ఈ సినిమా వాళ్ళు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నా వేలల్లో దానం చేయడానికి కూడా ఛస్తుంటారు. అందుకే వారి తీరును ఉతికి ఆరేసి ఎండగడతా ఈ రోజు పోస్టులో.
నేను కడప లో చదివేప్పుడు అనుకుంటా చిరంజీవి ఏమో Thumbs Up అని, పవన్ కళ్యాణ్ ఏమో పెప్సీ అని ప్రమోట్ చేసి వాళ్ళ జేబులు నింపుకుంటే ఆ ఇద్దరి ఫాన్స్ చొక్కా జేబులు చించుకుని మరీ కొట్టుకున్నారు. అదేదో థియేటర్ లోనే కొట్టుకు చచ్చారు కూడా.
ఇక ఫెయిర్ అండ్ లవ్లీ, సంతూర్, లక్స్ మోసాలు చెప్పాల్సిన అవసరం లేదు, తరతరాలుగా తారలను పోషిస్తూ మధ్య తరగతి కుటుంబీకుల నడ్డి విరిచేస్తున్నాయి.
మహేష్ బాబు మాత్రం ఎన్ని కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడరో ఎవరికీ తెలీదు. Thumbs Up లాంటివి మంచిది కాదు అని తెలిసీ ప్రమోట్ చేయడానికి ఒప్పుకుంటారు, అదే సినిమాలో అయితే ప్రజల తరపున పోరాడతారు, అంతా డబ్బు మాయ. ఆయనకున్న కోట్లల్లో మరీ కోటి రూపాయలు COVID విరాళం ఏమిటండీ మరీ చోద్యం కాకపొతే. శ్రీమంతుడు సినిమాలోనేమో ఆస్తి మొత్తం ఖర్చు పెట్టేస్తాడు ప్రజల కోసం. ఈ సినిమా హీరోలంతా ఇంతేనండీ. చెప్పేది శ్రీ రంగ నీతులు, దూరేది *** .
అందరి మీద కంటే మహేష్ బాబు మీద కూసింత విషం ఎక్కువే కక్కేసినట్లున్నాను. ఎంతైనా అసూయ అతనంటే, అందగాడు, పైగా మూణ్ణెల్లకోపాలి పెళ్ళాం పిల్లల్ని సంకలో ఎత్తేసుకొని పారిన్ టూర్లన్నీ తిప్పేస్తుంటాడు. అందుకే అందరు భార్యలు మహేష్ బాబు లాంటి మొగుడు కావాలి అంటారు. అయినా మా లాంటి నెలసరి జీతగాళ్ళ వల్ల అవుతుందా ఇలా తిప్పాలంటే?
ఇక మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం తానా, తందానా అంటూ U.S వెళ్ళి తైతక్కలాడతారు అక్కడ మనోళ్ల నెత్తి మీద చెయ్యెయ్యడానికి. ఏం కోట్లకు కోట్లు పెట్టి ఇళ్ళు, కారవాన్ లు కట్టుకుంటారు కానీ వాళ్ళ సొంత డబ్బుల్తో అసోసియేషన్ బిల్డింగ్ కట్టడానికి మాత్రం వీళ్లకు మనసొప్పదు.
ఇక పొలిటీషియన్స్ గురించి నన్నడకండి, నాకంటే మీకే బాగా తెలిసి ఉంటుంది, నేనసలే శానా ఈక్ పాలిటిక్స్ లో.
నేనిక్కడ ఇంత సీరియస్ గా ఈ సినిమా వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎండగడుతుంటే ఎవరో మా ఇంటి డోర్ కొడుతున్నారు. చూసేసి వస్తా.
ఎవరు కావాలి? మీరు
Change లేదు
కార్డు కాకెత్తు కెళ్ళింది
Sorry
Card తీసుకొని మా ఆవిడ ఇందాకే షాపింగ్ వెళ్ళింది
ఈ క్రైసిస్ లోనా?
అవును, అది వారి జన్మ హక్కు అడగడానికి ఎవరికీ ధైర్యం లేదు.
మరి ఇంట్లో ఉన్న ఆవిడ ?
మా బామ్మ
బాగా యంగ్ గా ఉన్నారు, నమ్మకం కలగడం లేదు
ఓహ్ అలాగా పాపం , మరి COVID బాధితులకు మీ వంతు సాయం ....
నా వంతు సాయం అంటే ఒక చిన్న జోక్ గుర్తొస్తోంది, చెబుతా విను.
నాకు టైమ్ లేదు సర్ .
వద్దులేండి సర్,ఆ చిన్న జోకే చెప్పెయ్యండి వింటాను.
నీలాంటి ఒక వ్యక్తి నాలాంటి పెద్ద మనిషి దగ్గరికి వచ్చి 'మేష్టారు, వృద్ధుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఉచితంగా సేవ చేద్దామనుకుంటున్నాను, మీ వంతు సాయం చేస్తే బాగుంటుంది' అని అడిగాట్ట.
ఇప్పుడు నీకు ఆ జోక్ ఎందుకు చెప్పానో అర్థమైందా?
అర్థమయింది. వెళ్ళొస్తాను సారీ వెళ్తాను సర్.
ఆ ఏం చెప్పుకుంటున్నాం, ఈ సినిమా వోళ్ళు అంతా ఇంతే, ఒక్క లక్ష విదిల్చడానికి కూడా చస్తారు కోట్లు పెట్టుకొని ఏం మనుషులో ఏమో మానవత్వం మచ్చుకైనా ఉండదు. ఈ ప్రపంచాన్ని బాగు చేయడం ఈ కరోనా వల్ల కూడా కాదు.
వీళ్ళు పన్నులు సరిగ్గా కడితే చాలు, విరాళాలు కంటే ఎక్కువే వస్తుంది ప్రభుత్వానికి.
