12, మార్చి 2020, గురువారం

కోవిడ్-19

ఈ మధ్య బాగా వైరల్ అయిన వైరస్ కరోనా అని అందరికీ తెలిసిందే. కాకపోతే కరోనా అనే పేరు గల వ్యక్తులు ఉండచ్చు కాబట్టి వారిని relate చేసినట్లు ఉండకూడదు అని 'CORONA' , 'VIRUS' , 'DISEASE' లోని మొదటి పదాలు కలుపుకొని, దానికి ఈ కరోనా ఏ సంవత్సరం లో మొదలైందో ఆ సంవత్సరాన్ని అనగా (2019) ని కలుపుకొని COVID-19 గా పిలుచుకుంటున్నారు.

కొన్ని సార్లు న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా, టీవీ చూడకపోతే మంచిది అనిపిస్తోంది, అనవసరమైన అపోహలు మొదలవుతున్నాయి.  మొన్న ఇలాగే సిడ్నీ లో కూడా 2 వారాలు షాప్స్ అన్నీ మూసేస్తారట అక్కడెక్కడో మూసేసినట్లు.. అని సొసైల్ మీడియా లో వార్త  స్పీడ్ గా స్ప్రెడ్  అవడం ఆలశ్యం అంత కంటే స్పీడ్ గా ఇండియన్ షాప్స్ లో ఎప్పటి నుంచో అమ్ముడుపోక ఎక్సపెరీ డేట్ కు దగ్గరలో ఉన్న సరుకంతా కూడా ఖాళీ.

ఇంపోర్ట్ సరుకు అంతా ఆగిపోతుందట. ఈ వార్త చాలు, దెబ్బకు టాయిలెట్ టిష్యూ పేపర్స్ అన్నీ ఖాళీ అవ్వడానికి, అదే జరిగింది ఇక్కడ సిడ్నీ షాప్స్ లో.  Kleenex  కంపెనీ వాళ్ళు మేము 24 గంటలు పని చేసి అయినా ఈ టిష్యూ పేపర్స్ డెలివర్ చేస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చినా వినకుండా స్టాక్ మొత్తం కొనడానికి షాప్స్ మీద పడి కొట్టుకున్నారు జనాలు. 


కొందరేమో ఒక ఇంగ్లీష్ ఆవిడ తన పుస్తకం లో దీని గురించి ఎప్పుడో రాసారు సంవత్సరంతో సహా అంటారు. మరొకరేమో మన పోతులూరి వీర బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు ఇలాంటి మహమ్మారి వస్తుందని అంటారు. 

సోషల్ మీడియాలో అయితే మీరు ఇలా చేస్తే ఈ వైరస్ వ్యాపించదు అని బోలెడు సలహాలు ఇస్తున్నారు. ఏది ఏమైతేనేం మన ప్రాచీన పద్దతులు ఈ వైరస్ వ్యాప్తి ని అడ్డుకుంటాయి అని అంటున్నారు కాబట్టి అదీ మన మంచికే, పాటిస్తే మంచిదే. కరచాలనం కంటే నమస్కారం మంచిది అన్నది అలాంటిదే.  కరచాలనమా, ఇదేదో సైన్స్ లో వచ్చే తెలుగు పదంలా ఉందే అని అనిపించచ్చు తెలుగు తెలియని వారికి, దీన్నే Handshake అంటారు మన తెలుగులో.

ఈ కరోనా దెబ్బ వల్ల లాభపడ్డవారిలో ఈ టిష్యూ కంపెనీ పేపర్ ప్రొడక్ట్స్ వాళ్ళు, షాప్స్ వాళ్ళే కాదు అప్పుడెప్పుడో పదేళ్ళ క్రితం విడుదల అయిన హాలీవుడ్ సినిమా నిర్మాత కూడా లాభపడ్డాడట. ఆ సినిమా పేరు కంటేజియన్, అల్ మోస్ట్ అటో ఇటో ఇలాంటి వైరస్ ను బేస్ చేసుకుని తీసిన కథే కావడం వల్ల ఆ సినిమాకు ఇప్పుడు లాభం చేకూరింది, అందరూ తెగ చూస్తున్నారట. 

