీ టీ గురించి.


   ఇక పదాలు పలకడం అంటారా, మయసభ ఏకపాత్రాభినయంలో రెండు మూడు కప్పులు కూడా కొట్టుకొచ్చాను కాంపిటీషన్స్ లో. 😊 ఆల్మోస్ట్ పదిహేనేళ్ల గ్యాప్ వచ్చింది.

   దుర్యోధనుడి డైలాగులు మా పవన్ గాడే చెప్పాలి అని మా ముసలవ్వ (మా స్వంత అవ్వ కాదు కానీ, మీకు తెలియనిదేమీ కాదు పల్లెల్లో ప్రతీ ఒక్కరూ బంధువులే) చచ్చేవరకూ అంటూ ఉండేది. స్టేజి మీద నేను ఆ ఏకపాత్రాభినయం చేసేప్పుడు స్టేజి పక్కన నిలబడి ద్రౌపతి నవ్వినట్లు అందరికీ వినపడేలా నవ్వే ఆ నవ్వు మా ముసలవ్వదే.


   అల్లూరి సీతారామరాజు, కృష్ణుడు ఈ వేషాలన్నీ ఎన్ని సార్లు వేశానో గుర్తు లేదు. కృషుడి వేషం కోసం పూసుకున్న రంగు యెంత కడుక్కున్నా పోయేది కాదు, మరుసటి రోజు కాలేజీకి వెళ్తే నా మొహం చూసి ఇప్పుడు హోళీ జరుపుకున్నాడు ఏమిటబ్బా వీడు అని అనుకునేవారు.


   కాకపొతే కాలం మారిపోయింది, వేషం కట్టినా చూసే వాళ్ళు, వినే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పుడు. ఏం చెయ్యలేం అప్పటి కాలాన్ని తలచుకొని బాధపడటం తప్ప.

   తొలగించండి
  2. పవన్ గారూ, ట్యూటర్ పోస్టు ఖాళీ వచ్చేసిందట. మీ భాషా ప్రావీణ్యంతో అమెరికా ఎంబీఏ అబ్బాయికి తేట తెలుగు నేర్పి 2023లో రాజగురువు స్థానం సంపాదించాలని మా కోరిక. ఎట్లాగూ ఆ శుభఘడియ (అశుభఘడియ) వరకు నిద్రపోనని శపథం చేసేరు కనుక వెంటనే అర్జీ పెట్టుకోండి.

   https://muchata.com/where-is-lokesh-language-mentor-now/

   తొలగించండి
  3. ట్రై చేస్తా జై గారూ, ఎవరితోనైనా recommendation letter తెచ్చుకుంటే బెటర్

   తొలగించండి
  4. @ PKR garu,
   ఆరోగ్య సమస్యలు ఉంటేనే గ్రీన్ టీ తాగుతారని ఏ యాంకరమ్మ చెప్పింది ? మా ఇద్దరికీ ఏ ఆరోగ్య సమస్యలూ లేవు ప్రొద్దున్నే పంచామృతం తాగుతాం...ఇపుడు ఇంటికొచ్చినవాళ్ళకు కూడా అదే ఇవ్వమంటున్నారు. మా ఇంటిప్రక్కనే ఒక చెట్టు ఉంది..30 కిలోల తేనె వచ్చింది. మా సందులో వాళ్ళందరం కేజీ 250 రూ లకు కొనుక్కున్నాం. మనకళ్ళముందే ఫ్రెష్ గా తేనె తీసి ఇస్తాడు. ఒక్క చెట్టులో అంత తేనె వస్తుందా అని ఆశ్చర్యపోయాం.

   తొలగించండి
  5. నాకు గ్రీన్ టీ నచ్చదు నీహారిక గారు, అందుకే తాగను.ఇక ఫ్యూచర్ లో తప్పదు నువ్వు తాగి తీరాలి అని డాక్టర్ సజెస్ట్ చేస్తే తాగుతానేమో. ఇప్పటికి అయితే నచ్చని దాన్ని బలవంతంగా పొట్ట లో కి తోసెయ్యలేను.

   పంచామృతం నాకిష్టం కానీ, నో గ్రీన్ టీ.

   ఇక తేనె అంటారా భలే ఇష్టం, పెరుగు లోకి తేనె కలుపుకొని తినేస్తాను టైమ్ పాడు అని పట్టించుకోను. ఇక రాత్రి పది గంటలకి ఏదైనా తినాలి అనిపిస్తే, ఇంట్లో ఏ తీపి పదార్థాలు లేకపోతే ఎప్పటికప్పుడు పూరి కాల్చుకొని చెక్కర అద్దుకొని తింటాను. హెల్త్ గిల్తు అని ఆలోచించే ప్రసక్తే లేదు, అసలే కాలమతి మెంటాలిటీ నాది.

   తొలగించండి
  6. పంచదార,తేనె,పుదీనా,నిమ్మకాయ,నీరు కలిపితే ఆధునిక పంచామృతం అని ఇంతకుముందు చెప్పినట్లు ఉన్నానే ? పాలు,తేనె,నెయ్యి,బెల్లం,పెరుగు కలిపిన పంచామృతం అంటే కూడా ఇష్టమే !

   తొలగించండి
  7. ఆధునిక పంచామృతం బాగుంది నీహారిక గారు వితౌట్ తేనీరు 😀

   తొలగించండి
 16. ఆస్ట్రేలియా టైము ప్రకారం పవన్ ఆల్రెడీ "నిద్రావస్థలో" తూగుతూ ఉండచ్చు 😀😀.

  రిప్లయితొలగించండి
 17. మొత్తానికి కన్న దేశమూ, మీరున్న దేశమూ కాక ఒకప్పుడు అందర్నీ పాలించిన దేశం పట్టుకెళ్ళినట్లుంది కదా :)

  రిప్లయితొలగించండి