రిప్లయితొలగించండిసినిమావాళ్ళో వ్యాపారవేత్తలో పన్ను సరిగా కట్టట్లేదని కుళ్ళుకుంటాం. కానీ ఏ షాపువాడైనా బిల్ లేకుండా 5శాతం తగ్గించి ఇస్తామంటే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంటాం!!
తొలగించండిప్రజా ప్రభుత్వం ఆమోదించిన వస్తువుని సినిమావాళ్ళు ప్రమోట్ చెయ్యకూడదు అనేమీ లేదు. ఏది ఎంత తినొచ్చో ఏది ఎంత తాగొచ్చో ఏది ఎంత పూసుకోవచ్చో ఏది ఎంతవరకు చూడొచ్చో మనకి ఒక ఐడియా ఉండాలి. అది లేకపోతే గోలీసోడావాడు సారా పేకెట్టువాడూ మన జేబు గుల్ల చేయడం ఖాయం!
బోనగిరి గారి లాజిక్ కరెక్టే.
తొలగించండినిజమే సూర్య గారూ, అది మన చేతుల్లోనే ఉంది ఏది వాడాలి ఏది వాడకూడదు అని, గుడ్డిగా మన హీరో ప్రమోట్ చేస్తున్నాడని
తొలగించండిబహుకాల దర్శనం పవన్ గారూ. As usual, great reading!
రిప్లయితొలగించండిఇక్కడ మేమంతా క్షేమం. సినిమాలు, రన్నింగ్ సీరియల్స్, ఐపీఎల్ మాచీలు, యాడు షూటింగులు ఆగిపోవడంతో ఎంతో హాయిగా ఉంది. టీవీలలో "చర్చల" పేరిట రచ్చలు కూడా కొంచం తగ్గాయి. మునుపటి మాదిరి ఘడియకోసారి "సార్ క్రెడిట్ కార్డు కావాలా" అంటూ ఫోనులు చేసే వెధవాయిల గోల శానా మట్టుకు మాయం. వంద కిలో బరువు, అరవై ఏండ్ల వయసున్న బండ హీరోల విచిత్ర విన్యాసాలు తప్పడం మూలాన దేశప్రజల మానసిక ఆరోగ్యం బ్రహ్మాండంగా కోలుకుంటుంది. కొరోనా పుణ్యమా అంటూ శబ్ద వాయు కాలుష్యం తగ్గి ఢిల్లీ జనాలు శాతం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
మీరు, మీ బంధుమిత్రులు, సహోద్యోగులు అందరూ కుశలమని తలుస్తాను. మొన్నటి అప్రైసల్ సమయంలో తిక్క వేషాలు నీల్గిన సుబ్బారావు, అతడికి మస్కా కొట్టి మాంచి ఇంక్రిమెంట్ కొట్టేసిన సోంబేరులు కూడా బాగుండాలనే కోరుకుందాం.
ఎంత సన్నాసులయినా వాళ్ళూ సాటి మనుషులే కనుక ఇప్పటికి క్షమించేసేద్దాం.
PS: only in fun, to lighten the morbid atmosphere. No fat heroes, TV "debaters" or appraising managers were hurt during the production of this comment.
ఇక్కడంతా క్షేమం జై గారు, సుబ్బారావ్ అతని సోప్ బ్యాచ్ తో కలిపి. బండ హీరోలు మళ్ళీ కరోనా తర్వాత విజృంభిస్తారు లెండి ఇంకాస్త బరువెక్కి ఇంట్లో ఖాళీగా ఉంటారుగా.
రిప్లయితొలగించండిమూడు నాలుగేళ్ళ క్రితం ఒక బ్లాగ్ ఉండేది, పేరు నాకు గుర్తు రావడం లేదు. చాలా రోజుల నుండీ కనబడడం లేదు / dormant అయినట్లుంది.
రిప్లయితొలగించండిఆ బ్లాగులో ఒకసారి నేనొక కామెంట్ పెట్టాను .... దానికి తగిన సందర్భం అక్కడ ఉంది కాబట్టి. ఒక ఉదాహరణ ఇస్తూ ఈ సమాజంలో జీవిస్తూ అంత సంపాదించుకున్న అక్కినేని తిరిగి పెద్దగా సమాజానికి చేసినదేమీ కనబడడం లేదని నా కామెంట్లో ప్రస్తావించాను. అంతే నా మీద విరుచుకు పడిపోయినంత పని జరిగింది. ఆయన కష్టపడి సంపాదించుకున్నది ఆయన జాగ్రత్తగా దాచుకుంటున్నాడు, ఎదుటి వారికేమిటి సంబంధం, ఆయన తన సొమ్ము ఎదుటివారి మీద ఖర్చు పెట్టాలని ఎలా expect చేస్తారు .... వగైరా అలవరసలో నామీద రివర్స్ విమర్శ. నేను అక్కడితో ఆపేశాను.
అయ్యా, అలా ఉంటుంది కొంతమంది వాదన.
పవన్ గారూ, నిజమేనండీ.
తొలగించండిమీరు క్షేమంగా ఉంటూ బ్లాగులు రాస్తూ ఉండండి, మేము చదివేసి పెడతాం. మాక్కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి :)
నా పాత ఫర్మాయిషు బ్రాడ్మాన్ మ్యూజియం సంగతి లాకుడౌను పూర్తిగా ఎత్తేసాక చూద్దురు లెండి. ప్రస్తుత పరిస్థితులలో దృష్ట్యా నా యొక్క సదరు విజ్జ్యప్తిపై మొరాటోరియం ప్రకటించడమైనది.
Take care, stay safe.