మా కొలీగ్ ఒకతను వెకేషన్ పేరుతో ఒక నెల లీవ్ పెట్టి వాళ్ళ దేశంతో పాటు కొరియా లాంటి దేశాలు కూడా వెళ్ళొచ్చాడు, ఇప్పుడు తిరిగొచ్చి 2 వారాలు సెల్ఫ్-ఐసొలేషన్ పేరుతో ఇంట్లోంచే పని చేస్తున్నాడు. కాకపోతే అసలు విషయం ఏమిటంటే అతని సిమ్ కార్డు పని చేయట్లేదట. కేవలం మెయిల్స్ మాత్రమే access చేయగలడట. అంటే రెండు వారాలు ఎక్స్టెండెడ్ లీవ్ అన్నమాట :)

Work From Home అంటే మొన్న సోషల్ మీడియా లో సర్క్యూలేట్ అవుతున్న జోక్ గుర్తొచ్చింది,  తెలుగులోకి అనువదించాను నవ్వొస్తే నవ్వుకోండి. 

నేను నా భార్య కరోనా వైరస్ వల్ల ఇంట్లో నుంచి ఆఫీస్ కి కనెక్ట్ అయి వర్క్ చేస్తున్నాం.  మా చావు కరోనా వైరస్ చేతిలో లేదు,  మా ఇద్దరి చేతిలోనే ఉందనే విషయం మొదటి రోజే అర్థమైంది. 

ఈ Work From Home మీద మరో జోకు కూడా బాగా సర్క్యూలేట్ అవుతోంది. 

డియర్ H.R, నాకు కరోనా వైరస్ ఉందని అనుమానం కాబట్టి  ఒక 20 రోజులు  పెయిడ్ లీవ్ ఇవ్వండి, లేదంటే ఆఫీస్ కి వస్తాను. 

దానికి  రిప్లై ఇలా వచ్చింది H.R నుంచి 

డియర్  ఉద్యోగి, దయచేసి మీరు తప్పక ఆఫీస్ కి వచ్చి పని చేయండి. ఎందుకంటే ఉద్యోగులందరికీ  ఇంటి నుంచి పని చేయమని చెప్పాము. 

ఒకప్పుడు పక్కన ఎవరైనా తుమ్మితే 'చిరంజీవ' అనేవారు ఇప్పుడేమో 'థూ! నీ యవ్వ'  పక్కకెళ్ళి తుమ్ము అంటున్నారు, ఏం చేస్తాం అంతా కరోనా మహమ్మారి  మాయ. 

23 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. Human nature.
    టాయిలెట్ రోల్స్ కొరత, కొట్లాటల గురించి వాట్సప్ లో వచ్చిన ఒక జోక్ .... "Just don't understand why they can't use water" 😆😆.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శుభ్రం గా కడుక్కోకుండా పేపర్లతో తుడుచుకోవడమేమి దిక్కుమాలిన అలవాటు.

      తొలగించండి
    2. అదేదో చాలా గొప్ప విషయమని మనవాళ్ళూ కొందరు నేర్చుకున్నారుగా

      తొలగించండి
    3. మేం ముందు ఆటోమాటిక్ వాటర్ స్ప్రే తో కడుక్కుని తరవాత టిష్యూ పేపర్ తో తుడుచుకుంటాం సర్.
      ఆస్ట్రేలియా లో టిష్యూ పేపర్ తయారుచేసే కంపెనీలు లేవా ఏమిటి?

      Contagion సినిమా అప్పట్లోనే చూసాను(స్వైన్ ఫ్లూ రోజుల్లో అనుకుంటా). సినిమా బావుంది.

      తొలగించండి
    4. మీరే దేశవాసులు సూర్యా? అహ మరేం లేదు, వివిధ దేశాల అలవాట్ల విశేషాలు తెలుసుకుందామని, general knowledge 🙂.

      తొలగించండి
  3. // "కరచాలనం కంటే నమస్కారం మంచిది" //

    మళ్ళీ వాట్సప్ సందేశం :-
    బ్రిటిష్ యువరాజు ఛార్లెస్ గారు కరచాలనం మానేసి నమస్కారం పెడుతున్నట్లున్న ఒక విడియో మీద ఒకరి కామెంట్ .... "What 200 years in India couldn't do, Covid 19 has done - teach Namaste to the British!"