అప్పుడెప్పుడో ప్రకృతి వైపరీత్యం వచ్చిన దరిమిలా అప్పటి మీ(మా) తెలుగు సినీ రంగ ఉద్దండపిండాలు కొందరు ఊరూరూ తిరిగి జోలె పట్టి విరాళాలు సేకరించి తమ దేశభక్తి & సామాజిక స్పృహ చాటుకున్నారు. 24 ఘంటల సుదీర్ఘ సమయం షూటింగులు మానేసి మరీ వారు చూపించిన ఔదార్యానికి సాధారణ జనం వేనోళ్ళ కొనియాడడం కడు సంతోషమే అయినా కొందరు గిట్టనోళ్లు విమర్శకు దిగడం బాధాకరం.
తొలగించండిఒకానొక చిన్న రెండరల ఇంట్లో ఇందు విషయంపై జరిగిన ఆంతరంగిక చర్చా కార్యక్రమాన్ని రహస్యంగా తలుపు చాటున నక్కి నక్కి సేకరించిన బుజ్జి బుజ్జి ప్రత్యక్ష సాక్షుల భోగట్టా పాఠక మహాశయుల ఎరిక కొరకు దిగువున పొందుపరిచాము.
"కుటుంబ పోషక చక్రవర్తి: మీ ఆడంగి తాగుడుబోతు బట్టేబాజ్ గాడు జేబుల కెల్లి ఒక్క రూపాయి ఇయ్యలే కానీ సిగ్గు లేకుంట ఊళ్ళ ఎంబడి ఎగబడి మంది కాడ బిచ్చమెత్తబట్టిండు. ఛీ వాని బతుకు చెడ"
"పతివ్రతా శిరోమణి: మీ ఏబ్రాసి బండోడు వానయ్య సొమ్మేమిచ్చిండా, వాన్నోట్ల మన్ను పడ. మావోడు వాని లక్క సీన్మా తీసేటోల్ల సామాన్లు ఇంటికి తోల్కపోయే చిల్లర వేషాలు వేస్తడా. మేరోళ్ల కడుపు కొట్టెటోడిని ఎన్క ఏసుకొస్తవేంది నువ్వు కూడా, ఊకే నీల్గకు"
"అతడు: ఏంది ఎక్కువ తక్కువ అంటవేంది. మీ నాయన బరువుల మా హీరో కంటే తక్కువ తిన్నడా? పేట్ల పురుజ్ లక్క పొట్ట పెంచిండు, ఎప్పుడు సూసినా తినుడు, సోంబేరోలే పండుడు తప్ప జిందగీలో మంచి పనొక్కటి చేయలే"
"ఆమె: మా నాయన అన్నెం పున్నం తెల్వని అమాయకుడు కాబట్టి బుద్ధి గడ్డి తిని నీ అసంటోడికి కట్ట బెట్టిండు. పాపం అమ్మ మన పిల్లను ఆ నల్లికుట్లోళ్ళు గెల్వనియ్యరు ఒద్దని మొత్తుకొని చెప్పినా వినలే. మా హీరోని అనేటంతొటోడివి అయినా నువ్వు"
ఎదో చిన్న అలికిడి పసికట్టిన సదరు చర్చికులు తమ రసవత్తర సంభాషణకు స్వల్ప విరామం ప్రకటించి మీ (మా) విలేఖరుల వీపు విమానం మోగించే కుసంస్కారానికి దిగడం మూలాన తదుపరి వివరాలు అందించలేకున్నాము. అంతరాయానికి ఖేదం.
అక్కినేని గారు బాగా పొదుపరి, పైసా కూడా బయటికి తీయరు అని నేను కూడా విన్నాను విన్నకోట వారు ఆ కాలంలో.
తొలగించండిఈ characters ఎవరో పోల్చడం కాస్త కష్టమైన పనిలానే ఉందండోయ్ జై గారు
తొలగించండి
తొలగించండిఅక్కినేని గారేం పొదుపరి కాదు ఆరోజుల్లో పాతికవేలిచ్చి కాలేజికి పేరు పెట్టించుకోలా?
ఈ విషయం తెలీదు శర్మ గారు. కీర్తి కండూతి అంటారు కదా అలాంటిదేమో మరి.
తొలగించండిఅంతేగా అంతేగా పవన్ 🙂.
తొలగించండిపవన్ గారూ, ఇవన్నీ inside information లాంటివి.
తొలగించండిసదరు పుణ్యదంపతులు అభిమాన హీరోల గురించి కొట్లాడుకొని ఎవరి మీద కోపం వాళ్ళ మీదే తీర్చుకోలేక పుక్కటిగా వచ్చిన పిల్లగాండ్లకు తొడపాశం పెడితే ఆ చిన్ని హృదయాలు ఎంత కలత చెందుతాయో చెప్పడం వర్ణనాతీతం.
ఆ లేత మనసుల వెతలు వారి భాషలోనే వినండి.
"అయ్య మీద కోపంతో అమ్మ సకినాలు పాలకాయలు చేస్తలేదు. అమ్మ సాదించుడు ఎక్కువయిందని రంది పడుకుంట నాయన చిల్లర డబ్బులు ఇస్తలేడు. అసలే ఒకవైపు ఇరానీ హోటళ్లు చాయి రేట్లు పెరిగి ఏడుస్తుంటే, ఇంకో పక్క మనం పక్క గల్లీ కామేశ్వరి మీద విసిరిన రాకెట్ వాళ్లన్న కంట్ల బడినందుకు పరేషానీ ఐతుంటే, నడిమిట్ల ఈ పెద్దోళ్ల సినిమా హీరోల లొల్లి ఏందో ఏమో.
ఈ సిన్మాలు కడుపు నింపుతయా, కాలు నింపుతయా. రంగులు పూసుకునేటోళ్లు ఎవడెట్ల ఛస్తే మనకేంది, ముందుగల పోరగాళ్లను చల్లంగా చూస్కోవాలే. గింత సోయి లేనోళ్ల కడుపున పుట్టినం, ఇగ మన బతుకు ఆగమైపాయె"
హెలికాప్టర్ నుంచి కొండల పైనుంచి దూకి అభిమానులకు పెస్టి కోలాలు తాగమని చెప్పే హీరోలు తాము మాత్రం ఆరోగ్యకరమైన కొబ్బరి నీళ్ళు, ఖరీదైన విదేశీ మద్యం, పళ్ళ రసాలు పుచ్చుకుంటారు.
రిప్లయితొలగించండిపెద్ద ఎన్టీ ఆర్ , శోభన్ బాబు.. కూడా పెద్దగా స్వంత డబ్బులు సమాజం కోసం ఇచ్చినట్టు లేదు.
ఇప్పుడు కొంచెం నయం. అందరు హీరోలు ఎంతో కొంత ఇస్తున్నారు.
ఆ మాటకొస్తే సమాజం లోని ఎగువ మధ్యతరగతి వారు ఇస్తున్నది కూడా తక్కువే.
Industrialist GD Naidu told.Learn for 25 years. Earn for 25 years.Spend what you have learnt and earned after these 50 years for the welfare of others
కొంత మంది సోషల్ మీడియా దెబ్బకు భయపడి ఏమీ చెయ్యలేక ఇస్తున్నట్లు ఉన్నారు GKK గారు. ఆ కొటేషన్ బాగుంది. థాంక్స్.
తొలగించండిపవన్,
రిప్లయితొలగించండి1950 దశాబ్దపు ఒక అమెరికన్ weekly tv show (17 సంవత్సరాలు నడిచింది) “What’s My Line?” చాలా సరదాగా ఉంటుంది, వీలు చేసుకుని చూడండి youtube లో అని ఆ మధ్యెప్పుడో మీకొక సలహా ఇచ్చాను, గుర్తుందా? చూశారా?
ఇప్పుడు కరోన పుణ్యమా అని కావలసినంత ఖాళీ టైము కదా? ఇదే మంచి అవకాశం. ఆ వీడియోలు చూడరాదూ?
సరిగ్గా గుర్తు చేశారు మేష్టారు. ఖచ్చితంగా చూస్తాను. ఈ playlist ఆల్రెడీ మై యూట్యూబ్ లైబ్రరీ లో యాడ్ చేసుకున్నాను.
తొలగించండిఖాళీ టైం అనీ, బోర్ కొడుతోంది అనీ అందరూ అంటున్నారు కానీ, నా వరకు అసలు తేడా ఉండటం లేదు. పిల్లలను ఎక్కువ T.V చూడనివ్వకుండా వాళ్ళని ఆటలతో, కబుర్లతో ఎంగేజ్ చెయ్యడానికి, వంటిట్లో మా ఆవిడకి హెల్ప్ చెయ్యడంతో.
రిటైరయిన తరువాత నాకు తీరిక దొరకనట్లు ........ 😁😁
తొలగించండిదానం అనేది ఇస్తే పుచ్చుకునేది. డిమాండ్ చేసి లాక్కునేది కాదు.
రిప్లయితొలగించండిసెలెబ్రిటీ అయినా ధనవంతులైనా ఇవ్వడం ఇవ్వకపోవడం వారిష్టం. ఇచ్చేలా వారిని ప్రోత్సహించాలే కానీ "ఎందుకియ్యవ్" అని బెదిరించేలా వ్యాఖ్యానించడం సరైనది కాదు. ఇచ్చినవారిని కూడా "ఆ ఇచ్చావులే ఇది ఏమూలకి సరిపోతుంది"అనో, "పన్నులు కట్టావో లేదో" అనో ఈసడించడం మనలోని చిన్నతనాన్ని తెలియపరుస్తుంది.
అసలా మాటకొస్తే మనలో కీర్తి కండూతి లేనిదేవరికి?
At last I find 1 correct person.
తొలగించండికొంత కాలం తర్వాత బిచ్చగాల్లు కత్తులుపట్టుకోని మనల్ని దానం అడుగుతారు. అప్పుడు మాత్రం మనం దాన్ని ఖండించుకోవచ్చు. ఎందుకంటే, మనదాకా వచ్చింది కదా మరి
తొలగించండిఓవరాల్ గా అదే కదా సూర్య అండ్ చిరు డ్రీమ్స్ గారు నేను కూడా చెప్పింది. అవతలి వారిని విమర్శించే ముందు మన కింది నలుపు చూసుకోమని నేను చెప్పడం.
తొలగించండినా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళ సినిమాలు చూశానని ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వమని తిరిగి అడిగినట్లుంది కొందరి డిమాండ్.
ఇచ్చినా ఇయ్యకపోయినా ఎవళ్ళది వాళ్ళిష్టం. చటాకు మందం విదిల్చి క్వింటాళ్ల లెవెల్లో ప్రాపగాండా చేసే వాళ్ళతోనే నెత్తినొప్పి, వ్యాష్ట.
తొలగించండిసూర్య,
తొలగించండిఅక్కినేని నాకు శత్రువూ రాదు, ఇతరులు మిత్రులూ కాదు. అక్కినేనో. మరో రామినేనో ఎవరైనా నాకు ఏమీ తేడా లేదు. సమాజానికి తిరిగి ఇవ్వడం అనే పాయింట్ మీద అక్కినేనిని ఒక ఉదాహరణగా మాత్రమే కోట్ చేశాను. అది మరెవరైనా కావచ్చు కూడా.
ఈ చర్చ పొడిగించచడం నాకేమీ ఆసక్తి లేదు గానీ మాట వచ్చింది కాబట్టి ఓ రెండు ముక్కలు ఉదాహరణలతో చెప్పి ముగిస్తాను.