    Truly a great leveller ... this Corona Virus 👏.

    😉

    రిప్లయితొలగించండి
  4. భీకరమైనకరోనా
    జోకులతోనిచ్చెశాంతిసుఖములనిచటన్
    మాకైపవన్ కుమారులు
    సౌకర్యమునిచ్చెకొంత చక్కగ నవ్వన్

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజు గారూ, ధన్యవాదాలు.

      మీరు బ్లాగ్ లోకానికి కొత్తా, లేక నాకు మాత్రమే కొత్తా? ఇంతకుముందు వినలేదు మీ పేరు అందుకు అడిగాను, మరోలా భావించకండి.

      తొలగించండి
    2. నా కలం చాలాముసలిది
      కవిరచయితల చరితలో పాతది
      జర్నలిజంలో నలభైఏళ్ళముందున్నది
      కవుల సమాఖ్యలో బూజుపట్టిన మాజీది
      బ్లాగులోకంలో ఈ మధ్యే దూరినది
      పవన్ రెడ్డివారికి నమస్కరించినది

      తొలగించండి

  5. కొందరేమో ఇంగ్లీషు వాడు (వాడు కాదు ఆవిడ )సంవత్సరం తో సహా .....


    ఈ విషయం నూటికి నూరు పాళ్ళు‌ నిజం.

    పుస్తకం పేరు - Prophecy by Sylvia Browne - First Edition 2006.

    Page - 214.


    జిలేబి
    ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కరోనా వైరస్ కి కేతు గ్రహానికి లంకె పెట్టే పోస్టు ఇంకా రాలేదేమిటే ఉప్మా!!

      తొలగించండి
    2. జిలేబి గారూ, ధన్యవాదాలు తప్పు సరి చేసి నందుకు. పోస్ట్ లో సరి చేస్తాను.

      తొలగించండి
  6. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. A non-CoronaVirus comment 👇.
    ----------------
    Philip Wollen ఒక ఆస్ట్రేలియన్. ఆయనొక జంతుహక్కుల ఉద్యమకారుడు. వారిచ్చిన ఒక స్పీచ్ ఈ క్రింది విడియోలో చూడండి. పవర్‌ఫుల్ గా ఉంటుంది. బ్లాగులోక మిత్రులందరూ చూస్తారని ఆశ. స్పీచ్ విని ఎవరికి వారు తమ ఆహారపుటలవాట్ల గురించి తగు నిర్ణయం వారే తీసుకుంటారనీ ఆశ. అలాగే లోకం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తెలిసినవారందరికి ఫార్వార్డ్ చెస్తే బాగుంటుంది (ముఖ్యంగా నాన్-వెజిటేరియన్లకు).

    "Animals should be off the diet menu :: Philip Wollen's speech"

    Philip Wollen wiki

    రిప్లయితొలగించండి
  8. కరోనా కాలం...!

    టిష్యూల తో పాటూ సానిటైజర్, మాస్క్లు అన్నీ ఖాళీ కదండీ :)

    మార్చ్ ఫస్ట్ వీక్ లో యే మెడికల్ షాప్ లో చూసినా డబ్బాలకి డబ్బాలు సానిటైజర్లు కొనుక్కొని పట్టుకెళ్తుంటే వింతగా చూశను. అదే ఆఖరి చూపు. ఇప్పుడు కనపడటం లేదు ;)

    రిప్లయితొలగించండి

  9. జాగర్తండి. అసలే శీతాకాలం కూడాను, మాకు ఎండ దంచేస్తోంది అప్పుడే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ శర్మ గారు. ఇల్లు దాటి వారం అవుతోంది. పాలకు మాత్రం ఒక్కసారి మా ఇంటి ఎదురుగా ఉండే షాప్ కి వెళ్ళాను అంతే. ఇక్కడ రోడ్ మీదకు రాకూడదు అనే కఠినమైన నిబంధనలు లేవు గానీ జాగ్రత్త కోసం ఇంట్లోనే ఉన్నాము.

      తొలగించండి