ఇక్కడ ఇంతకు ముందు వ్యాఖ్యల్లో ఎక్కడా “బలవంతం”గానో, “బెదిరించో” దానం లాక్కోవడం అనే అర్థమే రాలేదే ! మీకెందుకలా అనిపించింది మరి? అలా దండుకుంటే దాన్ని వినాయక చవితి “చందా” అంటారు గానీ దానం అనరు. నేను మాట్లాడినదీ స్వచ్ఛందంగా ఇచ్చే వదాన్య బుద్ధి గురించే.
ఎవరైనా తమ సంపాదనను జాగ్రత్త చేసుకోవడం ఏ మాత్రమూ తప్పు కాదు, చేసుకోవాలి కూడానూ ... తన్ను మాలిన ధర్మము లేదు కదా. అలాగే దానం అంటే జనాల్ని లైనులో నిలబెట్టి డబ్బులు పంచిపెట్టడమూ కాదు. కానీ, సాంఘిక ప్రయోజనం కలిగిన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, ఏదైనా జాతీయవిపత్తు సంభవించినప్పుడు రిలీఫ్ కార్యక్రమాల కోసం అయ్యే ఖర్చు నిమిత్తం సమాజంలోని పెద్దలు తమ వంతు సాయం ఇతోధికంగా చెయ్యడానికి తమంత తామే ముందుకొస్తారని ప్రజానీకం ఎదురు చూస్తుంది .... ఎందుకంటే ఇయ్యగల స్తోమతు కలిగినవారు కాబట్టి (ఇవ్వాలనే బుద్ధి ఉందా లేదా అన్నది వేరే సంగతి). ఆ పెద్దలు పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్సాపారవేత్తలు కావచ్చు, సినిమారంగం వారు కావచ్చు, క్రీడారంగం వారు కావచ్చు. సామాజిక బాధ్యతగా ఇస్తారని అనుకుంటారే తప్ప ఎవరూ కత్తి చూపించి లాక్కోరు. ఎవరి సొమ్ము వారిష్టం అన్న సూత్రం ఒకటి ఉందని అందరికీ తెలుసు.
విద్యాసంస్థల విషయానికొస్తే ... విరాళాలు చాలామంది ఇస్తారు, అంత మాత్రాన సంస్ధకు వారి పేరు పెట్టెయ్యరు సాధారణంగా .... విరాళం ఇచ్చిన పెద్దమనిషి తన దానానికి అదొక కండిషన్ గా పెట్టుంటే తప్ప ... కీర్తి కండూతి కొద్దీ.
కొన్ని ఊళ్ళల్లో అలా జరిగీ ఉండవచ్చు, కాదనలేం. విరాళం పుచ్చుకున్నవారే మీ పేరు పెడతామండీ అని ముందుకు రావడం వేరు. లేదా మరణించిన ప్రముఖుడు ఎవరి పేరు అయినా పెట్టవచ్చు. లేదా ఒక కుటుంబం విద్యా సంస్ధను ప్రారంభించి తామే నిర్వహిస్తూ తమ కుటుంబంలోని పెద్దవారి పేరు గానీ ప్రముఖుడి పేరు గానీ పెట్టవచ్చు. ఇవేవీ కాని పక్షంలో అడిగి పేరు పెట్టించుకోవడం కీర్తి కండూతే అవుతుంది.
సరే, విద్యాసంస్ధల మాట వచ్చింది కాబట్టి కొన్ని ఉదాహరణలు ఇస్తాను.
బెంగళూరులోని ఇండియన్ ఇన్-స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) పేరు వినే ఉంటారుగా. అంతర్జాతీయంగా చాలా ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థ. 20వ శతాబ్దం మొదట్లో దాని వ్యవస్థాపనకు విశేష కృషి చేసిన వ్యక్తి టాటా. మైసూరు మహారాజు గారి సహకారంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ అనుమతితో ప్రారంభించారు. టాటా గారే కాంపస్ లో అనేక భవనాలు కట్టించారు, కానీ వారి పేరు పెట్టలేదే. మైసూరు మహారాజు గారు భూమి దానం చేశారు, ఇతర వసతులు కల్పించారు, కానీ వారి పేరు పెట్టలేదే.
రెండు ..... పండిట్ మదన్ మోహన్ మాలవ్యా గారు భారతదేశమంతా తిరిగి మహారాజులు నవాబులతో సహా అనేక మంది ప్రముఖుల నుండి భూరి విరాళాలు సేకరించి బెనారస్ హిందూ యూనివర్సిటీ స్ధాపించాడు మహానుభావుడు 🙏. విరాళాలిచ్చిన వారి ఎవరి పేరూ
యూనివర్సిటీకి పెట్టలేదే.
ఇటువంటి మంచి పనులు వేరే ఊళ్ళల్లో కూడా జరిగుండవచ్చు.
ఏతావాతా నేను చెప్పేదేమిటంటే ఎవరూ ఎవరినీ బలవంత పెట్టలేరు. కలిగిన వారు ఇస్తారా లేదా అన్నది వారి వారి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే మనిషి సమాజంలో బతుకుతున్నాడు కాబట్టి సమాజం పట్ల కొంచెం బాధ్యత చూపిస్తాడని ఆశిస్తారు.
చివరగా మీరన్నట్లు “మనలో కీర్తి కండూతి లేనిదెవరికి?” .... బ్లాగుల్లో కామెంట్లు వ్రాసేవారితో సహా 🙂.
నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ వ్యక్తిగతంగా అరివీర భయంకర పిసినారి. ఇంట్లో ఉన్నప్పుడు చినిగిన షేర్వాణీలు వేసుకొని చార్మినార్ సిగరెట్లు తాగేవాడు.
తొలగించండిఅదే పీసిరిగొట్టు ప్రపంచమంతా చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసాడు. ఎక్కడా తన పేరు పెట్టమని అడగలేదు.
సూర్య గారు,
తొలగించండినల్లధనం తో వ్యాపారం చేసే వాళ్ళని పన్నులు సరిగ్గా కట్టమనడం చిన్నతనం ఎలా అవుతుంది?
Quite right జై గారు. బెనారస్ హిందు యూనివర్సిటీ స్ధాపన కోసం మాలవ్యా గారికి విరాళాలిచ్చినవారిలో నిజాం కూడా ఒకరు.
రిప్లయితొలగించండిపొడిగించనన్నాను గానీ మాలవ్యా గారి విషయంలో మరొక విశిష్టత తెలియజేయాలని మళ్ళీ వచ్చాను. బెనారస్ హిందూ యూనివర్సిటీ కోసం అన్ని విరాళాలు సేకరించినా ఏ దాత పేరూ మొత్తం యూనివర్సిటీకి పెట్టలేదు. కేంపస్ లో అనేక హాస్టల్ భవనాలకు దాతల పేర్లు పెట్టారు గానీ ఏ దాత పేరూ మొత్తం యూనివర్సిటీకి పెట్టలేదు. మాలవ్యా గారి తరువాత వారు కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు.
తొలగించండిఉదా:- నాకు గుర్తున్నంత వరకు BHU కేంపస్ లోని కొన్ని హాస్టళ్ళ పేర్లు ....
రూయా (Ruia), బిర్లా, బ్రోచా (Broacha), మోర్వీ, ధనరాజ్ గిరి, దాల్మియా .... ఇవి ఆయా ప్రముఖ కుటుంబాల పేర్లే గానీ ఆ కుటుంబం లోని ఏ ఒక్క వ్యక్తి పేరూ కాదు.
మరి కొన్ని హాస్టళ్ళకు ఇతర రంగాల ప్రముఖుల పేర్లు పెట్టారు ..... అయ్యర్, రామన్, భాభా, రాధాకృష్ణన్, వివేకానంద।
వృత్తిని తెలియజేసే పేర్లు .... విశ్వకర్మ (ఒక ఇంజనీరింగ్ విద్యార్థుల హాస్టల్), ధన్వంతరి (మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్).
అంత ఆలోచించి నిర్వివాదంగా పేర్లు పెట్టారు 🙏 .
మరచాను. BHU కేంపస్ లో కట్టిన ప్రొఫెసర్ల క్వార్టర్ల కాలనీకి “హైదరాబాద్ కాలనీ” అని పేరు పెట్టారు (నిజాం కూడా విరాళం ఇచ్చాడుగా).
తొలగించండిలోకల్ జనాలు, రిక్షాలు సింపుల్ గా హైదరాబాద్ అనేవారు. కేంపస్లో కొంచెం లోవలికి ఉంటుంది. రిక్షాను కేంపస్ కు వెళ్ళాలి వస్తావా అంటే హైదరాబాద్ తక్ జానా హై?? అని అడిగేవారు (దాన్ని బట్టి రిక్షా అతను అడిగే చార్జి ఉండేదన్నమాట) 🙂.
నిజాం గారి విరాళం గురించి ఒక కత చదివేనెక్కడో, నిజమేంటో తెలిసినవారు చెప్పాలె.
తొలగించండిమాలవ్యా గారు విరాళం కోసం నిజాం గారిని అడిగితే ఆయనపై చెప్పులిసిరారట నిజాంగారు. మహాప్రభో తమరు విరాళంగా చెప్పులివ్వడమే ఆనందం అని వాటినే తెచ్చుకుని మర్నాడు బజారులో వేలానికి పెట్టేరట. ఆ రోజుల్లో ఠోలీ అనేది చాలా చిన్నమొత్తం, సంస్థానంలో. మాలవ్యాగారు ఆ చెప్పుల్ని ఠోలీ కి అమ్మేస్తుండగా మంత్రులు నిజాం కు చెప్పి పరువు పోతోందని చెప్పి విరాళం ఇచ్చి ఆ వేలం నిలుపుదల చేయీచారట.
ఈ కథ నేనూ విన్నాను శర్మ గారు 🙂. మీరన్నట్లు నిజమెంతుందో నాకూ తెలియదు.
తొలగించండిపాత విశేషాలు నాకు కొత్తగా తెలియజేస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు.
తొలగించండిఉస్మాన్ అలీ ఖాన్ సాదాసీదా చెప్పులు & బట్టలు వేసుకునేవాడు, అమ్మితే ఏమొస్తుంది?
తొలగించండిఅతని గురించి ఎన్నో కట్టు కథలు ఉన్నాయి. నరేంద్ర లూథర్, పాండురంగా రెడ్డి లాంటి ప్రముఖ చరిత్రకారులు ఎవరూ ఉటంకించలేదు కనుక ఇది నాకయితే గిట్టని వాళ్ళు పుట్టించినట్టే అనిపిస్తుంది.
ఆ చెప్పులమ్మితే వచ్చేది ఠోలీ. నా లాటి తెలివి లేనివాడు మాలవ్యాగారిని అడిగాడట ఠోలీ విలువలేని చెప్పులు తెచ్చుకున్నావేంటయ్యా అని. దానికి మాలవ్యాగారు, నిజాం విలువ, అయన పరువు ఠోలీ విలువ చేస్తాయని ప్రపంచానికి చెప్పడం కోసమే అన్నాడట.
తొలగించండిఇవన్నీ కట్టుకతలే కావచ్చు, జైగారు నిజం చెప్పారుగా!
"జైగారు నిజం చెప్పారుగా"
తొలగించండినాకు నిజమేమిటో తెలీదు గురువు గారూ. కథ కొత్తగా అనిపించింది, పైగా హైదరాబాదులో ప్రాచుర్యం లేనిది. నమ్మశక్యంగా అనిపించలేదన్నానంతే.
ఠోలీ అంటే ఎన్ని అణాలండీ, కాస్త విమరించగలరు థాంక్స్. ఈ పదం ఎక్కడో పెద్దవాళ్ళ దగ్గర విన్నట్టే ఉంది కానీ సరిగ్గా గుర్తు రావడం లేదు.
దిగవల్లి వెంకట శివరావు గారు కథలు-గాధలు రాశారు, అందులోదనుకుంటా.
తొలగించండిఠోలీ అంటే, చిల్లు కానీ ఉండేది తెలుసుగా, అణాలో నాలుగో వంతు, దానికంటే తక్కువనుకుంటా. మీరు చెప్పేరు గనక నిజమని నమ్మేశానండీ. Exchange with British currency to Nijam currency is 100 rupees to 116 rupees.
ఠోలీ అంటే అర్ధం అయింది థాంక్స్ సార్. చిల్లు కాణీ వినడమే కానీ చూడలేదు.
తొలగించండిహాలీ సిక్కా బొంబాయి & మదరాసులో చెల్లదని, నిజాం రాష్ట్రం దాటితే బ్రిటిష్ రాజ్ కరెన్సీ తీసుకునే వాడినని మా తాత చెప్పడం గుర్తుంది.
తొలగించండిచిల్లు కానీ తెలీదా? మీవయసెంతా?నిజాం రూపాయల్ని హాలీ సిక్కా అనేవారు. మా పెదనాన్న తెచ్చేవారు.
see post
https://kastephale.wordpress.com/2016/04/01/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a8-15/
తొలగించండిమీ వయసెంతా ?
ఆ యేముందీ జూన్ నెలొస్తే ఓ ఆరేళ్ల బచ్చా :)
కష్టేఫలే బ్లాగు చూస్తూనే ఉంటాను గురువు గారూ. "నూటపదార్ల కత" టపా ఎందుకో మిస్ అయ్యాననుకుంటా. బహుచక్కని సమాచారం అందించారు.
తొలగించండిహైదరాబాదు సంస్థానంలో బ్రిటిష్ సర్కారు అమలు పరిచిన బాలికా వివాహ వయోపరిమితి చట్టం చెల్లదు కాబట్టి కొందరు మదరాసీయులు సరిహద్దు దాటొచ్చి మైనారిటీ తీరని బిడ్డల పెళ్లిళ్లు చేసేవారని భండారు వారు రాసినట్టు గుర్తు.
"There are more things in heaven and earth, Horatio,
Than are dreamt of in your philosophy"
Quote from the play Hamlet
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
తొలగించండినిజాం రూపాయల్ని “ఉస్మానియా సిక్కా” (OS) అనేవారట. OS గా పేరు మార్చక ముందు “హాలీ సిక్కా” అనేవారట. నిజానికి నాణాలుగా ఉన్నప్పుడు “హాలీ” అనేవారట, నోట్ల ముద్రణ మొదలెట్టినప్పుడు OS అని కొత్త పేరు పెట్టారట.
బ్రిటిష్ ఇండియా నాటి (స్వతంత్రం వచ్చిన తరువాత కూడా డెసిమల్ పద్ధతి ప్రవేశం వరకూ) “చిల్లు కానీ” నాణాలు ఇలా ఉండేవి, జై గారు 👇
చిల్లు కానీ
విన్నకోట వారూ, చిల్లర (non-decimal) కాణీయా చిల్లు కాణీయా (coin with hole like old FRF)? Slightly confused sir.
తొలగించండిLink not clickable for some reason please.
హాలీ అంటే కొత్త. ఆసఫ్ జాహీలు నామమాత్రపు మొఘల్ ఛత్రఛాయలు నుండి స్వాతంత్య్రం ప్రకటించాక మొఘల్ చక్రవర్తి పేరుమీద విడుదల అయిన నాణాలు చెల్లుబాటు రద్దయింది. కొత్తగా ఆసఫ్ జాహీలు మింటు చేసిన కాయిన్లను హాలీ (కొత్త) సిక్కా అనేవారు.
మహబూబు పాషా కాలం చేసి మియా ఉస్మాన్ గద్దె ఎక్కాక SBH (bank of issue i.e. central bank) ద్వారా హైదరాబాదు దేశంలో అధికారిక కాగితపు రూపాయి నోట్లు (legal tender bank notes) ముద్రించిన తోలి సంస్థానంగా వెలిసింది. ఉస్మానియా సిక్కా/రూపాయి అన్నది హాలీ సిక్కాకు ఇంకో అనధికారిక నామం అనుకుంటా.
మీరు రాసింది నేనన్నది దాదాపు ఒక్కటే. Only minor nuanced differences please.
The link is ok now. Please check it out.
తొలగించండిఐరోపాలో విస్తృతంగా తిరిగిన కారణాన విదేశీ చిల్లు కాణీలు (FRF/SEK?) చూసాను కానీ ఇవి చూడడం ఇదే మొదటి సారి. పెద్దలు చెప్పగా మాత్రమే విన్నాను. Thank you sir.
తొలగించండిచూస్తుంటే శాఖాచంక్రమణం పెరిగి ఒక దానినుంచి మరోదానికి వెళుతూ ఉంది. పవన్ గారి బ్లాగుని ఇలా కబ్జా చేయడం నాకిష్టం లేదు, ఇంతతో విరమిస్తా ఒక్క మాట చెప్పి.
తొలగించండినాటికాలంలో పదునాగేడుల ఆడపిల్లకి వివాహం చేయడం నేరం బ్రిటిష్ జమానాలో. అది నేరంకాదు నిజాంలోనూ, ఫ్రెంచ్ లోనూ. అందుకుగాను కృష్ణ దాటి జగ్గయ్య పేట లోనూ తూగోజికి దగ్గరలో యానాం లోనూ పెళ్ళిళ్ళు చేసేవారు. యానాం లో ఒక గుడి ఉంది వేంకటేశ్వరునిది, ఈయనను మీసాల వెంకన్న అంటారు.అక్కడపెళ్ళిళ్ళు చేసేవారు.
బాబాయి గారూ, ఆసక్తికర సమాచారం తెలియజేసారు. పవన్ గారి బ్లాగులలో subject branching off మామూలే. వ్యాఖ్యాతలు తగువులకు దిగనంత వరకు వారు కూడా అభ్యంతరం చెప్పిన దాఖలాలు లేవు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపవనుడికి సహనం ఎక్కువ ☝️🙂.
తొలగించండిఅయితే శర్మ గారు, ఆనాడు బ్రిటిష్ ఇండియాలో ఆంధ్రా ప్రాంతం వారు బాల్యవివాహాలు చెయ్యదలుచుకుంటే శారదా చట్టానికి దొరక్కుండా ఈ పద్ధతి అవలంబించేవారన్నమాట.
మరో పని కోసం కూడా తెలంగాణా వైపు వచ్చేవారని అంటారు .... మద్యపాన నిషేధం తెలంగాణ లో అమలులో లేకుండా ఆంధ్రా ప్రాంతంలో మాత్రం అమలులో ఉన్నప్పుడు ఆవైపుల నుండి హైదరాబాద్ వచ్చి రెండుమూడు రోజుల మకాం వేసి తృప్తిగా “సేద” దీరేవారని విన్నాను 😁.
అంతా మీ అభిమానం. నా మీద మీకు ఉన్న సదభిప్రాయానికి అలాగే నాకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు.
తొలగించండివిన్నకోట వారూ, నిజమేనండి. బొంబాయి & మదరాసు రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలిచిన దరిమిలా విదేశీ సరుకు (IMFL) దుకాణాలు బంద్ చేయడం మూలాన పల్లెజనాలకు కల్లు కొరత లేకున్నా సంపన్న మందుబాబులకు గడ్డుకాలం, హైదరాబాదు మైసూరు రాష్ట్రాలకు లాభం!
తొలగించండిఇప్పుడు అన్నీ బందు, కలికాలం వచ్చింది!
IISc, Bangalore ని ఇప్పటికీ కొంతమంది Tata institute అని అంటారు.
రిప్లయితొలగించండిఅజీం ప్రేమజీ కూడా పిసినారి లాగే గడుపుతారని విన్నాను. కాని ఆయన ఎంతో దానం చేస్తారు.
కరక్ట్ బోనగిరి గారూ. ఈ పాయింట్ పాఠకులలో ఎవరైనా ప్రస్తావిస్తారులే అని నేను నా కామెంట్లో కలపలేదు.
రిప్లయితొలగించండిమీరన్నది అక్షరాలా నిజం. బెంగుళూరు జనాలు కొంతమంది టాటా ఇన్-స్టిట్యూట్ అంటారు no doubt. ఆటోలకు అడ్రసు చెప్పడానికి తేలిగ్గా ఉంటుంది కూడా.
అయితే తేడా ఏమిటంటే అది కేవలం వ్యావహారిక నామమే గానీ అధికారిక నామం కాదు. ఆ ఇన్-స్టిట్యూట్ అఫీషియల్ పేర్లో “టాటా” అని లేదు.
నేను బెంగుళూరు ఉండే ఒక టైములో మత్తికెరె అనే ప్రాంతంలో ఉండేవాడిని. ఎవరైనా అడ్రస్ అడిగితే యశ్వంతపూర్ వెళ్లే దారిలో టాటా ఇన్స్టిట్యూట్ దాటగానే రైట్ తీసుకొని స్ట్రెయిట్ రూట్ లో వస్తే మత్తికెరె వస్తుంది అని డైరెక్షన్స్ చెప్పేవాడిని :)
తొలగించండిబెంగుళూరు మల్లేశ్వరం, యశ్వంతపూర్, టాటా ఇన్స్టిట్యూట్, మత్తికెరె: nostalgia! బస్సు స్టాపు పేర్లు కూడా టాటా ఇన్స్టిట్యూట్, మత్తికెరె గట్రా అనే ఉండేవి.
తొలగించండినేను ఉద్యోగావస్థ మొదట్లో 1-2 వారాలు మత్తికెరెలో ఎదో హాస్టల్ గది తీసుకొని ఉన్నాను. ఆ తరువాత జయనగర సమీపంలో (శాంతి సినిమా బస్సు స్టాపు) ఒక మిత్రుడి 2 BHK అద్దె పోర్షనులో రెండో రూము ఖాళీ కావడంతో అక్కడికి మారాను.
ఏమిటి పవన్ గారూ, మీ దేశంలో బీచ్ లకు తిరిగి అనుమతిస్తున్నారని టీవీ వార్త. నిజమేనా? అంటే “కరోనా” బాగా కంట్రోల్లోకి వచ్చేసినట్లేనా?
రిప్లయితొలగించండిఅయిననూ Stay home, Stay safe for some more time 👍😷.
గవర్నమెంటే చాలెంజ్ విసురుతోంది. వీళ్ళే చలికి భయపడి బయటికి రావటం లేదు. చలి భీకరంగా పెరిగిందని వార్త.
తొలగించండికంట్రోల్ లోకి వచ్చిందని అనుకొని అనుమతించారు మేష్టారు. దానికి తోడు ఇక్కడి వాళ్ళకు బీచ్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు.
తొలగించండిమీరు విన్నది నిజమే శర్మ గారు. ఇక్కడ గత 4 రోజులుగా చలి బాగా పెరిగింది. నెక్స్ట్ మంత్ వింటర్ స్టార్ట్ అవుతుంది.
తొలగించండి